ఇండియా లో ఉత్తమమైన హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు

ప్రతీ సంవత్సరం, ఇండియా లో గల గొప్ప హెల్త్ ఇన్సూరెన్సు  కంపెనీలు గా ప్రకటించబడిన సంస్థల జాబితా  ఇ న్సూరెన్సు కొనుగోలు లో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇన్సూరెన్సు కంపెనీలను రేటింగ్ చేయడానికి వాటి పనితీరు, ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో మరియు వినియోగదారుల కు అందించే మొత్తం ప్రయోజనాలను వంటి అంశాలను పరిగణ లోనికి తీసుకోవాలి.  పెరుగుతున్న ప్రాణాంతక-వ్యాధులు మరియు పెరిగిపోతున్న వైద్య చికిత్సల ఖర్చులకు రక్షణ కోసం ఒక సరైన

Read More

  • Policybazaar is one of India's leading digital insurance platform
  • ~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
  • 6.7 Crores Registered consumer
  • 51 Insurance partners
  • 3.4 Crores Policies sold
Policybazaar exclusive benefits
  • 30 minutes claim support*(In 120+ cities)
  • Relationship manager For every customer
  • 24*7 claims assistance In 30 mins. guaranteed*
  • Instant policy issuance No medical tests*

*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply

*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply

Back
Find affordable plans with up to 25% Discount**
  • 1
  • 2
  • 3
  • 4

Who would you like to insure?

  • Previous step
    Continue
    By clicking on “Continue”, you agree to our Privacy Policy and Terms of use
    Previous step
    Continue

      Popular Cities

      Previous step
      Continue
      Previous step
      Continue

      Do you have an existing illness or medical history?

      This helps us find plans that cover your condition and avoid claim rejection

      Get updates on WhatsApp

      Previous step

      When did you recover from Covid-19?

      Some plans are available only after a certain time

      Previous step
      Advantages of
      entering a valid number
      valid-mobile-number
      You save time, money and effort,
      Our experts will help you choose the right plan in less than 20 minutes & save you upto 80% on your premium

      మీరు హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కొనాలనుకుంటే ఎంచుకోవడానికి చాలా రకాలు లభ్యమవుతున్నాయి.  అంతే కాక, కొన్న్ని ఇన్సూరెన్సు సంస్థలు ఉత్తమమైన ఒప్పందాలను వారి వినియోయోగదారులకు అందిస్తున్నాయి.  అయితే, మీకు సరిపడే, మీ అవసరాలకు  తగిన  హెల్త్ ప్లాన్ ను అందించే ఇన్సూరెన్సు సంస్థల ను ఎంచుకోవడం అంత  సులువుగా సాధ్య పడదు.  

      మేము ఇండియా లో గల ఉత్తమ మైన హెల్త్ ఇన్సూరెన్సు అందించే  సంస్థల జాబితాను తయారు చేసాము.  మీరు వాటి  ఇంకర్డ్  క్లెయిమ్ రేషియో ని, నెట్ వర్క్ హాస్పిటల్స్ మరియు ఇతర అంశాలను తనిఖీ చేసుకోవడం వల్ల ఒక ఉత్తమమైన హెల్త్ ఇన్సూరెన్సు సంస్థ ను ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇండియా లో పేరుపొందిన హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ ల జాబితా క్రింద ఇవ్వబడింది.  మీరు కవరేజి బెనిఫిట్స్ మరియు ముఖ్య అంశాలను సరిపోల్చుకొని ఎంచుకోండి.  

      ఇప్పుడు ఇండియా లో ఉన్న కొన్ని ఉత్తమ మైన హెల్త్ ఇన్సూరెన్సు సంస్థల గూర్చి చదువుకుందాం.

      హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ ల్త్లు

      నెట్వర్క్ హాస్పిటల్స్

      ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో

       

      ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు

      6000+

      59%

      ప్లాన్ ను చూడండి

      బజాజ్ ఆలియాన్స్ హెల్త్ ఇన్సూరెన్సు

      6500+

      85%

      ప్లాన్ ను చూడండి

      భారతి ఏ ఎక్స ఏ  హెల్త్ ఇన్సూరెన్సు

      4500+

      89%

      ప్లాన్ ను చూడండి

      కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంత కు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు)

      7400+

      55%

      ప్లాన్ ను చూడండి

      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు

      7240+

      35%

      ప్లాన్ ను చూడండి

      డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు

      5900+

      11%

      ప్లాన్ ను చూడండి

      ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు

      2578+

      115%

      ప్లాన్ ను చూడండి

      ఫ్యూచర్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      73%

      ప్లాన్ ను చూడండి

      ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      102%

      ప్లాన్ ను చూడండి

      కోటక్ మహీంద్రా హెల్త్ ఇన్సూరెన్సు

      4800+

      47%

      ప్లాన్ ను చూడండి

      లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      82%

      ప్లాన్ ను చూడండి

      మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు

      4500+

      54%

      ప్లాన్ ను చూడండి

      మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు

      6500+

      62%

      ప్లాన్ ను చూడండి

      నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు

      6000+

      107.64%

      ప్లాన్ ను చూడండి

      న్యూ ఇండియా అసురన్సు హెల్త్ ఇన్సూరెన్సు

      3000+

      103.74%

      ప్లాన్ ను చూడండి

      ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు

      4300+

      108.80%

      ప్లాన్ ను చూడండి

      రహేజా క్యూబ్ హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      33%

      ప్లాన్ ను చూడండి

      రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      61%

      ప్లాన్ ను చూడండి

      రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు

      7300+

      14%

      ప్లాన్ ను చూడండి

      స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు

      9900+

      63%

      ప్లాన్ ను చూడండి

      ఎస్ బి ఐ హెల్త్  ఇన్సూరెన్సు

      6000+

      52%

      ప్లాన్ ను చూడండి

      టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు

      3000+

      78%

      ప్లాన్ ను చూడండి

      యునైటెడ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు

      7000+

      110.95%

      ప్లాన్ ను చూడండి

      యూనివర్సల్ సోంపో హెల్త్ ఇన్సూరెన్సు

      5000+

      92%

      ప్లాన్ ను చూడండి


      విశేష
       సూచన:  *పాలసీ బజార్  ఒక్క ఇన్సూరెన్సు సంస్థను గానీ, ఇన్సూరెన్సు ఉత్పత్తిని గానీ ఆమోదింపచేయడం గానీ, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా సిఫార్సు గానీ చేయదు.  

      சுகாதார காப்பீட்டு நிறுவனம்

      ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు

      ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్  యొక్క అనుబంధ కంపెనీ.  దీనిని వినియోగదారులకు జనరల్ ఇన్సూరెన్సు సేవలను సులభం గా అందించడానికి ప్రారంభించారు.  ఈ కంపెనీ కి సౌత్-ఈస్ట్ ఆసియ, మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ ఆసియ వంటి భౌగోళిక ప్రదేశాలలో ఉన్న ఇన్సూరెన్సు సంస్థ ల తో మంచి పలుకుబడి కలిగి ఉంది.  ఆదిత్య  బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ నుండి మెడికల్  ఇన్సూరెన్సు కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఈఇన్సూరెన్సు కంపెనీ 5850 ఆసుపత్రులు 650 పట్టణాలలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందచేస్తుంది.
      • ఈఇన్సూరెన్సు సంస్థ 800 కు పైగా ఫిట్నెస్ సెంటర్స్, యోగ, జిమ్ మొదలైన వాటిని ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తుంది.
      • పాలసీదారులు 2300  మెడికల్ షాప్ లలో మందులు ఖరీదు చేయడానికి 250  పట్టణాలలో డిస్కౌంట్స్ కూడా అందజేస్తున్నారు.  
      • ప్లాన్లో ఎంచుకుంటే,  ఇన్-పేషెంట్ ఆయుష్ ట్రీట్మెంట్ కవరేజీ కూడా ఉంటుంది
      • ఈఇన్సూరెన్సు కంపెనీ ఫిట్ నెస్  అసెస్మెంట్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, డయాగ్నొస్టిక్  సెంటర్స్, హాస్పిటలైజేషన్ సెంటర్స్ వంటి వాటిని  వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తుంది.    

      బజాజ్ ఆలియాన్స్ హెల్త్ ఇన్సూరెన్సు

      బజాజ్ ఆలియాన్స్ జనరల్  ఇన్సూరెన్సు కంపెనీ ఒక నిర్దిష్టమైన వయస్సు గల వారు లబ్ది పొందే హెల్త్ ప్రొడక్ట్స్ అందిస్తుంది.  క్యాప్టివ్ టి పి ఏ సర్వీస్ ల తో పాటు అదనపు ప్రయోజనాలు అందజేసిన మొట్టమొదటి ఇన్సూరెన్సు సంస్థ బజాజ్ ఆలియాన్స్ జనరల్  ఇన్సూరెన్సు కంపెనీ.  ఆర్ధిక సంవత్సరం 2018 -19  కి గాను ఇంకర్డ్ రేషియో 85 % కలిగి ఉంది.  బజాజ్ ఆలియాన్స్ మిడిల్ ఇన్సురన్ ప్లాన్ యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • హెల్త్గార్డ్, సిల్వర్ హెల్త్ మరియు స్టార్ ప్యాకేజీ వంటి 3 రకాల హెల్త్ ఇన్సూరెన్సు ప్రొడక్ట్స్ నుండి ఎంచుకోవచ్చు.  
      • ఈఇన్సూరెన్సు సంస్థ వ్యక్తులకు, కుటుంబాలకే కాక సీనియర్ సిటిజన్స్ కూడా హెల్త్ కవరేజీ ని అందిస్తుంది.
      • అదేకాక, బజాజ్ అల్లీయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు స్ట్రోక్, ట్యూమర్లు, కాన్సర్ వంటి  ప్రాణాంతక అనారోగ్యాలకు  కూడా కొన్ని ప్రత్యేక హెల్త్ ప్లాన్ లు తయారు చేసింది.  
      • దానితోపాటు, పాలసీ దారుడు 6500 ఆసుపత్రులలో క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ సౌకర్యాన్ని పొందవచ్చు.
      • విదేశాలలోకవరేజీ ని పొందడానికి, ఈ  ఇన్సూరెన్సు సంస్థ గ్లోబల్ పర్సనల్ గార్డ్ హెల్త్ ప్లాన్ ని  అందిస్తుంది.
      • అంతేకాక, ఈఇన్సూరెన్సు సంస్థ క్యాష్ లెస్ క్లెయిమ్ లు 60 నిమషాల వ్యవధిలో సెటిల్ చేస్తుందని ప్రఖ్యాతి చెందింది.

      భారతి ఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు

      ఆగస్టు 2008 లో ప్రారంభించబడిన భారతి ఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు భారతి ఎంటర్ ప్రైజెస్ 74 %  వాటా మరియు ఏ ఎక్స్  ఏ 26 % వాటా భాగస్వామ్యం తో ప్రారంభించబడింది.  భారతి ఎంటర్ ప్రైజెస్ ఇండియా లో ఒక పేరుపొందిన వ్యాపార సంస్థ.  అయితే ఏ ఎక్స్  ఏ ఒక గ్లోబల్ ఫైనాన్సియల్ మరియు వెల్త్ మానేజ్మెంటు కంపెనీ.  భారతి ఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు  కొనుగోలు చేయడం వలన పొందే ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      భారతి ఏ ఎక్స్  ఏ  జనరల్ హెల్త్ ఇన్సూరెన్సు సంస్థ ఇండియా లో  59 కార్పొరేట్ ఆఫీస్ లను కలిగిఉంది. కార్య కలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరం లోనే ఐ ఎస్ ఓ 27001:2005, దాని తరువాత ఐ ఎస్ ఓ 9001:2008 ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ఇది ఒక అత్యంత విశ్వసనీయ మైన ఉద్భవిస్తున్న ఇన్సూరెన్సు కంపెనీల లలో ఒకటి. భారతి ఏ ఎక్స్  ఏ హెల్త్ ఇన్సూరెన్సు సంస్థ అంకితమైన సేవలతో, వినియోగదారుని తో చక్కటి సంబంధాన్ని నెలకొల్పుకుంటూ ఎటువండి సమస్యలు-లేని క్లెయిమ్ ప్రాసెస్ ను కలిగి ఉంటుందని పేరుపొందింది.  భారతి ఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు సంస్థ నుంచిహెల్త్ ప్లాన్ ను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • భారతిఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లలో చాలా మటుకు కో-పేమెంట్ యొక్క అవసరం ఉండదు.
      • కొన్నిరకాలైన ప్లాన్ లు అపరిమిత ఆసుపత్రి గదుల అద్దె సదుపాయం కలిగి ఉంటాయి.
      • ఇండియాలో  4500 కంటే ఎక్కువ నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ కూడా పొందే అవకాశం.
      • మీరుఎంచుకున్న ప్లాన్ ను అనుసరించి రూ. 1  కోటి సమగ్ర వైద్య కవరేజీ పొందేందుకు అనువుగా ప్లాన్ లను అందిస్తున్నారు.  
      • అన్నిభారతి ఏ ఎక్స్  ఏ  హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లు  జీవితాంతం పాలసీ ని పునరుద్ధరణ చేసుకొనేందుకు అవకాశం ఇస్తున్నాయి.
      • సెక్షన్80 డి ప్రకారం మీరు పన్ను-ఆదా చేసుకొనే ప్రయోజనం కూడా పొందవచ్చు.  

      కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంతకు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు)

      కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంతకు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు) తక్కువ సమయం లోనే ఎక్కువ గా ఇండియా లోని ఇన్సూరెన్సు మార్కెట్ లో ఒక ఆదర్శ వంతమైన ఇన్సూరెన్సు సంస్థ గా అభివృద్ధి చెందింది.  దీని ఇంకార్డ్ రేషియో 2018-19 ఆర్ధిక  సంవత్సరానికి  గాను 93 % గా ఉంది.  ఇది తరుచుగా ఫోర్టిస్ హాస్పిటల్స్ చేత పొగడబడుతూ, ప్రోత్సహింపబడుతూ ఉంటుంది.   కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంతకు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు)  అందించే కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ పేర్కొనబడ్డాయి:

      • అందరువ్యక్తుల అవసరకు తగిన ఒక ప్లాన్ లు ఇక్కడ లభ్య మవుతున్నాయి అవి - వ్యక్తి గత & ఫామిలీ ఫ్లోటర్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఫర్ డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్, సీనియర్ సిటిజెన్ ప్లాన్ మరియు టాప్-అప్ ప్లాన్ లు.
      • ఈఇన్సూరెన్సు సంస్థ క్యాష్ లెస్ క్లెయిమ్ కేసులను లను సాధారణం గా  2 - గంటల వ్యవధిలో ఆమోదిస్తూ ఉంటుంది.   
      • చాలరకాల ప్లాన్ లు భీమా చేయబడిన వ్యక్తులకు సంవత్సర-ఆరోగ్య పరీక్షల ప్రయోజనాన్ని అందజేస్తుంటాయి.
      • ముందుగా-కలిగిఉన్న ఆరోగ్య సమస్యలు మరియు సంవత్సర కార్డియాక్ చెక్-అప్ ల కోసం కేర్ హెల్త్ హార్ట్ ప్లాన్ కూడా లభ్యమవుతున్నాయి.  

      చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు

      'ట్రస్ట్, టెక్నాలజీ మరియు ట్రాస్పెరెన్సీ'  అనే టి3 నినాదం తో   చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు 2001  సంవత్సరం లో ప్రారంభ మయింది.  చాల తక్కువ సమయం లోనే, 109 బ్రాంచీల తో దేశమంతటికీ తన వ్యాపారాన్ని విస్తరింప చేసింది. 2011 సంవత్సరం లో అది చేపట్టిన వినూత్న కార్వక్రమాల  వలన ఆసియన్ ఇన్సూరెన్సు కాంగ్రెస్ నుండి  ఫైనాన్సియల్ ఇన్సైట్స్ ఇన్నోవేషన్ అవార్డు పొందింది. చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు ఆకర్షణీయమైన ప్రయోజనాలు, అంశాలు కలిగి హెల్త్ కవరేజి అందించే పాలసీ లను అందరికీ అందుబాటు ధరలలో అందిస్తుంది.  ఈ కంపెనీ ఎక్కువ కవరేజీ ని అందించే  యూసర్-ఫ్రెండ్లీ ప్లాన్ లను అందిస్తుంది.  ఈ క్రింది కారణాల వలన  చోళమండలం  మెడికల్ ఇన్సూరెన్సు ప్లాన్ లు ఖచ్చితం గా ఒక సురక్షితమైన ఎంపిక అని భావించవచ్చు:

      • ఇండియాలో దేశ వ్యాప్తం గా చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ 136 బ్రాంచీలను కలిగి ఉంది
      • క్లిష్టఅనారోగ్యం మరియు ప్రమాదాల వలన కవరేజీ కూడా లభ్యం అవుతాయి ( ఎంపిక చేసిన హెల్త్ ప్లాన్లలో )
      • వైద్యఅత్యవసర పరిస్థితుల నుండి మీకు మరియు మీ ప్రియమైన వ్యక్తులను ఆర్ధిక భారం నుండి  కాపాడుకోవడానికి, జీవిత కాల పునరీకరణ సౌకర్యాన్ని అందిస్తుంది.
      • దాదాపుఅన్ని మెడికల్ ఇన్సూరెన్సు ప్లాన్ లో ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు 30 రోజులు మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు 60 రోజులు కల్పిస్తున్నాయి.
      • కొన్నిహెల్త్ ప్లాన్ లు  సంవత్సర ఆరోగ్య చెక్-అప్ ల సౌకర్యం అందజేస్తున్నాయి
      • ఈఇన్సూరెన్సు సంస్థ విస్తృతమైన ఫామిలీ హెల్త్ ప్లాన్ లు, వ్యక్తి గత హెల్త్ ప్లాన్ లు, టాప్-అప్ ప్లాన్ లు మరియు క్రిటికల్ ఇల్ నెస్  ఇన్సూరెన్సు ప్లాన్ లుఅందిస్తుంది.  

      డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు

      డిజిట్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ సి ఈ ఓ శ్రీ కామేష్ గోయల్ ద్వారా నడుపబడుతుంది.  గత సంవత్సరం లోనే, ఈ ఇన్సూరెన్సు సంస్థ 10 లక్షల కన్నా ఎక్కువ  పాలసీ లను జారీ చేసింది.  అదే కాకుండా ఈ కంపెనీ 87 % క్లెయిమ్ లను ఒకే ఒక్క రోజులో సెటిల్ చేసిన రికార్డు ను కూడా సొంతం చేసుకుంది.  ఈ కంపెనీ 2019 సంవత్సరానికి గాను ఆసియాస్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ అఫ్ ది ఇయర్ అవార్డు తో అభినందించబడింది.  ఇప్పుడు ఈ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్సు కొనుగోలు కు ఎలా అనుకూలం గా ఉంటుందో చూద్దాం:

      • హామీమొత్తాన్ని ఎంచుకునేందుకు కనిష్టం గా రూ. 2 లక్షల నుండి గరిష్టం గా రూ. 25 లక్షల వరకూ అనువుగా ఉన్నాయి.
      • పాన్ఇండియా లో 5900 ఆసుపత్రులలో పాలసీ దారుడు క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
      • డిజిటల్హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు ఆన్లైన్ లో మరియు డిజిటల్-ఫ్రెండ్లీ మరియు ఎక్కువ కాగితాల పని లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు.  
      • అంతేకాక, హాస్పిటల్రూమ్ రెంట్ ల విషయం లో సబ్-లిమిట్ లు లేవు.  

      ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు

      ఇండియా లో ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు ఒక పేరుపొందిన ఇన్సూరెన్సు సంస్థ మరియు ఈ సంస్థ మిల్లియన్ ల కొద్దే వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన ఈడెల్వెయిస్ గ్రూప్ కు చెందినది.  ఈ ఇన్సూరెన్సు సంస్థ ఎస్ ఏ పి ప్రాసెస్ ఇన్నోవేషన్ అవార్డు వంటి  చాల రకాలైన అవార్డు లతో అభినందించబడింది.  ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు కొనుగోలు చేయడం వలన పాలసీ దారునికి లభించే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం:

      • ఈడెల్వెయిస్హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లు ఇన్-పేషెంట్, ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు, క్రిటికల్ ఇల్ నెస్, ఆక్సిడెంట్ ల, జబ్బులు, మొదలైన వాటిని కవర్ చేసేందుకు తయారు చేయబడింది.  
      • ఈఇన్సూరెన్సు సంస్థ పాలసీ దారునికి జీరో డిపాజిట్ మరియు గారంటీడ్ బెడ్ సౌకర్యాన్ని అందజేస్తుంది.
      • చాలాఆసుపత్రులలో ప్రసూతి, గాల్ బ్లాడర్ రిమూవల్, కేటరాక్ట్  వంటి 14 వైద్య ప్రక్రియలకు జీరో డిశ్చార్జ్ టైం సౌకర్యం కూడా లభింపచేస్తుంది.

      ఫ్యూచర్ జెనెరలి హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యూచర్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ మరియు జెనెరలి గ్రూప్ యొక్క ఉమ్మడి భాగస్వామ్య సంస్థే ఈ ఫ్యూచర్ జెనెరలి టోటల్ ఇన్సూరెన్సు సోలుషన్స్.  మెడికల్ ఇన్సూరెన్సు తీసుకొనే వివిధ రకాలైన వ్యక్తుల అవసరాలకు తగిన విధం గా ఫ్యూచర్ జెనెరలి హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు తయారు చేయబడ్డాయి.   ఫ్యూచర్ జెనెరలి హెల్త్  ప్లాన్ కొనుగోలు చేయడానికి గల ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఫ్యూచర్విజెనెరలి మెడికల్ ఇన్సూరెన్సు పాలసీ ల వివిధ రకాలు గా వినియోదారుల అవసరాలను తీర్చే విధం గా వ్యక్తి గత ఆక్సిడెంట్ ప్లాన్, క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ, హాస్పిటల్ క్యాష్, ఆరోగ్య సంజీవని పాలసీ, మస్క్విటో ఇన్సూరెన్స్, మెడిక్లైయిం ఇన్సూరెన్సు, టాప్-అప్ ప్లాన్స్, సీనియర్ సిటిజెన్ ఇన్సూరెన్సు మొదలైనవి  రూపొందించింది.   
      • ఈఇన్సూరెన్సు సంస్థ భారత దేశం మొత్తం లో 5100 కన్నా ఎక్కువ ఆసుపత్రులలో క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ సదుపాయాన్ని అందజేస్తుంది.  
      • దాదాపుఅన్ని హెల్త్ ప్లాన్ లు జీవిత కాల పునరుద్ధరణ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.
      • పాలసీదారుల సౌలభ్యం కోసం ఈ భీమా సంస్థ క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ అనుమతి ని దాదాపు 90 నిముషాలలో అందజేస్తుంది.
      • దానికితోడు, భీమా చేయబడిన వ్యక్తులు వారి పాలసీ వివరాలు సులువుగా ఫ్యూచర్ జెనెరలి మొబైల్ అప్ లో  చూసుకో గలుగుతారు.

      ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు

      ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్సు ఇండియా లో ఉన్న ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఓపెరేటివ్  (ఇఫ్కో), నిచిదో ఫైర్ గ్రూప్ మరియు ప్రఖ్యాత జాపనీస్ ఇన్సూరెన్సు కంపెనీ అయిన - టోకియో మెరైన్ ల భాగస్వామ్యం లో డిసెంబర్ 4 ,  2000 సంవత్సరం లో ప్రారంభించబడింది.  

      ఈ కంపెనీ గొప్ప పనితనానికి  నిదర్శనం గా ఆర్ధిక సంవత్సరం 2018-2019 ఇంకార్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 102 % కలిగి ఉంది.   ఒక సంవత్సరం లో  మొత్తం సేకరించిన ప్రీమియం ల మొత్తానికి,  సెటిల్ చేసిన మొత్తం క్లెయిమ్ ల రేషియో నే    ఇంకార్డ్ రేషియో అంటారు.  ఇఫ్కో టోకియో నుండి హెల్త్ ఇన్సూరెన్సు కొనుగోలు చేయడానికి గల కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఇఫ్కోటోకియో హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు  మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏదయినా అకస్మాత్తుగా కలిగిన అనారోగ్యం, రోగాల లేదా గాయాలు, హాస్పిటలైజేషన్ అవసర మవడం, వైద్య లేదా శస్త్ర చిటికిత్స, అవయవ దానం వంటి హెల్త్ కేర్ ట్రీట్మెంట్ లకు ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది.  
      • కీమోథెరపీ, పేస్మేకర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, రేడియోథెరపీ, డయాలిసిస్, శస్త్ర పరికరాలు,రక్తం, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్,  మందులు, డ్రగ్స్ వంటి ఖర్చుల ను పొందడానికి ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు సహాయపడతాయి.
      • ఈహెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ గ్రామీణ ప్రజల కు కూడా ఉపయోగపడుతుంది.
      • ఈకంపెనీకి సమస్యలు-లేని క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని వినియోగదారునికి  త్వరగా మరియు సమర్ధ వంతం గా నిర్వహించి అందించే సాంకేతిక-పరిజ్ఞానం కలిగి ఉంది.  
      • కొంచెంఅదనపు ప్రీమియం ను చెల్లించడం ద్వారా క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీని ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కు జత చేసుకొనవచ్చును.

      కోటక్ మహీంద్రా హెల్త్ ఇన్సూరెన్సు

      కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ, కోటక్ మహేంద్ర బ్యాంకు కు జనరల్ ఇన్సూరెన్సు మరియు హెల్త్ ఇన్సూరెన్సు విభాలకోసం ఏర్పడిన అనుబంధ సంస్థ.  ఈ భీమా సంస్థ పాన్ ఇండియా లో 13 శాఖలను కలిగి ఉంది.  వినియోగదారులు తమకు నచ్చిన విధం గా మార్చుకోవడానికి  వీలుగా ఉన్న మెడికల్ పాలసీ లు ఈ క్రింది అంశాలను, ప్రయోజనాలను కలిగి ఉన్నాయి:

      • కోటక్హెల్త్ ప్లాన్ లను ప్రాధమిక అత్యవసర హాస్పిటలైజేషన్ మరియు ట్యూమర్, ఆఖరు-స్టేజి లో ఉన్న లివర్ అనారోగ్యం, కోమా, మాట కోల్పోవడం మొదలైన   ప్రాణాంతక అనారోగ్యం ల కోసం ఎంచుకోవచ్చు.
      • ఈప్లాన్ హీట్ ఎటాక్, కాన్సర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు పర్సనల్ ఆక్సిడెంట్ లను కూడా కవర్ చేస్తుంది
      • కోటక్సెక్యూర్ షీల్డ్ ప్లాన్ ఉద్యోగం కోల్పోయినా ఇన్సూరెన్సు చేయబడిన సభ్యులకు ప్రయోజనాలతో పాటు పిల్లల చదువుల కోసం కూడా కవర్ చేస్తుంది.
      • ఈపాలసీ లలో అందించే ప్రత్యేక ప్రయోజనాలలో - ఎయిర్ అంబులెన్సు కవర్, హోమ్ నర్సింగ్, కంపాషనేట్ విసిట్, మెటర్నిటీ కవర్, న్యూ-బోర్న్ బేబీ కవర్ వంటికి కలవు.     

      లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు

      లిబర్టీ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ 2013  సంవత్సరం లో ప్రారంభం అయింది.  ఇది లిబర్టీ మ్యూచువల్ ఇన్సూరెన్సు గ్రూప్, డి పి జిందాల్ గ్రూప్, లిబర్టీ సిటీ హోల్డింగ్స్ పి టి ఈ లిమిటెడ్ మరియు ఇనాం సెక్యూరిటీస్ ల భాగస్వామ్య సంస్థ.  ఈ ఇన్సూరెన్సు సంస్థ ఇండియా లోని 23  కన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఉంది.  క్రింద ఇవ్వబడ్డ  లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క ప్రయోజనాలు కొన్నింటిని తెలుసుకుందాం:

      • ఈఇన్సూరెన్సు సంస్థ యూనిక్  లాయల్టీ పెర్క్ బెనిఫిట్స్ మరియు ప్రతీ క్లెయిమ్-ఫ్రీ సంవత్సరానికి, హామీ మొత్తం 10% నుండీ  100%  పెరుగుదల ప్రయోజనాన్ని కల్పిస్తుంది
      • పాలసీదారుడు పాలసీ కొనుగోలు చేసిన 15 రోజులు తరువాత ఫ్రీ- లుక్ పీరియడ్ సదుపాయం ద్వారా పాలసీ ని రద్దు చేసుకొనే అవకాశం కూడా ఉంది.  
      • ఈహెల్త్  ప్లాన్ లు విస్తృతమైన హెల్త్ ప్రొటెక్షన్ కవర్ మరియు ఎక్కువ హామీ మొత్తం కలిగే విధం గా తయారుచేయబడ్డాయి.
      • దీనిలోఒక వినూత్నమైన అంశం ఏమిటంటే, ఫస్ట్ మెడికల్ ఒపీనియన్, లైవ్ హెల్త్ టాక్ మొదలైన ప్రివెంటివ్ కేర్ ఫెసిలిటీస్ కూడా కవర్ చేయబడ్డాయి.

      మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు

      మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు ఇండియా లో 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ఇంకార్డ్ రేషియో 54%  కలిగి ఉంది.  ఈ సంస్థ అన్ని వయో వర్గాల వారికీ సరిపడే హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లను అందిస్తుంది.  మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు అందించే కవరేజీ ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • మాక్స్భూపా హెల్త్ ప్లాన్ లు వ్యక్తులకు మరియు వారి కుటుంబ సభ్యుల హెల్త్ కవరేజీ అవసరాలకు తగిన విధం గా తయారుచేయబడ్డాయి.
      • కొన్నిప్లాన్ లు ఇంటెర్నేషన్ కవరేజి లో భాగం గా 9 ముఖ్యమైన క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీని 190 దేశాలలో అందిస్తుంది.
      • ఈఇన్సూరెన్సు సంస్థ క్యాష్ లెస్ క్లెయిమ్ అనుమతి 30 - నిముషాల వ్యవధి లోనే అందిస్తుంది.
      • అదేకాక, మాక్స్ భూపా క్రిటికేర్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లో భాగం గా లైఫ్-త్రెటెనింగ్ ఇల్ నెస్ కవర్ కూడా అందజేస్తుంది.

      మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు

      2014 లో ప్రారంభమయిన మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు, ఇండియన్ ఇన్సూరెన్సు మార్కెట్ లో  మిగతా ఇన్సూరెన్సు కంపెనీలకన్నా క్రొత్తది మరియు దాని ఇంకార్డ్ రేషియో 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 62% కలిగి ఉంది.   మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు అందిస్తున్న ఇన్సూరెన్సు ప్లాన్ ల ముఖ్యమైన అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • టాప్-అప్హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్ నెస్ ప్లాన్ లు, ఆక్సిడెంటల్ కేర్, లైఫ్ స్టైల్ ప్లాన్ మొదలైన కొన్ని హెల్త్ ప్లాన్ ల నుండి ఎంచుకోవడానికి అవకాశం ఇస్తుంది.
      • ఇదిఅందించే చాలా హెల్త్ ప్లాన్ లు వినియోగదాని అవసరాలు మరియు ప్రాధాన్యతను బట్టీ మార్పులు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
      • ఈఇన్సూరెన్సు సంస్థ 30 ముఖ్యమైన అనారోగ్యాలను కవర్ చేసే ఒక సమగ్ర క్రిటికల్ ఇల్ నెస్ ప్లాన్ లను అందిస్తుంది.
      • దాదాపుగా  అందించే ప్రతీ ప్లాన్ కూ ఈ ఇన్సూరెన్సు సంస్థ 100 % హామీ మొత్తం రెస్టోరేషన్ కు అవకాశం ఇస్తుంది.
      • అదీకాక, భీమాచేయబడిన వ్యక్తి తమ హెల్త్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను ఆన్ లైన్ లో సులువుగా ట్రాక్ చేయవచ్చు.  

      నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు

      ఒక గవర్నమెంట్ సంస్థ  అయిన నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు ఒక శతాబ్ద కాలం గా హెల్త్ ఇన్సూరెన్సు కవరేజీ లో వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉంది.  ఇది 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 107.64%  ఇంకార్డ్ రేషియో ను కలిగి ఉంది.   నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీ  అందించే హెల్త్ ప్లాన్ లను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు  క్రింద ఇవ్వబడ్డాయి:

      • నేషనల్హెల్త్ ఇన్సూరెన్సు 6000 కన్నా ఎక్కువ ఆసుపత్రులలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను అందిస్తుంది.
      • చాలహెల్త్ ప్లాన్ లు హాస్పిటలైజేషన్ కు ముందు 30  రోజుల ఖర్చులు మరియు 60  రోజులు హాస్పిటలైజేషన్ తరువాత ఖర్చులు కవర్ చేస్తాయి.
      • కొన్నిహెల్త్ ప్లాన్ లు 4 క్లెయిమ్-ఫ్రీ సంవత్సరాల తరువాత హామీ మొత్తం లో  1 % ఉచిత ఆరోగ్య పరీక్షల ను అందిస్తాయి.  
      • ఈకంపెనీ అందించే విస్తృత మైన హెల్త్ ప్లాన్ లో ఒకటి అయిన, పరివార్ మెడిక్లైయిం పాలసీ 6 గురు కుటుంబ సభ్యుల ను ఒకే ఒక ప్లాన్ పరిధిలో కవరేజీ ని అందిస్తుంది.

      నేషనల్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ అందించే వరిష్ఠా మెడిక్లైయిం సీనియర్ సిటిజెన్ ల కు కవరేజీ ని అందిస్తుంది.

      న్యూ ఇండియా అస్యూరన్స్  హెల్త్ ఇన్సూరెన్సు

      ప్రభుత్వ- సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరన్స్  హెల్త్ ఇన్సూరెన్సు ఇండియా లో 1919 ఆ సంవత్సరం లో కార్య కలాపాలను ప్రారంభించింది.  ఈ కంపెనీ  మెడిక్లైయిం పాలసీ ల కు బాగా ప్రసిద్ధి పొంది.  ఈ సంస్థ అందించే హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ  లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రధాన నగరాల్లో వివిధ రకాల రేటింగ్స్ ను అందచేస్తుంది. ఇది 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 103.74% ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో ని కలిగి ఉంది.  న్యూ ఇండియా  అస్యూరన్స్  కంపెనీ ముఖ్య అంశాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:

      • న్యూఇండియా అస్యూరన్స్  అందించే సమగ్ర హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు పూర్తి కుటుంబానికి, వ్యక్తులకు, భాగస్వామికి, మరియు ఆధారపడి ఉన్న ఇద్దరు పిల్లలకు కూడా ఆరోగ్య భద్రత ను కలుగ చేస్తున్నాయి.
      • ఈభీమా సంస్థ న్యూ ఇండియా కాన్సర్ గార్డ్ పాలసీ అనీ కాన్సర్ కవరేజీ ప్లాన్ ను అందిస్తుంది.
      • ప్రపంచకవరేజీ కోసం, ఈ కంపెనీ న్యూ ఇండియా గ్లోబల్ మెడిక్లైయిం పాలసీ ని కూడా అందిస్తుంది.

      ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు

      ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు కూడా ఇండియా లో  ఒక ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ గా ఎన్నో రకాల  హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది.  ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు లోని ఆకట్టుకొనే అంశం ఏమిటంటే, 60 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు ప్రీ-పాలసీ మెడికల్ టెస్ట్ అవసరం లేదు.  అదే మిగిలిన ఇన్సూరెన్సు సంస్థలు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లకు 45 సంవత్సరాల వయస్సు లోపు వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు తప్పని సరి చేస్తున్నాయి.  ఓరియంటల్  హెల్త్ ప్లన్స్ కొనుచేసేందుకు కొన్ని అవసరమైన ప్రయోజనాలను క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఈఇన్సూరెన్సు సంస్థ ఇంకార్డ్ రేషియో 2018-19 ఆర్ధిక సంవత్సరానికి80% కలిగిఉంది.
      • ఓరియంటల్హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ కుటుంబానికి మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్లు కవరేజీ కి రెండు ఫ్లోటర్ ప్లాన్లు అందిస్తుంది.
      • ఇందులో లభ్యమయ్యే చాలా హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు వినియోగదారుని అవసరాలకు తగ్గట్టుగా మార్పు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
      • అంతేకాక, ఈఇన్సూరెన్సు సంస్థ 4300 లకు పైగా నెట్ వర్క్ హాస్పిటల్ తో అనుబంధం  కలిగి ఉండి,  పాలసీ దారుడు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందడానికి సహాయపడుతుంది.

      రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు 

      రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు ఇండియా లో ప్రసిద్ధి చెందిన ఇన్సూరెన్సు సంస్థ లలో ఒకటి.  ఈ ఇన్సూరెన్సు సంస్థ వినియోగదారులకు నిరంతరాయం గా సేవలను అందించేందుకు ఇండియా అంతటా 139  కార్యాలయాలను కలిగి వుంది.  ఈ ఇన్సూరెన్సు సంస్థ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు మరియు ఎస్ ఎం ఈ  లు వంటి అత్యధిక వినియోగదారులను కలిగి వుంది. ఆన్లైన్ లో కొనుగోలు మరియు రెన్యువల్ సౌకర్యాలు ఉండటం వలన, మరింత సులువుగా అందుబాటులో ఉంటుంది.  

      • ఈఇన్సూరెన్సు సంస్థ ప్రీమియం లను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పే టి ఎం వంటి అనువైన చెల్లింపు విధానాలకు కలిగి ఉండటం వలన మీ కు అనుకూలం గా చెల్లింపులు చేయవచ్చు.
      • రిలయన్స్హెల్త్ ఇన్సూరెన్సు సంస్థ ప్రాధమిక హామీ మొత్తం పూర్తిగా క్షీణించినపుడు రెస్టోరేషన్ ప్రయోజనాన్ని అందిస్తుంది.
      • ఇంకా, 4 సంవత్సరాలవెయిటింగ్ పీరియడ్ తరువాత ముందుగా-కలిగి ఉన్న వ్యాధులకు కవరేజీ ను పొందవచ్చు.
      • రిలయన్స్చాహెల్త్ ఇన్సూరెన్సు అందించే  చాలా ప్లాన్ లలో  4 క్లెయిమ్-ఫ్రీ సంవత్సరాల తరువాత ఆరోగ్య పరీక్షల ఖర్చు రీయింబర్సు చేయబడుతుంది.

      రహేజా క్యూ బి ఈ  హెల్త్ ఇన్సూరెన్సు

      రాజన్ రహేజా గ్రూప్ మరియు ఆస్ట్రేలియా లో ప్రపంచ ఇన్సూరెన్సు కంపెనీల లో  అతిపెద్ద రెండవ కంపెనీ అయిన  క్యూ బి ఈ సంస్థల భాగస్వామ్యం లో ఇది రూపొందింది.  దాని పార్టనర్ లకూ మరియు వినియోగదారులకు నిరంతరాయం గా ఇన్సూరెన్సు సర్వీస్ లను అందించడానికి ఈ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ స్థాపించబడింది.  రహేజా క్యూ బి ఈ  హెల్త్ ఇన్సూరెన్సు అందించే హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల ముఖ్యమైన అంశాలు, ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఈఇన్సూరెన్సు కంపెనీ అందించే వివిధ హెల్త్ పాలసీ లలో బేసిక్ హెల్త్ ప్లాన్, కంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్,ఆ-లా-కార్తె  ప్లాన్ లు ఇంకా ఆడ్-ఆన్ లు జత చేసుకోవడానికి సూపర్ సావేరి మెడికల్ లు కలవు.
      • దీనిలోవినూత్న మైన అంశం ఏమిటంటే, నెట్ వర్క్ హాస్పిటల్ లో మీరు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ వినియోగించుకున్నట్లైతే, సమ్మర్ షార్ట్ లో 10 % పెంపు పొందగలుగుతారు.
      • రహేజాక్యూ బి ఈ  అందించే అన్ని హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లో నూ నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం మరియు డొమిసిల్లిరి హాస్పిటలైజేషన్ కవర్ ఉంటుంది.  
      • అన్నిహెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లూ రూ. 1,00,000  నుండీ, రూ. 50,00,000 హామీ మొత్తం పరిమితిని కలిగి ఉంటాయి.

      రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్సు

      ఇంకను మునుపు రాయల్ సుందరం ఆలియాన్స్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్ తన సమర్ధవంతమైన వినియోగదారుల నిర్వహణ సేవల కు చాలా అవార్డు లతో సత్కరించబడింది.  ఇది అందించే సమగ్రమైన ఇన్సూరెన్సు ప్లాన్ లు సరికొత్త అంశాలు మరియు పరిష్కారాలను అందిస్తాయి.

      • రాయల్సుందరం హెల్త్ ప్లాన్ లు 11  ముఖ్య క్రిటికల్ ఇల్ నెస్ లకు ప్రపంచ వ్యాప్త అత్యవసర హాస్పిటలైజేషన్ ను కవర్ చేయడానికి రూపొందించ బడ్డాయి.
      • రాయల్సుందరం లైఫ్ లైన్ సుప్రీమ్ ప్లాన్ కూడా 11  ముఖ్య క్రిటికల్ ఇల్ నెస్ లకు సెకండ్ ఒపీనియన్ కవరేజీ ని అందిస్తుంది.
      • పాలసీదారులు 10-50% మధ్య నో-క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) కూడా పొందవచ్చు.  ఇది ఒక వేళ ఏదయినా క్లెయిమ్ ని ఆ సంవత్సరం లో  నమోదు చేసి నప్పటికీ తగ్గింపు జరగదు.
      • ఒకవేళ  వ్యాధి యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కవరేజీ మొత్తం తరిగినప్పటికీ, 100 % హామీ మొత్తం రెస్టోరేషన్ మరియు నో-క్లెయిమ్ డిస్కౌంట్ కూడా లభ్యం అవుతుంది.
      • ఈప్లాన్ లలో చాలా వరకూ ప్లాన్ లు డొమిసిల్లరీ హాస్పిటలైజేషన్ మరియు మెటర్నిటీ కవరేజీని కూడా అందజేస్తున్నాయి.

      స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు

      స్టార్ హెల్త్ & అల్లైడ్ ఇన్సూరెన్సు కంపనీ కొన్ని సమగ్రమైన మెడికల్ ప్లాన్ లు మీకు, మీ కుటుంబానికి అందిస్తున్నాయి.  ఈ ఇన్సూరెన్సు కంపెనీ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 63% ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో ని కలిగి వుంది.  స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అందించే కొన్ని ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      • ఈకంపెనీ క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ సదుపాయం ను ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా అందజేస్తుంది.  
      • దీనితోపాటు, స్టార్ హెల్త్ & అల్లైడ్ ఇన్సూరెన్సు కంపెనీ డయాబెటిస్ మరియు హెచ్ ఐ వి+ పేషెంట్స్ లకు కూడా ఆకర్షణీయమైన చాలా ప్లాన్ లను అందిస్తున్నాయి.
      • క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ కు అనుకూలం గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు 9800 కు పైగా హాస్పిటల్ లను పాలసీ దారులకు అందిస్తుంది.
      • స్టార్హెల్త్ ప్లాన్ లలో ఒక మంచి విషయం ఏమిటంటే, ఇవి జీవితకాల పునరుద్దీకరణకు     అనువుగా ఉంటాయి.
      • ఈభీమా సంస్థ పాలసీ దారుని అవసరాల మేరకు పాలసీ ని మార్చుకొనేందు కు వీలుగా   టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను కూడా అందిస్తున్నాయి.

      ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు

      ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి అనేది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్ బి ఐ ) మరియు ఇన్సూరెన్సు ఆస్ట్రేలియా గ్రూప్ ల సంయుక్త భాగస్వామ్య సంస్థ.  ఇందులో  ఎస్ బి ఐ  74%  వాటాను, ఇన్సూరెన్సు ఆస్ట్రేలియా గ్రూప్  26% వాటాను కలిగి ఉన్నాయి.  ఇది దాదాపు 14,000 అధికారిక శాఖలలో ప్రపంచ వ్యాప్తం గా కార్య కలాపాలు నిర్వహిస్తుంది.  ఎస్ బి ఐ హెల్త్ ఇన్స్యూరెన్సు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో 52%  కలిగి  ఉండడమే  కాక 198876 పాలసీ లను జారీ చేసింది.   ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల ప్రయోజనాలు క్రింద పేర్కొనబడ్డాయి:

      • ఎంచుకోవడానికిఅనువుగా పాలసీ హామీ మొత్తాలు రూ. 50,000 మరియు రూ.  5 లక్షల పరిధి ని కలిగి ఉన్నాయి.
      • ఒకధరఖాస్తుదారుడు క్లీన్ మెడికల్ రికార్డు కలిగి ఉన్నట్లైతే, 45  సంవత్సారాల వయసు వరకూ ఆరోగ్య పరీక్షల అవసరం లేదు.
      • చాలవరకూ ఈ హెల్త్ ఇన్సూరెన్సు  ప్లాన్ లు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చిలను మరియు నర్సింగ్ ఖర్చులను కవర్ చేస్తున్నాయి.
      • అంతేకాక, ఎవరైనా చాలా సులువుగా ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను ఆన్ లైన్ లో పునరుద్ధరించుకోవచ్చు.  

      టాటా ఏ  ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు

      టాటా ఏ ఐ జి  జి ఐ కంపెనీ, అమెరికన్ ఇంటర్నేషనల్ మరియు టాటా గ్రూప్ యొక్క భాగస్వామ్యం లో రూపొందింది.  ఈ ఇన్సూరెన్సు సంస్థ 2001  సంవత్సరం లో తన కార్య కలాపాలను ప్రారంభించింది.  వెంటనే, చాల త్వరగా ఇన్సూరెన్సు ఇండస్ట్రీ లో  ప్రఖ్యాతి ని గడించింది.  భారత దేశం మొత్తం లో ఎక్కువ మొత్తం లో ఆసుపత్రుల తో అనుబంధం కలిగి ఉండి,  క్యాష్ లెస్ ట్రీట్మెంట్  4000 లకు పైగా హాస్పిటల్స్ లో అందిస్తుంది.   టాటా ఏ  ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు ఈ క్రింది ప్రయోజనాలను కలిగి ఉంది:

      • ఈఇన్సూరెన్సు సంస్థ  పాలసీ ప్లాన్ ను అవసరాలకు తగ్గట్టు మార్చు కోవటానికి వీలుగా లను వ్యక్తులకు, కుటుంబాలకు, సీనియర్ సిటిజెన్ ల క్రిటికల్ ఇల్ నెస్ మరియు అత్యవసర మెడికల్ కవరేజీ లను అందిస్తుంది.
      • ఈఇన్సూరెన్సు సంస్థ జీవిత కాల పునరుద్ధరణ మరియు పాలసీ ధరను క్లెయిమ్ లు నమోదు చేయకుండా ఉండాలనే నిబంధను బట్టీ కాక వయస్సు ను బట్టి నిర్ణయిస్తుంది.
      • టాటాఏ  ఐ జి మెడికల్ పాలసీ లు వైద్యం లో భాగం గా ఇంటివద్ద వైద్య చికిత్స పొందినప్పటికీ ఖర్చులు తిరిగి పొందే ప్రయోజనాన్ని అందిస్తుంది.
      • ఈప్లాన్లు హోమియోపతి, సిద్ధ, యునాని మరియు ఆయుర్వేద ట్రీట్మెంట్ ల ఖర్చు లను తిరిగిపొందే టందుకు రూపొందించబడ్డాయి.

      యునైటెడ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు

      యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కో.లిమిటెడ్ 22 కంపెనీ లతో విలీనం అయి వుంది.దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో వుంది.  ఇండియా లో ఇన్సూరెన్సు ప్రొవైడర్స్ లో ఇది ఒక అత్యంత జనాదరణ పొందిన సంస్థ.ఈ సంస్థ సరసమైన మరియు వ్యక్తిగతమైన ఆరోగ్య పథకాలను కస్టమర్లకు అందిస్తుంది.హై సొల్వెన్సీ మార్జిన్ రేషియో మరియు క్లెయిమ్ పేయింగ్ ఎబిలిటీ లకు యునైటెడ్ ఇండియా ఐ సి అర్ ఏ చేత గుర్తింపు పొందినది.కంపెనీ అందిస్తున్న  హెల్త్ పాలసీ లప్రయోజనాలను  తనిఖీ చేసుకోండి:

      • యునైటెడ్ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు ఇండియాలో 7000 లకు పైగా హాస్పిటల్స్ లో   క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ను అందిస్తుంది.
      • పాలసీదారుడు 3- వరుస సంవత్సరముల క్లెయిమ్-ఫ్రీ ఇయర్స్ దాటిన తరువాత ఉచిత వైద్య పరీక్షల ప్రయోజనాలను పొందవచ్చు.
      • ఈఇన్సూరెన్సు సంస్థ  మీకు, మీ భాగస్వామికి మరియు మీ పై  ఆధారపడి  వున్న పిల్లలకు చెల్లించిన ప్రీమియం పై 5 %  తగ్గింపును  అందిస్తున్నది.
      • పాలసీప్రయోజనాలను విశ్లేషించుకొని ఆ పాలసీ లో కొనసాగాలా లేదా అనేది నిర్ణయించుకొనేందుకు వీలుగా 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ను కల్పిస్తుంది.
      • అంతేకాక,  పాలసీ దారుడు వ్యక్తిగత మరియు కుటుంబ పథకం రెండింటిలో ప్రీమియం చెల్లింపు లో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చును.

      యూనివర్సల్ సోంపో హెల్త్ ఇన్సూరెన్సు 

      యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ ని పబ్లిక్ -ప్రైవేట్ రంగాల క్రింద 2007 లో స్థాపించబడింది.డాబర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్,సోంపో జపాన్మరియు కర్ణాటక బ్యాంకు,అలాహాబాద్ మధ్య భాగస్వామ్య సహకారం తో స్థాపించబడింది.యూనివర్సల్ సోంపో హెల్త్ ఇన్సూరెన్సు వారి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడినవి-

      • ఈఇన్సూరెన్సు కంపెనీ కుటుంబాలకు, వ్యక్తులకు, గ్రూప్ లకూ, విద్యార్థులకు, ఎం జి ఓ లు మొదలైన వారికి అనువైన వైవిధ్యమైన పథకాలను అందిస్తుంది.
      • ఇండియాఅంతటా 5000  కు పైగా హాస్పిటల్స్ కు నగదు లేకుండా హాస్పిటల్ లో చేరే అవకాశం ఈ కంపెనీ కల్పిస్తుంది.
      • దాదాపుఅన్ని మెడికల్ ఇన్సూరెన్సు పథకాలు ఇన్సూరెన్సు వున్నవ్యక్తులకు జీవితకాలం పునరుద్దీకరణ  చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
      • అంతేకుండా, విదేశాలలో పనిచేసేవారి కోసం/గ్రామీణ ప్రజలకోసం/గ్రూప్ ల కోసం  యూనివర్సల్ సోంపో ప్రత్యేకమైన మెడిక్లైయిం పథకాలను అందిస్తుంది.
      • ఏదిఏమైనా, పాలసీ దారుడు చెల్లించిన ప్రీమియం మొత్తం పై పన్ను యొక్క ప్రయోజనాలను సెక్షన్ 80 డి క్రింద పొందగలుగుతాడు.

      నిర్ణయం మీదే!

      ఈ వ్యాసం లో ఇండియా లో గల హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీల కోసం అందరికీ  ఉపయోగపడే విషయాలను మీతో పంచుకున్నాను.  ఇండియాలో ఈ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలు అందిస్తున్న వివిధ రకాలైన ఉత్పత్తులనుండి మీరు ఒక హెల్త్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.  ఈ ఇన్సూరెన్సు సంస్థలు వాటి ఫామిలీ ఫ్లోటర్ ప్లాన్ లతో సుపరిచితులు.  

      వివిధ రకాలైన ఇన్సూరెన్సు ప్లాన్ లను ఆన్ లైన్ లో సరిపోల్చుకొని ఉత్తమ మినా ఇన్సూరెన్సు పాలసీ ను పొందండి.  ఇప్పుడే!

      ఎఫ్ఏక్యూస్

      • ప్ర1. ఇండియా లో ఏ ఇన్సూరెన్సు కంపెనీ  అయినా  ఇన్సులిన్ ఖర్చులను కవర్ చేయ చేస్తుందా ?  

        జవాబు: కొన్ని హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు డయాబెటిస్ హెల్త్ ప్లాన్స్ అందిస్తున్నాయి.స్టార్ హెల్త్ డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్సు ప్లాన్, నేషనల్ వరిష్ఠా మెడిక్లైయిం ప్లాన్, మొదలైన ఇన్సూరెన్సు కంపెనీలు ఇన్సులిన్ ఖర్చులను కవర్ చేస్తాయి. మిగిలిన వాటి తో తనిఖీ చేసుకోండి.

      • ప్ర 2. వేరే ఇన్సూరెన్సు కంపెనీకి నా హెల్త్ ఇన్సూరెన్సు పోలిసీని బదిలీ చేసుకొనవచ్చా?

        జవాబు: మీ ఇన్సూరెన్సుకు చేకూరిన ప్రయాజనాలను కోల్పోకుండా ఒక ఇన్సూరెన్సు కంపెనీ నుంచి వేరొక ఇన్సూరెన్సు కంపెనీకి మీ హెల్త్ ఇన్సూరెన్సు పోలిసీని మార్చుకొనవచ్చు.  ఐ అర్ డి ఏ సూచనల  ప్రకారం మీ హెల్త్ ఇన్సూరెన్సు పోలిసీని వేరొక హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీకి మార్చు కొనే హక్కు మీకు వుంది.

      • ప్ర 3. ఏ హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు డెంటల్ కవరేజిని అందిస్తున్నాయి ?      

        జవాబు: కొన్ని హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు డెంటల్ ట్రీట్మెంట్  కవరేజ్ ను అందిస్తున్నాయి.బజాజ్ హెల్త్ గార్డ్ ఇన్సూరెన్సు ప్లాన్, చోళమండలం హెల్త్ లైన్  ఇన్సూరెన్సు ప్లాన్, స్టార్ కంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్సు మొదలైన ఇన్సూరెన్సు కంపెనీలు డెంటల్ కవరేజి ఖర్చులను అందిస్తున్నాయి.వేరే ఇన్సూరెన్సు కంపెనీలను తనిఖీ చేసుకొనవచ్చును.  

      • ప్ర. 4  ఏ హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ అయినా  కాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తుందా?

        జవాబు: చాల ఇన్సూరెన్సు కంపెనీలు కాన్సర్ ట్రీట్మెంట్ కవరేజీని అందిస్తున్నాయి.ఫ్యూచర్ జెనెరేలి  కాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్, బజాజ్ అలియాన్స్ క్రిటికల్ ఇల్ నెస్, ఆదిత్య బిర్లా యాక్టీవ్  సెక్యూర్- కాన్సర్ సెక్యూర్, డిజిట్  కాన్సర్ హెల్త్ ఇన్సూరెన్సు, చోళ ఏం ఎస్ క్రిటికల్ హెల్త్ లైన్ ప్లాన్, ఈడెల్వెయిస్  ప్లాటినం ప్లాన్, రహేజా కాన్సర్ ఇన్సూరెన్సు, కేర్ హెల్త్ కాన్సర్ ఇన్సూరెన్సు పాలసీ, స్టార్ కాన్సర్ కేర్ గోల్డ్ ఇన్సూరెన్సు ప్లాన్, మొదలైన కొన్ని ఇన్సూరెన్సు కంపెనీలు ఇండియాలో  కాన్సర్ ఇన్సూరెన్సును  అందిస్తున్నాయి.  కొనుగోలు చేసేముందు తనిఖీ చేసి,  సరిపోల్చు కొనేందుకు  చాల కంపెనీలు వున్నాయి.

      • ప్ర. 5  కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ లేక కిడ్నీ ఫెయిల్యూర్ చికిత్సకు అయ్యే కవరేజి భరించే హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు ఉన్నాయా?

        జవాబు: కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ లేక ఫెయిల్యూర్ చాల క్లిష్టమైన రోగం అందువలన ఇవి క్రిటికల్ ఇల్ నెస్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ క్రింద కవర్ చేయబడతాయి.బజాజ్ ఏలియన్స్ క్రిటికల్ ఇల్ నెస్ ఇన్సూరెన్సు పాలసీ, డి ఎఫ్ సి ఈ అర్ జి ఓ ఆప్టిమల్ వైటల్ ఇన్సూరెన్సు ప్లాన్ కూడా కవర్ చేస్తాయి.నేషనల్ క్రిటికల్ ఇల్ నెస్ మెడికల్ ఇన్సూరెన్సు ప్లాన్, ఎస్ బి ఐ క్రిటికల్ ఇల్ నెస్ ప్లాన్, టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు,మరియు యూనివర్సల్సోంపో  క్రిటికల్  ఇల్ నెస్ పాలసీలు కూడా ఈ కవరేజ్ ను భరిస్తాయి.

      book-home-visit
      Search
      Disclaimer: Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by an insurer.
      top
      Close
      Download the Policybazaar app
      to manage all your insurance needs.
      INSTALL