*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply
*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply
Who would you like to insure?
వినియోగదారుల వైవిధ్యమైన బీమా అవసరాలు తీర్చడానికి భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా కంపెనీ సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్లను అందిస్తోంది. మన బీమా సంస్థ విస్తృతమైన నెట్ వర్క్ ఆసుపత్రులను కలిగిఉంది. ఈ ఆసుపత్రుల్లో.కస్టమర్లు నగదు రహిత చికిత్స పొందవచ్చు. పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా క్లిష్టమైన అనారోగ్య సమస్యలు, ప్రసూతి ఖర్చులు, జన్యుపరమైన రుగ్మతలు వంటి వివిద యాడ్ ఆన్ ప్రయోజనాలను భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా ద్వారా పొందవచ్చు.
భారతి ఏఎక్స్ఏ జనరల్ ఆరోగ్య బీమా కంపెనీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ జాయింట్ వెంచర్ కంపెనీ. భారతదేశంలో ఇది ప్రఖ్యాత బిజినెస్ గ్రూప్. ఆర్థిక రక్షణ, సంపద నిర్వహణలో ఏఎక్స్ఏ అగ్రగామిగా నిలిచింది. 2008లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. మొదటి సంవత్సరంలోనే ఐఎస్ఓ 9001:2008, ఐఎస్ఓ 27001:2005 ధృవీకరణ పత్రాలను పొందింది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ రెండు ధృవపత్రాలు పొందిన మొదటి సంస్థ ఇది. 2012లో ఈ ధృవపత్రాలను మరో మూడు సంవత్సరాలకు పునరుద్దరించారు. ఆరోగ్య బీమా విషయంలో వ్యక్తుల అన్ని అవసరాలను తీర్చడానికి కంపెనీ ఉత్పత్తులను రూపొందించింది. భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా కంపెనీ 4500 నెట్ వర్క్ ఆసుపత్రులను కలిగి ఉంది. ఐఆర్డీఏ 2018-19 నివేదిక ప్రకారం క్లెయిమ్స్ రేషియే 89 శాతంగా ఉంది. ఇప్పటికే కంపెనీ 18 లక్షలుపైగా క్లెయిమ్స్ పరిష్కరించింది. 13 లక్షల పాలసీ సమస్యలు ఉన్నాయి. జీవితాంతం రెన్యువబులిటీ సౌలభ్యం ఉంది.
భారతి ఏఎక్స్ఏ జనరల్ ఇన్సూరెన్స్ తన కార్యకలాపాల మొదటి సంవత్సరంలోనే రెండు అంతర్జాతీయ ధృవపత్రాలను అందుకుంది, ఈ రెండూ 2012లో మళ్లీ మూడు సంవత్సరాలకు పునరుద్ధరించబడ్డాయి. ఈ అద్భుతమైన విజయం సంస్థ నాణ్యత, కస్టమర్ సంబంధాలు మరియు క్లెయిమ్ ప్రక్రియ యొక్క సరళీకరణపై దృష్టి సారించింది.
లక్షణాలు | స్పెసిఫికేషన్లు |
నెట్‌వర్క్ హాస్పిటల్స్ | 4500+ |
పొందిన దావాల నిష్పత్తి (IRDAI 2018-19 నివేదిక ప్రకారం) | 89% |
సెటిల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్య | 18 లక్షలు+ |
జారీ చేయబడిన పాలసీల సంఖ్య | 1.3 మిలియన్లు |
పునరుద్ధరణ | జీవితాంతం |
వ్యక్తులు, కుటుంబాలు, సీనియర్ సిటిజన్స్ కు భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా పథకాలు అందిస్తోంది.
భారతి ఏఎక్స్ఏ స్మార్ట్ సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్, స్మార్ట్ హెల్త్ అష్యూర్. ఇవి కాకుండా ఇతర బీమా పథకాలు కూడా ఉన్నాయి. భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా పాలసీలోని అంశాలను వివరంగా పరిశీలిద్దాం.
అన్ని వైద్య ఖర్చులు, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే వారికి ఈ బీమా పాలసీ అనుకూలంగా ఉంటుంది. రూ.4 లక్షల వరకు కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ పునరుద్దరణ తగ్గింపులు, నో క్లెయిమ్ బోనస్, పన్ను ఆదా, ఉచిత ఆరోగ్య తనిఖీలను ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. బీమా చేసిన మొత్తంలో వ్యక్తిగతంగా అయితే రూ.3 లక్షలు, కుటుంబ ప్లోటర్ ద్వారా రూ.4 లక్షల కవరేజీ లభిస్తుంది. జీవితాంతం పునరుద్దరణకు అవకాశం ఉంది. 91 రోజుల వయసు నుంచి 65 వయసు వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.
భారతి ఏఎక్స్ఏ స్మార్ట్ సూపర్ పథకం ఆసుపత్రిలో చేరే ఖర్చుల శ్రేణిని కవర్ చేసే సమగ్ర ఆరోగ్య ప్రణాళిక. ఈ పాలసీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. విలువ, క్లాసిక్, ఉబెర్ ప్లాన్ కింద లభిస్తుంది.
ఈ పాలసీ వ్యక్తిగత, కుటుంబ ప్లోటర్ కవర్ చేస్తుంది. రూ.5 నుంచి రూ.7 లక్షలు కవర్ చేస్తుంది. జీవితాంతం ఎప్పుడైనా పునరుద్దరణ చేసుకోవచ్చు. 91 రోజుల నుంచి 65 సంవత్సరాలు ఉండే వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.
స్మార్ట్ సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది భారతి ఏఎక్స్ఏ స్మార్ట్ సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క రూపాంతరం. ఇది రూ.7లక్షలు కవర్ చేసే బేసిక్ ప్లాన్.
ఆసుపత్రిలో ఇన్ పేషెంటుగా చేరిన రోగి ఖర్చులు ఈ పాలసీ కవర్ చేస్తుంది. రోగనిర్థరణ పరీక్షలు, శస్త్ర చికిత్స పరికరాలు, ఆపరేషన్ థియోటర్ ఖర్చులు, ఐసీయూ ఛార్జీలు, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫీజులు కవర్ చేస్తుంది. బీమా పరిమితికి లోబడి గది అద్దె చెల్లింపులకు పరిమితి లేదు. ఆసుపత్రిలో చేరడానికి ముందు 60 రోజుల ఖర్చులు, ఆసుపత్రిలో చేరిన 90 రోజుల వరకు బీమా పరిమితి ఉన్నంత వరకు నూరు శాతం పాలసీ వర్తిస్తుంది. హామీ మొత్తం పరిమితి వరకు డే కేర్ చికిత్స, హామీ మొత్తం పరిమితి వరకు ఆయుష్ చికిత్స, హామీ ఇచ్చిన మొత్తం పరిమితి వరకు
ఆసుపత్రిలో చేరేవరకు చికిత్స ఖర్చులు పాలసీ అందిస్తుంది. ప్రసూతి కవర్, నవజాత శిశువు కవర్, నిర్దేశిత తీవ్రత కలిగిన క్యాన్సర్, మొదటి సారి గుండెపోటు, ఓపెన్ ఛాతీ సీఏబీజీ, ఓపెన్ హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్, మేజర్ బర్న్స్, హైపటైటిస్, టెర్మినల్ అనారోగ్యం, బాక్టీరియల్ మెనింజైటిస్, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, అప్లాస్టిక్ అనీమియా, కిడ్నీ ఫెయిల్, రెగ్యులర్ డయాలసిస్, ఎండ్ స్టేజ్ ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయం వైఫల్యం, కోమా, మోటార్ న్యూరాన్ వ్యాధులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
స్మార్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లాసిక్ ప్లాన్ అనేది భారతి ఏఎక్స్ఏ స్మార్ట్ సూపర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కి భిన్నమైంది. పాలసీ విలువ, అధిక మొత్తం కవరేజీ అందించే మెరుగైన పాలసీ ఇది.
వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్ బీమా కవర్ అందిస్తుంది. రూ.10 లక్షలు, రూ.15, రూ.20 లక్షల పాలసీలు తీసుకోవచ్చు. జీవితాంతం ఎప్పుడైనా పునరుద్దరణ చేసుకోవచ్చు. 91 రోజుల నుంచి 65 సంవత్సరాల వయసు వారు ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు.
పది రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చేరితే రూ.10,000, ప్రమాదాలు జరిగితే ఔట్ పేషెంట్ అత్యవసర చికిత్సకు రూ.10,000 కవర్ పొందవచ్చు. జంతువులు కరిస్తే వ్యాక్సినేషన్ కవరేజీకి రూ.2500 రీఎంబర్స్మెంట్ చేస్తారు. వార్షిక ఆరోగ్య పరీక్షలను పొడిగించారు. బీమా చేసిన మొత్తానికి మించి తీవ్రమైన అనారోగ్యం వస్తే ఏక మొత్తంలో చెల్లిస్తారు. వాల్యూ ప్లాన్ లో సూచించిన మాదిరే మిగతావి ఉంటాయి.
భారతి ఏఎక్స్ఏ ఆరోగ్య బీమా ఉబెర్ ప్లాన్ భారతి ఏఎక్స్ఏ సూపర్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క వేరియంట్. ఈ పాలసీ క్లాసిక్ ప్లాన్ యొక్క మెరుగైన వెర్షన్ ద్వారా కోటి వరకు బీమా మొత్తాన్ని అందిస్తుంది.
వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్, రూ. 20 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమా కవరేజీ అందిస్తుంది. జీవితాంతం పునరుద్దరణకు అవకాశం ఉంది. 91 రోజుల వయసు నుంచి 65 సంవత్సరాల వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.
పొడిగించిన ప్రసూతి, నవజాత శిశువులకు రూ.50,000, జంతువుల కాటుకు గురైతే టీకా ఖర్చులకు రూ.5,000 రీఎంబర్స్మెంట్ చేస్తారు. తీవ్రమైన అనారోగ్యం వల్ల బీమా చేసిన మొత్తానికన్నా ఎక్కువ ఖర్చు అయితే ఏకమొత్తం చెల్లిస్తారు. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి 30 రోజులకు రోజుకు రూ.500, రూ.1000, రూ.3000 రోజువారీ ఖర్చుల కింద నగదు భత్యం చెల్లిస్తారు. దేశీయ ఎయిర్ అంబులెన్స్ కవర్, అత్యవసర దంత చికిత్సకు అవుట్ పేషెంట్ కవర్ లభిస్తుంది. మిగిలినవన్నీ పైన పేర్కొన్న ప్లాన్ మాదిరే ఉంటాయి.
భారతి ఏఎక్స్ఏ స్మార్ట్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఆరోగ్య బీమా పథకం.ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించడంపై ఈ పాలసీ ప్రధానంగా దృష్టి సారించింది. పాలసీ తీసుకున్న వారు ఆసుపత్రి ఖర్చులు, ఇతర మందుల ఖర్చులు పొందవచ్చు. అయితే ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఈ ప్లాన్ ప్రయోజనాలు అందిస్తుంది.
వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్, బీమా చేసిన మొత్తం ఏక మొత్తంలో చెల్లిస్తారు. 91 రోజుల నుంచి 55 సంవత్సరాల వయసు వారు పాలసీ తీసుకోవచ్చు.
ఆసుపత్రిలో చేరే ముందు ఖర్చులు, తరవాత ఖర్చులు కవర్ చేయబడింది. అతితీవ్రమైన భయం వ్యాధులు కవర్ చేస్తుంది. అవయవాల మార్పిడి, హూమ్ నర్సింగ్ ఖర్చులు కవర్ చేస్తుంది. ఇన్ పేషెంట్ ఫిజియోథెరపీ ఖర్చులు, ఆసుపత్రి నగదు భత్యం అందిస్తారు. రోగికి తోడుగా ఉన్న వ్యక్తి ఖర్చులు కవర్ చేస్తుంది.అత్యవసర అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేస్తుంది.
ఈ ప్లాన్ ద్వారా పిల్లల విద్యా నిధి అందిస్తారు. చనిపోయిన వారిని తరలించడానికి అయ్యే ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. 5 శాతం పునరుద్దరణ ప్రయోజనం ఉంది.వైద్య పరీక్షల ఖర్చులు రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఇదే కంపెనీలో ఒక పాలసీ నుంచి మరో పాలసీకి మారే సౌలభ్యం ఉంది. వినియోగదారులు ఈ ప్లాన్ తో ఫ్యామిలీ ఫ్లోటర్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. నలుగురు కుటుంబ సభ్యులందరకీ ఒకే బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
వైద్యానికి లొంగని జబ్బులు, క్యాన్సర్, పెద్ద దమనికి శస్త్ర చికిత్స, కరోనరీ గుండె జబ్బులు, మొదటి సారి గుండెపోటు,
కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, తీవ్రమైన రక్తహీనత, కాలేయ వైఫల్యం చివరి దశ, ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశ, కాలిన గాయాలు, కోమా, అవయవం, ఎముక మజ్జ మార్పిడి, మల్టిపుల్ స్క్లేరోసిస్,
మోటార్ న్యూరాన్ వ్యాధి, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, బాక్టీరియల్ మెనింజైటిస్ వ్యాధులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
ప్రమాదకారణంగా మరణం సంభవించడం లేదా అంగవైకల్యానికి దారితీసే ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఇది బీమా తీసుకున్న వ్యక్తితోపాటు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది. ఇది వ్యక్తిగత బీమా పాలసీ, ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించాలి. 65 సంవత్సరాలలోపు వారు ఎవరైనా తీసుకోవచ్చు.
ఈ పాలసీలో జీవితాంతం పునరుద్దరణపొందే సౌకర్యం ఉంది. పాలసీ పునరుద్దరణ సమయంలో, ఎటువంటి క్లెయిమ్ దాఖలు చేయని లేదా చెల్లించని షరతులపై మాత్రమే బీమా మొత్తాన్ని పెంచవచ్చు. మంచి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ ఉన్నట్లయితే పాలసీ కింద అందుబాటులో ఉన్న తదుపరి బీమా మొత్తం స్లాబ్ ఎంచుకోవచ్చు.
ఈ ప్లాన్ పూర్తి అంగవైకల్యం కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ శాశ్వత పాక్షిక వైకల్యం కవర్ చేస్తుంది. తాత్కాలిక వైకల్యం కూడా కవర్ చేస్తుంది. ప్రమాదకారణంగా సంభవించే మరణాన్ని కూడా కవర్ చేస్తుంది.
ఈ పథకం రోజువారీ ఆసుపత్రి ఖర్చులు, ప్రమాదవశాత్తూ ఆసుపత్రిలో చేరే ఖర్చులను అందిస్తుంది. న్యాయ పరమైన ఖర్చులను కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా 4500 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. ఆసుపత్రిలో చేరే ముందు ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఆసుపత్రిలో చేరిన తరవాత ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఈ పథకం భయంకరమైన వ్యాధుల నుంచి కోలుకునేందుకు కవర్ చేస్తుంది. అవయవాల మార్పిడి ఖర్చును పాలసీ కవర్ చేస్తుంది. హోమ్ నర్సింగ్ ఖర్చులు కవర్ చేస్తుంది. అంబులెన్స్ ఖర్చులు, ఇన్ పేషెంట్ ఫిజియోథెరపీ ఖర్చులతోపాటు రోగితోపాటు ఉన్న వ్యక్తి ఖర్చులు కూడా భరిస్తుంది. పిల్లల విద్యానిధి ఫండ్ కవర్ చేస్తుంది. 5 శాతం రెన్యువల్ డిస్కౌంట్ వర్తిస్తుంది. మెడికల్ ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. డబుల్ డెత్ బెనిఫిట్, పూర్తి అంగవైకల్యం కవర్ చేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం కారణంగా మరణించినా, శాశ్విత వైకల్యం కలిగినా రెట్టింపు బీమా అందిస్తారు.
నాన్ లింకుడ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధంలేని మూడు క్లెయిములు వరకు చేసుకునే ఆరోగ్య బీమాపథకం. మొదటి క్లెయిమ్ చేసిన తరవాత, భవిష్యత్ ప్రీమియంలన్నీ మాఫీ అవుతాయి. అవన్నీ మా ద్వారా చెల్లించబడతాయి.
13 తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేస్తుంది. 13 తీవ్రమైన అనారోగ్యాలను 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సీ.
పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా మూడు క్లెయిములు చేయవచ్చు. గ్రూపుల్లో ఒకదాని కిందకు వచ్చే మొదటి క్లెయిమ్ తర్వాత రెండు, మూడు గ్రూపుల క్లెయిమ్ కు అర్హులు. మొదటి క్లెయిమ్ చేసిన తరువాత భవిష్యత్ ప్రీమియాలను మాఫీ చేయడం ద్వారా మీ భారాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్ ప్రీమియాలను కంపెనీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ వరకు పాలసీ అమల్లో ఉంటుంది.
ప్రతి క్లెయిమ్ లో నూరు శాతం మొత్తాన్ని పొందుతారు. మొదటి క్లెయిమ్ తరవాత, ఇకే గ్రూపులో చేర్చకుండా, ఇతర రెండు క్లెయిమ్ ల హామీ మొత్తాలను అందుకుంటారు. ప్రతి క్లెయిమ్ మధ్య 365 రోజుల ప్రయోజనం లేని కాలానికి లోబడి ఉంటుంది.
ఆన్ లైన్లో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడానికి బీమా సంస్థ వెబ్ సైట్ ను సందర్శించాలి. మీకు ఇతర సహాయం కావాలంటే, టోల్ ఫ్రీ నెంబరుకు డయల్ చేయవచ్చు. మీ వయసు 56 సంవత్సరాల లోపు ఉండి రూ.2 లక్షలలోపు బీమా కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీ వయసు 46 సంవత్సరాలకంటే తక్కువ ఉండి రూ.2 లక్షల కంటే ఎక్కువ బీమా కోసం చూస్తుంటే ఇప్పటికే ఎలాంటి వ్యాధులు, గాయాలు లేకుంటే ఎలాంటి ఆరోగ్య పరీక్షలు లేకుండానే బీమా పాలసీ తీసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఉచితంగా ఎంత ఖర్చవుతుంది, పాలసీ వివరాలు పొందవచ్చు. తరవాత
దరఖాస్తు ఫారం నింపి,నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. పాలసీ పత్రాలు
పోస్ట్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా మీకు పంపిస్తారు.
అత్యవసర పరిస్థితి జాబితాలో చేర్చిన ఆసుపత్రిలో చేరితే, బీమా సంస్థ జారీ చేసిన హెల్త్ కార్డ్ ను ఎంపానల్ అయిన ఆసుపత్రిలో సమర్పించాలి. తరవాత నగదు రహిత క్లెయిమ్ ఫారంను ఆసుపత్రి సిబ్బంది ద్వారా
నింపి,ఫారంలో పేర్కొన్న ఫ్యాక్స్ నెంబరుపై థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ కు పంపాలి. లేదంటే ఆసుపత్రిలోని బీమా హెల్ప్
డెస్క్ కు సమర్పించాలి. టీపీఏ మీ క్లెయిమ్ పరిశీలిస్తుంది. మీ ఫారం సమర్పించిన తరవాత 6 గంటల్లో క్లెయిమ్ పరిస్థితిని టీపీఏ ఆసుపత్రితోపాటు పాలసీదారులకు ఈ మెయిల్ పంపిస్తుంది. ఎస్ఎంఎస్, ఫ్యాక్స్ ద్వారా కూడా తెలియజేస్తుంది. ఈ పాలసీ కింద కవర్ చేసే వైద్య ఖర్చులను మాత్రమే టీపీఏ ఆమోదిస్తుంది. పాలసీ కింద కవర్ చేయని ఖర్చులను పాలసీదారుడు భరించాలి. ఆసుపత్రి ఖర్చులను భారతి ఏఎక్స్ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిష్కరిస్తుంది.
అత్యవసర చికిత్సకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. ఆసుపత్రి బిల్లులను క్లియర్ చేసుకోవాలి. అయితే ఆసుపత్రిలో అయిన అన్ని ఖర్చులకు బిల్లులు తీసుకోవాలి. తరవాత క్లెయిమ్ ఫారంతో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ తో కలసి ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఆ పత్రాలను పరిశీలించి, అవసరమైన డాక్యుమెంట్లు స్వీకరిస్తుంది. 21 రోజుల్లో క్లెయిమ్ చెల్లింపులు ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ తిరస్కరణకు గురైతే, దానికిగల కారణాలతో తిరస్కరణ లేఖను పాలసీదారుకు పంపుతారు.
8506013131 (వాట్పప్)
కొత్తగా పాలసీ కావాల్సిన వారు ఈ నెంబరులో సంప్రదించగలరు
1800-208-8787
ఇప్పటికే పాలసీ ఉన్నవారు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబరుకు కాల్ చేయగలరు
1800-258-5970
ఎన్.ఆర్.ఐలు ఈ నెంబరులో సంప్రదించగలరు
091-124-6656507