టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఒక టర్మ్ ఇన్సూరెన్సు యొక్క హామీ మొత్తాన్ని అనుసరించి ప్రీమియం ని లెక్కించడానికి ప్రత్యేకం గా తయారుచేయబడిన సాధనము. టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలుచేద్దామనుకొనే వారికి ఇది చాల సులభమైన ఉపయోగకరమైన టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్. టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీకు దురదృష్టవశాత్తు మరణం సంభవించినపుడు మీ ఫామిలీ కి చెందాల్సిన హామీ మొత్తాన్ని సరిచూసుకోవడానికి ఉపయోగపడుతుంది.
#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use
~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీరు ఇన్సూరెన్సు సంస్థకు వాస్తవం గా చెల్లించాల్సిన ప్రీమియం ను నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇండియా లో చాలా ఇన్సూరెన్సు కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లను అందిస్తున్నాయి. కానీ, టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వివిధ రకాల ఇన్సూరెన్సు ప్లాన్ ల మధ్య గల తేడాలను సరిపోల్చి, మీ అవసరాలకు తగిన, ఉత్తమ మైన ప్లాన్ ను పొందడానికి సహాయపడుతుంది.
మీరు దగ్గర లేకపోయినా మీ కుటుంబాన్ని భద్రం గా చూసుకోండి. ఈ-ప్రీమియం ను లెక్కించడాని చాలా టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ లు లభ్యం అవుతున్నాయి. వీటి ద్వారా చెల్లింపులు జరిపి ఒక టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కాలిక్యులేటర్ లో మీకు తగిన విధం గా మీరే మార్పులు చేసుకోవచ్చును.
ఇన్సూరెన్సు కొనుగోలు దారుల అవసరాలను బట్టీ, వివిధ రకాలైన ప్రీమియం కాలిక్యులేటర్ లు మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. వీటిని ఒక సారి చూద్దాం:
ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ ఒక నిర్దిష్టమైన వయసులో నిర్దిష్టమైన కవరేజీ ని పొందడానికి ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ మీరు ఎంచుకున్న పాలసీ లో గల పెట్టుబడులను విశ్లేషించి మీ పెట్టుబడి పెరుగుదల ను అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీరు పదవీ విరమణ చేసే కాలానికి కోరుకున్న మొత్తము స్థిరమైన పెన్షన్ గా పొందడానికి ఈరోజు ఎంత పెట్టుబడి పెట్టాలో లెక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది.
చైల్డ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ పిల్లల విద్యావసరాలకు, వివాహానికి మరియు ఇతర అవసరాలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో లెక్కించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఒక మంచి ప్లాన్ ఎంచుకోవడానికి ముందు మీకు ఏది అవసరమో అదే అందిస్తుంది టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్. మీ అవసరాలకు తగిన ప్లాన్ ను వివిధ ప్లానుల తో సరిపోల్చి ఉత్తమమైన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ అందించడం లో ఉపయోగపడుతుంది. టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ అందించే ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మీరు చెల్లించ బోయే ఇన్సూరెన్సు ప్రీమియం ధర తెలుసుకోవడానికి, కావలసిన వివరాలను భర్తీ చేయడానికి పట్టే సమయం రెండు నిముషాల కన్నా ఎక్కువ కనుక, టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ను శ్రద్ధగా వాడవలసిన అవసరం ఉంది. ఇది వేగవంతమైనదీ, సులువైనది మాత్రమే కాదు ముఖ్యం గా సరిపోల్చడానికి ఖచితమైనది.
వివరాలను టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ లో భర్తీ చేయడం, ప్రీమియం ధరలను పొందడానికి 10 నిమషాలకంటే ఎక్కువ వ్యవధి తీసుకోదు.
ఈ కాలిక్యులేటర్ ని ఎలా సులువు గా ఉపయోగించాలో తెలియజేసే 3 మెట్లు:.
మా ఈ టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఖచ్చితం గా లెక్కించడానికి మరియు సులువుగా సరిపోల్చుకోవడానికి చివరిదశలో ఏవిధమైన అస్పష్టతకీ తావు లేకుండా చేస్తుంది. మీకు భవిష్యత్తు లో అవసరపడే ఖచ్చితమైన మొత్తాన్ని అందించే ప్లాన్ ను కొనుగోలు చేయండి. మీ భవిష్యత్తు ప్రణాళిక మీకు ఇప్పుడు 3 మెట్ల దూరం లో ఉంది.
సరళం గా చెప్పాలి అంటే, ఇన్సూరెన్సు ప్లాన్ లు భీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబానికి ఆర్ధిక భద్రతను అందజేస్తాయి. అంతే కాక ఇన్సూరెన్సు పాలసీలు రిటైర్మెంట్ ఫండ్, ఎండోమెంట్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటి పొదుపు సాధనకు కూడా పనిచేస్తాయి. అంతేకాక, ఇన్సూరెన్సు ప్లాన్ లు వల్ల పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, నిరంతర ప్రయోజనాలను పొందడానికి ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించడమూ అంతే ముఖ్యం. పాలసీ దారు ప్రీమియం ను వివిధ రకాలుగా నెలసరి, అర్ధ-సంవత్సరానికి, సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ప్రీమియం ధరల సరిగ్గా ఉన్నాయో లేవో పాలసీ కొనుగోలు దారులు లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఉపయోగించి సరిచూసుకోవచ్చు.
ఓక పాలసీ ప్రీమియం ధర అభ్యర్థి ఎంచుకున్న ప్లాన్ మీద మరియు ఇచ్చిన వివరాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణం గా యువత తీసుకొనే పాలసీ ప్రీమియం కంటే, 50 సంవత్సరాల వయసుగల వ్యక్తి తీసుకొనే పాలసీ ప్రీమియం ధర ఎక్కువ గా ఉంటుంది. దీనికి కారణం యుక్త వయసులో ఉన్నవారు, వయసు ఎక్కువ ఉన్న వారికన్నా ఆరోగ్యం గా ఉంటారని, రిస్క్ తక్కువ కలిగి ఉంటారని ఇన్సూరెన్సు కంపెనీ లు భవిస్తూ ఉండటమే. అయితే, పాలసీ ప్రీమియం ధర ని చాలా రకాలైన కారకాలు నిర్ణయిస్తూ ఉంటాయి.
ఇన్సూరెన్సు కొనుగోలు దారులు టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ను ఉపయోగించి ఎక్కువ ఉపయుక్తమైన ప్లాన్ ను మంచి సరసమైన ప్రీమియం ధరలో పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ను ఉపయోగించేటప్పుడు ఈ క్రింది వివరాలను అందించవలసి ఉంటుంది.
పై వివరాలను పొందుపరిచిన తరువాత, ఇన్సూరెన్సు కొనుగోలుదారుడు సుమారుగా ఉండే ప్రీమియం ధరను పొందుతాడు.
ఈ క్రింది అంశాలను ప్రీమియం లెక్కించే ముందు పరిగణ లోనికి తీసుకోవలసి ఉంటుంది:
మీరు పాలసీ పునరుద్ధరణకు కోసం చెల్లించే ప్రీమియం యొక్క తరచుదనాన్నే ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇది సంవత్సరానికి గాని, అర్ధసంవత్సరానికి, త్రైమాసికానికి లేదా నెల కు ఒకసారి టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించే విధం గా ఉంటాయి.
ఇన్సూరెన్సు కొనుగోలుదారులు ప్రీమియం ధరను టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఉపయోగించి నిర్ణయించుకొనవచ్చును. ఇన్సూరెన్సుసంస్థలు రక రకాలైన టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం సకాలం లో చెల్లించుకొనేందుకు వీలుగా వినియోగదారులకు వివిధ రకాలైన విధానాలను అందజేస్తున్నారు. అందులో కొన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లింపు విధానాలు క్రింద ఇవ్వబడ్డాయి.
టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ నిర్ధారించిన ఇన్సూరెన్సు ప్రీమియం ధరలే మీరు ఒక ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేయడానికి చెల్లించే ఖరీదు. వీటిని లెక్కించే నిపుణులను యాక్టుఅరీస్ అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు ఆయా పాలసీ ప్రయోజనాలు మరియు ఇన్సూరెన్సు కంపెనీ అందజేసే రిస్క్ కవరేజీ యొక్క తీవ్రత కు సరిపోయే విధం గా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు ఈ క్రింది అంశాల ఫై ఆధారపడి ఉంటాయి.
జవాబు: టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ ను ఉపయోగించి తమ అవసరాలకు తగిన లైఫ్ ఇన్సూరెన్సు ను లెక్కించుకో గలుగుతారు. మీరు చేయాల్సిందల్లా, మీ పేరు, వయస్సు, లింగము, వృత్తి, వివాహ స్థితి మొదలైన వ్యక్తిగత వివరాలను పొందుపరిస్తే, మీ వివరాలకు అనువైన, ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్లు అందచేయబడతాయి.
జవాబు: మీకు కావల్సిన ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించడానికి పాలసీ తీసుకొనే సమయం లో మీ ప్రస్తుత వయస్సు, ఆరోగ్య స్థితి, మీరు కోరుకుంటున్న హామీ మొత్తం మరియు కాలపరిమితి వంటి చాల రకాల అంశాలను పరిగణ లోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మీరు టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వంటి ఆన్ లైన్ సాధనాల సహాయంతో మీకు కావలసిన హామీ మొత్తాన్ని లెక్కించుకోవచ్చు.
జవాబు: కొన్ని సమయాల్లో లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ తెలిపిన ప్రీమియం ధర కూ చెల్లించాల్సిన ప్రీమియం మొత్తానికి తేడా ఉండవచ్చు. మీ ఇన్సూరెన్సు ఎలా లెక్కించబడింది అనీ విషయం మీద దీన్ని ఆపాదించవచ్చు. మీ వయస్సు, లింగము, ఆరోగ్య వివరాలు, వృత్తి, అభిరుచులు, ఎంచుకున్న పాలసీ రకము (జీవిత కాలం / టర్మ్) వంటి కొన్ని కీలక అంశాలు కూడా ప్రీమియం మార్పు పై ప్రభావితం చూపుతాయి.
జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు లో హామీ మొత్తాన్ని లెక్కించడానికి మీ ప్రస్తుత ఖర్చులు, చెల్లించాల్సిన ఖర్చులను మీ మొత్తం చెల్లించాల్సిన బాధ్యతలకు జత చేసి, దాని నుండి అమ్మకానికి వీలైన ఆస్తులు విలువను తీసి వేయాల్సి ఉంటుంది. ఆఖరుగా దానికి ముఖ్యమైన సంఘటనలకు లేదా నెరవేర్చాల్సిన బాధ్యతలకు అయ్యే ఖర్చులను దానికి జోడిస్తే మీకు హామీ మొత్తము లభ్యం అవుతుంది.
జవాబు: ఒక లైఫ్ ఇన్సూరెన్సు క్యాష్ వేల్యూ ను తెలుసుకోవడానికి సులభ మైన మార్గం ఏమిటంటే, మీరు ప్రీమియం చెల్లించిన సంవత్సరాలు మరియు ఎన్ని సార్లు చెల్లించారో లెక్కిస్తే చాలు. మీరు లెక్కించిన మొత్తానికి వడ్డీ రేటు 2 .5 - 3 .5 % జమ జేసుకోవాలి. ఈ మొత్తం మీరు ఎంచుకున్న హామీ మొత్తానికి సరి పోక పోవచ్చు కానీ ఇది మీకు ఒక అంచనాకు రావడానికి మాత్రమే పనికి వస్తుందని దయచేసి గ్రహించండి.
జవాబు: ఈ క్రింద ఇవ్వబడిన ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని, టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ని ఉపయోగించి సులభం గా మీ లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించ వచ్చు: 1. మీరు చెల్లించాల్సినవి/ప్రస్తుత ఖర్చులు లను జత చేయండి 2 . మీరు చెల్లించాల్సిన మొత్తము నుండి అమ్మడానికి వీలు అయ్యే ఆస్తులను తీసి వేయండి. 3 . చివరగా, మీరు మీ జీవితం లో ముఖ్యం గా జరిపించాల్సిన కార్య క్రమాలకు, బాధ్యతలు నిర్వర్తించడానికి అయ్యే ఖర్చులు కలపండి.
జవాబు: ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ని ఉపయోగించి ప్రీమియం ధరను లెక్కించే విధానాన్ని 3 దశల్లో తెలుసుకుందాం:
జవాబు: పాలసీ దారుని యొక్క లైఫ్ ఇన్సూరెన్సు కాస్ట్ లింగం, వయస్సు, ప్రదేశం వంటి రిస్క్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇన్సూరెన్సు సంస్థలు లెక్కిస్తాయి. ఇవన్నీ వారి దృష్టి లో ఎంతో కొంత కాస్ట్ తో ముడి పడి ఉంటాయి. ఈ రిస్క్ అంశాలతో అనుబంధిత మైన వ్యయాల ను విశ్లేషణలు, పూర్వపు పోకడలను, మిగిలిన ముఖ్యమైన అంశాలను అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయిస్తారు.
జవాబు: సాంకేతికంగా, భీమా పొందిన వ్యక్తి మరణించిన్నపుడు అతని లబ్ధిదారుడు క్లెయిమ్ ను భీమా సంస్థకు సమర్పించినపుడు లైఫ్ ఇన్సూరెన్సు చెల్లింపు జరుగుతుంది.