లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకునే ముందు ఒక వ్యక్తి తప్పనిసరిగా అర్ధం చేసుకోవలసిన ప్ప్రధమిక నిబంధనలలో బీమా చేసిన మొత్తం మరియు హామీ ఇచ్చిన మొత్తం ఉన్నాయి. ఈ రెండు పడాల ఆధారంగా ప్రణాళికను అంచనా వేయవచ్చు. అనుభవం లేని వ్యక్తి హామీ ఇచ్చిన మొత్తాన్ని మరియు బీమా చేసిన మొత్తాన్ని ఒకే విధంగా అర్థం చేసుకోగలిగినప్పటికీ, వాటి వస్తావా అర్థాలు గణనీయంగా బిన్నంగా ఉంటాయి. హామీ ఇచ్చిన మొత్తం ప్రయోజనాన్ని సుచిస్తుండగా, బీమా చేసిన మొత్తం బీమా చేయబడినవారికి కలిగిన నష్టాన్ని తిరిగి చెల్లిస్తుంది.
#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use
~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
జీవిత రహిత బీమా పాలసీలు, అనగా మోటార్ బీమా, గృహ బీమా మరియు ఆరోగ్య బీమా, వంటివి నష్టపరిహర సూత్రంపై పనిచేస్తూ ఇయ్యబోవు మొత్తాన్ని బీమా చేసిన మొత్తం అని పిలుస్తారు. నష్ట పరిహారం అనేది ఏదైనా నష్టం, హాని, లేదా గాయానికి బీమా సంస్థ చెల్లించే పరిహారాన్ని సూచిస్తుంది. ఈ పాలసీలు ఏదైనా నష్టం కారణంగా బీమా చేసిన సొత్తుకి ఏదైనా నష్టం జరిగితే మాత్రమే కవరెజీని అందిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తాడు అది బీమా చేసిన మొత్తం రూ.1 లక్ష ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు, బీమా చేసిన వ్యక్తి యొక్క ఏదైనా ఆసుపత్రి బిల్లు రూ. 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తం బీమా సంస్థచే చెల్లించబడుతుంది. అయితే, బిల్ మొత్తం రూ. 1 లక్ష దాటితే అప్పుడు బీమా సంస్థ రూ.1 లక్ష మాత్రమే చెల్లిస్తుంది మిగిలినవి పాలసీదారుడు భరించాలి.
ఈ భావన వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే చెల్లించే పరిహారం ద్రవ్య ప్రయోజనానికి దారి తీయకూడదు మరియు అసలు నష్టానికి సంబందించిన మొత్తాన్ని మాత్రమే అతనికి చెల్లించాలి. అందువల్లనే జివితరహిత బీమా పాలసీల్లోని కవర్ ను బీమా చేసిన మొత్తంగా పిలుస్తారు.
హామీ ఇచిన మొత్తం అనగా ముందే నిర్ణయించిన మొత్తాన్ని బీమా చేసిన సంఘటన జరిగినప్పుడు బీమా కంపెనీ పాలసీదారునికి చెల్లిస్తుంది. ఉదాహరణకు, మీరు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తారు అప్పుడు, బీమా చేసిన వ్యక్తికి హామీ ఇచ్చినట్టుగానే అతను మరణించిన సందర్భంలో నామినీకి హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీ దారుడు బీమా సంస్థకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
సాధారణంగా, జీవిత బీమా పధకాలు హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తాయి మరియు జీవితరహిత బీమా పధకాలు బీమా చేసిన మొత్తాన్ని అందిస్తాయి. బీమా సంస్థలు ఈరోజుల్లో మీ మెడికల్ బిల్లులను తిరిగి చెల్లించడంతో పాటు ముందేచెప్పినట్లుగా ఏదైనా వైద్య సంఘటన జరిగితే మీకు ముందుగా నిర్వచించిన ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ రకమైన ద్వంద్వ-ప్రయోజన ప్లాన్స్ ను నాన్-లైఫ్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు రెండూ అందిస్తున్నాయి. ఈ రకమైన వాటికి ఒక సాధారణ ఉదాహరణ ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అనేది బీమా చేసిన వ్యక్తికి పాలసీలో పేర్కొన్న ఏదైనా అనారోగ్యంతో భాధ పడుతుంటే, అనగా పక్షవాతం, గుండెపోటు, కాన్సర్ వంటి వాటికి ఒకసారి మాత్రమే వచ్చే ప్రయోజనం. ఉదాహరణకు, హాస్పిటల్ క్యాష్ పాలసీ రోజువారీ నగదు ప్రయోజనాన్ని ముందుగా నిర్వచించిన పరిమితి వరకూ ఇస్తుంది. అదేవిధంగా, శస్త్ర చికిత్స ప్రయోజన ప్రణాళికలు పాలసీదారునికి శస్త్రచికిత్స విషయంలో ముందే హామీ ఇచ్చిన మొత్తాన్ని ఇస్తాయి.
మీరు కొనుగోలు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై ఏజెంట్ కనుక బీమా చేసిన మొత్తాన్ని హామీ ఇస్తే, మీకు నిర్వచించిన బెనిఫిట్ ప్లాన్ మీరు పొందుతారు. కానీ మీ వైద్య ఖర్చులను తిరిగి చెల్లించే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీ ప్రాధమిక అవసరం అవుతుంది.