టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం (టి ఆర్ ఓ పి)

ఇన్సూరెన్సు తీసుకొనే వారి అవసరాలను దృష్టి లో ఉంచుకొని, చెల్లించిన ప్రీమియం ను తిరిగి పొందగలిగే అవకాశం ఉన్న టర్మ్ ప్లాన్ నే  టి ఆర్ ఓ పి అని పిలుస్తారు.  మిగిలిన ప్రామాణిక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ వలె ఈ  టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ కూడా ఆర్ధిక భద్రత తో పాటు కుటుంబాన్ని ప్రతికూల పరిస్థితుల బారి నుండి సంరక్షిస్తుంది.

Read more
Get ₹1 Cr. Life Cover at just
Term Insurance plans
Online discount
upto 10%#
Guaranteed
Claim Support
Policybazaar is
Certified platinum Partner for
Insurer
Claim Settled
98.7%
99.4%
98.5%
99%
98.2%
98.6%
98.82%
96.9%
98.08%
99.2%

#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply

Get ₹1 Cr. Life Cover at just
+91
View plans
Please wait. We Are Processing..
Get Updates on WhatsApp
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use
We are rated
rating
58.9 million
Registered Consumers
51
Insurance
Partners
26.4 million
Policies
Sold

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను మిగిలిన ప్రామాణిక టర్మ్ ఇన్సూరెన్సు ల కంటే భిన్నం గా ఉండటానికి గల కారణం ఏమిటంటే, పాలసీ దారుడు ఈ ఇన్సూరెన్సు పాలసీ కాలవ్యవధి ముగిసిన తరువాత జీవించి ఉన్నట్లైతే, అంతవరకూ చెల్లించిన ప్రీమియం ను తిరిగి పొందగలుగుతారు.   

మీకు  ప్రీమియం ని తిరిగి చెల్లించే టర్మ్ ప్లాన్ గూర్చి పూర్తిగా తెలిపేందుకు, వివరాలను విస్తారం గా తెలియజేస్తున్నాము.  

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ఎలా పని చేస్తుంది?

10 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన రూ. 20 లక్షల కవరేజీ కలిగిన  పాలసీ సంవత్సర ప్రీమియం రూ. 2000 ఉందనుకుందాం.  ఒక వేళ భీమా చేయబడిన వ్యక్తి మరణించి నట్లయితే, వారి కుటుంబానికి  రూ. 20 లక్షలు (హామీ మొత్తం) చెల్లించబడుతుంది.  కానీ ఆ కాల వ్యవధిలో భీమా చేయబడిన వ్యక్తి జీవించి ఉంటే, ఇన్సూరెన్సు సంస్థ మొత్తం ప్రీమియం అంటే రూ. 20,000 (రూ.2000 X 10)  తిరిగి చెల్లిస్తుంది.

సాంకేతిక పరం గా, ప్రీమియం ను తిరిగి చెల్లించే టర్మ్ ప్లానులను నాన్- పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్సు ప్లాన్ అని పిలుస్తారు.  మామూలు  టర్మ్ ప్లాన్ లతో పోల్చి చూసినట్లయితే ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్సూరెన్సు ప్రయోజనాలు ఎటువంటివి అందచేస్తాయో ఇప్పుడు చూద్దాం.  

 • మామూలు టర్మ్ ప్లాన్ కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే అందిస్తుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్సు  విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను మెచ్యూరిటీ బెనిఫిట్ గా ప్రీమియం మొత్తాన్ని కాలపరిమితి పూర్తి అయిన తరువాత చెల్లిస్తుంది.  
 • ప్రీమియం తిరిగి ఇవ్వబడే హామీ వల్ల ఈ టి ఆర్ ఓ పి ప్లాన్ మిగిలిన స్వచ్ఛమైన టర్మ్ ప్లాన్ ల కన్నా ఉన్నతమైనది అని చెప్పుకోవచ్చు.  

టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ను కొనుగోలు చేయడానికి గ ముఖ్య కారణాలు

ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ముఖ్యం గా ఏ వినియోగదారులు   తమ ఆర్ధిక భద్రతకోసం, తమకు ప్రియమైన వారి కి లబ్ది చేకూర్చేందుకు ఇష్టపడతారో వారికోసమే తయారుచేయబడింది.  ఇది పేరుకు తగ్గట్టుగానే, ఈ పాలసీ ఇన్సూరెన్సు కవరేజీ ని  అందించడం తో పాటు, ప్రీమియం మొత్తం ను తిరిగి చెల్లిస్తుంది.  

అన్నింటి కన్నా ముఖ్యం గా  ఈ పాలసీ ఏమయినా దురదృష్ట సంఘటనలు జరగడం వల్ల కుటుంబ సభ్యులకు  ఆర్ధిక భద్రత కు భంగం వాటిల్ల కుండా చూడటం ద్వారా మనఃశాంతి ని కలుగ జేస్తుంది.  రెండవది, ఈ ప్లాన్ కాలపరిమితి లో  జమ చేసిన అన్ని ప్రీమియం లనూ తిరిగి పాలసీ దారునికి చెల్లించే  హామీ ను ఇస్తుంది.

ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ని  కొనుగోలు చేయడానికి ఎందుకు ఎంపిక చేసుకోవాలో, ముఖ్య కారణాల్ని తెలుసుకుందాం.  

 • టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను పాలసీ కాలపరిమి తీరిన తరువాత ప్రీమియం ను తిరిగి చెల్లిస్తుంది.  ఒక వేళ పాలసీ దారుడు కాలపరిమితి తీరిన తరువాత జీవించి ఉన్నట్లైతే, తాను పాలసీ కాలపరిమితి లో పెట్టుబడి పెట్టిన ప్రీమియం మొత్తం తిరిగి పొందడానికి  అర్హుడవుతాడు.  ఇన్సూరెన్సు కవరేజీ తో పాటూ కాల పరిమితి తరువాత ప్రీమియం ను తిరిగి పొందే అవకాశం వల్ల కొనుగోలు దారులకి ఈ ప్లాన్ ఆదర్శవంతగా మారింది.  
 • ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను పాలసీ కాలపరిమి తీరిన తరువాత ప్రీమియం ను తిరిగి చెల్లించడానికి హామీ ఇస్తుంది. దీని ద్వారా భీమా పొందిన వ్యక్తి తాను చెల్లించిన మొత్తాన్ని  ఖచ్చితం గా తిరిగి పొందుతాడు.  పాలసీ దారుడు తాను చెల్లించిన డబ్బు తిరిగి పొందలేమని చింతించాల్సిన పనిలేదు.  
 • టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను లో ఇన్సూరెన్సు కవరేజీ ని పెంచుకోవడాని వీలు గా రైడర్ ప్రయోజనాలను కూడా కలుగచేస్తుంది.  చాలా మంది భీమా సంస్థలు వివిధ రైడర్స్ ని కొనుగోలు చేసుకోవడానికి వీలుగా అందచేస్తున్నాయి. వీటిని భీమా కొనుగోలు చేసే సమయం లో గానీ లేదా, తరువాత జత చేసుకోవడానికి వీలు గా ఉంటాయి. ఈ రైడర్స్ ని టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం పాలసీ తీసుకొనే సమయం లోనే కొద్దీ పాటి మొత్తాన్ని కేటాయించడం వల్ల తక్కువ ధర లో  ఆకస్మిక ప్రమాదాలు, అంగవైకల్యం వంటి వాటినుండి కూడా కవర్ చేసుకోవడానికి పొందవచ్చు. 
 • ఈ పాలసీ పన్ను చట్టాలను అనుసరించి టాక్స్ లబ్ది ని కూడా కలుగ జేస్తుంది. ప్రస్తుతం చెల్లించిన ప్రీమియం మొత్తం మరియు తీసుకొనే మొత్తం పైన ఇన్ కం టాక్స్ యాక్టు, 1961   సెక్షన్ 80 సి మరియు 10 (10  డి)  ల ప్రకారం పన్ను ఉండదు. పన్ను మినహాయింపు గరిష్టం గా రూ. 1 .5  లక్షల వరకు ఉంటుంది.

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం యొక్క లక్షణాలు

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం లేదా  టి ఆర్ ఓ పి ప్లాన్ మిగిలిన ప్లాన్ ల కంటే భిన్నం గా డెత్ బెనిఫిట్ తో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ గా ప్రీమియం ను తిరిగి చెల్లిస్తుంది.

ప్రీమియం ను తిరిగి చెల్లించే ఈ టర్మ్ ప్లాన్ యొక్క లక్షణాలను వివరం గా తెలుసుకుందాం.

1 . హామీ మొత్తం

ఈ టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ యొక్క హామీ మొత్తం మీరు పాలసీ తీసుకున్న సమయంలో పాలసీ దారుడు  ఎంచుకున్న కవరేజి పై ఆధారపడి ఉంటుంది. సాధారణ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లతో పోలిస్తే ఈ టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను లు ప్రీమియం ను తిరిగి ఇవ్వబడడం వల్ల తక్కువ హామీ మొత్తాన్ని అందిస్తుంటూ ఉంటాయి.  

2. జీవించి ఉండటం వల్ల కలిగే లబ్ది లేదా మెచ్యూరిటీ బెనిఫిట్

సాంప్రదాయ టర్మ్ పాలసీ లకు భిన్నం గా  ప్రీమియం ను తిరిగి చెల్లించే  ఈ టర్మ్ ప్లాన్ జీవించి ఉండటం వల్ల కలిగే లబ్ది లేదా మెచ్యూరిటీ బెనిఫిట్ లను అందిస్తుంది.  సాధారణ టర్మ్ ప్లాన్ తీసుకున్న పాలసీ దారుడు ఏదేని సర్వైవల్ లేదా మెచ్యూరిటీ బెనిఫిట్ లను పొందలేడు.  కానీ ఈ టి ఆర్ ఓ పి ప్లాన్ వలన భీమా చేసిన వ్యక్తి తాను ప్రీమియం రూపం పెట్టిన  పెట్టుబడి మొత్తం సొమ్ము తిరిగి పొందుతాడు.  

3 . డెత్ బెనిఫిట్స్

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ తీసుకున్న పాలసీ దారుడు మరణించినట్లయితే, హామీ మొత్తం అంతా పాలసీ దారుని నామినీ కి డెత్ బెనిఫిట్ రూపం లో అందుతుంది.  వివిధ ఇన్సూరెన్సు సంస్థలు అందజేసే ప్లాను లు, అవి అందించే ప్రయోజనాలు, ఎంచుకున్న కవరేజీ, ప్రీమియం చెల్లించే విధానాల ను బట్టీ హామీ మొత్తం ఆధారపడి ఉంటుంది.  

4. సరెండర్ వేల్యూ

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం విరమించు కొనే సమయం లో చెల్లింపడే సరెండర్ వేల్యూ, ప్రీమియం చెల్లింపు విధానం పై ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందే, కాలపరిమితి మొదలయ్యే టప్పుడు ఒకే  సారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించినట్లయితే ఎక్కువ సరెండర్ వేల్యూ లభ్యం కావడం పరిపాటి. భీమా సంస్థలు తమ తమ స్వంత పద్ధతుల్లో వేర్వేరు విధాలు గా  సరెండర్ వేల్యూ ని లెక్కిస్తారు.  టి ఆర్ ఓ పి ప్లాన్లు తీసుకొనే వారు ముఖ్యం గా తమకు వస్తుంది అని భావిస్తున్న మొత్తం చేతికి వచ్చే మొత్తం తో పోలిస్తే వేరు గా ఉండటానికి అవకాశం ఉంటుందని గ్రహించాలి.       

5. పెయిడ్-అప్ వేల్యూ

ప్రీమియం ను తిరిగి పొందే ఈ సౌకర్యం టర్మ్ ప్లాన్ లలో ఉండాల్సిన ప్రయోజనం. దీని ద్వారా, ఇంతక ముందు తెలియజేసిన విధం గా పాలసీ దారుడు ప్రీమియం చెల్లించలేని పరిస్థితులలో కూడా తక్కువ కవరేజీ తో ప్లాన్ కొనసాగుతుంది.  చాల భీమా సంస్థలు నిర్దిష్టం గా కనీసం కొన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన వారికే ఈ ప్రయోజనం చెల్లు బాటు అయ్యే విధం గా చూస్తున్నాయి.

6. రైడర్స్

ఇన్సూరెన్సు సంస్థలు ప్రాధమిక కవరేజీ తో పాటు కొన్ని అదనపు కవరేజీల ను కూడా అందిస్తూ ఉంటాయి.  ఇవి సాధారణం గా: 

 • వ్యక్తిగత ప్రమాద, అంగ వైకల్యాలు కవరేజీ కొరకు  రైడర్:  ఇది భీమా చేసిన వ్యక్తి ప్రమాదాల కు గురియై, గాయపడిన, పనిచేయలేని స్థాయిలో ఉన్నా లేదా మరణించిన ఈ రైడర్ ఉపకరిస్తాయి.
 • క్లిష్ట అనారోగ్యాల రైడర్: ఈ రైడర్ ముఖ్యం గా గుండె పోటు, స్ట్రోక్, కాన్సర్ మరియు వివిధ గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు మొదలైన అనారోగ్యాలను కవర్ చేస్తుంది.  కవర్ చేసే అనారోగ్యాల సంఖ్య ప్రతీ భీమా సంస్థ కూ  వేర్వేరుగా ఉండటం చేత పాలసీ తీసుకొనే సమయం లోనే రైడర్ కవరేజీ వివరాలను నమోదు చేసుకొని ఉంచుకోవాలి. 
 • హాస్పిటల్ క్యాష్: ఈ రైడర్ పాలసీ దారుడు ఆసుపత్రి పాలయినప్పుడు కొన్ని రకాల నగదు ప్రయోజనాలను నిర్దేశించిన కారణాల మేర అందుకోవచ్చును.  

 టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ని ఎవరు తీసుకోవచ్చు ?

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం తీసుకొనేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు అయితే,  టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం కు గరిష్ట వయసు 55  సంవత్సరాలు. వివిధ కారణాల వలన ప్రీమియం రేట్లు కొనుగోలు దారుని వయస్సు ప్రకారం నిర్ణయించబడ్డాయి.    టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ లను అవివాహితులు, వివాహం అయిన వారు, వివాహం అయి పిల్లలు కలిగి ఉన్నవారు కూడా కొనుగోలు చేయవచ్చు.  

 • మీరు అవివాహితులు అయినట్లయితే  - మీరు వివాహితులు కాకున్నా, వివాహితులు అయినా, ఆర్ధిక భద్రత కలిగి ఉండటం తప్పని సరి.   టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ ద్వారా మీరు మీ ఆర్ధిక భవిష్యత్తుకోసమే కాకుండా, మీకు ప్రియమైన వారి కూడా దీర్ఘ కాలిక ఆర్ధిక భద్రతను కలిగించగలుగుతారు.      
 • మీరు వివాహితులు అయి పిల్లలు లేనిచో - మీ మీద ఆధారపడి ఉన్నది కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రమే అయిఉండవచు.  అలాంటి స్థితి లో మీ జీవిత భాగస్వామి జీవితము లో మీరు లేని పరిస్థితి లో ఆర్ధిక భవిష్యత్తు కి ఆసరా కల్పించడము అన్నింటి కంటే ముఖ్యమైన విషయము.  ఒక వేళ పాలసీ కాలవ్యవధి తరువాత మీరు జీవించి ఉంటే, ఇది టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం కాబట్టీ ఇప్పటివరకూ చెల్లించిన ప్రీమియం తిరిగి వాపసు కాబడుతుంది.
 • మీరు వివాహితులు అయి, పిల్లలు కలిగిఉంటే - ప్రతీ ఒక్కరికీ తమ పై ఆధార పడి జీవిస్తున్న వారి కుంటుంబ ఆర్ధిక శ్రేయస్సు చూసుకోవడం ప్రాధమిక బాధ్యత.  టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం కుటుంబం యొక్క ఆర్ధిక భవిష్యత్తు నే కాక అత్యవసర ఆర్థిక చెల్లింపులు కూడా జరపడానికి పనిచేస్తుంది.  

పాలసీ కాలపరిమి

సాంప్రదాయ ఇన్సూరెన్సు ప్లాన్ ల వలె జీవిత కాల కవరేజీ ని ఇవ్వకుండా, టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను 10, 15, 20, 25 లేదా 30 సంవత్సరాల  నిర్దిష్ట కాల వ్యవధి ని  కలిగి ఉంటుంది.   కొన్ని భీమా సంస్థలు ఈ  ప్లాన్ లకు  మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు కంటే ఎక్కువ కల్పిస్తున్నప్పటికీ , సాధారణం గా ఈ ప్లాన్ లకు మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు కంటే తక్కువ ఉంటుంది.  

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం వర్సెస్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం

 (టి ఆర్ ఓ పి)

ఇది ఒక స్వచ్ఛమైన భద్రత ను కల్పించే ప్లాను గా చెప్పబడుతుంది, ఇది అన్ని జీవిత భీమా పాలసీ ల కంటే సరళమైనది.


టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే వైవిధ్యమైనది.

ఇది స్వచ్ఛ మైన టర్మ్ ప్లాన్ కావడం చేత డెత్ బెనిఫిట్ మాత్రమే అందిస్తుంది.

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం డెత్ బెనిఫిట్ తో పాటు,  పాలసీ దారుడు పాలసీ కాలపరిథి లో జీవించి ఉంటే ప్రీమియం మొత్తం తిరిగి  చెల్లించే సర్వైవల్ బెనిఫిట్ లభిస్తుంది.

ఇది స్వచ్ఛ మైన టర్మ్ ప్లాన్ కావడం చేత పాలసీదారుడు చెల్లించిన సంవత్సర ప్రీమియం కు 10 రెట్లు కు సమానం గా హామీ మొత్తం ఉంటుంది.

మరొక వైపు, ఈ టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను కు మిగతా టర్మ్ ప్లాన్ ల కంటే హామీ మొత్తం చాల తక్కువ గా ఉంటుంది.   


సాంప్రదాయ టర్మ్ ప్లాన్ కావడం చేత ప్రీమియం ధర అందరికీ అందుబాటు లో ఉంటుంది.  

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం తీసుకొనే ప్రీమియం ధర కొంచెం ఎక్కువ గా ఉంటుంది.

ఇన్ కం టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ద్వారా పన్ను రాయితీ ని కల్పిస్తుంది.  

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం కూడా ఇన్ కం టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ద్వారా పన్ను రాయితీ ని కల్పిస్తుంది.  

ఈ టర్మ్ ప్లాన్  కుటుంబ ఆర్ధిక భద్రత ను కోరుకొనే ప్రతి ఒక్కరికి చక్కగా ఉపయోగపడుతుంది.   


టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ఇన్సూరెన్సు కవరేజీ తో పాటు కొంత పెట్టుబడి ద్వారా లాభం పొందాలను కొనే వారికి చాలా ఉపయోగకరం.

టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాను కొనుగోలు చేసేందు సరళమైన చిట్కాలు

మీ ఇన్సూరెన్సు కొనుగోళ్ల సౌలభ్యం  కోసం పాలసీబజార్ నిపుణులు కొన్ని సులభమైన చిట్కాల తో ముందుకు వచ్చారు.

 • మెచ్యూరిటీ బెనిఫిట్ మాత్రమే ఇన్సూరెన్సు సంస్థ ను ఎంచుకోవడానికి కారణం కాకూడదు.  ఎక్కువ లాభాలను ఇస్తున్నా దాని ధర తక్కువ గా ఉండకపోవచ్చు. 
 • చాల ఇన్సూరెన్సు కంపెనీలు ఎక్కువ విలుల గల హామీ మొత్తాలకు మంచి తగ్గింపు ప్రతిపాదనలు కూడా ఇస్తూ ఉంటారు.  
 • ఈ టర్మ్ పాలసీ ల కాల పరిమితులు  పెంచుకోవడానికి వీలు పడదు కాబట్టీ, వీలైనంత గరిష్ట కాల పరిమితులు కల టర్మ్ ప్లాన్ లు తీసుకోవడం మంచిది.  

తక్కువ ఖరీదు చేసే ప్రీమియం ధరలను అందించే ప్రత్యేకమైన ఇన్సూరెన్సు పోర్టల్ లు చాలా ఉన్నాయి కానీ వినియోగదారుని సేవలో మేము అగ్ర స్థానం లో ఉన్నామని చెప్పడానికి గర్విస్తున్నాము.   మా వద్ద మంచి ప్రావీణ్యం గల, లైసెన్స్ కలిగిన  ప్రతినిధులు ఉత్తమ మైన టర్మ్ ప్లాన్ ఎంచుకోవడానికి వీలుగా మీకు మరింత వివరాలను ని అందించడానికి సంతోషం గా సిద్ధం గా ఉన్నారు.
Different types of Plans


Term insurance articles

Recent Articles
Popular Articles
Points to Consider Before Buying Term Insurance for NRIs

23 Mar 2023

The NRIs living outside India prefer buying term insurance in
Read more
Reduced Paid-up in Term Insurance

23 Mar 2023

Term insurance is one of the most affordable ways of securing
Read more
Bharti AXA Flexi Term Pro

23 Mar 2023

Bharti AXA Flexi Term Pro is a comprehensive protection plan that
Read more
What is Renewable Term Insurance?

16 Mar 2023

A renewable term life insurance is a regular term plan that
Read more
TATA AIA Smart Sampoorna Raksha Param Rakshak Plus

07 Mar 2023

TATA AIA Smart Sampoorna Raksha Param Rakshak Plus is a
Read more
LIC Term Insurance 1 Crore
LIC of India offers various plans to help you secure the financial future of your loved ones. In order to make
Read more
What Medical Tests are Required for Term Insurance?
Term insurance offers a sum assured to the beneficiary of the policyholder upon their death that can help them
Read more
2 Crore Term Insurance Plan
The pandemic has surely generated a global panic and emphasised the importance of financial planning that would
Read more
Types of Deaths Covered and Not Covered by Term Insurance
A term insurance plan is the best way to ensure the financial well-being of your family members in case of any
Read more
Term Insurance: Tax Benefits under Section 80D
Term Insurance provides financial security and protection to your family in case of your unexpected death within
Read more

top
View Plans
Close
Download the Policybazaar app
to manage all your insurance needs.
INSTALL