*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply
*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply
Who would you like to insure?
ఫ్యూచర్ జెనెరేలి అనేది జెనెరల్ భీమా సంస్థ, భారత దేశం లో వున్నా అన్ని ప్రముఖ వ్యాపార సమ్మేళనం మధ్య ఒక జాయింట్ వెంచర్. ఫ్యూచర్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ మరియు జెనెరేలి గ్రూప్ అనేవి ప్రముఖ ఇటాలియన్ ఆధారిత కంపెనీ లు, అలాగే ఆర్ధిక రక్షణ మరియు సంపాద నిర్వహణలో ప్రధాన నాయకుడు.
ఇప్పుడు వున్న ఆధునిక రోజులలో ఆరోగ్య భీమా పధకాలు అనేవి చాలా ముఖ్యమైనవి, కారణం పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు అనేక వ్యాధుల చికిత్స ఖర్చులు. అలాగే వైద్య ఖర్చులు అనేవి రోజురోజుకి పెరుగుతూనే వున్నాయి, కానీ అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఆర్థికంగా భరించే శక్తీ , ఒక సామాన్యుడి ఆదాయం లో అభివృద్ధి ఉండటం లేదు. అందువల్ల తనని తాను భీమా చేస్కోవడం వల్ల ఏదయినా అత్యవసర వైద్యపరమైన ఖర్చులు ఎదురైనప్పుడు పాలసీ ద్వారా ఆర్థిక సంక్షోభం భీమా కంపెనీ చే నిర్వహించబడుతుంది, దీనివల్ల సగటు మధ్య తరగతి మనిషికి వైద్య ఖర్చులు అనేవి భారం కావు.
జెనెరేలి గ్రూప్ అనేది ఇటలీ లోనే పెద్ద బీమా సంస్థ మరియు యూరోప్ లోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన మరియు పెద్ద బీమా సంస్థలలో ఒకటి . ఈ సంస్థ తన కార్యకలాపాలను సెప్టెంబర్ 2007 లో ప్రారంభించింది. ఈ కంపెనీ ఒక వ్యక్తికి అవసరం అయ్యే అనేక విభాగాలలో వున్నా అన్ని రకాల బీమా ఉత్పత్తులను వినియోగదారుల కోసం అందిస్తుంది. ఈ బీమా సంస్థ ఒక వ్యక్తికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చేలాగా ఆరోగ్య బీమా విషయంలో ప్లాన్స్ ని రూపొందించి అందిస్తుంది.
ఈ ఫ్యూచర్ జెనెరేలి భీమా సంస్థ నాణ్యత, వినియోగదారుల సంబంధాలు, మరియు సాధారణ లేదా తేలికైన క్లెయిమ్ ప్రక్రియ మీద దృష్టి పెడుతుంది. ప్రస్తుతం దేశం లో వున్న అన్ని ప్రధాన భీమా సంస్థల లో ఫ్యూచర్ జెనెరేలి కూడా ఒకటి. క్రింద ఫ్యూచర్ జెనెరేలి యొక్క ఆరోగ్య భీమా కొనడం వల్ల కలిగే లాభాలు వున్నాయి .
ఈ సంస్థ ఆరు రకాల ఆరోగ్య భీమా పధకాలను అందిస్తోంది. అవి
ఆసుపత్రి లో చేరడం అనేది ఎప్పుడూ కూడా ఖరీదయిన వ్యవహారం. సాధారణ రోజు వారి చికిత్స నుంచి పెద్ద పెద్ద ఆపరేషన్స్ వరకు ప్రతిదీ మీరు దాచుకున్న డబ్బు నుంచి ఖర్చు పెట్టాలి అంటే చుక్కలు కనిపిస్తాయి. అందుకే మీ ఆర్థిక విషయాలను సులభతరం చేయడం కోసం మేము ఈ పాలసీ ద్వారా ఇక్కడ వున్నాము. మా పాలసీ తో మీకు అవసరమైన వైద్య చికిత్సను రాజీపడకుండా పొందవచ్చు.
ఆరోగ్య సురక్ష కుటుంబ ప్లాన్ ద్వారా ఒక హామీ మొత్తం బీమా కుటుంబ సభ్యులందరికి వర్తిస్తుంది. ఈ పాలసీ లో కుటుంబ సభ్యులందరు బీమా వ్యక్తి యొక్క జీవిత భాగస్వామిగా మరియు అతనిపై ఆధారపడిన ఇద్దరు పిల్లలు గా వర్గీకరించబడతారు. నిర్మాణ ప్రకారంగా అందించబడ్తున్న ప్రయోజనాల ఆధారంగా ఈ ప్లాన్ క్రింద పేర్కొనే మూడు ఉప వర్గాలుగా వర్గీకరించబడుతుంది, అవి ఉప వర్గాలు బేసిక్, సిల్వర్ మరియు ప్లాటినం. ఈ కంపెనీ యొక్క 4200 + నెట్వర్క్ గల ఎ ఆసుపత్రి లో అయిన నగదు రహితంగా చేరవచ్చు.
ప్రస్తుత రోజులలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా ప్రమాదాలు జరుగవచ్చు. దీనివల్ల మీరు, మీ కుటుంబం మానసికంగా, శారీరకంగా మరియు ఆర్థికంగా కృంగిపోతారు. ఈ ప్రమాదాల వల్ల మీ కుటుంబానికి భారం పెరుగుతుంది, అలాగే మీ యొక్క జీవిత కాల పొదుపు ని హరించేస్తాయి. కానీ మీరు వాటి గురించి బాధతో ఆలోచిస్తూ కాలాన్ని గడపవలసి పని లేదు. మీ యొక్క ఆందోళనను ఫ్యూచర్ జెనెరేలి యొక్క వ్యక్తిగత ప్రమాద భీమా చూసుకుంటుంది!
మా వ్యక్తిగత ఆరోగ్య రక్షణ పాలసీ ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని తిరిగి పొంది, మీ పనిని మీరు తిరిగి మొదలుపెట్టేవరకు మీకు ఆర్థికంగా తోడుగా ఉంటుంది, అలాగే మీరు సమీపం లో లేనప్పుడు మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థోమతను సురక్షితం గా వుంచుకోవచ్చు.
అత్యంత అనారోగ్య పరిస్థితులలో మీకు అవసరం అయ్యేలా మిమ్మల్ని రక్షించడానికి రూపొందించిందే ఈ క్లిష్టమైన అనారోగ్య భీమా పథకం. క్లిష్టమైన అనారోగాలు మీ జీవితం లో ప్రాణాపాయాలు మరియు వినాశనాన్ని కలిగిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా , క్లిష్టమైన ఆరోగ్య బీమా ద్వారా మీకు తగిన డబ్బు సాయాన్ని అందిస్తుంది. సాధారణంగా, ప్రాథమిక ఆరోగ్య బీమా పధకం ద్వారా క్లిష్టమైన అనారోగ్యాలు కవర్ చేయబడవు, అందువల్ల నిర్దిష్టంగా రూపొందించిన ఈ బీమా పధకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మీరు పైన పేర్కొన్న జాబితాలో ఇవ్వబడిన క్లిష్టమైన అనారోగ్యాలతో బాధాపడ్తున్న లేదా వ్యాధులకు శస్త్ర చికిత్స చేయించుకున్న మేము మీకు ఏక మొత్తం ప్రయోజనాలను అందజేస్తాము. అయితే ఇందుకోసం వ్యక్తి మొదటి రోగ నిర్దారణ లేదా ప్రకియ జరిగిన తర్వాత 28 రోజుల వరకు జీవించి ఉండాలి మరియు పాలసీ బీమా ఖచ్చితంగా 90 రోజులు పాతది అయ్యి ఉండాలి.
ఎవరు కూడా అనారోగ్యానికి గురి కావాలని లేదా గాయపడాలని అనుకోరు , కానీ ఏదోక కాలంలో / సమయం లో మనలో చాల మందికి వైద్య సంరక్షణ ఉండటం అనేది చాల అవసరం.
మీకు ఇప్పటికే ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ , అది ఎలాంటి యాదృచ్ఛిక ఖర్చులను కవర్ చేయలేదు . యాదృచ్ఛిక ఖర్చులంటే ఏంటి ? ఆహారం, ప్రయాణం, ఎక్స్ రే మరియు శస్త్రచికిత్స ఉపకరణాల వంటి ఖర్చులే యాదృచ్ఛిక ఖర్చులు .
ఫ్యూచర్ జెనెరేలి ఆసుపత్రి నగదు బీమా ద్వారా మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ భత్యం పొందుతారు. ఈ భత్యాన్ని మీరు మీకోసం అవసరం అయ్యే యాదృచ్చిక ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు నగదు ప్రయోజనాలను అందించే ఫుల్ ప్రూఫ్ మార్గం మరియు మీరు పొదుపుగా దాచుకున్న నగదు మొత్తం తగ్గకుండా నిరోధిస్తుంది. అదనంగా, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది.
నివాసం నగరం లోపల లభించే ICU ప్రయోజనాలు
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు 10 రోజుల కాలం కంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చేరితే, ఒక్కో ఆసుపత్రిలో చేరిన ఈవెంట్ కు ఒకసారి చొప్పున 5000 రూ యొక్క అదనపు స్వస్థత ప్రయోజనం లభిస్తుంది.
ప్రతి ఆసుపత్రిలో గరిష్టం గా 10 రోజులు మరియు పాలసీ వ్యవధిలో గరిష్టం గా 20 రోజులు ICU ప్రయోజనాలు అందించబడతాయి.
తరచుగా రికవరీ అనేది ఆసుపత్రి లో చేరినంత ఖరీదైనది. అందుకే మా పాలసీ అదనపు 5000 రూ ఒత్తిడి లేని రికవరీ ప్రయోజనాలను అందిస్తుంది.
మీరు ఇదివరకే ఆరోగ్య బీమా ను తీసుకొని ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సంరక్షణ అనేది మిమ్మల్ని ఆర్థికంగా డిమాండ్ చేయవచ్చు. కొన్ని సార్లు వైద్య ఖర్చులు మీ బీమా కవరేజ్ కంటే ఎక్కువగా ఉండొచ్చు, అలాంటి పరిస్థితులలోనే మీ ఆరోగ్య బీమా యొక్క కవరేజ్ ని పెంచుకోవడం వల్ల మీకు సహాయం లభిస్తుంది.
ఇది సాధ్యమేనా? అవును, ఫ్యూచర్ జెనెరేలి యొక్క ఆరోగ్య బీమా టాప్ అప్ ద్వారా మీ కవరేజ్ ని పెంచుకోడానికి లేదా పొడిగించుకోడానికి మీకు అనుమతి లభిస్తుంది. ఈ బీమా ని ఎంచుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తానికి బీమా చేయబడతారు. దీని ద్వారా మీరు మాములు చికిత్స తో కాకుండా పూర్తి నాణ్యమైన/ ఉత్తమమైన చికిత్సను ఎంచుకోవచ్చు. ఈ బీమా వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతంగా కూడా అందుబాటులో వుంది.
మా ఈ టాప్ అప్ బీమా వల్ల మీకు పొడిగించిన కవరేజ్ లభిస్తుంది. ఇందువల్ల మీరు ఇకపై మీ చికిత్సలలో రాజీ పడవలసిన పని ఉండదు. పాలసీ ఏమేమి కవర్ చేస్తుందో ఈ క్రింద ఉంచబడినది:
రోజురోజుకి ఆసుపత్రుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ మా టాప్ అప్ పాలసీ ద్వారా మీ పొదుపులు సురక్షితంగా వున్నాయి , మా టాప్ అప్ బీమా కి ధన్యవాదాలు. మా టాప్ అప్ పాలసీ ద్వారా మీరు మీ యొక్క పొదుపు గురుంచి ఆందోళన చెందకుండా మీరు మీ యొక్క చికిత్స పై మాత్రమే దృష్టి పెట్టవచ్చు.
మా ప్లాన్ లో గది, బోర్డింగ్ మరియు నర్సింగ్ చార్జీలు కవర్ చేయబడతాయి. అలాగే మందులు, ఎక్స రే , పరీక్షలు మరియు కన్సల్టెంట్ ఫీజులు కూడా కవర్ చేయబడతాయి.
మేము ఈ పాలసీ ద్వారా మందులు, డయాగ్నొస్టిక్ మెటీరియల్స్, ఎక్స రే, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, స్పెషలిస్ట్ ఫీజులు, మరియు కన్సల్టెంట్స్, మొదలైన వాటిని కవర్ చేస్తాము.
మీరు మీ క్లెయిమ్ ను ఆన్ లైన్ లో అప్లై చేస్కోవచ్చు లేదా మీకు నచ్చిన , మీకు దగ్గరగా వున్న ఫ్యూచర్ జెనెరేలి శాఖ నందు క్లెయిమ్ ఫారం ను అందించవచ్చు. మీరు మీ క్లెయిమ్ వివరాలను మాకు ఇమెయిల్ కూడా చేయవచ్చు.
మా ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతీ వేగంగా మరియు విశ్వాసనీయం గా ఉంటుంది.
1 . పత్రాలను సేకరించుట
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా తరువాత అన్ని హాస్పిటల్ బిల్స్ ని చెల్లించండి. చికిత్స పొందిన మరియు ఖర్చులకు సంబందించిన అన్ని బిల్స్ ని సేకరించండి.
2 . క్లెయిమ్ ఫారం/ పత్రము
FG ఆరోగ్య క్లెయిమ్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని పూరించండి.
3 . పత్రాలను సమర్పించుట
అన్ని ఒరిజినల్ పత్రాలను దగ్గర్లోని FG శాఖ నందు అందజేయాలి .
4 .క్లెయిమ్ పరిష్కారం
మేము పాలసీ షరతులకు మరియు నిబంధనలకు లోబడి క్లెయిమ్ ప్రాసెస్ ని పూర్తి చేస్తాము.
ఫ్యూచర్ జెనెరేలి యొక్క సులభమైన నాలుగు దశల పద్ధతిలో మీ క్లెయిమ్ ను ప్రాసెస్ చేస్కోండి.
1 . ఆసుపత్రిని సందర్శించండి
మీకు దగ్గరలో వున్న FG నెట్వర్క్ లో వున్న హాస్పిటల్ కు వెళ్లి ఇన్సూరెన్స్ డెస్క్ ను సంప్రదించండి. నగదు రహిత చికిత్స కోసం మీ ఆరోగ్య కార్డు ని చూపించండి
2 . మిమ్మల్ని మీరు ద్రువీకరించుకోండి
FG నెట్వర్క్ ఆసుపత్రి మిమల్ని / మీ యొక్క గుర్తింపుని ద్రువీకరిస్తుంది మరియు ఫ్యూచర్ జెనెరేలి తో సక్రమంగా పూరించిన ప్రీ ఆథరైజేషన్ ఫారం ను అందజేస్తుంది .
3 . ఆసుపత్రిలో చేరుట
మీరు ఆసుపత్రి లో ఎలాంటి డిపాజిట్ చేయకుండానే అడ్మిట్ చేయబడతారు మరియు నగదు రహిత చికిత్స పొందుతారు.
4 . మన శ్శాంతి
మీరు ఒకసారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తరువాత మీ యొక్క క్లెయిమ్ పత్రాలను ఆసుపత్రి FG కి పంపిస్తుంది. చికిత్స కు అయినా మొత్తం ఖర్చును నేరుగా ఆసుపత్రి కి సెటిల్ చేయబడుతుంది.
మెయిల్ – fgcare@futuregenerali.com
ఫోన్ – 1800 220 233/1860 500 3333