లైఫ్ ఇన్సూరెన్సు

లైఫ్ ఇన్సూరెన్సు అనేది భీమా చేసిన వ్యక్తి కీ మరియు భీమా సంస్థకూ మధ్య గల  ఒక ఒప్పందం. ఇన్సూరెన్సు కంపెనీ ప్రీమియం లు తీసుకుంటూ, దానికి బదులు గా ఒక నిర్దిష్టమైన కాలవ్యవధి లో భీమా చేసిన వ్యక్తి మరణిస్తే, ఒక పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుంది.

Read more
Get ₹1 Cr. Life Cover at just ₹411/month*
No medical checkup required
Save more with upto 10% discount
Covers COVID-19
Tax Benefit
Upto Rs. 46800
Life Cover Till Age
99 Years
8 Lakh+
Happy Customers

*Tax benefit is subject to changes in tax laws. *Standard T&C Apply

** Discount is offered by the insurance company as approved by IRDAI for the product under File & Use guidelines

Get ₹1 Cr. Life Cover at just ₹411/month*
No medical checkup required
Save more with upto 10% discount
Covers COVID-19
+91
View plans
Please wait. We Are Processing..
Get Updates on WhatsApp
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use & consent to Policybazaar to access your credit report

లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ అంటే ఏమిటి?

ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ఇన్సూరెన్సు కంపెనీకి & పాలసీ దారుని కీ మధ్య గల ఒక ఒప్పందం.  దీని ప్రకారం దురదృష్టవశాత్తూ పాలసీ దారుడు పాలసీ కాల వ్యవధిలో లో మరణించి నట్లైతే, అతను నామినేట్ చేసిన లబ్ధిదారునికి ఇన్సూరెన్సు కంపెనీ హామీ మొత్తాన్ని అందజేస్తుంది.  దానికి బదులు గా పాలసీ దారుడు ముందు గా నిర్ణయించిన మొత్తాన్ని ప్రీమియం రూపం లో క్రమబద్ద మైన అంచెలలో లేదా ఒకే ఒక ప్రీమియం రూపం లో చెల్లించడానికి అంగీకరిస్తాడు.  

ఒక వేళ పాలసీ లో తెలియచేయబడి ఉంటే, క్లిష్ట అనారోగ్యానికి కూడా కవర్ చేస్తుంది.  

దీనిలో కవరేజీ మెరుగుదల ఉంది కనుక, దీని లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం లో  కూడా పెరుగుదల ఉంటుంది.

ఇండియా  2020  లో ఉత్తమ మైన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు 

ఉత్తమ మైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ప్లాన్ లు క్రింద ఇవ్వబడ్డాయి:

ఇన్సూరెన్సు ప్లాన్      

ప్రవేశ వయస్సు (కనీస/గరిష్ట)

పాలసీ కాల పరిమితి (కనీస/గరిష్ట)

హామీ మొత్తం  (కనీస/గరిష్ట)

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ షీల్డ్ ప్లాన్

18/65 సంవత్సరాలు

10, 20/30 సంవత్సరాలు

రూ.25 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

ఏగొం లైఫ్ ఐ-టర్మ్ ప్లాన్

18/75 సంవత్సరాలు

5/40 సంవత్సరాలు

10 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

అవివా లైఫ్ షీల్డ్ అడ్వాంటేజ్ ప్లాన్

18/55 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

ఆప్షన్ ఏ - 35 లక్షలు/గరిష్ట పరిమితి లేదు 

ఆప్షన్ బి - రూ. 50 లక్షలు/గరిష్ట పరిమితి లేదు

బజాజ్ ఆలియాన్స్ ఐ-సెచురె

18/70 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

20 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

భారతి ఏ ఎక్స్ ఏ లైఫ్ ప్రీమియం ప్రొటెక్ట్ ప్లాన్

18/65 సంవత్సరాలు

10, 15/35 సంవత్సరాలు

25 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

కెనరా హెచ్ ఎస్ బి సి ఐ సెలెక్ట్ + టర్మ్ ప్లాన్

18/65 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

రూ.25 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

ఈడెల్వెయిస్ టోకియో లైఫ్ సింప్లీ ప్రొటెక్ట్ ప్లాన్

18/65 సంవత్సరాలు

10/40 సంవత్సరాలు

రూ.25 లక్షలు / గరిష్ట పరిమితి లేదు  

ఎక్సయిడ్  లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్

18/65, 60 సంవత్సరాలు

10, 12/30 సంవత్సరాలు

రూ.5 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఫ్యూచర్ జెనెరాలి ఫ్లెక్సీ ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్సు

18/55 సంవత్సరాలు

10/75 సంవత్సరాలు

రూ.50 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

హెచ్ డి ఎఫ్ సి క్లిక్ 2  ప్రొటెక్ట్ ప్లస్

18/65 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

రూ.10 లక్షలు   / 10 కోట్లు 

హెచ్ డి ఎఫ్ సి లైఫ్ సంచయ్ 

30/45 సంవత్సరాలు

15/25 సంవత్సరాలు

1,05,673  / గరిష్ట పరిమితి లేదు  

ఐ సి ఐ సి ఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ 

20/75 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

రూ.3 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఐ డి బి ఐ ఫెడరల్ ఇన్కమ్ ప్రొటెక్ట్ ప్లాన్

25/60 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

ఎన్ ఏ

ఇండియా ఫస్ట్ లైఫ్ ప్లాన్

18/60 సంవత్సరాలు

5/40 సంవత్సరాలు

రూ.1 లక్ష  / 5 కోట్లు

కోటక్ లైఫ్ ప్రిఫర్డ్ ఈ-టర్మ్ 

18/75 సంవత్సరాలు

10/40 సంవత్సరాలు

రూ. 25 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఎల్ ఐ సి జీవన్ అమర్

18/65 సంవత్సరాలు

10/40 సంవత్సరాలు

రూ. 25 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఎల్ ఐ సి టెక్ టర్మ్ 

18/65 సంవత్సరాలు

10/50 సంవత్సరాలు

రూ. 50 లక్షలు  / గరిష్ట పరిమితి లేదు  

మాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్

18/60 సంవత్సరాలు

10/50 సంవత్సరాలు

రూ.25 లక్షలు  / 100 కోట్లు

పి ఎన్ బి మెట్ లైఫ్ మేరా టర్మ్ ప్లాన్

18/65 సంవత్సరాలు

10/40 సంవత్సరాలు

రూ. 10 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ప్రమెరికా లైఫ్ యూ-ప్రొటెక్ట్

18/65 సంవత్సరాలు

10/30 సంవత్సరాలు

రూ. 25 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లస్

18/60 సంవత్సరాలు

10/40 సంవత్సరాలు

రూ. 25 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఎస్ బి ఐ ఈషీల్డ్ ప్లాన్

18/70 సంవత్సరాలు

5/30 సంవత్సరాలు

రూ. 20 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

ఎస్ బి ఐ శుభ్ నివేశ్ ప్లాన్

18/60 సంవత్సరాలు

5/30 సంవత్సరాలు

75000  / గరిష్ట పరిమితి లేదు  

సహారా శ్రేష్ఠ నివేశ్ జీవన్ బీమా

9/60 

5/10 సంవత్సరాలు

రూ. 30,000/ రూ. 1 కోటి  

శ్రీరామ్ లైఫ్ క్యాష్ బ్యాక్ టర్మ్ ప్లాన్ 

12/50 సంవత్సరాలు

10, 15, 20 & 25 సంవత్సరాలు

రూ. 2 లక్షలు  / రూ. 20 లక్షలు

ఎస్ యూ డి లైఫ్ అభయ్ ప్లాన్

18/65 సంవత్సరాలు

15, 20/40 సంవత్సరాలు

రూ. 50 లక్షలు   / --

టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్సు సంపూర్ణ రక్షా +   

18/70, 65 సంవత్సరాలు

10, 15/40

రూ. 50 లక్షలు   / గరిష్ట పరిమితి లేదు  

మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన లైఫ్ ఇన్సూరెన్సు పదాలు

లైఫ్ ఇన్సూరెన్సు ను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి తరుచుగా ఉపయోగించే కొన్ని ప్రాధమిక పదజాలాన్ని అర్ధం కోవడం చాలా ముఖ్యము.  కొన్ని సార్లు ఉపయోగింపబడిన పరిభాష అర్ధం చేసుకోకపోవడం వలన ఆయా ప్లాన్ లు కొనుగోలు చేయలేకపోవడం జరుగుతుంది.  

ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్సు లో ఉపయోగించే కొన్నిముఖ్యమైన  సాంకేతిక పదజాలాన్ని మీరు అర్ధం చేసుకోనేనెదుకు క్లుప్తం గా  ఇవ్వబడింది:

 • పాలసీ హోల్డర్

లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనుగోలు చేసి ప్రీమియం చెల్లించే వ్యక్తి నే పాలసీ దారుడు అంటారు.  ఒక వ్యక్తి పాలసీ ని కలిగి ఉన్నపటికీ, అతనే  భీమా చేయబడిన వ్యక్తి   అయిఉండకపోవచ్చు.   

 • లైఫ్ అస్సురెడ్

సరళం గా చెప్పాలంటే, ఎవరి జీవితానికి భీమా చేయబడిందో లేదా ఎవరి జీవిత భద్రతకు ఇన్సూరెన్సు తీసుకున్నారో వారినే లైఫ్ అస్సురెడ్ అంటారు.  

 • నామినీ

పాలసీ దారునిచే నామినేట్ చేయబడిన లబ్దిదారుడినే నామినీ అంటారు. ఏదయినా అనుకోని సంఘటన జరిగినప్పుడు లైఫ్ ఇన్సూరెన్సు  పాలసీ  ఇతర ప్రయోజనాల తో చివరికి చెల్లించబడేది నామినీ కే.  నామినీ నే లబ్ధిదారుడు అని కూడా అంటారు.  ఒక పాలసీ ని కొనుగోలు చేసినప్పుడే నామినీ ని తెలియపరచాల్సి ఉంటుంది.  సాధారణం గా, పాలసీ దారుని తరువాత ఆర్ధికం గా ఆధారపడుతున్న కుటుంబసభ్యులైన జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లి తండ్రులను  నామినీ గా  ప్రకటిస్తూ ఉంటారు.  

 • పాలసీ కాలపరిమితి

లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ని ఎంత కాలం వరకూ అందిస్తుందో, ఆ నిర్ణీత కాలాన్నే పాలసీ టర్మ్ లేదా పాలసీ టెన్యూర్ అని అంటారు. ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ రకము, నియమాలు మరియు షరతుల ను, మరియు ఇన్సూరెన్సు కంపెనీ ని అనుసరించి ఈ కాలపరిమి వివిధ రకాలుగా  ఉంటుంది.  

 • ప్రీమియం 

లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను క్రియ శీలకం గా ఉంచుకోవడం కోసం చెల్లించే మొత్తాన్నే ప్రీమియం అంటారు.  ఒక వేళ మీరు లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం మొత్తాన్ని  గడువు తేదీ లోపు లేదా గ్రేస్ పీరియడ్ లోగ చెల్లించని పక్షం లో మీ పాలసీ లాప్స్ అయిపోతుంది. ఇన్సూరెన్సు ప్రీమియం మొత్తం పాలసీ యొక్క కాలపరిమితి, భీమా చేయబడిన వ్యక్తి వయస్సు, జీవన శైలి హాబీల వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. 

 • హామీ మొత్తం

ఒక వేళ ఇన్సూరెన్సు చేయబడిన వ్యక్తి మరణించినట్లైతే, లబ్ది దారునికి ఖచ్చితం గా లభించే హామీ మొత్తాన్నే సమ్ అస్సురెడ్ అంటారు.  చాలాసార్లు, పాలసీ దారుడు మరణించినట్లైతే ఎంత ఆర్థిక నష్టం జరుగుతుందో ఆ మొత్తాన్ని బట్టీ  ఈ హామీ మొత్తాన్ని నిర్ణయిస్తూ ఉంటారు.  లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ప్లాన్ ను ఖరీదు చేసేటప్పుడే, పాలసీ దారుడు తాను పాలసీ కాల పరిమితిలో మరణించినట్లైతే, తన నామినీ కు లభించ బోయే  హామీ మొత్తాన్ని ఎంచుకుంటాడు. 

 • డెత్ బెనిఫిట్

పాలసీ కాలపరిమితి లో లైఫ్ ఇన్సూరెన్సు చేయబడిన వ్యక్తి మరణించినట్లైతే లబ్ది దారునికి లభించే మొత్తాన్నే, డెత్ బెనిఫిట్ అంటారు.  అయితే,  హామీ మొత్తం మరియు డెత్ బెనిఫిట్ అనేవి రెండు వేర్వేరు పదాలని అర్ధం చేసుకోండి.  అంటే, డెత్ బెనిఫిట్ హామీ మొత్తానికి సమానం గా లేదా ఎక్కువ గా ఉండటమే కాక రైడర్ బెనిఫిట్ ని కూడా కలిగి ఉండవచ్చు.  

 • మెచ్యూరిటీ బెనిఫిట్

పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత పాలసీ దారునికి చెల్లించే మొత్తాన్నే మెచ్యూరిటీ ప్రయోజనం అంటారు.  

 • లేప్జ్డ్ పాలసీ

పాలసీ ప్రీమియం మొత్తం గ్రేస్ పీరియడ్ దాటినా తరువాత కూడా చెల్లించ నందున  పాలసీ ముగించబడుతుంది.  దీనినే లేప్జ్డ్ పాలసీ అంటారు.  కొన్ని లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలు బాకీ ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన తరువాత  ఆయా పాలసీ  ని పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఇస్తున్నాయి.  

 • గ్రేస్ పీరియడ్ 

ప్రీమియం మొత్తం చెల్లించడానికి గడువు తేదీ ముగిసిన తరువాత కూడా పాలసీ దారునికి ఇచ్చే అదనపు కాల వ్యవధిని గ్రేస్ పీరియడ్ అంటారు. పాలసీ దారుడు ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన తరువాత పాలసీ ప్లాన్ కవరేజీ కొనసాగుతుంది.     

 • రివైవల్ పీరియడ్

గ్రేస్ పీరియడ్ సమయం లో ప్రీమియం చెల్లించని పక్షంలో పాలసీ లాప్స్ అవుతుంది.  ఒక వేళ మీరు ప్లాన్ ను ను కొనసాగించుకుందామని అనుకున్న పక్షం లో ఇన్సూరెన్సు కంపెనీ లాప్స్ అయిన ప్లాన్ ని క్రియాశీలం చేయడానికి గ్రేస్ పీరియడ్ తరువాత ప్రీమియం చెల్లించే అవకాశం ఇస్తుంది.  ఇలా ఇచ్చే కాలపరిమితి నే రివైవల్ పీరియడ్ అంటారు. 

 • ఫ్రీ-లుక్ పీరియడ్

ఒక వేళ మీరు ఎంచుకున్న ఇన్సూరెన్సు ప్లాన్  యొక్క నిబంధనలు  మరియు షరతులు మీకు సౌకర్యవంతం గా లేనట్లైతే, పాలసీ పత్రాలలో సూచించిన ఒక నిర్దిష్టమైన కాలవ్యవధి లో దానిని తిరిగి పంపించవచ్చు.  దీనినే ఫ్రీ-లుక్ పీరియడ్ అంటారు.  స్టాంప్ డ్యూటీ చార్జీలు, మెడికల్ పరీక్షలు, రిస్క్ ప్రీమియం లో కొంత భాగం మినహాయించుకుని తిరిగి చెల్లించబడుతుంది.

 • రైడర్

రైడర్ లు మీరు ఎంచుకున్న ప్లాన్ యొక్క కవరేజీని మెరుగు పర్చుకొనేందు ఉపయోగపడే అదనపు ప్రయోజనాలు.  అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా పొందే ఈ రైడర్ బెనిఫిట్స్ పాలసీ దారుని  కుటుంబానికి అనుకోని సంఘటనల నుండి ఆర్ధిక రక్షణ అందిస్తుంది.  

 • క్లెయిమ్ ప్రాసెస్

ఒక వేళ పాలసీ దారుడు పాలసీ కాల వ్యవధి లో మరణించినట్లైతే, నామినీ చే డెత్ బెనిఫిట్ కోసం ఒక క్లెయిమ్ ని నమోదుచేయబడుతుంది.  ఈ ప్రక్రియనే క్లెయిమ్ ప్రాసెస్ అంటారు.

 • మినహాయింపులు

కొన్ని రకాలైన సందర్భాలు లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లలో కవర్ చేయబడవు.  నమోదు చేయబడిన క్లెయిమ్ అటువంటి మిహాయింపులు కలిగి  ఉంటే, ఇన్సూరెన్సు కంపెనీ ప్రయోజనాలను అందజేయదు.  

నాకు లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ  ఎందుకు అవసరం ?

లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ అనేది మనిషి జీవితానికి సంబంధించిన వైకల్యం, మరణం, ఆక్సిడెంట్. రిటైర్మెంట్ వలన కలిగే ఆర్ధిక ఇబ్బందులను  కవరేజీ చేయడానికి చాలా అవసరం. మానవ జీవితం లో మరణం లేదా ఆక్సిడెంట్ ద్వారా లేదా సహజం గా కలిగే వైకల్యమే ఒక పెద్ద రిస్క్.  మనిషి జీవితం పాక్షికం గా,  తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం కలిగి ఉంటే అది వారి కుటుంబానికి ఆర్ధికం గా చాలా నష్టం కలుగుతుంది, ఆ ప్రభావం కుటుంబంలో ఆ వ్యక్తి మాత్రమే సంపాదించే ఏకైక వ్యక్తి అయినపుడు ఇంకా ఎక్కువ గా ఉంటుంది.   

అయితే, మనిషి జీవితానికి వెలకట్టలేము; కానీ,  ఆదాయం లేక రాబోయే సంవత్సరాలలో కలిగే ఆర్ధిక ఇబ్బందులను డబ్బు లేకపోవడం మాత్రమే కలుగజేస్తుంది.  అందువలన, లైఫ్ ఇన్సూరెన్సు లో ఖచ్చితం గా చెల్లించబడే హామీ మొత్తం ఏదయినా నష్టం కలిగినపుడు ప్రయోజనం రూపం లో చెల్లించబడుతుంది.  ఒక వ్యక్తి పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేదా ప్రమాదం వలన అంగవైకల్యం పొందినా ఖచ్చిం గా ఒక మొత్తాన్ని లైఫ్ ఇన్సూరెన్సు ఉత్పత్తులు కలుగ చేస్తాయి.

లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క ముఖ్యమైన ఉపయోగాలను కొన్నింటిని క్రింద పొందుపరచడం జరిగింది:

 • ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే, లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయానికి హామీ ఇస్తుంది.
 • అది పిల్లల చదువులు మరియు వివిధ ఇతర అవసరాలను కూడా తీర్చడం లో సహాయపడుతుంది
 • రిటైర్మెంట్ అయిన తరువాత  కూడా ఒక స్థిరమైన ఆదాయం పొందడానికి.
 • క్లిష్ట అనారోగ్య పరిస్థితులు లో లేదా ఆక్సిడెంట్ వలన ఆదాయం తగ్గినా లేదా పూర్తిగా కోల్పోయినా లైఫ్ ఇన్సూరెన్సు ఆదాయాన్నీ కలిగించడం లో హామీ ఇస్తుంది.  
 • ఇది వివిధ రకాలైన ఆర్ధిక అవసరాలను మరియు జీవన శైలి అవసరాలను తీర్చుకొనే విధం గా ఉపయోగపడుతుంది.

అందువలన, ఒక వ్యక్తి తన కుటుంబానికి ముఖ్య ఆదాయవనరు అయి ఉంటే వారి సంక్షేమానికి లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవడం ఒక మంచి ఆలోచన.  లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల సంఖ్య, పెట్టుబడి అవసరాలు ఇంకా వివివిధ్ అంశాల పై ఆధారపడి ఉంటుంది.  కాలక్రమేణా లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు జీవిత రక్షణకే కాక ఆదాచేసుకోను కొనేందుకు, పెట్టుబడి అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి.  జీవితం ఎప్పుడూ అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కనుక అటువంటి పరిస్థితులలో కలిగే ఆర్ధిక ఇబ్బందులనుండి, అభద్రతా భావాన్ని అధిగమించడానికి లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు కలిగి ఉండడం మంచింది.  

నాకు ఎంత లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ అవసరమవుతుంది?

ఇప్పటివరకూ, లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ యొక్క ముఖ్య అవసరాలను గూర్చి తెలుసుకున్నాము.  ఇప్పడు ఎంత లైఫ్ ఇన్సూరెన్సు అవసరమో తెలుసుకుందామా?

మార్కెట్ లో టర్మ్ ప్లాన్ లు, ఎండోమెంట్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్ లు మరియు యూ లిప్స్  వంటి  లైఫ్ ఇన్సూరెన్సు ఉత్పత్తులు చాలా ఉన్నాయి.  టాక్స్ ఆదా కలిగిన ప్లాన్లు తో అందరూ రూ. 25  లక్షల , రూ. 1  కోటి ఇన్సూరెన్సు తీసుకుంటున్నారు.  అయినప్పటికీ,  యాదృచిక్కం గా ఎదో ఒక మొత్తాన్ని ఎంచుకోవడం లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేసే పద్ధతి కాదు. 

ప్రధానం గా, ఎంత లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ కావాలో నిర్ణయించుకోవడానికి ఆధారపడేవి వ్యక్తి వయస్సు, ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య, చెల్లించవలసిన మొత్తం మొదలైనవి.  వంటరి గా జీవిస్తూ ఉన్న అవివాహితుడైన ఒక వ్యక్తి వయస్సు 18-24  సంవత్సరాల మధ్య కలిగి ఉండి అనుకుందాం.  అతనికి ఎక్కువ బాధ్యతలు లేవు అని అర్ధం అవుతుంది.  అతని ఋణం లేదా అతని పై  ఆధారపడుతున్న అతని తల్లితండ్రులు మాత్రమే ఆర్ధిక బాధ్యతలు కావచ్చును.  ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో, ఒక చిన్న ఇన్సూరెన్సు ప్లాన్ అతను కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఒక వేళ వ్యక్తి కి మంచి ఆదాయ వనరులు ఉన్నట్లైతే, రాబోయే కాలం లో వివాహం జరిగిన తరువాత అదనపు బాధ్యతలను కవర్ చేసుకొనేందుకు ఎక్కువ కవరేజీ ని కలిగిన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్డు ను ఎంచుకోవచ్చు.  

ఇప్పుడు వయస్సు 24-33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిఉన్న ఒక వ్యక్తి వివాహం అయి, జీవిత భాస్వామి ని  పరిరక్షించుకొనే బాధ్యతని కలిగి ఉంటాడు.  అటువంటి వ్యక్తి ఖచ్చితం గా ఒక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలి ఉంటుంది.  లైఫ్ ఇన్సూరెన్సు జీవితం లోగల వివిధ రకాలైన దశలను కవర్ చేస్తుంది.  

లైఫ్ ఇన్సూరెన్సు కవర్ మొత్తం అన్ని భవిష్యత్ బాధ్యతలను, జీవిత భాగస్వామి యొక్క, పిల్లల చదువులు, వివాహం మొదలైన ఆర్ధిక అవసరాలను కవర్ చేస్తుంది.  కవరేజీ ని లెక్కించే టప్పుడు కుటుంబానికి అవసరమయ్యే  సంవత్సర ఆర్ధిక అవసరాలు మరియు చెల్లించాల్సిన ఖర్చులను పరిగణ లోనికి తీసుకోవాలి.  ఇప్పుడు ఆ మొత్తాన్ని కుటుంబ కవరేజీ ని కోరుకుంటున్న సంవత్సరాల తో గుణించాలి.  

ఒక లైఫ్ ఇన్సూరెన్సు కవర్ కుటుంబానికి ఏ పరిస్థితులలో నా, ఎప్పుడైనా ఆదుకొనే విధం గా ఉండాలి.

లైఫ్ ఇన్సూరెన్సు వలన కలిగే లాభాలు

ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయడం వలన కలిగే లాభాలు పాలసీ దారుని కుటుంబాన్ని కఠిన మైన సమయాల్లో ఆదుకోవడం కన్నా ఎక్కువే ఉన్నాయి.  ఆదాయం సంపాదించే వ్యక్తి తన కుటుంబం లో తన పై ఆధారపడి జీవిస్తున్న వారి ని తన దురదృష్ట పరిస్థితులలో కలిగే మరణం, ప్రమాదాలవలన కలిగే అంగ వైకల్యం ఆదాయం కోల్పోవడం వలన కలిగే నష్టం నుండి రక్షించుకోవాలి.  లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల ప్రయోజనాల కోసం చెప్పాలంటే చాలా పెద్ద జాబితా తయారు అవుతుంది.  

పాపం, చాలామంది కి  లైఫ్ఈ ప్లాన్ లు అందించే ప్రయోజనాల విషయం గూర్చి అవగాహన ఉండదు.  వారికి తెలిసిందాల్లా డెత్ బెనిఫిట్ మరియు వైకల్య ప్రయోజనాలు.  అయితే, వారికి లైఫ్ పాలసీ లు మెచ్యూరిటీ బెనిఫిట్, టాక్స్ బెనిఫిట్స్ వంటి చాలా ప్రయోజనాలు అందిస్తాయి.  

ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అందించే వివిధ ప్రయోజనాల ను గూర్చి తెలుసుకుందాం:

 • ఋణం తీసుకోవడానికి తాకట్టు 

ఇప్పటివరకూ, చాలామంది కి తెలియని విషయం ఏమిటంటే, లైఫ్ పాలసీ లు ఋణం తీసుకోవడానికి తాకట్టు పెట్టవచ్చు అని.  మీ దగ్గర ఉన్న లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క రకం మరియు సరెండర్ వేల్యూ ని అనుసరించి పాలసీ దారుడు ఒక బ్యాంకు నుండి గానీ లేదా ఎన్ బి ఎఫ్ సి (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ) నుండి గానీ నిబంధనలు మరియు షరతుల ను బట్టి ఋణం పొందవచ్చు.  

ఋణం మొత్తం: సాధారణం గా, ఋణం లభించే మొత్తం లైఫ్ పాలసీ యొక్క సరెండర్ వేల్యూ యొక్క శాతం మీద 90 % వరకూ లభ్యం అవుతుంది  కొన్ని కంపెనీలు చెల్లించిన ప్రీమియం మొత్తం మీద 50  శాతం వరకూ రుణాన్ని అందిస్తూ ఉంటారు.

 • ఆన్లైన్ పేమెంట్ డిస్కౌంట్

చాలామంది వ్యక్తులకు ఆన్ లైన్ లో పేమెంట్ చేయడం వలన కలిగే ప్రయోజనం గూర్చి తెలియదు (లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని ఆన్ లైన్ లో చెల్లించే విధానం ను ఎంచుకోవడం వలన చెల్లించే ప్రీమియం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది).  అందరూ ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లిస్తే, లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ ల నిర్వాహణ ఖర్చులు గణనీయం గా తగ్గిపోతాయి.  

ఇది ఎందుకంటే, దీనిలో పేపర్ వర్క్ ఖర్చు ఉండదు కనుక.  ఇంకా పాలసీ దారుడు ఆఫ్ లైన్ లో లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనే టప్పుడు, రెన్యువల్ సమయాల్లో ఏజెంట్ లకు చెల్లించే కమిషన్ ని కూడా ఆదా చేసుకోగలుగు తాడు.  

దయచేసి గమనించండి- అందించే డిస్కౌంట్  ఒక్కో కంపెనీకి ఒక్కో విధం గా ఉంటుంది. 

 • నిర్ణీత కాల వ్యవధి పై ఆధారపడిన డిస్కౌంట్ 

ప్రతీ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ సంవత్సర, అర్ధ-సంవత్సర, త్రైమాసిక లేదా మాస కాలవ్యవధి లో చెల్లించే అవకాశాన్ని పాలసీ దారులకు అందిస్తూ ఉంటారు.  ఒక వేళ పాలసీ దారుడు పాలసీ ప్రీమియం ను సంవత్సర కాలవ్యవధిలో చెల్లించేందుకు ఎంచుకున్నట్లైతే, కంపెనీ ఆ సొమ్మును పెట్టుబడి కోసం వినియోగించుకో గలుగుతుంది దీనివలన ఎక్కువ లాభాలు మరియు ప్రయోజనాలు కంపెనీకి కలుగుతాయి.  ఒక సారి పాలసీ దారుడు ప్రీమియం కాల వ్యవధి ఎంచుకోగానే, ఈ డిస్కౌంట్ లు దానికి అవే  వర్తించబడి, ప్రీమియం రేట్లను తగ్గించి ఇస్తాయి.

 • వ్యాపారాన్ని సంరక్షించుకోవడం

కొన్ని రకాల ఇన్సూరెన్సు కంపెనీలు వ్యాపారులైన పాలసీ దారులకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాయి.  ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే, వారి బిజినెస్ భాగస్వామ్యులు సులువుగా ఈ విధమైన ఇబ్బందులు లేకుండా పాలసీ దారుని వాటాను కొనుగోలు చేయవచ్చు.  ఈ పరిస్థితులలో, బిజినెస్ భాగస్వామి ఇన్సూరెన్సు కంపెనీ తో ఒక ఒప్పందం పై సంతకం చేయాల్సి ఉంటుంది, దీని ప్రకారం పాలసీ దారుని వాటా ను అమ్మిన తరువాత అతని పై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది.  

అయితే,  పాలసీ దారుని నామినీ కు గానీ ఆధారపడి జీవిస్తున్న వారికి గానీ కంపెనీ లో  భాగం ఉండదని అర్ధం చేసుకోవాలి.  

 • పన్ను ప్రయోజనాలు

లైఫ్ పాలసీ ప్రీమియం చెల్లింపులో ఒక పాలసీ హోల్డర్ కు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961  సెక్షన్ 80  సి ప్రకారం పన్ను రాయితీ పొందడానికి అర్హుడవుతాడు.  తనకోసం, తన జీవిత భాగస్వామికి లేదా పిల్లలు, తల్లిదండ్రులు మరియు అత్తమామలు కోసం చెల్లించిన ప్రీమియం లో రాయితీ ని పొందవచ్చు.  ఈ ప్రయోజనం అన్ని లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలూ - ప్రైవేట్ సెక్టార్ లైఫ్ ఇన్సూరెన్సు కంపీలు లేదా పబ్లిక్ సెక్టార్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలూ అందిస్తాయి.  

దీనికి అదనం గా, లైఫ్ పాలసీ ల మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961 సెక్షన్ 10(10 డి) ప్రకారం పన్ను మినహాయింపు ని కలిగి ఉంటుంది.  

ఇండియా లో గల లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ల రకాలు

లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

కవరేజీ

టర్మ్ ప్లన్స్

ప్యూర్ రిస్క్ కవర్

యు లిప్స్ 

ఇన్సూరెన్సు + పెట్టుబడి ప్రయోజనాలు

ఎండోమెంట్ ప్లాన్ లు

ఇన్సూరెన్సు కవర్ + సేవింగ్స్

మనీ బ్యాక్ ప్లాన్ లు 

ఇన్సూరెన్సు కవరేజీ తో బాటు క్రమబద్ద ఆదాయం 

హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

జీవిత కాల కవరేజీ

చైల్డ్ ప్లాన్ లు

పిల్లల చదువులు, వివాహం కోసం నిధులు సమకూర్చుకోవడం

రిటైర్మెంట్ ప్లాన్ లు

రిటైర్మెంట్ తరువాత  ఆర్ధిక ఆసరా తో కూడిన ఆర్ధిక స్వతంత్రత

పైన ఇవ్వబడిన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల యొక్క వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ అనేది ఒక ప్రాధమిక లైఫ్ కవరేజీ.  ఇది అందరికీ  అందుబాటులో ఉండి, ప్రతీ ఒక్క రూ ఇబ్బందు లు లేకుండా కొనుగోలు చేయగలిగే సరసమైన లైఫ్ ఇన్సూరెన్సు.  

టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ డెత్ కవరేజీ  ని నియమిత కాలపరిమితి కి అందిస్తుంది.  పాలసీ కాలపరిమితి లో దురదృష్టవశాతూ అకస్మాత్తుగా పాలసీ దారుడు మరణించినట్లైతే , ఇన్సూరెన్సు కంపెనీ ముందుగా నిర్ణయించబడింది డెత్ బెనిఫిట్ ఒక పెద్ద మొత్తం లో నెలవారీ/సంవత్సర వారీ గా లేదా రెండు విధాలు గా  నామినీ కి అందజేస్తుంది.  అన్నింటి కంటే ఉత్తమమైన టర్మ్ ప్లాన్ కవరేజీ మంచి సరసమైన ప్రీమియం తో లభిస్తుంది.

 • యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

ఇన్సూరెన్సు & ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలు మిళితమైన లైఫ్ కవరేజీ ప్లాన్ నే యునైటెడ్-లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ లేదా యూలిప్ ని అంటారు.  ఇది దీర్ఘ-కాల పెట్టుబడి ప్రయోజనాలను అందిస్తూ  విలువైన పెట్టుబడి కి అనుకూలం గా ఉంటుంది.  యూ లిప్ కు చెల్లించే ప్రీమియం లో కొంత మొత్తాన్ని లైఫ్ కవరేజీ ప్లాన్  రిస్క్-కవర్ కు, మిగిలిన మొత్తం డేట్స్, ఈక్విటీస్, బాండ్స్, మార్కెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ మొదలైన మార్కెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టబడతాయి.  ఇన్సూరెన్సు కొనుగోలు చేసే వారి రిస్క్ ను భరించే సామర్ధ్యం   ను బట్టి మార్కెట్ ఫండ్ ల యొక్క ఎంపిక ఆధారపడి ఉంటుంది.  దీనిపై ఆధారపడి, ఇన్సూరెన్సు కంపెనీ పాలసీ దారుని ఎంపిక ప్రకారం కాపిటల్ మార్కెట్ లో ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడుతుంది.

 • ఎండోమెంట్ ప్లాన్ లు

ఎండోమెంట్ ప్లాన్ లను సంప్రదాయ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అని కూడా అంటారు.  ఈ ప్లాన్ లు ఆదా చేయడం అనే అంశం పై ఆధారపడి ఉంటాయి.  మిగతా పెట్టుబడి ఉత్పత్తులతో పోలిస్తే, దీనిలో రిస్క్ శాతం చాలా తక్కువ గా ఉంటుంది (వచ్చే రాబడి కూడా) .

ఒక ఎండోమెంట్ పాలసీ ఒక లైఫ్ కవరేజీ ప్లాన్ మరియు సేవింగ్స్ ప్లాన్ యొక్క కలయిక.  ఇన్సూరెన్సు కంపెనీ దీనిలోని  కొంత మొత్తాన్ని లైఫ్ కవరేజీకి ఉపయోగించి, మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడుతుంది.  ఒక వేళ పాలసీ దారుడు పాలసీ కాలవ్యవధి లో  జీవించి ఉన్నట్లైతే, ఇన్సూరెన్సు కంపెనీ అతడు/ఆమె కు మెచ్యూరిటీ బెనిఫిట్ అందజేస్తుంది.  అంతే కాక, కొన్ని ఇన్సూరెన్సు ఎండోమెంట్ పాలసీ లు కొన్ని నియమిత కాలవ్యవధిలో బోనస్ లు కూడా ఇస్తూ ఉంటాయి.  ఈ బోనస్ లు కొన్ని సమయాల్లో పాలసీ దారునికి పాలసీ మెచ్యూరిటీ సమయం లో లేదా మరణిస్తే నామినీ కు డెత్ క్లెయిమ్ సమయం లో అందజేస్తూ ఉంటాయి.  

 • మనీ బ్యాక్ ప్లాన్ లు

దీని పేరులో ఉన్నట్లుగానే, హామీ మొత్తం లో కొంత శాతం ఈ రకం లైఫ్ కవరేజీ ప్లాన్ మనీ బ్యాక్ చేస్తుంది.    ముందుగా నిర్ధారించబడిన సమయాల్లో పాలసీ దారునికి ఇవ్వబడతాయి.   ఈ ప్రయోజనాన్ని పే బ్యాక్ ప్రయోజనం లేదా సర్వైవల్ బెనిఫిట్ అంటారు.  

తమ పెట్టుబడి తో పాటూ లిక్విడిటీ కోరుకొనే వారికి ఇటువంటి మనీ బ్యాక్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ చాలా ఉత్తమ మైనది.  అంతే కాక, ఈ ప్లాన్ లు ఇన్సూరెన్సు సంస్థలు అందించే బోనస్ లకు కూడా  అర్హతలు కలిగిఉంటాయి.  

 • హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ పాలసీ హోల్డర్ బ్రతికి ఉండేంత వరకూ కవరేజీ ని అందిస్తాయి.  కొన్ని ఇన్సూరెన్సు సంస్థలు లైఫ్ కవరేజీ ని 100  సంవత్సరాల వయస్సు వరకూ అందజేస్తాయి.  టర్మ్ ప్లాన్ ల వాలే కాకుండా, ఈ ప్లాన్ లు లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ని విస్తృతం గా ఇస్తాయి.  హామీ మొత్తం లైఫ్ కవరేజీ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడే లెక్కించబడి, పాలసీ దారుడు మరణించిన తరువాత నామినీ కి ఆ మొత్తం బోనస్ తో కలిపి (ఒక వేళ ఉంటే) లబ్ది దారునికి చెల్లించబడుతుంది.  ఇది తక్కువ ప్రీమియం లో ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్సు కవర్ అందించే పాలసీ లలో ఒకటి.   

 • హోల్ లైఫ్ యు లిప్ 

మార్కెట్ లో దొరికే  వేర్వేరు హోల్  లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల తో పాటూ కొన్ని లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు  యు లిప్ ప్రయోజనాలు కలిగి  ఉన్నాయి.  ఒక హోల్ లైఫ్ యు లిప్ ప్లాన్ విస్తృత కవరేజీ తో పాటూ ఎక్కువ రాబడిని కూడా అందిస్తాయి.  

గమనిక - దయచేసి పాలసీ దారుడు ఒక వేళ 100 సంవత్సరాల  వయసు వరకూ జీవించి ఉంటే, ఇన్సూరెన్సు కంపెనీ ఎండోమెంట్ మెచ్యూరిటీ బెనిఫిట్ ను పాలసీ హోల్డర్ కు చెల్లిస్తుంది.  

 • చైల్డ్ ప్లాన్ లు

ఒక చైల్డ్ ప్లాన్ పాలసీ దారుని పిల్లల కు భవిష్యత్ నిధులను సృష్టించడానికి ఉపయోగపడుతుంది.  చైల్డ్ ప్లాన్ లు పిల్లల చదువులు, వివాహం వంటి విషయాలకు కావలసిన నిధి ని సమకూరుస్తుంది.  సాధారణం గా, చైల్డ్ ప్లాన్ లు ప్రయోజనాలను పిల్లల 18  సంవత్సరాల వయసు కు చేరిన తరువాత  ఇన్స్టాల్మెంట్ లలో గానీ సంవత్సరానికి ఒక సారి గానీ లేదా 1 -సారి మొత్తం చెల్లిస్తుంది.  

ఒక వేళ దురదృష్టవ శాత్తూ పాలసీ దారుడు పాలసీ కాలవ్యవధి లో మరణించినట్లైతే, చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని ఇన్సూరెన్సు కంపెనీ తిరిగి చెల్లిస్తుంది.  ఇటువంటి సమయాల్లో, కొన్ని లైఫ్ ఇన్సూరెన్సు సంస్థలు రాబోయే ప్రీమియం లను మాఫీ చేయడం తో పాటూ, ప్లాన్ ను ఎంచుకున్న కాలవ్యవధి వరకూ కొనసాగిస్తాయి.  

 • రిటైర్మెంట్ ప్లాన్ లు

రిటైర్మెంట్ సమయం లో పాలసీ దారునికి కొంత నిధి ని సమకూర్చే రిటైర్మెంట్ ప్లాన్ ను ఆన్యుయిటీ గా తెలుసు లేదా పెన్షన్ ప్లాన్  అంటారు.  సాధారణం గా, రిటైర్మెంట్ ప్లాన్  పాలసీ దారుడు 60 సంవత్సరాల వయస్సు కు చేరుకోగానే,  ఇన్స్టాల్మెంట్ లో గానీ లేదా సంవత్సరం లో ఒక సారి గానీ లేదా 1 - సారి చెల్లింపు లు జరుపుతుంది.  ఒక వేళ పాలసీ కాలపరిమితి లో పాలసీ దారుడు జీవించి ఉంటే, ఈ ప్లాన్ వెస్టింగ్ బెనిఫిట్ ను కూడా అందజేస్తుంది.  ఒక వేళ భీమా చేసిన వ్యక్తి మరణించినట్లైతే, డెత్ బెనిఫిట్ ను పాలసీ దారుని నామినీ కు అందిస్తుంది.  

గమనిక- భీమా చేయబడిన వ్యక్తి పాలసీ క్రియాశీలకం గా ఉన్నప్పుడు మరణించి ఉంటే, ఇన్సూరెన్సు కంపెనీ ముందుగా నిర్ణయించబడింది మొత్తాన్ని పాలసీ దారుని నామినీ కి అందజేస్తుంది.

ఇండియా లో గల వివిధ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల మధ్య వ్యత్యాసాలు

బేసిస్

టర్మ్ పాలసీ లు

హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు

ఎండోమెంట్ ప్లాన్ లు

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

మనీ బ్యాక్ ప్లాన్లు

పెన్షన్/ఆన్యుయిటీ ప్లాన్

అవలోకనం

లైఫ్ కవరేజీ కు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు సులువైన రూపాన్ని కలిగి ఉంటాయి.  

ఈ ప్లాన్ లు జీవిత కాలం అంతా రక్షణను కల్పిస్తాయి.  ఇవి పెట్టుబడి అవకాశాలు కలిగి ఉండాలనే నియమం లేదు. కలిగి ఉంటే ఉండవచ్చు. 

ఈ ప్లాన్ రక్షణ తో పాటూ, పెట్టుబడి అవకాశాలు కలిగి ఉంది.  ఖచ్చితమైన లాభాలు కలిగి ఉంది, ఒక్కోసారి 100 % వరకూ లాభాలను ఖచ్చితం గా పొందుతాయి.

ఈ ప్లాన్ లు రక్షణ తో పాటూ మార్కెట్ ఆధారితమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి.  పెట్టు బడి పై లాభాలు ఇన్సూరెన్సు కంపెనీ పెట్టుబడి పెట్టిన ఫండ్ యొక్క పనితీరుపై ఆధారపడి, ఎటువంటి ఆదాయానికి హామీ ఉండదు.

ఈ ప్లాన్ లు రక్షణతో పాటూ పెట్టుబడి అంశం కూడా కలిగి ఉంది.  దీని వలన కలిగే లాభాలు కొన్ని నిర్ణీత సంవత్సరాల తరువాత చెల్లించే విధం గా ఉంటాయి.  

ఈ ప్లాన్ లు వ్యక్తి జీవించి ఉన్నంతకాలం రాబడి ని అందిస్తూ ఉంటాయి.  కొన్ని ప్లాన్ లు కొనుగోలు ధరను వ్యక్తి మరణించిన తరువాత తిరిగి చెల్లించబడతాయి. 

పాలసీ టర్మ్ *

ఇవి సాధారణం గా 5  సంవత్సరాల నుండి 50 సంవత్సరాల పరిధి

ఈ పాలసీ పాలసీ దారుని మొత్తం జీవితాన్ని కవర్ చేస్తుంది

సాధారణం గా ఇవి 10  సంవత్సరాల నుండి 35 సంవత్సరాల పరిధి ని కలిగి ఉంటాయి.

ఈ పరిధి 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు ఉంటుంది.

సాధారణం గా దీని పరిమితి 25 సంవత్సరాల వరకూ ఉంటుంది

నియమిత కాలవ్యవధి లేదు

మెచ్యూరిటీ బెనిఫిట్స్


జీవించి ఉంటే, మీకు మెచ్యూరిటీ ప్రయోజనాలు చెల్లించ బడవు.

మీరు ఒక నిర్ణీత వయస్సు కు చేరు కున్నతరువాత మెచ్యూరిటీ బెనిఫిట్ చెల్లించబడుతుంది (బహుశా 80 నుండీ 100 సంవత్సరాలు).

పాలసీ కాల వ్యవధి లో మీరు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ లు పొందవచ్చు.

పాలసీ వ్యవధి లో మీరు జీవించి ఉంటే, మెచ్యూరిటీ బెనిఫిట్ లు పాలసీ కాలపరిమి ముగిసిన తరువాత చెల్లించబడుతుంది.

మీకు జీవించి ఉండటం వలన ప్రయోజనాలు మెచ్యూరిటీ సమయం లో చెల్లించబడతాయి.

మెచ్యూరిటీ బెనిఫిట్ అందించదు.  జీవించి ఉన్నంత కాలం మీకు రెగ్యులర్ రాబడిని ని అందిస్తుంది.  

డెత్ బెనిఫిట్

ఒకవేళ మీరు పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే, హామీ మొత్తం లబ్ది దారునికి చెల్లించబడుతుంది.  

ఒక వేళ మీరు పాలసీ చలామణి లో ఉండగా మరణిస్తే హామీ మొత్తం లబ్ది దారునికి చెల్లించబడుతుంది.

భీమా చేయబడిన వ్యక్తి మరణించినట్లైతే, డెత్ బెనిఫిట్ లబ్ది దారునికి చెల్లించబడుతుంది.

డెత్ బెనిఫిట్ పాలసీ చెల్లుబాటులో ఉన్న కాలం లో  పాలసీ దారుడు మరణిస్తే  తరువాత 

లబ్ది దారునికి చెల్లించబడుతుంది. 

పాలసీ దారుడు పాలసీ కాలవ్యవధి లో మరణిస్తే డెత్ బెనిఫిట్ లబ్ది దారునికి చెల్లించబడుతుంది.  

కొన్ని ప్లాన్ లు భీమా చేసిన వ్యక్తి మరణించినట్లైతే, పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి చెల్లించబడుతుంది.

అనువుగా ఉండేది 

ఈ ప్లాన్ లు అధిక ప్రీమియం చెల్లించ కుండా, తమ మరణం తరువాత వారి ప్రియమైన వారిని ఆర్ధికం గా రక్షణ ను కల్పించాలనుకొనే వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది.

హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు తమ ప్రియమైన వ్యక్తుల ఆర్ధిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని రక్షణగా ఇవ్వాలనుకొనే వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది.  

ఈ ప్లాన్ లు ఆర్ధిక భద్రత తో పాటూ  పెట్టుబడి,  ఖచ్చితమైన లాభాలు పొందాలని భావించే వ్యక్తులకు అనువుగా ఉంటాయి.

ఈ ప్లాన్  మధ్యస్థ కాలానికి పెట్టుబడి పెడుతూ తమ పోర్ట్ ఫోలియో ను పెంచుకోవాలనుకొనేవారికి బాగా అనువుగా ఉంటుంది. ఎక్కువ రాబడి కలిగి ఉన్న, మంచి పెట్టుబడి ఆలోచనల తో ఉండే  వ్యక్తులకు ఈ ప్లాన్ చాలా మంచిది.  

ఈ పాలసీ జీవితాన్ని సురక్షితం గా చూసుకుంటూ కొంత మొత్తం నిర్ణీత వ్యవధి లో పొందాలనుకునే వారికి ఇది మంచిది.  ప్రొటెక్షన్ మరియు పెట్టుబడి ప్రయోజనం పొందాలనుకునే వారికి అనువు గా ఉంటుంది. 

ఈ ప్లాన్ రిటైర్మెంట్ సమయం లో రక్షణ కల్పించే రెగ్యులర్ రాబడి ని కోరుకొనే వారికి చాలా అనువుగా ఉంటుంది.  లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం అంటే ఏమిటి?

లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్సు ప్రయోజనాలను అందించడానికి చెల్లించే మొత్తము.  లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం సంవత్సరానికి ఒక సారి చెల్లించబడుతుంది; అయితే, ప్రీమియం చెల్లించే కాల అవధి ని నెలసరి లేదా అర్ధ-సంవత్సరం కు కూడా ఎంచుకోవచ్చు.  ఈ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్సు యొక్క క్యాష్ వేల్యూ పెంపు కు కూడా ఉపయోగపడుతుంది.

ఇన్సూరెన్సు కంపెనీ పాలసీ దారుడు ఎంత ప్రీమియం భీమా కంపెనీకి చెల్లించాలో నిర్ణయిస్తుంది.  అంటే, లైఫ్ ఇన్సూరెన్సు కొనుగోలు దారుడు పాలసీ యొక్క నిబంధనలను మరియు హామీ మొత్తాన్ని ఎంచుకుంటాడు.

ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క హామీ మొత్తాన్ని లెక్కించే క్రమంలో, ఇన్సూరెన్సు కంపెనీ, పాలసీ కొనుగోలు దారుని జీవన విధానము, వృత్తి, ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్యా, ఆర్ధిక స్థితి, హామీ మొత్తం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది.  

గమనిక- మానవ జీవితం యొక్క విలువను ఏ ప్రీమియం కాలిక్యులేటర్ కూడా లెక్కించలేదు.

లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ను కొనుగోలు చేయడానికి కావలసిన పత్రాలు

పాలసీ ను కొనుగోలు చేయడానికి దరఖాస్తు చేసేటప్పుడు, ఇన్సూరెన్సు కంపెనీ ఈ క్రింద పేర్కొనబడిన కె వై సి పత్రాలు అడుగుతుంది:

 • ఆదాయ ధ్రువీకరణ పత్రము 

ఇది  భీమా చేయబోయే వ్యక్తి హామీ మొత్తాన్ని  లేదా అవసరమయ్యే కవరేజీ ని  అంచనా వేయడానికి అవసరం.  చాలా సందర్భాల్లో,  లైఫ్ఇన్సూరెన్సు కంపెనీలు ధరఖాస్తుదారుని సంవత్సర ఆదాయానికి 20  రెట్ల వరకూ కవరేజీ ని అందిస్తూ ఉంటాయి. ఒక  ప్రామాణిక ఆదాయ ధ్రువీకరణ ఈ క్రింది విషయాలతో కూడు ఉంటుంది:

  • 3  నుండి 6  నెలల క్రితం నాటి  శాలరీ స్లిప్పులు (ఇన్సూరెన్సు సంస్థ పై ఆధారపడి)
  • 2  నుండి  3  సంవత్సర క్రితం ఇన్ కం టాక్స్ రిటర్న్ లు (ఐ టి ఆర్) 
  • ఆఖరి 6 నెలల బ్యాంకు ఖాతా నివేదిక; అందులో 3 నెలల జీతము వరుసగా వచ్చి ఉండాలి.   
  • ఒక వేళ వ్యక్తి స్వయం-ఉపాధి కలిగి ఉంటే ఒక సి ఏ నుండి ధ్రువీకరణ పత్రం
  • కొత్త ఫారం 16

 • చిరునామా ధ్రువీకరణ

ధరఖాస్తుదారుని చిరునామా వివరాలను ఇన్సూరెన్సు కంపెనీలు అడుగుతూ ఉంటాయి.  అడ్రస్ ప్రూఫ్ కోసం ఈ క్రింది పత్రాలను ఉపయోగించుకోవచ్చును.  

  • ఓటర్ ఐ డి కార్డు
  • ఆధార్ కార్డు
  • సేవింగ్స్ అకౌంట్ బ్యాంకు స్టేట్మెంట్
  • 6 నెలల పాస్ బుక్  ఎంట్రీలు 
  • డ్రైవింగ్ లైసెన్సు 
  • 3  నెలల యుటిలిటీ బిల్లులు
  • పాస్ పోర్ట్ 
  • రేషన్ కార్డు

 • ఐడెంటిటీ ప్రూఫ్

గుర్తింపు  కోసం ఈ క్రింది పత్రాలను సమర్పించవచ్చు.

  • పాస్ పోర్ట్
  • పి ఏ ఎన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • ఓటర్  ఐ డి కార్డు

 • వయస్సు ధ్రువీకరణ

ఈ క్రింద ఇవ్వ బడ్డ పత్రాలు వయస్సు నిర్ధారణ పత్రాలు గా నిర్ధారింప బడతాయి.  అయితే, క్రింద ఇవ్వబడ్డ సమగ్ర  జాబితా ఏజ్ ప్రూఫ్ కోసం ఉపయోగించ వచ్చు:

  • పి ఏ ఎన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • ఓటర్ ఐ డి కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాస్ పోర్ట్
  • రేషన్ కార్డు
  • మ్యారేజ్ సర్టిఫికెట్
  • స్కూల్/కాలేజీ లీవింగ్ సర్టిఫికెట్
  • బర్త్ సర్టిఫికేట్

 • ఇతర పత్రాలు

కే వై సి పత్రాల తో మినహా, కొన్ని అవసర మైన పత్రాలను దరఖాస్తు దారుడు లైఫ్ ఇన్సూరెన్సు కవరేజ్ కొనుగోలు చేసేటప్పుడు సమర్పించాల్సి ఉంటుంది.:

  • ఇన్సూరెన్సు అప్లికేషన్ లేదా ప్రపోసల్ ఫారం
  • భీమా చేయబోయే వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ప్రపోసల్ ఫారం ను పూరిస్తున్నట్లైతే, పాలసీ డిక్లరేషన్ ను సమర్పించాలి.  
  • సమర్పించిన వివరాలు అన్ని వివరాలు నిజమనీ, అవి అసత్యమని రుజువు అయితే, ఇన్సూరెన్సు కంపెనీకి ఆ దరఖాస్తు నిరాకరించే హక్కు ఉంటుంది అని తెలిపే ఒక చివరి డిక్లరేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.లేనిచో, ఒప్పందం శూన్యం కాబడి మరియు చెల్లించిన ప్రీమియం సరెండర్ చేయబడుతుంది.  అందువలన, దరఖాస్తు చేసే ప్రక్రియ విశ్వనీయం గా పూర్తి చేయాల్సి  ఉంటుంది.
  • ఒక వేళ పాలసీ, వివాహం అయిన మహిళా ఆస్తి చట్టం ప్రకారం నమోదు చేయదలిచితే, ఒక ప్రత్యేక పత్రాన్ని నామినీ వివరాల తో సహా  పూరించి ఇన్సూరెన్సు కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది.  
  • పాలసీ ప్రపోసల్ ఫారం ఒక నివేదిక ను కూడా కలిగి ఉంటుంది.  దీని లోని సమర్పించే వివరాలు సరిగ్గా లేని చొ దరఖాస్తు నిరాకరణకు గురి అవుతుంది.

ఉత్తమ మైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ను ఎలా ఎంచుకోవాలి?

ఇండియా లో లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలు వివిధ రకాలైన ప్లాన్ లను అందిస్తూ ఉంటారు.  కొన్ని సార్లు ఇవి అందించే వివిధ రకాలప్లాన్ ఎంపికలు మరియు అవి అందించే కవరేజీ ప్రయోజనాలను ఎంచుకోవడం ఒక పెద్ద పని అవుతుంది.  

ఉత్తమ మైన లైఫ్ ఇన్సూరెన్సు ను ఎంచుకోవడానికి ఈ క్రింది అంశాలు ఉపయోగపడతాయి:

 • ఇన్సూరెన్సు కంపెనీ యొక్క రెపుటేషన్:  మార్కెట్ లో రక రకాలైన ఇన్సూరెన్సు కంపీనీలు వివిధ రకాలైన ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తూ ఉంటాయి.  అంటే ఇన్సూరెన్సు సెక్టార్ లో కొన్ని ఇన్సూరెన్సు సంస్థలు క్రొత్తవి మరియు ఈ వ్యాపార రంగం లో అనుభవం లేనివి ఉంటాయి.  అందువలన, మార్కెట్ లో సిద్ధి గాంచిన, మంచి పేరు ప్రఖ్యాతలు, గుడ్ విల్ గల లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీని మీ ఇన్సూరెన్సు అవసరాలకోసం ఎంచుకోవాలి.  
 • క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో:  ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేసేదే అవసరమయినపుడు క్లెయిమ్ నమోదు చేయడానికే.  కానీ, నమోదు చేసిన క్లెయిమ్ పరిష్కరించబడకపోతే?  అందువలన, ఒక ఇన్సూరెన్సు కంపెనీని ను ఎంచుకొనే టప్పుడే కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ని చెక్ చేసుకోవాలి.  ప్రతీ సంవత్సరం కంపెనీ ఎన్ని క్లెయిమ్ లు స్వీకరించి పరిష్కరించారో తెలుసుకోవడం వల్ల తప్ప కుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఎక్కువ క్లెయిమ్ రేషియో కలిగి ఉన్న లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ ఉత్తమ మైనది గా నిర్ణయించుకోవచ్చు.  
 • హామీ మొత్తం మూల్యాంకనం:  ఒక ఇన్సూరెన్సు కంపెనీని ఎంచుకొనే ముందు రాబోయే హామీ మొత్తాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.దానికి తోడు, ఇన్సూరెన్సు కంపెనీలు ప్రీమియం ను లెక్కించడం అనే విధానాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది.  మీకు సరిపడే ఇన్సూరెన్సు కంపెనీని ఎంచుకొనే టప్పడు, అన్ని అంశాలూ సంతృప్తి చెందిన తరువాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి. 
 • వినియోగదారునిసమీక్ష:  ఆఖరు విషయం అయినా చిన్న విషయం కానిది.  ఆన్ లైన్ లో వినియోగదారుని సమీక్షలు చదవడం ఒక అలవాటు గా చేసుకోవాలి.  ఈ రోజు మీరు సులువుగా ఆన్ లైన్ లో ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయవచ్చు.  సమీక్షలు చదవడం వలన ఒక తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు.  అంతేకాక, ఏ విధమైన ప్రశ్నలు, గందరగోళాలు ఉత్పన్నం కాకుండా కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ తో సంప్రదించాల్సి ఉంటుంది.  దీనివలన కంపెనీ వినియోగదారులతో ఎలా మెలుగు తున్నారో అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  

ఉత్తమమైన లైఫ్ ఇన్సురన్ ప్లాన్ ఏది?

ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని ఎంచుకోవడం వలన అత్యవసర సమయాల్లో మీ కుటుంబ జీవనశైలి ని కోల్పోకుండా సంతోషం గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.  ఉత్తమ మైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని ఎంచుకోవడానికి అవి అందించే ఇన్సూరెన్సు ప్లాన్ యొక్క ప్రయోజనాలను క్షుణ్ణం గా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

 • సమగ్ర ప్లాన్ లు:  ఒక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఆర్ధిక భరోసానే కాక ఒక దీర్ఘ-కాలిక పెట్టుబడి అవకాశం గా పనిచేస్తుంది.  సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్ వంటి ప్రాధమిక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు వివిధ రకాలైన మనీ-బ్యాక్, మెచ్యూరిటీ వేల్యూ, క్యాష్ వేల్యూ లు వంటి మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తాయి.
 • ఖచ్చితం గా లభించే ఆన్యుయిటీ : ఒక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ రిటైర్మెంట్ సమయానికి కొంత సొమ్ము ను  ఆదా చేస్తుంది.  ఉత్తమమైన ఇన్సూరెన్సు ప్లాన్ మీరు రిటైర్ అయ్యే సమయానికి స్థిరమైన లాభాలను అందిస్తాయి.  
 • ఇన్సూరెన్సు విత్ సేవింగ్స్:  లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కోసం మీరు కొన్ని ప్రీమియం లు కూడా క్రమబద్ధం గా చెల్లించాల్సి ఉంటుంది.  ఇది పాలసీ దారునికి  పొదుపు చేయడానికి కూడా ప్రోత్సహాయిస్తుంది.  ఇది మీ రాబోయే  అవసరాలకు తగిన సంపదను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది.  
 • రుణ సౌకర్యం: లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కలిగి ఉన్న ఇన్సూరెన్సు కవరేజీ పై ఋణం తీసుకోవడానికి, తద్వారా అనుకోకుండా సంభవించే ఖర్చులు మరియు ప్రయోజనాలను దెబ్బ తినకుండా కవర్ చేస్తుంది.  
 • పన్ను ప్రయోజనాలు:  లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు టాక్స్ ప్రయోజనాలను కలిగి ఉండి డబ్బును ఆదా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  చాలా లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు ప్రీమియం చెల్లింపు  పై పన్ను మినహాయింపు మరియు హామీ మొత్తం పై పన్ను రాయితీ  ప్రయోజనాలను సెక్షన్ 80 సి  మరియు సెక్షన్ 10(10 డి) ద్వారా పొందవచ్చు. 

లైఫ్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను ఎలా నమోదు చేసుకోవాలి?

క్లెయిమ్ ను నమోదు చేయడం మరియు హామీ మొత్తాన్ని పొందటం కొన్ని అవసరమైన అంశాలను పాటించడంద్వారాసులభం.  క్లెయిమ్ చేసే టప్పుడు  ఒక సరైన విధాన్నాన్ని పాటించడం చాలా ముఖ్యం.  ఇండియా లో ఈ క్రింది ప్రరిస్థితులలో పాలసీ హోల్డర్ లేదా పాలసీ హోల్డర్ యొక్క నామినీ క్లెయిమ్ ని ఎలా నమోదు చేయాలో తెలియజేస్తుంది.  

 • పాలసీ దారుని మరణం సంభవించినపుడు
 • పాలసీ మెచ్యూరిటీ పొందినపుడు

 • మరంచినప్పుడు క్లెయిమ్ ని ఎలా నమోదు చేయాలి?

ఇన్సూరెన్సు కంపెనీకి తెలిజేయడం:  వీలైనంత త్వరగా ఇన్సూరెన్సు సంస్థ యొక్క టోల్-ఫ్రీ నెంబర్ కి గానీ ఇమెయిల్ చేయడం ద్వారా గానీ సంప్రదించాలి.  ప్రక్రియను ప్రారంభించడానికి వీలైతే ఇన్సూరెన్సు సంస్థ కు నేరుగా కాల్ చేయాలి.   

ముఖ్యమైన వివరాలను తెలియజేయండి:  క్లెయిమ్ చేసేవారు లేదా లబ్ది దారులు క్లెయిమ్ నమోదు చేసే సమయం లో కొన్ని ముఖ్యమైన వివరాలను తెలియ జేయాలి:

  • పాలసీ నెంబర్
  • పాలసీ దారుని పేరు
  • మరణించిన స్థలము
  • క్లెయిమ్ చేసే వారి పేరు

ఒక వేళ ఇన్సూరెన్సు పాలసీ ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసి ఉంటే, ఇన్సూరెన్సు సంస్థకు పాలసీ కొనుగోలు సమయంలో లభించే  క్లెయిమ్ ఇంటిమేషన్ ఫారం ను జమ చేయాల్సి ఉంటుంది.  ఒక వేళ ఆన్ లైన్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ అయినట్లైతే, ఆన్ లైన్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ ఫారం ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.  

క్లెయిమ్ ప్రక్రియ: ఒక వేళ ఆక్సిడెంట్ ద్వారా లేదా సహజ మరణం అయినట్లైతే, క్లెయిమ్ ప్రాసెస్ కోసం ఇన్సూరెన్సు సంస్థ కు లబ్ధిదారుడు లేదా నామినీ అన్ని మద్దతు పత్రాలను జమ చేయవలసి ఉంటుంది.

క్లయిమ్ సపోర్ట్ టీం ఇన్సూరెన్సు పత్రాలను, క్లెయిమ్ డిక్లరేషన్ ను  పరిశీలిస్తుంది.  కొన్ని సందర్భాలలో, వారు లబ్ధిదారుని ఇంకా కొన్ని పత్రాలను జమ చేయమని కోరవచ్చు.  

సమర్పించాల్సిన పత్రాలు

  • లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ అసలు పత్రం
  • నింపబడిన క్లెయిమ్ ఫారం
  • పాలసీ దారుని డెత్ సర్టిఫికేట్
  • ఒక వేళ  డీడ్ అఫ్ అసైన్మెంట్ ఉంటే అది.
  • సాక్షి సంతకాలతో కూడిన  డిశ్చార్జ్ ఫారం  
  • పోస్ట్-మోర్టమ్ రిపోర్ట్ లు, హాస్పిటల్ సర్టిఫికేట్ మరియు డాక్టర్ సర్టిఫికేట్ (అవసరం మేరకు) వంటి  అదనపు పత్రాలు 
  • పోలీస్ ఎంక్వయిరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 

గమనిక - ఒక వేళ నామినీ కాకుండా వేరే వ్యక్తి క్లెయిమ్ ను నమోదు చేసినట్లైతే, ఇన్సూరెన్సు కంపెనీ లీగల్ టైటిల్ అఫ్ సక్సెసైన్ ను కోరవచ్చు.  

ఆమోదం మరియు చెల్లింపు 

  • అన్ని పత్రాలూ జమ చేసిన తరువాత, ఇన్సూరెన్సు సంస్థ పరిశీలించి, క్లెయిమ్ పరిష్కరిస్తుంది.  
  • ఇన్సూరెన్సు సంస్థ లబ్దిదారుని బ్యాంకు వివరాలూ  కోరవచ్చు - ఒక కాన్సుల్ చేయబడిన చెక్కు లేదా బ్యాంకు అధికారి చే అట్టేస్ట్ చేయబడిన  బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ కాపీ.
  • నామినీ గుర్తింపు ధ్రువీకరణ కోసం, పాస్ పోర్ట్ కాపీ, ఓటర్ ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు మొదలైనవి జమ చేయవలసి ఉంటుంది.
  • క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ సాధారణం గా 30 రోజులు పడుతుంది.  ఒక సారి అనుమతించిన తరువాత, ఇన్సూరెన్సు కంపెనీ వెంటనే చెల్లింపు జరుపు తుంది.
  • కొన్నిసార్లు ఇన్సూరెన్సు సంస్థ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ లేదా ఈ సి ఎస్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు విధానం ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

ఇక్కడ చెప్పిన  ప్రాధమిక పత్రాలు క్లెయిమ్ ప్రక్రియ కోసం ఇన్సూరెన్సు కంపెనీ అడుగవచ్చు (అవసరమయిన చో) - 

  • ఎంప్లొయెర్ సర్టిఫికేట్
  • వెరిఫికేషన్ చేసేందుకు వీలుగా కొన్ని అదనపు ఫారం లు లేదా నివేదికలు • మెచ్యూరిటీ క్లెయిమ్ ను ఏ విధం గా నమోదు చేయాలి?

ఒక వేళ పాలసీ దారుడు పాలసీ కాలవ్యవధి లో జీవించి ఉంటే, అతడు/ఆమె పాలసీ మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు.  అయితే, పాలసీ దారుడు పాలసీ యొక్క అన్ని ప్రీమియం లో చెల్లించాల్సి ఉంటుంది.  

ఇక్కడ మెచ్యూరిటీ క్లెయిమ్ ను అతి తక్కువ పేపర్ వర్క్ తో నమోదు ప్రక్రియ తెలుపబడింది.

పాలసీ మెచ్యూరిటీ దశకు చేరుకున్నట్లైతే, ఇన్సూరెన్సు సంస్థ సాధారణం గా 1 -2  నెలల ముందు గా  తెలియజేస్తుంది. మెచ్యూరిటీ డేట్, మెచ్యూరిటీ మొత్తం మరియు డిశ్చార్జ్ వౌచెర్ మొదలైన వివరాలు పాలసీ దారునికి ఇవ్వబడతాయి.  డిశ్చార్జ్ వౌచెర్ (ఒక రసీదు వంటిది) ను పాలసీ దారుడు సంతకం సాక్షుల సమక్షం లో చేయాల్సి ఉంటుంది.  తరువాత ఆ వౌచెర్ ను , మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందడానికి  ఇన్సూరెన్సు కంపెనీకి ఒరిజినల్ పాలసీ బాండ్ తో  సహా పంపించాలి.   

ఒక వేళ పాలసీ దారుడు లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కోసం ఇంకొక వ్యక్తి లేదా సంస్థ ను నామినెటే చేసినట్లైతే, క్లెయిమ్ మొత్తాన్ని పొందడానికి డిశ్చార్జ్ వౌచెర్ మీద నామినీ  సంతకం చేయాలి.  

గుర్తుంచుకోవలసిన అంశాలు

 • ఈ ప్రక్రియ కేవలం అడిషనల్ బోనస్, సర్వైవల్ బెనిఫిట్స్ వంటి మెచ్యూరిటీ బెనిఫిట్ లు అందించే లైఫ్ ప్లాన్ లకు మాత్రమే వర్తిస్తుంది. 
 • ఒక వేళ పాలసీ దారుడు పాలసీ మెచ్యూరిటీ తేదీ తరువాత పాలసీ డిశ్చార్జ్ ప్రక్రియ సమయంలోమరణిస్తే, దానిని మెచ్యూరిటీ క్లెయిమ్ గా పరిగణించబడుతుంది.  మరియు ఆ క్లెయిమ్ మొత్తం మరణించిన  పాలసీ దారుని నామినీ లకు చెల్లించబడుతుంది.  
 • ఒక క్రొత్త లైఫ్ ప్లాన్ కొనుగోలు చేసేముందు, దరఖాస్తు దారుడు తాను ముందుగా కొనుగోలు చేసిన పాలసీ వివరాలను తెలియజేయాలి (ఒక వేళ ఉంటే).  ఇన్సూరెన్సు కంపెనీ కు ప్రస్తుత పాలసీ కోసం తెలిసి ఉండాలి.  అదనంగా, ఇన్సూరెన్సు కొనుగోలుకు అతని/ఆమె అవసరాలకు తగిన సరైన పాలసీ ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది.  లేదంటే, తప్పుగా పేర్కొన్నందుకు డెత్ క్లెయిమ్ నిరాకరణకు గురి అవుతుంది.

లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్ & వాటి ప్రాముఖ్యత 

లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్ అంటే ఏమిటి?

ఇన్సూరెన్సు సంస్థలు అందించే బేస్ లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీని మరింత మెరుగుపరచేందుకు ఈ రైడర్స్ ఆడ్ -ఆన్ ప్రయోజనాలను అందిస్తాయి.  ఐతే మార్కెట్లో అందుబాటులో వుండే రైడర్స్ లోని రకాలు తెలియకుండా లైఫ్ ప్లాన్ యొక్క కవరేజిని పెంచుట కొరకు ఒకే రైడర్స్ ను యాదృచ్చికంగా ఎంపిక చేయకూడదు.

లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కనుగోలు చేసే విధంగానే సరి అయిన లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్ ను ఎంపిక చేసుకోవడం అనేది కూడా చాలా కీలకమైన అంశం.అయితే ,ఇన్సూరెన్సు నిర్ణయాన్ని ఎవరూ తిరస్కరించలేరు.  ఇన్సూరెన్సు ను ఎంపిక చేసుకొనేముందు  ప్రతి ఒక్కరు కొంత టైం తీసుకొని మరియు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకొని లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్ ను ఎంపిక చేసుకొనవలెను. 

లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్ లోని రకాలు 

పాలసీ దారులకు ఇక్కడ కొన్ని రైడర్లునుఎంపిక చేసుకొనే అవకాశం అందుబాటులో వున్నాయి. 

 • క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ 

ఈ రైడర్స్  ప్రధానంగా క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీ ప్రయోజనాలను అందిస్తాయి.  ఉదాహరణకు కాన్సర్, గుండె పోటు, మూత్ర పిండాల వైఫల్యం, స్ట్రోక్, కోమా, పక్షవాతం, మొదలైనవి.  ఆ కవరేజీ ఒక పాలసీ దారునికి , వేరొక పాలసీ దారునికి వేరుగా ఉండవచ్చు.  ఇన్సూరెన్సు కంపెనీ ఏ అనారోగ్యానికి ఏ విధముగా కవరేజీని అందిస్తుందో తనిఖీ చేసుకోవడం చాల ముఖ్యమైన అంశం.ఇన్సూరెన్సు కంపెనీ క్లిష్టమైన అనారోగ్యాలకు రోగనిర్ధారణను బట్టి రైడర్ ప్రయోజనాలను అందిస్తుంది.  పైన పేర్కొనబడిన క్లిష్టమైన అనారోగ్యాలు  తక్షణ మరణాలకు కారణం కాకపోవచ్చు.  కానీ చికిత్సకు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది.  ఈ రైడర్ల క్రింద , పాలసీ దారుడు హామీ మొత్తాన్ని చికిత్స ఖర్చుల కొరకు వాడుకొనవచ్చును.  పాలసీ దారుడు జీవించి వున్న పరిస్థితిలో మాత్రమే ఇది సాధ్య పడుతుంది. 

క్లిష్టమైనఅనారోగ్యంసంభవించిందని ఏ ఒక్కరూ ఖచ్చితంగా 100 శాతం నిర్ధారించలేరుకనుక, ఈక్రిందివ్యక్తులుఈరైడర్లనుఎంచుకోవచ్చు:

 • పై స్థాయిలో పనిచేసే ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడికి గురి అవుతున్నవారు
 • అధికమైన దూమ్రపానం 
 • అనారోగ్యమైన జీవన విధానాన్ని గడుపుతున్నవారు

 •  వీవర్ అఫ్ ప్రీమియం రైడర్ 

ఒక వేళపాలసీ దారుడు వైకల్యం వలన,  ఆదాయంకలిగిఉండకపోవడంవలనఅతడు/ఆమెప్రీమియంచెల్లించకపోవడంవలనలైఫ్ఇన్సూరెన్సుపాలసీముగించబడుతుంది.  అటువంటి సందర్భాలలో, పాలసీ దారునకు ఎటువంటి పరిహారం చెల్లించ బడదు.అటువంటి సమయంలో,వారి కుటుంబంక్రమంగా వచ్చే ఆదాయం లేకుండాఆర్ధికంగాఎలా నిర్వహించ బడతారు? 

అటువంటి సందర్భాలలో, వీవర్అఫ్ ప్రీమియం రైడర్  జీవితాన్ని రక్షించే రైడర్ వలె పని చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క అన్ని భవిష్యత్ ప్రీమియంలు మాఫీచేయబడి, పాలసీచలామణిలోఉంటుంది..  

మరణించడంవలనగానీ, ఆక్సిడెంట్వలనకలిగినవైకల్యమువలనకానీప్రీమియం ను చెల్లించ లేకపోయినా  బేస్  పాలసీ యొక్క ప్రీమియం మరియు రైడర్లు  మాఫీచేయబడిపాలసీ కొనసాగుతుంది.

ఒక వేళఈ రైడర్ ను క్లిష్టమైన అనారోగ్యానికి  మరియు ప్రమాదంవలనకలిగినమొత్తం మరియు శాశ్వత వైకల్యము కొరకు పాలసీ దారుడు ఈ రైడర్ లను  ప్రత్యేకముగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.  రాబోయేఅనిశ్చితపరిస్థితులనుమనంముందుగాగుర్తించలేముకనుక,ప్రతి నిత్యం ప్రయాణించే వారు లేక ఆన్-సైట్  లో పని చేసేవారు, సివిల్ వర్క్ లో శారీరిక శ్రమ చేసే వాళ్ళుతప్పకఈలైఫ్ఇన్సూరెన్సురైడర్నుకొనుగోలుచేయాలి.  

 • ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ 

ఈ రైడర్ తో, ఇన్సూరెన్సు చేయబడిన వ్యక్తి ఆక్సిడెంట్ వలన మరణిస్తే, నామినీ కు  ప్రాధమిక హామీ మొత్తం తో పాటూ అదనపు ఆక్సిడెంట్ డెత్ బెనిఫిట్ లభిస్తుంది.  చాలా వరకూ కేసులలో, పాలసీ హోల్డర్ వెంటనే అక్కడి కక్కడే మరణించక పోవచ్చు కనుక కంపెనీలు సంఘటన జరిగిన కొంత కాలం వరకూ కవరేజీ ని పొడిగిస్తూ ఉంటారు.  

ఉదాహరణకు, ఒక పాలసీ దారుడు ఆక్సిడెంట్ జరిగిన 100  రోజుల తరువాత మరణిస్తే, నామినీ కు హామీ మొత్తం లభిస్తుంది.   అందువల్ల లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క ఉపవాఖ్యలను రైడర్ లను ఎంచుకొనే ముందే జాగ్రత్త గా పరిశీలించాల్సి ఉంటుంది.   

ఆక్సిడెంట్ లు ఎక్కడైనా జరగడానికి అవకాశం వుంది కనుక, ప్రతీ ఒక్కరూ వారి కుటుంబ ఆర్ధిక భవిషత్తు ను జాగ్రత్త చేసుకోవాలి.  ఎవరైనా రైడర్ ను ఎంచుకోగలరు కానీ వీరు మాత్రం తప్పక కొనుగోలుచేయాలి:

 • రోజు వారీ పనుల మీద కార్, బైక్, పబ్లిక్ లేదా వాణిజ్య వాహనాలను వాడుతున్న వారూ.
 • తరుచు గా వ్యాపార పనులపై ప్రయాణం చేసేవారు, ఫ్యాక్టరీ లలో పనిచేసే వారు లేదా సివిల్ వర్క్ పనులలో ఆన్-సైట్ లో ఉండే వారికి.

 • ఆక్సిడెంటల్ టోటల్ అండ్ పెర్మనెంట్ డిస్ఎబిలిటీ  రైడర్

ఆక్సిడెంట్ వలన  తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినట్లైతే, పాలసీ దారుడు రోజు వారీ ఆదాయాన్ని కోల్పోతాడు. ఈ రైడర్ వారి కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని నెలసరి ఆదాయంరూపం లో అందిస్తుంది.  ఈ రైడర్ ప్రయోజనం ప్రతీ ప్లాన్ కూ వేర్వేరు కాలపరిమితితోనిర్ణయించబడి ఉంటుంది.  

ఉదాహరణకు, కొన్ని కంపెనీలు ఆక్సిడెంట్ జరిగిన 5 సంవత్సరాల నుండి  10 సంవత్సరాల వరకూ రైడర్ బెనిఫిట్ లు అందజేస్తారు.  పాలసీ కాలవ్యవధి లో మరణం సంభవిస్తే, లబ్ధిదారుడు హామీ మొత్తాన్ని పొందుతాడు.  

ఈ క్రింది వ్యక్తులు  తప్పని సరిగా రైడర్లు  కొనుగోలు చేయాలి:

 • ప్రతీ రోజూ ప్రయాణం చేసే వారు, బైక్ , కారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ లేదా వాణిజ్య వాహనాలు ఉపయోగయించే వారు.
 • సివిల్ ఆన్-సైట్ లో, పరిశ్రమ లలో  శారీరక శ్రమ చేసేవారు, తరుచు గా వ్యాపారరీత్యా ప్రయాణాలు చేసేవారు.
 • టర్మ్ రైడర్: ఈ రైడర్ పాలసీ దారుడు పాలసీ కాలవ్యవధి లో మరణిస్తే  నెల సరి ఆదాయాన్ని ఒక మొత్తం లబ్ధిదారునికి చెల్లిస్తుంది. ముందుగా ఇన్సూరెన్సు సంస్థ నిర్ణయించిన  ప్రాధమిక  హామీ మొత్తం కాకుండా అదనపు ప్రయోజనాన్ని టర్మ్ రైడర్ ప్లాన్ అందిస్తుంది.
 • హాస్పిటల్ క్యాష్ రైడర్: ఈ రైడర్ ప్రకారం, ఒక నిర్ణీత మొత్తం అకస్మాత్తుగా/ ప్లాన్డ్ గా హాస్పిటల్ లో జాయిన్ కావలసి వస్తే చెల్లిస్తుంది.  ఈ ప్రయోజనం  ద్వారా అందించే హామీ మొత్తం వివిధ ఇన్సూరెన్సు సంస్థల నిబంధలు, ప్రయోజనాల ను అనుసరించి వేర్వేరు గా ఉంటుంది. లైఫ్ఇన్సూరెన్సు కంపెనీలు అందించే ఈ రైడర్ బెనిఫిట్ అత్యవసర హాస్పిటలైజేషన్ కొరకు కవరేజీ ని కోరుకొనే వారికి ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది.  
 • సర్జికల్ కేర్ రైడర్:  పాలసీ చేయబడిన వ్యక్తి తప్పని సరి పరిస్థితులలో ఇండియా లో  శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే, ఈ రైడర్ ఒక మొత్తాన్ని అందజేస్తుంది.  అయితే, ఈ రైడర్ ప్రయోజనాలు శస్త్ర చికిత్స యొక్క తీవ్రత ను బట్టే వేర్వేరు ప్లాన్ లకు వేర్వేరు గా ఉంటుంది.  అకస్మాత్తుగా జరిగే  శస్త్ర చికిత్సల ఖర్చులను కవర్ చేసుకొనే వారికి ఈ రైడర్ ప్రయోజనం ఉపయోగపడుతుంది.  ఇది అకస్మాత్తుగా జేబులు చిల్లు పడే ప్రమాదం నుండి కాపాడుతుంది.  

లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లు

ఇన్సూరెన్సు కంపెనీ

స్వీకరించబడిన డెత్ క్లెయిమ్ లు

చెల్లించిన క్లెయిమ్ లు

రిజెక్ట్/తిరస్కరించిన  క్లెయిమ్ లు

పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లు

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (సి ఎస్ ఆర్ %)

ఆదిత్య బిర్లా 

సన్ లైఫ్

5,260

5,110

0

24

97.15%

ఏగొం లైఫ్

507

489

0

0

96.45%

అవివా

938

901

15

2

96.06%

బజాజ్ అలియాన్జ్

12,767

12,130

153

3

95.01%

భారతి ఏ ఎక్స్ ఏ 

1065

1036

0

7

97.28%

కెనరా హెచ్ ఎస్ బి సి ఓరియంటల్

1006

946

0

1

94.04%

ఈడెల్వెయిస్ టోకియో

239

229

0

0

95.82%

ఎక్సయిడ్ లైఫ్

3,335

3,236

0

0

95.82%

ఫ్యూచర్ జెనెరాలి ఇండియా 

1,157

1,101

4

8

95.16%

హెచ్ డ్ ఎఫ్ సి స్టాండర్డ్ లైఫ్

12,946

12,822

23

34

99.04%

ఐసీ ఐసీ ఐ  ప్రుడెన్షియల్ 

10,826

10,672

0

21

98.58%

ఐ డి బి ఐ ఫెడరల్

1,306

1251

0

8

95.79%

ఇండియా ఫస్ట్

2,242

2,081

8

9

92.82%

కోటక్ మహీంద్రా

3,038

2,959

0

12

97.40%

ఎల్ ఐ సి 

7,50,381

7,34,328

3442

791

97.79%

మాక్స్ లైఫ్

15,085

14,897

0

3

98.74%

పి ఎన్ బి మెట్ లైఫ్ ఇండియా

4170

4,012

0

0

96.21%

ప్రమెరికా

656

635

0

2

96.80%

రిలయన్స్ నిప్పాన్

8,371

8,179

0

4

97.71%

సహారా లైఫ్

681

614

12

16

90.16%

ఎస్ బి ఐ లైఫ్

19,902

18,913

0

28

95.03%

శ్రీరామ్ లైఫ్

2,830

2,414

43

39

85.30%

స్టార్ యూనియన్ డైయాచి

1,258

1,217

1

5

96.74%

టాటా ఏ ఐ ఏ 

2,700

2,675

0

0

99.07%

విశేష సూచన: పాలసీ బజార్  ఏ ఒక్క ఇన్సూరెన్సు సంస్థను లేదా ఆ ఇన్సూరెన్సు సంస్థ అందించే ఉత్పత్తి ని గానీ గానీ ప్రోత్సహించడం, రేటింగ్ ఇవ్వడం లేదా సిఫార్సు చేయడం గానీ చేయదు.

తరుచు గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు కోసం నెలకు ఎంత ఖర్చు అవుతుంది?

జవాబు: వివిధ రకాల అంశాల పై లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ఖర్చు ఆధారపడి ఉంటుంది. వాటిలో కొన్ని,  ఆర్ధిక అవసరాలు, మీరు ఎంచుకొనే లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క రకం, మీరు కోరుకుంటున్న కవరేజీ విస్తృతి, మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జెండర్, వృత్తి మరియు ప్రీ-మెడికల్ పరీక్షల యొక్క ఫలితాలు.   వీటి పై ఆధారపడి పాలసీ ప్రీమియం లెక్కింపబడుతుంది.

ప్ర. రూ. 5,00,000 లక్షల లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కవరేజీ సరిపోతుందా?

జవాబు:మీ సంవత్సర ఆదాయానికి 10-20 రెట్ల కవరేజీ ని ఎంచుకోవడమే అన్నింటికంటే సరైన ఇన్సూరెన్సు మొత్తాన్ని లెక్కించే పద్ధతి.  రూ. 5,00,000 లక్షల కవరేజీ సరిపోతుందో లేదో మీ సంవత్సర ఆదాయం పై ఆధారపడి ఉంటుంది.  

ప్ర. లైఫ్ ఇన్సరున్స్ తీసుకోవడానికి గరిష్ట వయోపరిమితి ఏమిటి?

జవాబు: ఇన్సూరెన్సు ప్లాన్ లకు ఒక నిర్దిష్టమైన వయోపరిమితి నిర్ణయించబడి ఉండటం వలన, అన్ని వయస్సు ల కలవారూ దీనికి అర్హులు కారు.  అందువలన, సాధారణం గా గరిష్ట వయోపరిమితి ని సుమారుగా 75 సంవత్సరాల  నుండీ  80 సంవత్సరాల వరకూ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలు నిర్ణయించాయి.

ప్ర. సగటు లైఫ్ ఇన్సూరెన్సు చెల్లింపు ఎంత ఉంటుంది?

జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు చెల్లింపులు ముఖ్యం గా చెల్లించే ప్రీమియం, నిబంధనలు మరియు షరతులు, దరఖాస్తు దారుని వయస్సు, లింగము మరియు వృత్తి పై ఆధారపడి లెక్కించబడుతుంది.  

ప్ర. మరణం తరువాత లైఫ్ ఇన్సూరెన్సు ను ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు?

జవాబు: పాలసీ దారుడు మరణించిన తరువాత, వారి నామినీ లేదా చట్టబద్ధ వారసులు లైఫ్ ఇన్సూరెన్సు ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు ను మరణం కంటే ముందు సొమ్ము చేసుకోవచ్చా?

జవాబు: అవును, ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క క్యాష్ వేల్యూ పై ఆధారపడి, పాలసీ ని సొమ్ము చేసుకోవచ్చు.  క్యాష్ వేల్యూ అనేది లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ  డెత్ బెనిఫిట్ లోని ఒక భాగం కనుక దీనికి సొమ్ము చేసుకోవచ్చు.  వివిధ ఇన్సూరెన్సు కంపెనీలు వివిధ రకాల క్యాష్ వేల్యూ పెరుగుదల శాతాన్ని కలిగి ఉంటాయి.  వీటిని ఆర్ ఓ ఏ -  రేట్ అఫ్ ఎక్యుములేషన్  అని కూడా అంటారు.  ఒక వేళ పాలసీ దారుడు పాలసీ క్యాష్ వేల్యూ  ద్వారా రుణాన్ని పొంది ఉండి, మరణించి ఉంటే, డెత్ బెనిఫిట్ నుండి ఆ లోన్ మొత్తముమినహాయించబడుతుంది.  

ప్ర. ఒక వేళ భీమా చేయబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతడు/ఆమె కు లైఫ్ ఇన్సూరెన్సు ప్రయోజనాలు లభిస్తాయా?

జవాబు: ఒక వేళ పాలసీ దారుడు ఆత్మహత్య పాలసీ కొనుగోలు చేసిన 12 నెలల లోపు చేసుకున్నట్లైతే, నామినీ కు ఎటువంటి ఇన్సూరెన్సు ప్రయోజనాలు పొందబడదు.  అయితే, ఇన్సూరెన్సు కంపెనీ అప్పటి వరకూ చెల్లించ బడిన లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం ను సర్వీస్ చార్జీలు, నిర్వహణ చార్జీలు మరియు ప్రాసెసింగ్ చార్జీల ను మినహాయించుకుని చెల్లిస్తుంది.

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు తీసుకోవడానికి థంబ్ రూల్ ఏమిటి?

జవాబు: ఒక ప్రాధమిక థంబ్ రూల్ ఏమిటంటే, ఒకరి శాలరీ కంటే 10-20 రెట్లు లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ డెత్ బెనిఫిట్ ను కలిగి ఉండాలి. అయితే, ఇది కూడా అన్ని థంబ్ రూల్స్ లాగానే అన్ని పరిస్థితులలో ఖచ్చితం సరిపోదు. 

ప్ర. ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే  లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ క్యాష్ వేల్యూ ఏమవుతుంది?

జవాబు: ఒక వేళ పాలసీ దారుడు క్యాష్ వేల్యూ తీసుకొనే ముందే మరణిస్తే, లబ్ది దారునికి క్యాష్ వేల్యూ చెల్లించబడదు. చాల లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ల తో పాటూ లభించే క్యాష్ వేల్యూ అనేది ఒక పెట్టుబడి.

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లలో ఎన్ని రకాలు ఉంటాయి?

జవాబు: ఇండియా లో లభ్యమయేసాధారణ పాలసీ లు: టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు హోల్ లైఫ్ పాలసీ ఎండోమెంట్ ప్లాన్ లుయూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు (యు లిప్స్ ) మనీ బ్యాక్ పాలసీ చైల్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు, ఎన్నూయిటీ  ప్లాన్ లు.

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క క్యాష్ వేల్యూ ఏమిటి?

జవాబు: ఇదిఒక పాలసీ దారుడును తన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని రద్దు చేసుకుంటే ఇన్సూరెన్సు కంపెనీ పాలసీ దారునికి చెల్లించే మొత్తము.  క్యాష్ వేల్యూ అందుకునేందుకు పాలసీ దారుడు పాలసీ కల్పించే హక్కులను, భవిషత్తులో లభ్యమయ్యే ప్రయోజనాలను సరెండర్ చేయవలసి ఉంటుంది.  

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు పైడ్ అప్ వేల్యూ అంటే ఏమిటి?

జవాబు: ఒక వేళ పాలసీ దారుడు నిర్దిష్టమైన సమయం లో  ప్రీమియం చెల్లించడం లో  విఫలమైతే అతని/ఆమె పాలసీ లాప్స్ కాబడి హామీ మొత్తం తగ్గించబడి పైడ్-అప్ వేల్యూ గా మారుతుంది.

ప్ర. ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ క్యాష్ సరెండర్ వేల్యూ అంటే ఏమిటి ?

జవాబు: ఒక ఇన్సూరెన్సు పాలసీ ని మెచ్యూరిటీ సమయానికి ముందు గా పాలసీ దారుడు రద్దు చేసుకోదలిచినపుడు లేదా పాలసీ దారునికి అనుకోని సంఘటనలు ఎదురైనా, ఇన్సూరెన్సు సంస్థ పాలసీ దారునికి చెల్లించే మొత్తాన్నే క్యాష్ సరెండర్ వేల్యూ అంటారు.  

ప్ర. ఇన్సూరెన్సు లో టి పి ఏ అంటే ఏమిటి?

జవాబు: టి పి ఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. ఇది (ఐ ఆర్ డ్ ఏ) ఇన్సూరెన్సు రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా నుండి క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి లైసెన్స్ పొందిన ఏజెన్సీ/సంస్థ.  అంతే కాక, ఇది ఇన్సూరెన్సు సంస్థ తరుపున క్యాష్ లెస్ ఫెసిలిటీ ని కూడా అందజేస్తుంది.  

ప్ర. నాకు లైఫ్ ఇన్సూరెన్సు మరియు క్లిష్ట అనారోగ్య కవరేజీ రెండూ అవసరం అవుతుందా?

జవాబు: ఇది ఖచ్చితం గా మీ ఇన్సూరెన్సు అవసరాల పై ఆధాపడి ఉంటుంది.  అయితే, మెరుగైన ఇన్సూరెన్సు కవరేజీ మరియు క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీ తో కూడిన లైఫ్ ఇన్సూరెన్సు కలిగిఉంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.  

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు లో చేయాల్సిన మరియు చేయకూడని పనులు ఏమిటి?

జవాబు:  లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేసేముందు, ఈ క్రింది చేయాల్సిన మరియు చేయకూడని విషయాలను ను పాటించవలసి ఉంటుంది: 

చేయాల్సినవి- ప్లాన్ ను కొనుగోలు చేసేముంది, మీ యొక్క అవసరాల్ని విశ్లేషించుకోండి.  మీ ప్రణాళికల్ని అవసరాలకు తగ్గట్టు గా  క్లుప్తం గా నిర్ణయించుకోండి. ఎక్కువ ప్లాన్ లు అయితే ఆన్ లైన్ లో సరిపోల్చుకోండి. వీలైనంత ఎక్కువ ప్రశ్నలు వేయడం ద్వారా  మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అప్లికేషన్ ఫారం ను జాగ్రత్తగా నింపండి.  అప్లికేషన్ లో నింపే వివరాలు సరిగ్గా ఉండే లా చూసుకోండి.    మీరు అప్లికేషన్ ఫారం ను నింపేటపుడు పాలసీ డిక్లరేషన్ లో గల నియమాలు, సంతకం చేయబడిన ఒప్పంద పత్రము యొక్క కాపీ ని భద్రపరుచుకోండి.  

చేయకూడనివి- అప్లికేషన్ లో వివరాలు నింపకుండా ఖాళీలు వదలకండి.  మీకు బదులు గా వేరే ఒకరి చేత అప్లికేషన్ నింపించకండి.  అసత్య వివరాలను ఇన్సూరెన్సు కంపెనీకి అందజేసి తప్పుదారి పట్టించకండి.  ప్రీమియం చెల్లింపుని ఆలస్యం లేకుండా తప్పక చెల్లించండి.  

ప్ర. లాప్స్ కాబడిన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ను పునరుద్ధరించుకోవా ఎలా?

జవాబు: నిరంతరాయ పాలసీ ప్రయోజనాలను పొందడానికి, మీ పాలసీ ని ఎప్పటికప్పుడు రెన్యూ చేయించుకుంటూ ఉండాలి.  మీరు మీ పాలసీ ని పునరుద్ధరించుకోవడం మరచి పోయినట్లైతే, అది లాప్స్ అవుతుంది,  ఆలస్యానికి గల కారణం రుజువు చేసే పత్రాలను ప్రీమియం తో పాటు గా  అందజేయాల్సి ఉంటుంది.  లాప్స్ అయిన కాలపరిమితి కి ఇన్సూరెన్సు కంపెనీ పెనాల్టీ రుసుమువిధిస్తుంది.

ప్ర. లైఫ్ ఇన్సూరెన్సు మరియు జనరల్ ఇన్సూరెన్సు ల మధ్య  తేడాలు ఉంటాయా ?

జవాబు: అవును,  లైఫ్ ఇన్సూరెన్సు మరియు జనరల్ ఇన్సూరెన్సు ల మధ్య కొన్ని  తేడాలు  ఉన్నాయి.  పాలసీ దారుడు అకస్మాత్తు గా మరణిస్తే,  జనరల్ ఇన్సూరెన్సు లైఫ్ కవరేజీ అందజేయదు కానీ లైఫ్ ఇన్సూరెన్సు లైఫ్ కవరేజీ అందజేస్తుంది. జనరల్ ఇన్సరున్స్ కార్, ద్విచక్ర వాహనం, ఇల్లు, వంటి వాటికి కవరేజీ ని అందిస్తుంది.  లైఫ్ ఇన్సూరెన్సు వీటికి కవరేజీ ని అందించదు.    

ప్ర: కంటింజెంట్ బెనెఫిషరీ అంటే ఎవరు?

జవాబు: ప్రాధమిక లబ్ది దారుడు మరణించిన పాలసీ దారుని ప్రయోజనాలు తీసుకోకుండా మరణించి ఉన్నా, లేక నిరాకరించినా, అతని తరువాత లబ్దిదారుడి నే కంటింజెంట్ బెనెఫిషరీ అంటారు.  

ప్ర: ఒక వేళ పాలసీ దారుడు విదేశం లో మరణించి నట్లైతే, డెత్ బెనిఫిట్ పాలసీ నామినీ లకు చెల్లింపబడుతుందా?

జవాబు: అవును, పాలసీ ప్రయోజనాలు చెల్లించబడతాయి.  

ప్ర: ప్రాథమిక లైఫ్ ఇన్సూరెన్సు అంటే ఏమిటి?

జవాబు: ఇన్సూరెన్సు సంస్థ కు మరియు పాలసీ దారుని కి మద్య గల ఒప్పందమే బేసిక్ లైఫ్ ఇన్సూరెన్సు.  ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే, పాలసీ లబ్ది దారునికి ఒక పెద్ద-మొత్తం డెత్ బెనిఫిట్ రూపం లో అందించబడుతుంది.   

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ లో ఎంత మొత్తం గరిష్టం గా పొందవచ్చు?

జవాబు: ప్రతీ ఇన్సూరెన్సు కంపెనీ వివిధ రకాల ప్లాన్ లనూ హామీ మొత్తాలు కలిగి ఉంటుంది.  గరిష్ట కవరేజీ మొత్తం పాలసీ దారుని వయస్సు, ఆరోగ్య పరిస్థితి, వృత్తి మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.  

ప్ర: ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే, లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ మొత్తం ఎవరికీ చెందుతుంది?

జవాబు: దురదృష్టవశాతూ పాలసీ దారుడు మరణించి నట్లైతే, హామీ మొత్తం పాలసీ లో పేర్కొన్న నామినీ (పాలసీ దారునిచే నియమింపబడ్డ) కి అందచేయబడుతుంది.  

ప్ర: పాలసీ దారుడు మరణించిన ఎంత కాలానికి లైఫ్ ఇన్సూరెన్సు మొత్తం పొందవచ్చు?

జవాబు: డెత్ క్లెయిమ్ను క్లెయిమ్ చేసిన వ్యక్తి  అన్ని పత్రాలూ సరిగ్గా సమర్పించినట్లైతే, కనీసం  10 నుండీ  14 రోజులలో ప్రక్రియ పూర్తి అయి, హామీ మొత్తం చెల్లించబడుతుంది.  అయితే, సాధారణం గా ఇన్సూరెన్సు కంపెనీలు హామీ మొత్తం నామినీ చెల్లిండం కోసం 30-60 రోజుల కన్నా ఎక్కువ రోజులు తీసుకోరు. 

ప్ర: నేను లైఫ్ ఇన్సూరెన్సు నుండి డబ్బు విత్ డ్రా చేసుకో  గలనా?

జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు డెత్ బెనిఫిట్ కోసం ఉద్దేశింపబడినవి ఇవి క్యాష్ వేల్యూ కలిగి డబ్బు ఋణం గా తీసుకోవడానికి ఉపయోగపడతాయి.

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు కాల వ్యవధి లో నేను జీవిచి ఉంటే ఏమి జరుగుతుంది?

జవాబు: టర్మ్  పాలసీ వ్యవధి లో జీవించి ఉండటం వలన ఎటువండి ప్రయోజనం పొందబడదు.  హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ల వంటి కొన్ని పాలసీ లు పాలసీ వ్యవధి లో జీవించి  ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ని కలిగి ఉంటాయి. 

ప్ర: ఒక వేళ పాలసీ దారుడు లబ్ది దారుని పేర్కొనకపోతే ఏమి జరుగుతుంది?

జవాబు: ఒక వేళ పాలసీ దారుడు ఎవరినీ లబ్ది దారునిగా నామినెటే చేయని చొ, అతని/ఆమె చట్ట బద్ద వారసునికి డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది.

ప్ర: ఏ వయస్సు వద్ద ఇన్సూరెన్సు ప్లాన్ ముగుస్తుంది?

జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ గరిష్ట కవరేజీ వయస్సు ఒక్కో ఇన్సూరెన్సు ప్లాన్ కూ ఒక్కోరకంగా వేర్వేరు విధాలు గాఉంటుంది.

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు అంత్య క్రియల ఖర్చులను కవర్ చేస్తుందా?

జవాబు: అంత్య క్రియల కొరకు ప్రత్యేక మైనమొత్తం అందించబడదు.  దురదృష్టవ శాత్తూ పాలసీ దారుడు మరణిస్తే, నామినీ కు చెల్లించే పాలసీ సొమ్ము తో అంత్య క్రియలకు ఉపయోగించ వచ్చు.

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు ద్వారా హామీ మొత్తం ఎంత పొందవచ్చు?

జవాబు: ఇది పూర్తి గా మీరు ఎంచుకొనే పాలసీ పై ఆధారపడి ఉంటుంది. 

ప్ర: ఒక వేళ నేను నయంకానిఅనారోగ్యాన్ని కలిగి ఉండి లైఫ్ ఇన్సూరెన్సు తీసుకో గలనా?

జవాబు: ఒక వేళ మీరు నయంకానిఅనారోగ్యాన్ని కలిగి ఉంటే, సాధారణ లైఫ్ ఇన్సూరెన్సు పొందడానికి అర్హులు కారు.

ప్ర:  ఒకవేళ నేను లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించడం ఆపి వేస్తే ఏమి జరుగుతుంది?

జవాబు: ఒకవేళ మీరు లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించడం ఆపి వేస్తే, గ్రేస్ పీరియడ్ దాటిన తరువాత  మీ పాలసీ లాప్స్ కాబడు తుంది.  

ప్ర: నా లైఫ్ ఇన్సూరెన్సు నామినీ నాకంటే ముందు మరణిస్తే ఏమిజరుగుతుంది?

జవాబు: ఒక వేళ మీ పాలసీ నామినీ మీకంటే ముందు మరణిస్తే, మీరు క్రొత్త నామినీ ని జత చేయవచ్చు.  ఒక వేళ ఆలా చేయని పక్షం లో, మీ చట్టబద్ధ వారసులు స్వయం చాలికం గా నామినీ గా మారుతారు.

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు రిటైర్మెంట్ అవసరాలకు పనిచేస్తుందా?

జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు లలో పెన్షన్ ప్లాన్/రిటైర్మెంట్ ప్లాన్ లు రిటైర్మెంట్ తరువాత ఆర్ధిక భద్రత కోసం ఉపయోగపడతాయి.

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు కొరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందా?

జవాబు: అవును.  ఒక వేళ పాలసీ దారుడు ప్రీమియం చెల్లించక పొతే,  ఇన్సూరెన్సు కంపెనీ 30 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. 

ప్ర: లైఫ్ ఇన్సూరెన్సు బెనిఫిట్ ఒక మొత్తం లో చెల్లింపబడుతుందా?

జవాబు: ఇది పాలసీ దారుడు పాలసీ కొనుగోలు చేసే సమయం లో ఎంచుకున్న అంశం పై ఆధారపడి ఉంటుంది.  అదీకాక, కొన్ని ప్లాన్ లలో డెత్ బెనిఫిట్  మొత్తం ఎలా చెందాలనుకుంటున్నారో  నామినీ కు ఎంచుకొనే సదుపాయం వుంది.Search
Disclaimer: Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by an insurer.
Average Rating
(Based on 0 Reviews)
Newsletter
Sign up for newsletter
Sign up our newsletter and get email about term plans.
SUBSCRIBE
Close
Download the Policybazaar app
to manage all your insurance needs.
INSTALL