చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్

(34 Reviews)
Highlights

*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply

*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply

Back
Get insured from the comfort of your home
Get insured from the comfort of your home
  • 1
  • 2
  • 3
  • 4

Who would you like to insure?

  • Previous step
    Continue
    By clicking on “Continue”, you agree to our Privacy Policy and Terms of use
    Previous step
    Continue

      Popular Cities

      Previous step
      Continue
      Previous step
      Continue

      Do you have an existing illness or medical history?

      This helps us find plans that cover your condition and avoid claim rejection

      Get updates on WhatsApp

      What is your existing illness?

      Select all that apply

      Previous step

      When did you recover from Covid-19?

      Some plans are available only after a certain time

      Previous step
      Advantages of
      entering a valid number
      You save time, money and effort,
      Our experts will help you choose the right plan in less than 20 minutes & save you upto 80% on your premium

      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్

      చోళమండలం ఎం స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది మురుగప్ప గ్రూప్ (ఇండియన్ కంపెనీ) మరియు మిట్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్ కంపెనీ (జపనీస్ ఇన్సూరెన్స్ కంపెనీ) మధ్య జాయింట్ వెంచర్గా ఏర్పడింది. మురుగప్ప గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. మిట్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ లో నైపుణ్య కలది. ఇంకా జపాన్‌లో మూడవ అతిపెద్ద ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ.

      Read More

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ - ఒక అవలోకనం:-

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్సూరెన్స్ కంపెనీ. 2001వ సంవత్సరంలో ప్రారంభించబడింది. దేశం మొత్తం మీద 100 బ్రాంచీలను కలిగి ఉంది.

      చోళమండలం ఎం స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2011-2012 సంవత్సరానికి గాను ఇన్ టైం క్లైమ్ సెటిల్మెంట్ లో బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీగా అవార్డ్ అందుకుంది.

      "ఆరోగ్యమే మహాభాగ్యం" ఎవరు చెప్పినా ఈ మాట నిజం. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సామాన్యులకు కూడా సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏకైక సంస్థ చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. అందరి అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్లాన్ లను రూపొందించి, అందరికీ సహాయకారిగా నిలవడమే ధ్యేయంగా చేసుకున్న సంస్థ "చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ".

      హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటుగా మోటార్ ఇన్సూరెన్స్, కారు ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోం ఇన్సూరెన్స్, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

      జీవితంలో ప్రమాదాలు, అనారోగ్యాలు ఎప్పుడు, ఎలా వస్తాయో చెప్పడం గానీ, ఊహించడం గానీ చాలా కష్టం. చెప్పకుండా వచ్చే ఈ అనారోగ్యాలు, ప్రమాదాల నుండి కాపాడుకోవడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో సహాయపడుతుంది. హాస్పిటల్ ఖర్చులకి భయపడకుండా మీ మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగకారిగా ఉంటుంది.

      దేశం మొత్తం మీద ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నప్పటికీ, సామాన్యులకి మెరుగైన వైద్యం అందిచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న ఏకైక సంస్థ "చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ".

      మీకు నచ్చిన చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోండి

      ₹2లక్ష
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్
      ₹3లక్ష
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్
      ₹5లక్ష
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్
      ₹10లక్ష
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్
      ₹20లక్ష
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్

      హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు:-

      • డే కేర్ విధానాలు - 539 కన్నా ఎక్కువ డే కేర్ విధానాలు చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులలో అందుబాటులో ఉన్నాయి.
      • ఇండివిజువల్ మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజీ - వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల కొరకు ఇన్సూరెన్స్ మొత్తాన్నీ ఎంచుకునే అవకాశాన్ని పాలసీ అందిస్తుంది.
      • న్యూ బోర్న్ బేబీ కవరేజ్ ఫ్రమ్ డే వన్ - పాలసీ ప్రారంభమైన తేదీ నుండి నిరంతరంగా 12 నెలల పాటు పాలసీ కింద తల్లి కవర్ చేయబడినట్లైతే, ఆ తల్లికి పుట్టే పిల్లలకు, పుట్టిన మొదటి రోజు నుండి కవరేజ్ అందుబాటులో ఉంటుంది.
      • ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వాటికి అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
      • డైలీ క్యాష్ బెనిఫిట్స్.
      • రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల సమయంలో ఇన్సూరెన్స్ మొత్తానికి అదనపు మొత్తం జోడించబడుతుంది.
      • క్లైమ్ చేసుకొని ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ చేయబడుతుంది.
      • అత్యవసర వైద్య పరిస్థితుల్లో వేరే దేశానికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు అయ్యే విమాన చార్జీలు కూడా కవర్ చేయబడతాయి.
      • టాక్స్ బెనిఫిట్స్:- ఇన్ కమ్ టాక్స్ చట్టం 80D కింద వినియోగదారులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీలలో టాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
      • హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లైతే ఆపద సమయంలో మనకీ ఆర్థికంగా ఎంతో సహాయకారిగా ఉంటుంది. హాస్పిటల్ ఖర్చులకి భయపడకుండా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుంది. మానసికంగా కృంగి పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

      சுகாதார காப்பீட்டு நிறுவனம்
      Expand

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులు:

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

      • చోళ ఎం స్ హెల్త్ లైన్ ప్లానులు:-

        ఇది మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన ఇద్దరు పిల్లలు ఇందులో కవర్ చేయబడతారు. అంతే కాకుండా ఇందులో మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు, మీ సోదరీ సోదరులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతారు. ఈ పాలసీ కిందకు వచ్చే ప్రయోజనాలు 4 రకాల ప్లానులలో పొందుపరచ బడ్డాయి. అవి:-

        • వ్యాల్యూ హెల్త్ లైన్ ప్లాన్.
        • ఫ్రీడమ్ హెల్త్ లైన్ ప్లాన్.
        • ఎన్రిచ్ హెల్త్ లైన్ ప్లాన్.
        • ప్రివిలేజ్ హెల్త్ లైన్ ప్లాన్.
      • వ్యాల్యూ హెల్త్ లైన్ ప్లాన్:

        • ఇన్సూరెన్స్ మొత్తం:- 2 లక్షల నుండి 10 లక్షల వరకు.
        • 30 నుండి 60 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి.
        • డే కేర్ చికిత్స విధానం కవర్ చేయబడుతుంది.
        • ఇంట్లో ఉండే వైద్యం చేయించుకొనే వీలుంది.
        • 1000 రూపాయల వరకు ఎమర్జన్సీ అంబులెన్స్ సేవలు కూడా కవర్ చేయబడతాయి.
        • అవయవ మార్పిడి సందర్భంలో అవయవ దానానికి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
        • ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వాటికి అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
        • పాలసీని జీవిత కాలం రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది.
        • వయో పరిమితి:- 18 నుండి 65 సంవత్సరాలు.
        • 45 సంత్సరాలు నిండిన వారికి ప్రి పాలసీ హెల్త్ చెకప్ లు అవసరం.
      • ఫ్రీడమ్ హెల్త్ లైన్ ప్లాన్:

        • ఇన్సూరెన్స్ మొత్తం: 3 నుండి 15 లక్షల వరకు.
        • 30 నుండి 60 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి.
        • డే కేర్ చికిత్స విధానం కవర్ చేయబడుతుంది.
        • ఇంట్లో ఉండే వైద్యం చేయించుకొనే వీలుంది.
        • 2000 రూపాయల వరకు ఎమర్జన్సీ అంబులెన్స్ సేవలు కూడా కవర్ చేయబడతాయి.
        • అవయవ మార్పిడి సందర్భంలో అవయవ దానానికి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
        • ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వాటికి అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
        • పాలసీని జీవిత కాలం రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది.
        • రూమ్ రెంట్ కన్సల్టేషన్ ఫీజు వంటి వాటిలో ఎటువంటి సబ్ లిమిట్స్ లేవు
        • క్లైమ్ చేసుకొని ప్రతి సంవత్సరానికి 5% క్యుములేటివ్ బోనస్ ఇవ్వబడుతుంది.
        • వయో పరిమితి:- 18 నుండి 65 సంవత్సరాలు.
        • ఈ పాలసీలో తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వారికి పుట్టే పిల్లలకు 3 నెలల నుండి 26 సంత్సరాలు వచ్చే వరకు ఈ పాలసీలో కవర్ చేయబడతారు.
        • ఈ ప్లానులో మీరు, మీ భార్య లేదా భర్త మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు కవర్ చేయబడతారు.
        • 45 సంత్సరాలు నిండిన వారికి ప్రి పాలసీ హెల్త్ చెకప్ లు అవసరం.
      • ఎన్రిచ్ హెల్త్ లైన్ ప్లాన్:

        • ఇన్సూరెన్స్ మొత్తం:- 3 నుండి 25 లక్షల వరకు.
        • క్యాష్ లెస్ చికిత్స విధానం దేశం మొత్తం మీద చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని అన్ని హాస్పిటల్స్ లో చేయించుకోవచ్చు.
        • 60 నుండి 90 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
        • 141 డే కేర్ చికిత్స విధానం కూడా ఇందులో కవర్ చేయబడుతుంది. దాని కోసం 24 గంటలు హాస్పిటల్లో చేరి ఉండవలసిన అవసరం లేదు.
        • ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకునే సదుపాయం ఉంది.
        • 2000 వేల వరకు అత్యవసర అంబులెన్స్ ఛార్జీలు కూడా హాస్పిటల్లో చేరిన ప్రతి సారి ఇందులో కవర్ అవుతాయి.
        • అవయవ మార్పిడి సందర్భంలో అవయవ దానానికి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
        • ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వాటికి అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
        • క్లైమ్ చేసుకొని ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ చేయబడుతుంది.
        • రూమ్ రెంట్, కన్సల్టేషన్ ఫీజు, డయాగ్నొస్టిక్ ఛార్జీలు కవర్ చేయబడుతాయి.
        • పాలసీని జీవిత కాలం రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది.
        • క్లైమ్ చేసుకొని ప్రతి సంవత్సరానికి 50% క్యుములేటివ్ బోనస్ ఇవ్వబడుతుంది 100% ఇన్సూరెన్స్ మొత్తానికి.
        • వయో పరిమితి:- 18 నుండి 65 సంవత్సరాలు.
        • ఈ పాలసీలో తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వారికి పుట్టే నలుగురుపిల్లలకు 3 నెలల నుండి 26 సంత్సరాలు వచ్చే వరకు ఈ పాలసీలో కవర్ చేయబడతారు.
        • ప్లానులో మీరు, మీ భార్య లేదా భర్త మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు, సోదరీ సోదరులు కవర్ చేయబడతారు.
        • 45 సంత్సరాలు నిండిన వారికి ప్రి పాలసీ హెల్త్ చెకప్ లు అవసరం.
      • చోళ ఎం స్ ప్రివిలేజ్ హెల్త్ లైన్ ప్లాన్:-

        • ఇన్సూరెన్స్ మొత్తం:- 5 నుండి 25 లక్షల వరకు.
        • అత్యవసర అనారోగ్యం లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసిన మొత్తానికి రెండింతలు మొత్తం ఇవ్వబడుతుంది.
        • మెటర్నిటీ ఖర్చులు 1 లక్ష రూపాయల వరకు అప్పుడే పుట్టిన బిడ్డ ఖర్చులతో సహా కవర్ చేయబడతాయి.
        • ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దంతాల వైద్యం, కళ్ళజోడు, హియరింగ్ ఎయిడ్, కాంటాక్ట్ లెన్స్ ఖర్చులకు 10 వేల వరకు ఇందులో కవర్ చేయబడతాయి.
        • అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం కోసం 25,000 రూపాయలు వరకు ఇవ్వబడతాయి.
      • చోళ ఎం స్ క్రిటికల్ హెల్త్ లైన్ ఇన్సూరెన్స్ ప్లాన్:-

        • ఇది పాలసీలో పేర్కొనబడిన లిస్టెడ్ క్రిటికల్ జబ్బులకు అనువైన మొత్తం ఇన్సూరెన్స్ ఎంపికలతో కూడిన ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ప్లాన్ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
        • తీవ్రమైన అనారోగ్యాలకు ఒకేసారి మొత్తం ఖర్చులు చెల్లించబడుతుంది.
        • ఇన్సూరెన్స్ మొత్తం:- 3 నుండి 50 లక్షల వరకు.
        • ప్లానులలో రెండు సబ్ కేటగిరీలు ఉంటాయి. అవి స్టాండర్డ్ ప్లాన్ మరియు అడ్వాన్స్‌డ్ ప్లాన్.
        • స్టాండర్డ్ ప్లాన్ 10 క్లిష్టమైన అనారోగ్యాలను, అడ్వాన్స్‌డ్ ప్లాన్ 12 క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుంది.
        • 1000 రూపాయల వరకు అంబులెన్స్ ఛార్జీలు కూడా ఇందులో కవర్ అవుతాయి.
        • పాలసీని జీవిత కాలం రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది.
        • వయో పరిమితి:- 5 నుండి 65 సంవత్సరాలు.
        • ఇందులో గుండె పోటు, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, బోన్ మారో వంటి జబ్బులు కవర్ అవుతాయి.
      • వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు:

        వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనీ మీరు మీ కోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం తీసుకోవచ్చు. వైద్యానికి అయ్యే ఖర్చులు, కన్సల్టేషన్ ఫీజు, సర్జరీలకు అయ్యే ఖర్చులు, చికిత్సకు అయ్యే ఖర్చులు, రోజువారీ ఖర్చులు, హాస్పిటల్లో చేరినందుకు అయ్యే ఖర్చులు అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి.

      • ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులు:

        వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంటే కుటుంబం మొత్తానికి తీసుకోవడానికి ఇవి ఉత్తమమైనవి. ఇందులో మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు కూడా కవర్ చేయబడతారు.

      • ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేవి:

        డే కేర్ చికిత్స విధానాలు. 24 గంటల కన్నా తక్కువ టైం ట్రీట్మెంట్ తీసుకునే విధానాన్ని డే కేర్ చికిత్స విధానం అని అంటారు. మీరు తీసుకున్న చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో డే కేర్ చికిత్స కోసం అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.

        హాస్పిటల్లో చేరడం:- మీకు చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులలో అనారోగ్యం కారణంగా లేదా ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే ఖర్చులు, డాక్టర్ ఫీజు, సర్జరీకి అయ్యే ఖర్చులు, రూమ్ రెంట్, ఐ సి యు ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు ఇలా ఎన్నో రకాల ఖర్చులు ఈ ఇన్సూరెన్స్ ప్లానులలో కవర్ చేయబడతాయి. ఒకవేళ క్యాష్ లెస్ పద్ధతిలో చికిత్స చేయించుకోవాలి అనుకుంటే చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్లలో చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్ ను ఎంచుకోవాలి. క్లైమ్ చేసుకోవడం కోసం హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించాలి.

        హాస్పిటల్లో చేరడానికి ముందు అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి. ఒకే అనారోగ్యం లేదా ప్రమాదం మూలంగా హాస్పిటల్లో మళ్ళీ చేరాల్సి వచ్చినపుడు, హాస్పిటల్లో చేరడానికి ముందు చేరిన తర్వాత అయ్యే అన్ని ఖర్చులు కూడా ఇందులో కవర్ చేయబడతాయి.

        ఆయుష్ చికిత్స విధానం:- ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలైన చికిత్సా ప్రక్రియలు చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి. ఇందులో సర్జరీలు, థెరపీలు కూడా ఇందులో కవర్ అవుతాయి.

        చోళ హెల్త్ లైన్ కవర్ కింద చోళ ఎం స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు హాస్పిటల్లో అయ్యే అదనపు ఖర్చులను కూడా అందిస్తాయి.

        అవయవదానానికి అయ్యే ఖర్చులు:- చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ అవయవదానానికి అయ్యే ఖర్చులు, ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలకు అయ్యే మొత్తం ఖర్చులు ఈ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడతాయి.

        రికవరి ప్రయోజనాలు:- అనుకున్న దాని కన్నా ఎక్కువ సమయం హాస్పటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆర్థికంగా ప్రయోజనకారిగా ఉంటుంది. దీనినే రికవరీ బెనిఫిట్ అని అంటారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయ పడుతుంది. ఇవన్నీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి.

      ఇన్సూరెన్స్ పరిధిలోకి రానివి:-

      • వ్యాక్సినేషన్:- వ్యాక్సినేషన్లు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడవు.
      • ఆటలు ఆడేటప్పుడు అయ్యే గాయాలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడవు.
      • యుద్ధం వల్ల లేదా గొడవలు కొట్లాటలు వల్ల అయ్యే గాయాలు అనారోగ్యాలు హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడవు.
      • స్వతహాగా చేసుకునే గాయాలకు అయ్యే ఖర్చులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడవు.
      • చట్ట వ్యతరేకంగా ఏమైనా పనులు చేసినప్పుడు అయ్యే గాయాలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడవు.
      • ఆర్మీ, న్యావి, ఎయిర్ ఫోర్స్ వంటి వాటిలో పాల్గొన్నప్పుడు అయ్యే గాయాలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడవు.
      • చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లైంగికంగా సంక్రమించే వ్యాధులకు అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ చేయబడవు.
      • కాస్మెటిక్ సర్జరీలు మరియు ఊబకాయం వంటి వాటికి అయ్యే ఖర్చులు చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడవు.

      క్లయిమ్ ఎలా చేయాలి, దానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు:

      హెల్త్ ఇన్సూరెన్సును రెండు విధాలుగా క్లైమ్ చేసుకోవచ్చు. అవి:- 1.క్యాష్ లెస్ క్లైమ్ 2.రీయింబర్స్మెంట్ క్లైమ్.

      క్యాష్ లెస్ క్లైమ్:

      క్యాష్ లెస్ క్లైమ్ పొందడం కోసం ముందుగా హాస్పిటల్లో చేరగానే, చేరిన వ్యక్తికి చోళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనే విషయాన్ని తెలియచేయాలి. దీని తర్వాత చోళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు మరియు మీ ఐ డి కార్డును హాస్పిటల్లో చూపించాలి. అవసరమైన ఫామ్ లను నింపి చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కి పంపించాలి.

      వాటిని అన్నిటినీ పరిశీలించిన తర్వాత చోళ ఎం స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ చికిత్సను ప్రారంభిస్తుంది. కొన్ని సందర్భాల్లో చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి డాక్టరును పంపి పరిశీలించిన తర్వాత ప్రాసెస్ ను మొదలు పెడుతుంది. అన్ని పరిశీలనలు ముగిశాక అర్హులు అని తెలిశాక క్లైమ్ మంజూరు చేసి, హాస్పిటల్ ఖర్చులను నేరుగా హాస్పిటల్ కే కట్టివేస్తుంది.

      రీయింబర్స్మెంట్ క్లైమ్:

      పేషంట్ తన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను హాస్పిటల్ యాజమాన్యానికి చూపించాలి. అది ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్ అయినట్లయితే క్లైమ్ కోసం చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీనీ అడగాలి. నేరుగా క్లైమ్ అందుబాటులో లేకపోతే ముందు హాస్పిటల్ బిల్లులు కట్టేయ్యాలి.

      బిల్లు కట్టిన తర్వాత చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్ సైట్లో క్లైమ్ ఫామ్ అందుబాటులో ఉంటుంది. దానిని నింపాలి. లేదా 1800 208 5544 అనే టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలి. తర్వాత అవసరమయ్యే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. లేదా మీ డాక్యుమెంట్లను customercare@cholaఎం స్ .murugappa.com లో షేర్ చేయవచ్చు.

      మీ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నట్లైతే చోళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ రీయింబర్స్మెంట్ క్లైమ్ మొత్తాన్ని మంజూరు చేస్తుంది.

      చోళమండలం ఆరోగ్య బీమాను ఎలా కొనుగోలు చేయాలి?

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులను పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ లో ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పొందాలి అనుకున్న వారు కంపెనీ సేల్స్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, కస్టమర్ సర్వీస్ ప్రతినిధితో మాట్లాడవచ్చు.

      ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్ సైట్లో వారి పేరు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐ డి ని పొందుపరచి, తిరిగి కాల్ చేయమని రిక్వెస్ట్ పెట్టవచ్చు.

      ఆసక్తి ఉన్న వ్యక్తులు 56677 నంబర్కి ‘CHOLA HEALTH’ అనే కీవర్డ్‌తో Sఎం స్ పంపవచ్చు.

      ఆసక్తి ఉన్నవారు కంపెనీ వెబ్ సైట్లో నేరుగా లాగ్ ఇన్ అయ్యి, అక్కడ పొందుపర్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో తమకు అనుకూలంగా ఉన్న పాలసీని ఎంపిక చేసుకొని, ఆన్లైన్ లోనే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.

      ఆన్లైన్ లో తీసుకోవడం వద్దు అనుకుంటే చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క బ్రాంచీలకు వెళ్ళడం ద్వారా లేదా ఏజెంట్లను కలవడం ద్వారా అవసరమైన ప్లానులను కొనుగోలు చేసుకోవచ్చు.

      ఈ విధంగా చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ఏ విధంగా అయినా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.

      చోళమండలంహెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడం కోసం క్రింది సూచనలు పాటించండి:

      ముందుగా మీ పాలసీనీ ఎంచుకోవాలి. తర్వాత మీ పాలసీ నంబరును ఎంటర్ చేయాలి. తర్వాత మీ పుట్టిన తేది నెల సంవత్సరమును ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ పాలసీ వివరాలు కనిపిస్తాయి. వాటిని సరి చూసుకుని పాలసీని రెన్యువల్ చేసుకోవాలి.

      కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటైల్స్:

      టోల్ ఫ్రీ నంబర్ - 1800-208-5544 మోటార్ల కోసం

      హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇతరాల కోసం -1800-208-9100

      వాట్సప్ నం - 7305234434.

      Policybazaar exclusive benefits
      • 30 minutes claim support*
      • 50,000 claims approved in last 15 months*
      • Schedule home visit with our advisors
      • Get a plan based on your medical needs
      Disclaimer: Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by an insurer.
      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్స్ Plans
      Critical Healthline Insurance
      Hospital Cash
      Flexi Health Insurance Plan
      COVID-19 Cover
      top
      Close
      Download the Policybazaar app
      to manage all your insurance needs.
      INSTALL