రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
భారతదేశంలో అత్యుత్తమ ఆరోగ్య భీమా పాలసీ అందిస్తున్న ఏకైక కంపెనీ రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
Read More
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత వివరంగా
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి సారిగా క్యాష్ లెస్ క్లైమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మార్కెట్ లో ఉన్న అత్యుత్తమ ఆసుపత్రులతో అనుసంధానం అవుతూ పాలసీ దారులకు వైద్యాన్ని మరింత చేరువ చేస్తుంది. అలాగే ఆయా హాస్పిటల్లకు పాలసీ దారుల తరపున క్యాష్ అలవెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఆటో, ట్రావెలింగ్, ఇల్లు, వ్యాపారం ఇలా అన్ని రంగాలలోనూ వారి అవసరాలకు తగ్గట్టు అతి తక్కువ ప్రీమియం తో వివిధ పాలసీలను రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ సాధారణ భీమా సంస్థగా నిలిచింది రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
మీకు నచ్చిన రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోండి
₹1లక్ష
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
₹2లక్ష
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
₹3లక్ష
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
₹5లక్ష
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
₹10లక్ష
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు క్లుప్తంగా, వివరంగా
కీలకమైన అంశాలు |
ముఖ్యాంశాలు |
అనుసంధానించ బడిన హాస్పిటల్స్ |
3000+ |
ఇన్సూరెన్స్ క్లైమ్ శాతం |
61% |
ప్లాన్ పునరుద్ధరణ కాలం |
జీవితాంతం |
వేచి ఉండే సమయం |
3 సంవత్సరాలు |
పాలసీ యొక్క పదవీకాలం ఎంపికలు |
1,2,3 సంవత్సరాలు. |
భీమా పునరుద్ధరణ |
ఇన్సూరెన్స్ చేసిన భీమా మొత్తం వరకూ. |
గ్రేస్ పీరియడ్ |
30 రోజులు |
క్లెయిమ్ బోనస్ లేదు |
కొన్ని ప్లానుల్లో 10% నుండి 50 % వరకూ. కొన్ని ప్లానుల్లో 10% నుండి 100% వరకూ. |
డే కేర్ సేవలు |
200 వరకూ. |
టీకా కు సంబంధించిన ఖర్చులు |
ఏదైనా జంతువు కరిచిన సందర్భంలో. |
పాలసీ దారులకు రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ప్రయోజనాలు
- వరసగా నాలుగు సంవత్సరాల పాటు పాలసీ క్లైమ్ చేసుకోని యెడల ఆ పాలసీ దారులకు ఉచిత హెల్త్ చెక్ అప్ సౌకర్యం ఉంది.
- పాలసీ క్లైమ్ చెయ్యని ప్రతీ సంవత్సరానికి 5% నుండి 50% వరకూ నో క్లైమ్ బోనస్ పొందవచ్చు.
- ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీ దారులు రాయల్ సుందరం కంపెనీ తో అనుసంధానం చేయబడి ఉన్న 3000 పైగా హాస్పిటల్స్ లో వైద్యం చేపించుకునే సదుపాయం ఉంది.
- ఈ పాలసీ 147 డే కేర్ సేవలను అందిస్తోంది.
- హాస్పిటల్ కు వచ్చే ముందు మరియు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా ఈ పాలసీ ద్వారా అందిస్తున్నాము.
- 3 సంవత్సరాల పాటు పాలసీ పునరుద్ధరణ చేసిన తర్వాత ముందుగా ఉన్న ఆనారోగ్యం కూడా పాలసీ లోకి తీసుకునే సౌలభ్యం కల్పిస్తుంది.
- పాలసీ ను జీవితకాలం పునరుద్ధరించే సౌకర్యం కల్పిస్తుంది.
- ప్రసూతి సమయంలో వైద్యం కూడా ఈ ప్లాన్ ద్వారా అందుబాటులో ఉంది.
- సెక్షన్ 80(D) కింద అన్ని భీమా ప్రీమియం ప్లాన్ లు టాక్స్ బెనిఫిట్ కలిగి ఉన్నాయి.
- ఆక్సిడెంట్ జరిగినప్పుడు భీమా మొత్తాన్ని 50% పెంచుకునే అవకాశం ఉంది.
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనే ఎందుకు తీసుకోవాలి?
అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురి అయినప్పుడు కానీ లేదా దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్స తీసుకోవడానికి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కింద వివరించిన కారణాలు చూస్తే తప్పకుండా రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నే ఎంచుకుంటారు.
- వ్యక్తిగత మరియు కుటుంబ ప్లాన్: రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కుటుంబంలో అత్యధికంగా 19 మంది సభ్యులకు భీమా సౌకర్యం కల్పిస్తుంది. అలాగే వ్యక్తిగత పాలసీ కూడా అందిస్తుంది. మీ ఆనందకరమైన కుటుంబం కోసం అందరికీ కలిపి ఒకే పాలసీ అందించడం మాకు చాలా గొప్ప విషయం.
- అత్యధిక భీమా విలువ: రోజు రోజుకూ పెరిగిపోతున్న వైద్య ఖర్చులకు అప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవాలి అంటే చాలా కష్టమైన విషయం. అందుకే రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లో 1.5 కోట్ల రూపాయల వరకూ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఈ భీమా మొత్తంలో అన్ని వైద్య సేవలు అందించబడతాయి.
- జీవితకాలం పాలసీ ను పునరుద్ధరించే అవకాశం: ఇన్సూరెన్స్ అన్ని ప్లాన్లు జీవితకాలం పునరుద్ధరించే అవకాశం కలిగి ఉన్నాయి.
- వయసు పరిమితి నిబంధన లేదు: వయసుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా పాలసీ తీసుకునే సౌలభ్యం ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ లో వైద్య సదుపాయం: అత్యంత క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో కూడా వైద్యం చేయించుకునే వీలు కల్పిస్తుంది రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. అవి
- రాయల్ సుందరం లైఫ్ లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు - లైఫ్ లైన్ క్లాసిక్, సుప్రీం, ఎలైట్.
- రాయల్ సుందరం ఫ్యామిలీ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
- రాయల్ సుందరం హాస్పిటల్ క్యాష్ అల్లోవెన్స్ ప్లాన్
ఒకొక్క ప్లాన్ గురించి మరింత వివరంగా తెలుసుకోండి
-
రాయల్ సుందరం లైఫ్ లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ వ్యక్తిగతంగా ఒకరు అయినా తీసుకోవచ్చు. లేదా కుటుంబ సభ్యులతో కలిపి తీసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా ఈ పాలసీ తీసుకునే సదుపాయం ఉంది. అలాగే 91 రోజులు నిండిన వారికి అలాగే 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వారి తల్లితండ్రులు ఉండే పాలసీ లో సభ్యులుగా కలిపి తీసుకునే సౌలభ్యం ఉంది.
ఒక్క రాయల్ సుందరం " లైఫ్ లైన్" హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లో అత్యధికంగా 6 గురు వ్యక్తులు కలిపి ఒకే పాలసీ తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ 1, 2, 3 సంవత్సరాల కాల వ్యవధిలో లభిస్తుంది. 2 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన పాలసీ తీసుకునే వారికి 7.5 % నుండి 12% వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
లైఫ్ లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 3 విధాల ప్లాన్లలో లభిస్తుంది. 1. క్లాసిక్, 2. సుప్రీం ,3. ఎలైట్. ఈ మూడు ప్లాన్ల వివరాలు క్లుప్తంగా ఇక్కడ చదవండి.
-
18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా రాయల్ సుందరం లైఫ్ లైన్ క్లాసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. వారితో పాటు వారి పిల్లలకు కూడా ఈ ప్లాన్ లోనే పాలసీ తీసుకునే సౌలభ్యం ఉంది.
ప్లాన్ |
వ్యక్తిగత/ కుటుంబ ప్లాన్ |
వయో పరిమితి |
పెద్దలు: 18 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ. పిల్లలు: 91 రోజుల నుండి 25 సంవత్సరాల మధ్య లో ఉన్నవారు |
భీమా మొత్తం |
2-4 లక్షల రూపాయలు |
పాలసీ కాల వ్యవధి |
1,2,3 సంవత్సరాలు |
నో క్లైమ్ బోనస్ |
10 నుండి 50 % |
ప్లాన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
- ఈ పాలసీ లో పేషంట్ హాస్పిటల్ ఖర్చులు, నర్సింగ్ ఖర్చులు, బోర్డింగ్ ఖర్చులు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు, ICU ఖర్చులు, వాక్సిన్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, మెడిసిన్ ఖర్చులు మొత్తం అందించబడతాయి.
- భీమా మొత్తం విలువను బట్టి హాస్పిటల్ లో చేరే 30 రోజుల ముందు పేషంట్ ఖర్చులు, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల మెడికల్ ఖర్చులు కూడా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది.
- పేషంట్ కు ఇంటి దగ్గర అయ్యే మెడిసిన్ ఖర్చులు కూడా ఈ పాలసీ కిందకే వస్తాయి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ పథకం కింద అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి.
- 3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతీ సంవత్సరం ఉచితంగా హెల్త్ చెక్ అప్ చేయించుకునే వీలుంది.
- డే కేర్ సేవలకు అయ్యిన ఖర్చులు మొత్తం రీ ఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు.
-
రాయల్ సుందరం లైఫ్ లైన్ సుప్రీం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో భీమా మొత్తం 50 లక్షల రూపాయలు వరకూ తీసుకునే సౌకర్యం ఉంది. ఈ ప్లాన్ కూడా వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యుల అందరికీ కలిపి తీసుకోవచ్చు. ప్లాన్ వివరాలు కింద గమనించగలరు.
ప్లాన్ విధానం |
వ్యక్తిగత/ కుటుంబ ప్లాన్ |
భీమా మొత్తం విలువ |
5 నుండి 50 లక్షలు. |
నో క్లైమ్ బోనస్ |
20 నుండి 100 శాతం. |
భీమా పునరుద్ధరణ |
ఇన్సూరెన్స్ చేసిన భీమా మొత్తం వరకూ. |
హాస్పిటల్ లో చేరే ముందు/ డిశ్చార్జ్ అయ్యాక భీమా వర్తించే రోజులు |
60/90 రోజులు. |
వయో పరిమితి |
18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. పిల్లలు : 91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు. |
ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
- 11 క్లిష్టమైన వ్యాధుల / ఆరోగ్య పరిస్థితుల కోసం 2వ అభిప్రాయం తీసుకునే అవకాశం ఈ ప్లాన్ లో ఉంది.
- అత్యవసర పరిస్థితుల్లో దేశంలో చేసే ప్రయాణ ఖర్చులు కూడా ఈ పాలసీ లో రీ ఎంబర్స్మేంట్ చేసుకోవచ్చు.
- అంబులెన్స్ ఖర్చులు 5000 రూపాయల వరకూ పెంచుకోవచ్చు.
- అవయవ దాతలకు అయ్యే ఖర్చులు కూడా భీమా పరిమితి ను బట్టి ఈ పాలసీ నుండి క్లైమ్ చేసుకునే వీలు ఉంది.
- పాలసీ వ్యవధిలో పాలసీ క్లైమ్ చెయ్యకపోతే వ్యవధి దాటిన తర్వాత 20 నుండి 100% నో క్లైమ్ బోనస్ పొందవచ్చు.
- ఇంటి దగ్గర అయ్యే మెడిసిన్ ఖర్చులు కూడా ఈ పాలసీ ద్వారా కంపెనీ భరిస్తుంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ పథకం కింద అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి.
- ప్రతీ సంవత్సరం ఉచితంగా హెల్త్ చెక్ అప్ చేయించుకునే సౌకర్యం కూడా ఉంది.
- దేశంలో వైద్యం కోసం అయ్యే ప్రయాణ ఖర్చులు 1 లక్ష రూపాయల వరకూ క్లైమ్ చేసుకునే వీలు ఉంది.
-
రాయల్ సుందరం లైఫ్ లైన్ ఎలైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించే పాలసీ ను అందిస్తుంది. విదేశాల్లో కూడా అత్యవసర చికిత్స క్లిష్టమైన వైద్య చికిత్స ఈ పాలసీ ద్వారా అందించబడుతుంది. మరిన్ని వివరాలు క్లుప్తంగా.
ప్లాన్ విధానం |
వ్యక్తిగత / కుటుంబ ప్లాన్ |
భీమా మొత్తం |
రూ. 25 నుండి 1 కోటి వరకూ. |
నో క్లైమ్ బోనస్ |
20 నుండి 100 % |
భీమా పునరుద్ధరణ |
ఇన్సూరెన్స్ చేసిన భీమా మొత్తం వరకూ. |
హాస్పిటల్ లో చేరే ముందు/ డిశ్చార్జ్ అయ్యాక భీమా వర్తించే రోజులు |
60/180 రోజులు. |
ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
- 11 రకాల క్లిష్టమైన చికిత్స కోసం ప్రపంచ వ్యాప్తంగా చికిత్స అందించే సదుపాయం కలిగి ఉన్నప్పటికీ పాలసీ దారుడు ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా దేశాలను ఎంచుకునే ప్రత్యేక సౌలభ్యం ఉంది.
- ఈ పాలసీ అంబులెన్స్ ఖర్చులు మొత్తాన్ని కవర్ చేస్తుంది.
- గరిష్టంగా ఇద్దరు బిడ్డల ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులో భీమా మొత్తం విలువలో 25% వరకూ అప్పుడే జన్మించిన శిశువుకు వర్తిస్తుంది. ఒక సంవత్సరం పాటు వాక్సిన్ ఖర్చులు కూడా అందిస్తుంది.
- ప్రపంచంలో ఎక్కడైనా కూడా అత్యవసర వైద్య సదుపాయాలను కల్పిస్తుంది.
- పాలసీ వ్యవధి లో పాలసీ దారుడు క్లైమ్ చెయ్యకపోతే, గడువు ముగిశాక నో క్లైమ్ బోనస్ 20 నుండి 100% అందుతుంది.
- హాస్పిటల్ లో చేరే ముందు 60 రోజుల నుండి డిశ్చార్జ్ అయిన 180 రోజుల పాటు పేషంట్ ఖర్చులను కవర్ చేస్తుంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ పథకం కింద అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి.
-
రాయల్ సుందరం ఫ్యామిలీ ప్లస్ ప్లాన్ ఎక్కువ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే ప్లాన్ తీసుకునే అవకాశం కలిగి ఉన్న ఒక మంచి పాలసీ. ఈ ప్లాన్ ద్వారా అత్యధికంగా ఒక కుటుంబంలో 19 మంది పాలసీ తీసుకునే సౌలభ్యం ఉంది.
ప్లాన్ విధానం |
వ్యక్తిగత/ కుటుంబ ప్లాన్. |
వ్యక్తిగత పాలసీ కు భీమా మొత్తం |
రూ. 2 లక్షల నుండి 15 లక్షల వరకు. |
కుటుంబ పాలసీ కు భీమా మొత్తం |
రూ. 3 లక్షల నుండి 50 లక్షల వరకు. |
వయో పరిమితి |
పెద్దలు: 18 సంవత్సరాలు ఆ పైన. పిల్లలు : 91 రోజులు ఆ పైన. ఈ ప్లాన్ లో గరిష్ట వయో పరిమితి లేదు. |
నో క్లైమ్ బోనస్ |
20 నుండి 100% |
పాలసీ ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
- ఒకే ప్లాన్లో అత్యధికంగా 19 మంది కుటుంబ సభ్యులకు పాలసీ తీసుకునే అవకాశం ఉంది.
- గరిష్టంగా రెండు ప్రసవాలకు అయ్యే ఖర్చు ఈ పాలసీ కవర్ చేస్తుంది. పుట్టిన శిశువులకు పోషకాహారం అల్లోవేన్స్ ఈ పాలసీ ద్వారా లభిస్తుంది.
- భీమా మొత్తాన్ని పునరుద్ధరించే సదుపాయం ఈ పాలసీలో ఉంది.
- ఐదు సంవత్సరాలలో పాలసీ క్లైమ్ చెయ్యలేని పక్షంలో భీమా మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ పథకం కోసం అయ్యే ఖర్చులు, చికిత్స అనంతరం ఇంటి దగ్గర అయ్యే మెడిసిన్ ఖర్చులు, అవయవ దాత కోసం అయ్యే మెడికల్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు కూడా ఈ పాలసీ అందిస్తుంది.
- 11 క్లిష్టమైన వ్యాధుల / ఆరోగ్య పరిస్థితుల కోసం 2వ అభిప్రాయం తీసుకునే అవకాశం ఈ ప్లాన్ లో ఉంది.
- దేశంలో అత్యవసర వైద్యం కోసం అయ్యే ప్రయాణ ఖర్చులు 1 లక్ష రూపాయల వరకూ క్లైమ్ చేసుకునే వీలు ఉంది.
-
రాయల్ సుందరం హాస్పిటల్ క్యాష్ అల్లోవెన్సు ప్లాన్ హాస్పిటల్ లో అయ్యే అదనపు ఖర్చులు కవర్ చేస్తుంది. ఉదాహరణకు హాస్పిటల్ నుండి ఇంటికి రాను పోను ప్రయాణ ఖర్చులు, పేషంట్ డైట్, ప్రత్యేక అటెండర్ కు అవసరమైన ఖర్చులు. మీరు తీసుకున్న బేసిక్ ప్లాన్ తో పాటు ఈ ప్లాన్ కూడా తీసుకునే సౌకర్యం ఉంది. ప్లాన్ వివరాలు క్లుప్తంగా.
ప్లాన్ విధానం |
వ్యక్తిగత / కుటుంబ ప్లాన్ |
పునరుద్ధరణ కాల పరిమితి |
జీవితకాలం |
డిస్కౌంట్ |
10% |
వయో పరిమితి |
1 నుండి 65 సంవత్సరాలు |
ఫీచర్లు మరియు ప్రయోజనాలు:
- రాయల్ సుందరం హాస్పిటల్ క్యాష్ ఆల్లోవేన్స్ పాలసీ ద్వారా పాలసీ దారుని భార్య లేదా భర్త, పిల్లలు, లేదా తల్లితండ్రుల అదనపు ఖర్చులు కూడా కవర్ అవుతాయి.
- ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులకు ఈ ప్లాన్ తీసుకుంటే 10 % డిస్కౌంట్ లభిస్తుంది.
- ఆక్సిడెంట్ జరిగిన సందర్భంలో రెట్టింపు నగదు చెల్లింపు ఇస్తుంది.
- అత్యవసర పరిస్థితుల్లో ICU లో చేరవలసి వస్తే మూడు రెట్లు అధికంగా చెల్లింపు వర్తిస్తుంది.
- అన్ని ట్రీట్మెంట్ మరియు సర్జరీలకు వర్తిస్తుంది.
చెల్లించే ప్రీమియం మరియు జోనల్ ధరల వివరాలు:
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వర్గాలుగా విభజించారు
- పాలసీ దారుని భీమా మొత్తం మరియు పాలసీ దారుని వయసు.
- పాలసీ దారుడు నివసించే ప్రాంతం.
పాలసీ దారుడు చెల్లించే ప్రీమియం వారు ఎంచుకునే భీమా మొత్తాన్ని బట్టి, వారి వయసు ను బట్టి, వారు నివసించే జోన్ ను బట్టి మారుతూ ఉంటుంది.
జోన్ 1: ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, పూణే, కోల్కతా, హైదరాబాద్, గుజరాత్. ఈ జోన్ల వారికి డిస్కౌంట్ లభించదు.
జోన్ 2: జోన్ 1 కాకుండా మిగిలిన ప్రాంతాల వారు అందరూ జోన్ 2 లోకి వస్తారు. వీరికి 15 % డిస్కౌంట్ లభిస్తుంది.
ఆన్లైన్ లో రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి?
ఆన్లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా సులభమైన విషయం, మీరు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆన్లైన్ లోనే పాలసీ తీసుకోవచ్చు. పాలసీ బజార్ వెబ్సైట్ నుండి మీరు ఈ పాలసీ కొనుగోలు చెయ్యవచ్చు. ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం ద్వారా మీరు చాలా సమయాన్ని ఆదా చేసుకున్నట్టే. ఆన్లైన్ లో ఎలా తీసుకోవాలి అని మరింత వివరంగా చూడండి.
- పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను ఎంచుకోండి.
- అందులో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకోండి.
- ప్లాన్ వివరాలు, కట్టవలసిన ప్రీమియం చెల్లింపు వివరాలు సరి చూసుకోండి.
- మీకు అంతా ఖచ్చితంగా ఉన్నట్టు అయితే అక్కడే పాలసీ కొనుగోలు చెయ్యవచ్చు. మీ ఈ మెయిల్ కు మెయిల్ ద్వారా ఈ కొనుగోలు రిసీప్ట్ పంపబడుతుంది.
- పాలసీ డాక్యుమెంట్స్ పాలసీ దారుని చిరునామాకు పంపబడుతాయి.
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ మరియు రీఎంబర్స్ చేసుకునే విధానం:
పాలసీ దారుడు రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ రెండు విధాలుగా క్లైమ్ చేసుకోవచ్చు. మొదటిది క్యాష్ లెస్, రెండవది రీఎంబర్స్మెంట్.
క్లైమ్ చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన వివరాలు:
- రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నెంబరు.
- ఆనారోగ్య లక్షణాలు మొదలైన తేదీ వివరాలు.
- హాస్పిటల్ పేరు.
- పాలసీ దారిని ఫోన్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడి మొదలగు వివరాలు.
- చికిత్స పొందుతున్న పేషెంట్ వివరాలు.
- అనారోగ్య లక్షణాలు.
- ఆక్సిడెంట్ అయిన సందర్భంలో ఆక్సిడెంట్ అయిన ప్రదేశం, తేదీ, సమయం.
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ రీ ఎంబర్స్ చేసుకునే విధానం:
రాయల్ సుందరం కంపెనీ అనుసంధానం లో లేని హాస్పిటల్ లో చికిత్స చేపించుకున్న వారు రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ రీ ఎంబెర్స్ చేసుకోవచ్చు. ఆ విధానం చూడండి.
- హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపు క్లైమ్ ఫామ్ ను పూర్తి చేసి సంతకం చేసి కంపెనీ కు అందించాలి.
- కంపెనీ అన్ని వివరాలు ఖచ్చితంగా సరి చూసుకున్న తర్వాత 30 రోజులలో డబ్బులు మీకు అందించబడతాయి.
- ఒకవేళ మీ అప్లికేషన్ నిరాకరించ బడితే 7 రోజుల్లో మీకు ఈ విషయం తెలియజేయ బడుతుంది.
- డబ్బు పాలసీ దారునికి చెల్లించబడుతుంది.
అన్ని డాక్యుమెంట్స్ రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఏదైనా బ్రాంచ్ లో అప్పగించాలి.
భారతదేశంలో రాయల్ సుందరం క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే విధానం:
- ముందుగా అనుకున్న ట్రీట్మెంట్ కోసం ఐతే, 72 గంటలు ముందుగా TPA కు సమాచారం ఇవ్వాలి. అవి సరి చూసుకుని కంపెనీ మీకు క్యాష్ లెస్ క్లైమ్ అందిస్తుంది.
- అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేరినట్లయితే చేరిన 24 గంటల లోపు TPA కు తెలియజేయాలి.
- ఫార్మ్ పూర్తి చేసి అక్కడ ఉన్న TPA కు అందజేయాలి.
- అన్ని వివరాలు TPA కు అందిచాక ఏదైనా సమస్య ఉంటే ఆ TPA మీకు 4 గంటలలో సమాచారం ఇస్తారు.
- అదనపు ఖర్చులు ఏవైనా పాలసీ దారుడే భరించవలసి ఉంటుంది.
- దరఖాస్తు చేసుకున్న చికిత్స పాలసీ లో లేనట్లు అయితే 2 గంటలలో నిరాకరించి మీకు పంపబడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా రాయల్ సుందరం క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే విధానం:
- ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడానికి పేషంట్ హాస్పిటల్ లో చేర్పించిన 24 గంటలలో కంపెనీ కు సమాచారం అందించాలి.
- పాలసీ దారుడు ఇచ్చిన వివరాలు కంపెనీ సరి చూసుకుంటుంది.
- ఒకసారి పాలసీ అప్రూవ్ అయ్యాక, కంపెనీ నేరుగా హాస్పిటల్ కు డబ్బు చెల్లిస్తుంది.
- ఏదైనా అదనపు ఖర్చులు ఉన్న యెడల అవి పాలసీ దారుడే చెల్లించాలి.
రాయల్ సుందరం ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే విధానం:
పాలసీలో ప్రతిపాదించబడిన 11 క్లిష్టమైన చికిత్స కు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి.
- ఇలాంటి చికిత్స కు విదేశాలకు వెళ్ళే వారు ముందుగా కంపెనీ కు వివరాలు తెలియజేయాలి, పాలసీ దారుడు తీసుకున్న పాలసీ ను బట్టి కంపెనీ నేరుగా చెల్లింపు చేస్తుంది.
- ఏవైనా అదనపు ఖర్చులు ఉంటే అవి మీరే చెల్లించవలసి వస్తుంది.
- అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేటినట్లయితే చేరిన 24 గంటలలో, సాధారణ పరిస్థితుల్లో చేరేటట్లయితే చేరే 48 గంటలు ముందుగా కంపెనీ కు తెలియజేయాలి.
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పునరుద్ధరించే విధానం:
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ పునరుద్ధరించే విధానం కూడా చాలా సులభం, మీ గడువు తేదీ లోపే మీరు పాలసీ ను పునరుద్ధరించడం ఉత్తమమైన మార్గం. ఒకవేళ గడువు తేదీ లోపు భీమా పునరుద్ధరించడానికి వీలు కాకపోతే మీకు కొంత గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. ఆ సమయంలో మీరు మీ పాలసీ ను పునరుద్ధరించవచ్చు. అది ఎలా అంటే పాలసీ బజార్ వెబ్సైట్ కు వచ్చి ఈ కింద చెప్పిన మార్గాలు అవలంబించండి.
- పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేసి రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ను ఎంపిక చేసుకోండి.
- అక్కడ ఉన్న రెన్యువల్ ను ఎంచుకుని తర్వాత పేజీ కు రండి.
- అక్కడ మీ యొక్క వివరాలు అడగబడతాయి. వాటిని పూర్తి చేసి సబ్మిట్ చెయ్యండి.
- ఇప్పుడు మీకు ప్రీమియం వివరాలు కనిపిస్తాయి, వాటిలో మీకు కావల్సిన ప్రీమియం ఎంచుకుని ఆన్లైన్ లో డబ్బు చెల్లించండి.
- మీ పేమెంట్ పూర్తి అవ్వగానే మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ కు పూర్తి సమాచారం మెయిల్ వస్తుంది.
రాయల్ సుందరం లైఫ్ ఇన్సూరన్స్ కంపెనీ చిరునామా
℅ కస్టమర్ కేర్ సర్వీసెస్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్
విశ్రాంతి మెలారం టవర్స్,
నెం. 2/319, రాజీవ్ గాంధీ సలాయి (OMR),
కరప్పకం,
చెన్న - 600097.