సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు అనేది 60 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వయోవృద్దుల వైద్య అవసరాల కవరేజీ లు అందించే మెడికల్ ఇన్సూరెన్సు పాలసీ. క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ కవర్, డే కేర్ ఎక్స్పెన్సెస్, ప్రీ-ఎక్సిస్టింగ్ డిసీస్ కవర్ వంటివి సీనియర్ సిటిజెన్ మెడికల్ పాలసీ అందించే ముఖ్యమైన ప్రయోజనాలు.
*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply
*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply
Who would you like to insure?
ఇప్పుడు ఐ ఆర్ డి ఏ నిబంధనల మేరకు ప్రతీ భీమా సంస్థ 65 సంవత్సరాల వయస్సు వరకూ గల వ్యక్తుల కు హెల్త్ ఇన్సూరెన్సు లు అందించడానికి సిద్ధం గా ఉన్నారు. ఈ నిబంధనల వలన వ్యక్తులు తమ జీవిత చివరి కాలం లో కొన్ని కవరేజీ లను పొందగలుగుతారు. అంతేకాక భీమా సంస్థలు పాలసీ దారులకు ఒక భీమా సంస్థ సంతృప్తి కలిగించే సేవను అందించనిచొ ఇంకొక భీమా సంస్థ కు బదిలీ చేసుకొనే అవకాశం కూడా ఇస్తున్నాయి. వయోవృద్దులకు భీమా పాలసీ లు అందించే సంస్థలకు ఇండియా లో కరువు లేదు. అయినప్పటికీ, సరైన సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎంచుకోవడం అనేది నిజం గా ఒక సవాలు లాంటిదే.
వయోవృద్దులకు సీనియర్ సిటిజెన్ మెడిక్లైయిం పాలసీ చాల రకాల కవరేజి ప్రయోజనాలను అందచేస్తున్నాయి. అవి హాస్పిటల్ లో చేరటం వలన అయ్యే, శాస్త్ర చికిత్సలకు, క్లిష్ట అనారోగ్య సమస్యలకు, ప్రమాదాల వలన కలిగిన దెబ్బలకు మరియు ముందుగా కలిగిఉన్న అనారోగ్య సమస్యలకు అయ్యే ఖర్చుల ను చెల్లించుకోవడానికి ఉపయోగపడతాయి. సరైన సమయాల్లో పాలసీ ని పునరుద్దీకరిస్తే చాలు 80 సంవత్సరాల వరకూ కవరేజీ సౌకర్యం తో పాటు జీవిత కాల పునరుద్దీకరణ సౌకర్యం లభిస్తుంది.
ఇండియా లో సీనియర్ సిటిజెన్ మెడిక్లైయిం పాలసీ కొనుగోలు చేయడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:
హెల్త్ ప్లాన్ పేరు |
హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ |
ప్రవేశ వయస్సు |
హామీ మొత్తం రూ. |
కలిగియున్న వ్యాధుల కవరేజీ |
వైద్య పరీక్షలు |
ఆక్టివ్ కేర్ సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు |
55-80 సంవత్సరాలు |
స్టాండర్డ్: 10 లక్షలు వరకూ క్లాసిక్: 10 లక్షలు వరకూ ప్రీమియర్: 25 లక్షలు వరకూ |
2 వ సంవత్సరం నుండి |
అవసరము
|
|
సిల్వర్ హెల్త్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ |
46-70 సంవత్సరాలు |
50,000 – 5 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
46 సంవత్సరాల వయస్సు తరువాత |
|
భారతి ఏఎక్సఏ సీనియర్ సిటిజెన్ హెల్త్ ప్లాన్ |
భారతి ఏఎక్సఏ హెల్త్ ఇన్సూరెన్సు |
18-65 సంవత్సరాలు |
5 లక్షలు - 1 కోటి |
2 వ సంవత్సరం నుండి |
-- |
కేర్ హెల్త్ ఫ్రీడమ్ హెల్త్ ప్లాన్ |
కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (గతం లో రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు) |
46 సంవత్సరాల వయస్సు తరువాత |
3 లక్షలు - 10 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
కేసు ను బట్టి అవసరము |
ఇండి విడ్యుఅల్ హెల్త్ లైన్ ప్లాన్ |
చోళమండలం హెల్త్ ఇన్సూరెన్సు |
65 సంవత్సరాల వయస్సు వరకూ |
2 లక్షలు - 25 లక్షలు |
-- |
55 సంవత్సరాల వయస్సు వరకూ అవసరము లేదు |
డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు |
డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు |
వర్తించదు |
వర్తించదు |
వర్తించదు |
వర్తించదు |
హెల్త్ ఇన్సూరెన్సు ప్లాటినం ప్లాన్ |
ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు |
వయస్సు ఏదయినా |
15 లక్షలు - 1 కోటి |
-- |
అవసరము |
హెల్త్ సురక్ష ఇండి విడ్యుఅల్ ప్లాన్ |
ఫ్యూచర్ జెనెరలి హెల్త్ ఇన్సూరెన్సు |
70 సంవత్సరాల వయస్సు వరకూ లైఫ్ టైం రెన్యువల్ |
5 లక్షలు - 10 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
46 సంవత్సరాల వయస్సు తరువాత |
ఇండివిడ్యుఅల్ మెడీషీల్డ్ ప్లాన్ |
ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు |
3 నెలల నుండి -80 సంవత్సరాలు |
50,000 – 5 లక్షలు |
3 వ సంవత్సరం నుండి |
60 సంవత్సరాల వయస్సు తరువాత |
కోటక్ మహీంద్రా ఫామిలీ హెల్త్ ప్లాన్ |
కోటక్ మహీంద్రా హెల్త్ ఇన్సూరెన్సు |
65 సంవత్సరాల వరకూ |
2 లక్షలు - 100 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
-- |
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు |
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు |
65 సంవత్సరాల వయస్సు వరకూ లైఫ్ టైం రెన్యువల్ |
2 లక్షలు - 15 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
55 సంవత్సరాల వయస్సు తరువాత అవసరము |
హార్ట్ బీట్ ప్లాన్ |
ఎంట్రీ వయస్సు 65 సంవత్సరాల వరకూ |
2 లక్షలు - 50 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
పాలసీ దారుని వయస్సు పై ఆధారపడి |
|
లైఫ్ స్టైల్ ప్రొటెక్షన్ ఆక్సిడెంట్ కేర్ |
మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు |
ఎంట్రీ వయస్సు 65 సంవత్సరాల వరకూ |
50,000 – 10 కోట్లు |
-- |
-- |
వరిష్ఠా మెడి క్లెయిమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ |
నేషనల్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు |
60-80 సంవత్సరాల వయస్సు ( 90 సంవత్సరాల వయస్సు వరకూ పునరుద్ధరణ) |
మెడిక్లైయిం - 1 లక్ష క్రిటికల్ ఇల్ నెస్ - 2 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
అవసరము |
న్యూ ఇండియా అసురన్సు సీనియర్ సిటిజెన్ మెడిక్లైయిం పాలసీ |
న్యూ ఇండియా అసురన్సు హెల్త్ ఇన్సూరెన్సు |
60-80 సంవత్సరాల వయస్సు ( 90 సంవత్సరాల వయస్సు వరకూ పునరుద్ధరణ) |
1 లక్ష – 1.5 లక్షలు |
18 నెలల తరువాత |
అవసరము |
సీనియర్ సిటిజెన్ హోప్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ |
ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు |
60 సంవత్సరాల వయస్సు తరువాత |
1 లక్ష – 5 లక్షలు |
2 వ సంవత్సరం నుండి |
ఎంపిక చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ నుండి అవసరము |
రహేజా క్యూబ్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ |
రహేజా హెల్త్ ఇన్సూరెన్సు |
65 సంవత్సరాల వయస్సు వరకూ |
1 లక్ష – 50 లక్షలు |
-- |
-- |
లైఫ్ లైన్ ఎలైట్ ప్లాన్ |
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్సు |
పరిమితి లేదు |
25 లక్షలు – 1.5 కోట్లు |
2 వ సంవత్సరం నుండి |
-- |
హెల్త్ గైన్ ఇన్సూరెన్సు ప్లాన్ |
ఎంట్రీ వయస్సు సంవత్సరాలు |
3 లక్షలు – 18 లక్షలు |
3 వ సంవత్సరం నుండి |
వయస్సు పై ఆధారపడి అవసరము |
|
సీనియర్ సిటిజెన్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ |
60-75 సంవత్సరాలు |
1 లక్ష – 10 లక్షలు |
2 వ సంవత్సరం నుండి పాలసీ కవరేజీ |
ప్రీ-ఆక్సిప్టాన్స్ మెడికల్ టెస్ట్ అవసరము లేదు |
|
ఆరోగ్య టాప్ అప్ పాలసీ |
65 సంవత్సరాల వయస్సు వరకూ |
1 లక్ష – 5 లక్షలు; 1 – 10 లక్షలు (డేడిక్టబుల్స్ తో కలిపి) |
4 వ సంవత్సరం నుండి |
55 సంవత్సరాల వయస్సు తరువాత |
|
మెడి సీనియర్ హెల్త్ ఇన్సూరెన్సు |
61 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ |
2 లక్షలు – 5 లక్షలు |
4 వ సంవత్సరం నుండి |
అవసరము మరియు తిరిగి 50% చెల్లించబడేది |
|
యునైటెడ్ ఇండియా సీనియర్ సిటిజెన్ మెడిక్లైయిం పాలసీ |
యునైటెడ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు |
61-80 సంవత్సరాలు |
1 లక్ష – 3 లక్షలు |
4 వ సంవత్సరం నుండి |
అవసరము మరియు తిరిగి 50% చెల్లించబడేది |
సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ |
యూనివర్సల్ సంపూ హెల్త్ ఇన్సూరెన్సు |
60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ |
1 లక్ష – 5 లక్షలు |
24 నెలలు |
అవసరము |
విశేష సూచన : పాలసీ బజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు సంస్థను గానీ, ఇన్సూరెన్సు ఉత్పత్తిని గానీ ఆమోదింపచేయడం గానీ, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా సిఫార్సు గానీ చేయదు.
వయోవృద్దుల కు అనూహ్యం గా ఏర్పడే ఆరోగ్య సమస్యల నుండి రక్షకోసం హెల్త్ ఇన్సూరెన్సు చాలా అవసము. ఆసుపత్రిలో చేరడమనేది వారికీ, వారి కుటుంబాలకీ ఆర్ధికం గా నూ, మానసికంగానూ ఒత్తిడికి తీసుకువస్తుంది. సీనియర్ సిటిజెన్ లు హెల్త్ ఇన్సూరెన్సు ఎందుకుతీసుకోవాలో ముఖ్యమైన కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల లో ఇంటివద్ద చికిత్సనుండీ, హాస్పిటల్ లో అయ్యే ఖర్చుల వరకూ అన్ని ప్రయోజనాలూ కవర్ అవుతాయి. సీనియర్ సిటిజెన్ ల మెడిక్లైయిం పాలసీ లలో సామాన్యం గా లభించే ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఒక హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కలిగిన అన్ని రకాలైన ఆరోగ్య బాధల నూ కవర్ చేస్తున్నప్పటికీ, కొన్ని సమయాల్లో సీనియర్ సిటిజెన్ మెడిక్లైయిం కవర్ లు నిరాకరణకు గురి అవుతుంటాయి. సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ ల కొన్ని సాధారణ మినహాయింపు లు క్రింద ఇవ్వబడ్డాయి.
తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశము గల వయోవృద్దులకు, ఖరీదయిన చికిత్సఅవసరం అయ్యే వారి కోసం ఒక సీనియర్ సిటిజెన్ మెడి క్లెయిమ్ పాలసీ వారికి కావలసిన హెల్త్ ఇన్సూరెన్సు ను అందిస్తుంది. యుక్త వయసు లో ఉన్నవారు తల్లి తండ్రుల ఆరోగ్య అవసరాలను అత్యంత శ్రద్ధ గా చూసుకోవాలి అందులోనూ తల్లితండ్రులు సీనియర్ సిటిజన్స్ అయివుంటే మరింత గా.
01 . డే-కేర్ ట్రీట్ మెంట్స్
చాలా హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లు డే కేర్ ట్రీట్మెంట్ ను కవర్ చేయవు. అంతే కాక, మెడిక్లైమ్ చేయడానికి ఆసుపత్రి లో కనీసం 24 గంటల సేపు ఉండ వలసి ఉంటుంది. అయితే, ఆధునీకరణ తరువాత జరిగిన గొప్ప విషయం ఏమిటంటే, ఈరోజు; హాస్పిటల్ లో ఉండే అవసరం లేకుండా చాలా పద్ధతులు ఉన్నాయి. అందువల్ల, డయాలసిస్, కీమో థెరపీ, రేడియోథెరపీ మొదలైన ఎక్కువ డే-కేర్ టెక్నిక్స్ కవర్ చేసే ఉత్తమమైన ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
02 . క్యాష్ లెస్ హాస్పిటల్స్
క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను అందించే నెట్ వర్క్ హాస్పిటల్ ల జాబితాను మీరు తనికీ చేసుకోండి. ప్రతీ ఒక్క ఇన్సూరెన్సు కంపెనీ నెట్ వర్క్ లో విస్తృతమైన హాస్పిటల్స్ నెట్వర్క్ రిజిస్టర్ కాబడి ఉన్నాయి. మీ సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ దేని అధీనం లోనికి వస్తుందో తనికీ చేసుకోవచ్చు. అత్యవసర కాలం లో మీ తల్లితండ్రులను ఈ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఎదో ఒక దానిలో చికిత్స చేయించవచ్చు. మరియు అందరూ మనకి దగ్గర గా ఉన్న హాస్పిటల్ లో ప్రత్యేకం గా చికిత్స చేయించుకోవాలని ఇష్టపడతారు.
03 . హెల్త్ ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సామర్ధ్యం
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ టైం అనేవి ముఖ్యమైన అంశాలు గా పరిగణించబడుతుంది. త్వరిత గతిలో క్లెయిమ్ సెటిల్మెంట్ టైం మరియు ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ని కలిగి ఉంటే ఆ భీమా కంపెనీ, పాలసీ దారుల క్లెయిమ్ అభ్యర్ధనల ను చక్కగా పరిష్కరిస్తుందని భావిచవచ్చు.
04 . నో-క్లెయిమ్ బోనస్
చాలా భీమా సంస్థలు పాలసీ దారుడు క్లెయిమ్ లు నమోదు చేయకపోతే, నో-క్లెయిమ్ డిస్కౌంట్ లేదా నో-క్లెయిమ్ బోనస్ ను అందిస్తున్నారు. ఈ సందర్భం లో పాలసీ దారుని ప్రీమియం లో తగ్గింపు లేదా హామీ మొత్తం లో పెంపు లేదా రెండూ సంభవించవచ్చు.
05 . ఫ్రీ మెడికల్ హెల్త్ -చెకప్ సౌకర్యం
పాలసీ దారుల కు ప్రతీ సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు అందించే ఉత్తమమైన హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ని వెతకండి. ఈ సౌకర్యం సాధారణం గా కొన్ని పాలసీ సంవత్సరాలు తరువాత అందజేయబడుతుంది. ఈ ఆరోగ్య పరీక్షలు రెన్యువల్ చేయించే సమయం లో ప్రీమియం పై ప్రభావం చూపవు.
పాలసీ దారుడు హాస్పిటల్ లో చేరినపుడు లేదా అత్యవసర వైద్య చికిత్స కోసం సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను నమోదు చేయడానికి అవకాశమిస్తుంది. ఈ పాలసీ లు ఆయా నెట్ వర్క్ ఆసుపత్రి లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవడాని లేదా చికిత్స కు అయిన ఖర్చులు తిరిగి పొందడానికి ఉపయోగపడుతుంది. ఏది ఏమయినప్పటికీ, క్యాష్ లెస్ మరియు తిరిగి చెల్లించే పద్ధతుల్లో ఏది అయినా సరే, పాలసీ దారుడు తప్పకుండా ఇన్సూరెన్సు సంస్థకు హాస్పిటల్ లో చేరిన 24 గంటల లోపు తెలియజేయాల్సి ఉంటుంది.
సాధారణం గా సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ల నమోదు, పరిష్కారానికి ఈ క్రింది విధానాలను అనుసరించాల్సి ఉంటుంది.:
మీరు సీనియర్ సిటిజెన్ పాలసీ ద్వారా వైద్య చికిత్సల కోసం నెట్ వర్క్ హాస్పిటల్ ను వినియోగించుకొని క్యాష్ లెస్ క్లెయిమ్ నమోదు ఈ క్రింద విధం గా చేయవచ్చును:
సత్వరం గా క్లెయిమ్ ప్రక్రియ మరియు పరిష్కారం పొందటానికి అన్ని అవసరమైన విషయాలను సరిగ్గా నెరవేర్చవలసి ఉంటుంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ మీకు కావలసినప్పుడు ఆరోగ్య ప్రయోజనాలను హామీ ఇవ్వడమే కాక ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961 సెక్షన్ 80 డి ప్రకారం పన్ను మినహాయింపు పొందడానికి సహాయపడుతుంది. మీరు మీ వయోవృద్దులు అయిన తల్లితండ్రులకు సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు పొంది ఉన్నట్లైతే, రూ. 30,000 పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు అవుతారు. అంతే కాక, సంవత్సర ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం రూ. 5,000 అదనపు రిబేట్ కూడా పొందగలుగుతారు.
మీరు ఇప్పటికీ సంపాదిస్తూ, మీ కుమారుని కోసం గానీ కుమార్తె కోసం గానీ హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియం ను చెల్లిస్తూ ఉంటే, రూ. 25,000 అదనపు ఇన్ కం టాక్స్ రిబేటు ను పొందవచ్చు. అంటే, మీరు గరిష్టం గా రూ. 60,000 పన్ను మినహాయింపు సెక్షన్ 80 డి ద్వారా పొందవచ్చు.
* టాక్స్ ప్రయోజనాలు పన్ను చట్టాల లో మార్పులను అనుసరించి ఉంటాయి.
కరోనావైరస్ మన దేశం లో చొచ్చుకొని పోతున్న విధానం బట్టీ చూస్తే, ఈ సమయానికి కరోనా వైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్సు కొనుగోలు చేయడం ఎంతయినా అవసరం. కోవిడ్-19 బారిన పడే వారిలో ఎక్కువమంది వయోవృద్దులు మరియు తక్కువ రోగ నిరోధక శక్తి కలవారు అని అందరకూ తెలిసిందే. అందువలన సీనియర్ సిటిజెన్ లను ఎక్కువ రిస్క్ గల వారు గా పరిగణించ వలసి వస్తుంది.
95 % మరణాలు 60 సంవత్సరాల వయసు పై బడిన వారివే అని ఒక సమాచారం ప్రకారం తెలుస్తోంది.
అందువలన ఇది ముందుగా కలిగి ఉన్న వ్యాధి కాదు కనుక మీ వయోవృద్దులైన తల్లితండ్రులకు సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ తో రక్షణ కల్పించి చికిత్స ఖర్చుల ను పొందవచ్చు. అయినప్పటికీ, హామీ మొత్తము మరియు వైద్య పరీక్షలు, క్వారంటీన్ ఖర్చులు, వెయిటింగ్ సమయం మొదలైన కవరేజీ లు ఒక్కో భీమా సంస్థ కూ ఒక్కో విధం గా ఉంటాయి. మీరు కొరోనా కవచ్ మరియు కొరోనా రక్షక్ పాలసీ లు 65 సంవత్సరాల వయసు వరకూ గల సీనియర్ సిటిజన్ల కొరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ప్లాన్ లో ప్రాధమిక హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లో కవర్ చేయబడని పి పి ఈ కిట్లు, చేతి తొడుగులు, మాస్క్లు , ఆక్సిమీటర్, వెంటిలేటర్ మొదలైన ఖర్చులు కూడా ఇందు లో కవర్ చేయబడతాయి.
మీరు ఒక వయోవృద్ధులు అయి, హెల్త్ ఇన్సూరెన్సు సంక్షోభం లో చిక్కుకొని ఉంటే, పాలసీ బజార్ మిమ్మల్ని రక్షించేందుకు సిద్ధం గా ఉంది.
మంచి నిపుణులు కలిగి ఉన్న టీమ్ తో మా పాలసీ బజార్ త్వరగా మరియు సులువుగా హెల్త్ ఇన్సూరెన్సు మెడిక్లైయిం పాలసీ లను సరిపోల్చి , మీ కాలాన్ని, డబ్బును ఆదాచేయడానికి ఉపయోగపడుతుంది. ఐ ఆర్ డి ఏ అనుమతి పొందిన ఇన్సూరెన్సు సంస్థలు చాలా రకాల సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను వయోవృద్దులకు అందచేస్తున్నరు కనుక వాటిని ఆన్ లైన్ లో ఒక దాని తో మరొకటి సరిపోల్చడం వలన సరైన ప్లాన్ ను ఎన్నుకోవడం సాధ్యం అవుతుంది.
మీరు చేయాల్సిందల్లా, ఒక సరళమైన ఫారం ను మీ వివరాలు మరియు మీ ఇన్సూరెన్సు అవసరాల తో పూర్తి చేయడమే. పూర్తి చేసి సమర్పించగానే, మీకు సరసమైన సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ధరలు లభ్యం అవుతాయి. అన్నింటికంటే ఉత్తమ మైన విషయం ఏమిటంటే మా వద్ద ఉన్న ఇస్యూరెన్సు నిపుణులు మీతో మాట్లాడటానికి ప్రశ్నలకు అడిగితే జవాబు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు.
జవాబు: 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వయోవృద్దుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకం గా తయారుచేయబడినదే ఈ సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ. వయస్సు పెరుగుతూ ఉండటం తో పాటు జీవనశైలి వలన కలిగే అనారోగ్యం మరియు క్లిష్ట ఆరోగ్య పరిస్థితులు కవరేజీ ని కష్ట సాధ్యం చేస్తాయి. ఇది మామూలు హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కన్నా కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.
జవాబు: దీనికి కారణం చాలా స్పష్టం గా ఉంది. ఒక మనిషి వయస్సు పెరుగుతూ ఉండే కొద్దీ వారికి రోగాల బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందువలన వయోవృద్దులు ఎక్కువ ఆరోగ్య రక్షణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ వయో వర్గం వారికి పెన్షన్ తప్ప మరొక ఆదాయ వనరు మార్గము ఉండదు. ఈ కారణం వలన హెల్త్ ఇన్సూరెన్సు ఈ సమయానికి చాలా ముఖ్యమైనది.
జవాబు: సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్సు చాలా ఖఠినమైన ఆరోగ్య పరీక్షలు, కవరేజీ పరిమితుల తో కూడుకొని మరియు కొన్ని మినహాయింపులు కలిగి ఉంటుంది. ఎంట్రీ/ఎగ్జిట్ వయసు, రెన్యువల్ చేసుకొనే గరిష్ట వయోపరిమితి, కో-పేమెంట్ మరియు ఇంటివద్దనే జరిగే ట్రీట్మెంట్ కవరేజీ లు వాటి అంశాలు కొనుగోలు చేసే ముందు గమనించాలి.
జవాబు: ఈ క్రింది పత్రాలు అవసరమవుతాయి.
జవాబు: అవును. సీనియర్ సిటిజెన్ హెల్త్ ప్లాన్ కొనే ముందు మీరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వంటి వయోవృద్దులు ఇన్సూరెన్సు సంస్థల దృష్టి లో ఎక్కువ రిస్క్ ను కలిగి ఉన్నవారుగా గుర్తింపబడతారు. కనుక చాలా ఇన్సూరెన్సు కంపెనీలు పాలసీ తీసుకొనే వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నాయి.
జవాబు: సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు పరిమిత కవరేజీ లను కలిగి ఉంటాయి. ఏదయినా ప్లాన్ ను కొనుగోలు చేసేముందు ఈ క్రింది విషయాలను తప్పక పరిశీలించాలి:
జవాబు: అవును. అన్ని మంచి ఇన్సూరెన్సు కంపెనీలూ క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ని వారి నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్నాయి
జవాబు: మీరు మీ ఇన్సూరెన్సు పాలసీ ను ఒక ఇన్సూరెన్సు కంపెనీ నుండి మరొక ఇన్సూరెన్సు కంపెనీకి మార్చుకుంటే నో-క్లెయిమ్ బోనస్ లేదా సంచిత బోనస్ మరియు వెయిటింగ్ పీరియడ్ లు మీరు కొనసాగింపు ప్రయోజనం గా పొందవచ్చు.
జవాబు: సాధారణం గా, పాలసీ తీసుకొనే ముందు దరఖాస్తు దారుడు ఈ ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఐ ఆర్ డి ఏ అనుమతించిన ఇన్సూరెన్సు కంపెనీలు వారి అనుబంధ ఆసుపత్రులలో వీటిని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తాయి.
జవాబు: కొన్ని ఇన్సూరెన్సు కంపెనీలు, వారి పాలసీ దారులకు (హామీ మొత్తాన్ని అనుసరించి) వరుసగా మూడు సంవత్సరాలు క్లెయిమ్-ఫ్రీ అయితే ఈ ప్రయోజనాన్ని అందజేస్తున్నాయి. కొన్ని ఇన్సూరెన్సు కంపెనీలు మీరు క్లెయిమ్ ని నమోదు చేసినప్పటికీ, ఈ ప్రయోజనాన్ని ప్రతీ సంవత్సరమూ కూడా అందజేస్తున్నాయి. అందువలన, పూర్తి విషయాల కోసం మీ పాలసీ యొక్క ప్రయోజనాల పత్రాన్ని జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, ఇన్సూరెన్సు కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ లేదా దగ్గర లో ఉన్న సంస్థ కార్యాలయానికి వెళ్ళండి. ఒక వేళ పరీక్షలు ఇంపానెల్ల్డ్ సెంటర్ లో జరుగుతున్నట్లైతే, వారు వినియోదారుడిని చెల్లించామని అడగరు ఎందుకంటే ఇన్సూరెన్సు సంస్థ వారు అడిగిన మొత్తాన్ని చెల్లించి ఉంటారు కనుక. అయితే, పాలసీ దారుడు పరీక్షలు దగ్గరలో ఉన్న ల్యాబ్ లో చేయించుకొంటే ఆ చెల్లించిన మొత్తాన్ని తరువాత కంపెనీ నుండి తిరిగి పొందవచ్చు.
జవాబు: క్లెయిమ్ పత్రాలను టి పి ఏ కు జమ చేయాలి. టి పి ఏ లేని పక్షం లో ఇన్సూరెన్సు కంపెనీ ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటే జమ చేయవచ్చు.