ప్రతీ ఒక్కరూ కనీసం రెండు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల కోసం ఎందుకు తెలుసుకోవాలి?

వీలయినంత తక్కువ ప్రీమియం తో జీవిత బీమాను అందిస్తుంది టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ. వీటిలో వ్యక్తిగత పాలసీ లు కొంతమంది సమూహం కోసం గ్రూప్ పాలసీ లు కూడా ఉంటాయి.  మీరు మీ యొక్క భీమా అవసరాలకు అనుగుణం గా ఉత్తమైన పాలసీ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఇన్సూరెన్సు అవసరాలను సరిగ్గా బేరీజు వేసుకొని రెండవ ఇన్సూరెన్సు ప్లాన్ ని కూడా పరిగణ లోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు రెండవ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవాలనుకుంటే, మొదటి ఇన్సూరెన్సు వివరాలను రెండవ  ఇన్సూరెన్సు సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది.

Read more
Get ₹1 Cr. Life Cover at just ₹449/month*
No medical checkup required
Save more with upto 10% discount
Covers COVID-19
Tax Benefit
Upto Rs. 46800
Life Cover Till Age
99 Years
8 Lakh+
Happy Customers
*Tax benefit is subject to changes in tax laws. *Standard T&C Apply
** Discount is offered by the insurance company as approved by IRDAI for the product under File & Use guidelines
Get ₹1 Cr. Life Cover at just ₹449/month*
No medical checkup required
Save more with upto 10% discount
Covers COVID-19
+91
View plans
Please wait. We Are Processing..
Get Updates on WhatsApp
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use

టర్మ్ ప్లాన్ అంటే ఏమిటి?

టర్మ్ ప్లాన్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రమాదాలకు సమర్ధవంతం గా కవర్ చేసే ఒక జీవిత భీమా ప్లాను.  పాలసీ దారుడు మరణించినట్లయితే పాలసీ మొత్తం అతని లబ్ధిదారునికి చెందుతుంది.  ఒక వేళ పాలసీ దారుడు ఆ కాల వ్యవధి లో జీవించి ఉన్నట్లైతే ఏవిధమైన ద్రవ్య ప్రయోజనం ఉండదు.  జీవించి ఉన్నందున టర్మ్ ప్లాన్ ఎటువంటి ప్రయోజనాలను అందించదు. మనుగడ ప్రయోజనాన్ని అందించనందున  వీలైనంత తక్కువ ప్రీమియం కలిగి ఉన్న టర్మ్ ప్లాన్ ని రిస్క్ కవరేజి  కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది.

డెత్ క్లెయిమ్ నిరాకరణ

డెత్ క్లెయిమ్ కొన్ని రకాలైన కారణాల వలన నిరాకరణకు గురిఅవుతుంది. కొన్ని కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి. 

 • ప్రతిపాదన పత్రం లో తప్పుడు/అసంపూర్తి వివరాలు ఇచ్చినందున  
 • ఆరోగ్య చరిత్ర ని సరిగ్గా బహిర్గతం చేయనందున
 • భీమా పాలసీ లాప్స్ అయినందున

చాలామటుకు పాలసీ లను భీమా కంపెనీలే సెటిల్ చేస్తాయి.  భీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ని గమనించడం వల్ల ఆయా కంపెనీల  డెత్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమర్ధతను అర్ధం చేసుకోవచ్చు. 

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇన్సూరెన్సు సంస్థ సమర్ధతను సూచిస్తుంది. ఇది సంపూర్ణం గా ఇన్సూరెన్సు కంపెనీ సమర్ధతను తెలిపే సూచిక కాదు కానీ కొంతవరకూ దీని పై ఆధారపడవచ్చును. 

క్లెయిమ్ సెటిల్ చేసే సమయం లో రిస్క్ కలిగి ఉంటుంది కనుక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించాలి.  ఒకటికన్నా ఎక్కువ ఎక్కువ ప్లాన్ లను కలిగి ఉండటం వల్ల ఈ పరిస్థితి  నుండి కొంతవరకూ తప్పించుకోవచ్చు.  

రెండు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల వలన కలిగే లాభాలు

మీ ఇన్సూరెన్సు అవసరాలకోసం మీరు రెండు అంతకంటే ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను తీసుకోవచ్చు.  ఇన్సూరెన్సు ప్లాన్ కు  ఒకరి కంటే ఎక్కువ లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది.  మీరు రెండు ఇన్సూరెన్సు ప్లాన్ లను కలిగి ఉంటే రెండింటికీ  ఒకే లబ్దిదారుడిని నామినేట్ చేయాలనే నిబంధన లేదు.    దానికి తోడు, ఆన్ లైన్ లో మీకు అనుకూలమైన ప్రీమియం ని కలిగి ఉన్న ఉత్తమ మైన ప్లాన్ ను మిగతా ప్లాన్ లతో సరిపోల్చుకొని,  టర్మ్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ ని ఉపయోగించి, ఎంచుకోవచ్చు.

 • అదనపు భద్రత - ఒకటికి కన్నా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను కలిగి ఉండటం వల్ల అధిక భద్రత పొందవచ్చు.
 • డెత్ బెనిఫిట్ - లబ్ధిదారులు ఒకటికన్నా ఎక్కువ పాలసీ ల ద్వారా వచ్చిన డెత్ బెనిఫిట్ పొందవచ్చు.  
 • క్లెయిమ్ నిరాకరణ నుండి తప్పించుకోవడం -  మీరు ఎక్కువ ఇన్సూరెన్సు పాలసీ లు పొందటం ద్వారా నిరాకరణ ను అధిగమించవచ్చు.  ఒక వేళ ఒక ఇన్సూరెన్సు సంస్థ నిరాకరించినా, మరొక ఇన్సూరెన్సు సంస్థనుండి  క్లెయిమ్ సెటిల్ కావడానికి అవకాశం ఉంది.  తద్వారా మీ నామినీ/లబ్ధిదారునికి సంపూర్ణ భద్రతను కలిగించినట్లు అవుతుంది     
 • క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో - ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒక్కో ఇన్సురన్ పాలసీ కీ ఒక్కో విధం గా ఉంటుంది.  ఈ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్నట్లయితే మీ క్లెయిమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది.  
 • మైలురాయిని చేరుకోండి- మీ జీవితపు మైలు రాయిని చేరుకోవడానికి ఒకటికన్నా ఎక్కువ ఇన్సూరెన్సు ప్లాన్ లు తీసుకోవడం వల్ల సాధ్యమవుతుంది.  మీ వ్యక్తిగత అవసరాలకు, మీ  పై  ఆధారపడి జీవిస్తున్నవారి అవసరాలకు సరిపడే ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకొన వచ్చు.  పిల్లల  చదువులు, పిల్లల వివాహము ఇంకా ఒక క్రొత్త ఇల్లు వంటి క్రొత్త మైలురాయిలను అధిగమించడం ఇన్సూరెన్సు పాలసీ ల వల్ల సాధ్యమవుతుంది.  
 • డెత్ క్లెయిమ్ -  పాలసీ దారుడు పాలసీ కాల పరిమితి కి ముందే మరణించినట్లైతే, ఆ పాలసీదారు యొక్క లబ్ధిదారునికి లభించే మొత్తమే డెత్ క్లెయిమ్.  పాలసీ యొక్క  నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా మొత్తము లబ్ధిదారునికి  చెల్లించబడుతుంది.  

మొదటి ఇన్సూరెన్సు పాలసీ పూర్తి వివరాలు  రెండవ పాలసీ  ఇన్సూరెన్సు కంపెనీకి విధిగా తెలియజేయాలి. ఒక వేళ మూడవ పాలసీ తీసుకునేటప్పుడు మొదటి, రెండవ ఇన్సూరెన్సు పాలసీ ల వివరాలు మూడవ పాలసీ జారీ చేసే ఇన్సూరెన్సు కంపెనీ కి తప్పనిసరిగా తెలియచేయాలి.  

తప్పుడు వివరాలతో నిజాలను కప్పి పెట్టడం వల్ల కూడా క్లెయిమ్స్ నిరాకరణకు గురు అవుతాయి.  

పరిమితులు

ఒకటి కన్నా ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకొనే వారికి కొన్ని రకాల పరిమితులు ఉంటాయి. తీసుకున్న పాలసీ ల మొత్తం విలువ మనిషి జీవిత విలువ కంటే మించి ఉండ కూడదు.  

రిస్క్ ను ఇన్సూరెన్సు కంపెనీ అంచనా వేస్తుంది.  ఒక పాలసీ కోసం  ప్రతిపాదన అందుకున్న వెంటనే పూచీకత్తు ప్రక్రియను ఇన్సూరెన్సు కంపెనీ ప్రారంభిస్తుంది.  కంపెనీ వివిధ రకాల ఆరోగ్య సంబంధమైన రిస్క్ లను ముందుగానే అంచనా వేసి హామీ మొత్తము మరియు ప్రీమియం లను నిర్ణయిస్తుంది.  

బీమా అనేది దరఖాస్తుదారు యొక్క సంవత్సర ఆదాయం మరియు ప్రస్తుత లైఫ్ కవర్ మీద ఆధారపడి ఉంటుంది.

ఋణం తీర్చడానికి ఒక పాలసీ

మీరు మరో 10  సంవత్సరాల వ్యవధిలో రూ. 20 లక్షల రూపాయల ఇంటి కోసం లేదా ఆస్థి కోసం చేసిన అప్పును తీర్చాలంటే ఒకటికి బదులు రెండు ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకోవాల్సి ఉంటుంది.  ఒక టర్మ్ ప్లాన్ రూ. 20 లక్షల రూపాయల కు 10  సంవత్సరాల కాల పరిమితి తోనూ, మరొక టర్మ్ ప్లాన్ రూ. 50 లక్షల రూపాయల కు 10  సంవత్సరాల కాల పరిమితి తోనూ తీసుకోవాల్సి ఉంటుంది.  

ఉదాహరణ 1:   రెండు పాలసీ లు విజయవంతం గా క్లెయిమ్ కాబడినట్లయితే మీ అప్పు తీరి, లోన్ అకౌంట్ మూసి వేయబడింది.  లబ్దిదారుల అవసరాలు తీర్చడానికి ఇంకొక ఇన్సూరెన్సు పాలసీ చెల్లింపు మొత్తం ఉపయోగపడుతుంది.    

ఉదాహరణ 2:  ఒక పాలసీ ఇన్సూరెన్సు కంపెనీ యొక్క నియమ నిబంధనలు మరియు షరతులను పాటించక నిరాకరణకు గురి అయినప్పటికీ కూడా లబ్దిదారుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పు తీర్చగలుగుతాడు.  

ఒకటి కంటే ఎక్కువ పాలసీ లు కలిగి ఉండటం పాలసీ దారుని రక్షణకు ఎంతగానో సహాయపడుతుంది.  

ఒకటికంటే ఎక్కువ ఇన్సూరెన్సు పాలసీ లు క్లెయిమ్ చేసే విధానము

ఒకటికంటే ఎక్కువ ఇన్సూరెన్సు పాలసీ లు క్లెయిమ్ చేసే ముందు అన్ని టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు యొక్క వివరాలు ఇన్సూరెన్సు కంపెనీ కు తెలియజేయాలి.  అన్ని ఇన్సూరెన్సు కంపెనీ లు ఐ ఆర్ డి ఏ (ఇన్సూరెన్సు రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా) వారు  సూచించిన నిర్దిష్టమైన విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.  

అన్ని ఇన్సూరెన్సు కంపెనీ లు  ఐ ఆర్ డి ఏ  పర్యవేక్షణలో పనిచేస్తుంటాయి.  ఐ ఆర్ డి ఏ  వినియోదారుల సంక్షేమాన్ని కాపాడుతుంది.  ఒకవేళ ఏదయినా క్లెయిమ్ లో సమస్య ఏర్పడితే ఆ ఇన్సూరెన్సు కంపెనీ వద్ద టికెట్ నెంబర్ పొందవచ్చు.  ఈ క్రమం లో మీకు ఆ ఇన్సూరెన్సు కంపెనీ స్పందించకపోతే మీకు దాని సహాయంతో ఐ ఆర్ డి ఏ  దగ్గరకు ఆ సమస్యను తీసుకు పోవచ్చును.  అపుడు ఈ  ఇన్సూరెన్సు రెగ్యులేటర్ ఆ సమస్యను స్నేహపూర్వకం గా పరిష్కరిస్తుంది.

మీరు లబ్దిదారుల సురక్షితను కోరుకుంటున్నారా? 

మీరు కనీసం రెండు టర్మ్ పాలసీ లు  తప్పకుండా తీసుకుంటే ,  త ద్వారా  చెల్లింపు జరిగే  సొమ్ము లబ్దిదారుల అవసరాలను పూర్తిచేస్తుంది.   లబ్ధిదారులు అన్ని ఇన్సూరెన్సు పాలసీ నుండీ  డెత్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

లబ్ది దారులు క్లెయిమ్ చేసే తప్పుడు క్లెయిమ్ ధరకాస్తు తో పాటు అధికారిక మరణ ధ్రువ పత్రాన్ని జత చేయవలసి ఉంటుంది.  ఇన్సూరెన్సు కంపెనీ ఆ క్లెయిమ్ ధరకాస్తు తీసుకున్న 10 రోజులలో క్లెయిమ్  ను పరిష్కరిస్తుంది. 

ఇన్సూరెన్సు కంపెనీ లబ్ధిదారుని ఆధారాలను పరిశీలించిన వెంటనే క్లెయిమ్ సొమ్ము ను అందజేస్తుంది.  లబ్ధిదారుడు కావలసిన అన్ని రకాల ఆధారాలు, వివరాలు అందించడం లో విఫలం చెందితే, మరిన్ని ఆధారాలు అడిగే హక్కు ఇన్సూరెన్సు కంపెనీ కి ఉంది.  లబ్ది దారు ఆవశ్యకమైన పత్రాలు అందించలేకపోయినట్లైతే, అతను/ఆమె ఆ ఇన్సూరెన్సు కంపెనీ  తెలియజేసిన విధంగా వివరాలను అందించవలసి ఉంటుంది.   

ఒకటి కంటే ఎక్కువ ఇన్సూరెన్సు ప్లాన్ లను తీసుకోవడం ఎలా?

మీకు ఒకటి కన్నా ఎక్కువ ఇన్సూరెన్సు ప్లాన్ లు తీసుకో వాలనుకుంటే నిపుణులు ఇచ్చే సలహాలను పాటించడం ఉత్తమం.  మీరు ఒకటి కంటే ఎక్కువ ప్లాన్ లు తీసుకోవాలనుకున్నప్పుడు క్రమబద్ధం గా ప్రణాళిక రూపొందించుకొంటే సమయం, చేసిన కృషి కి మంచి ఫలితం ఉంటుంది. 

 • ఒక సంస్థను సంప్రదించడం -   ఇన్సూరెన్సు సేవలను అందించే ఒక సంస్థను సంప్రదించడం ద్వారా వివిధ కంపెనీల ఇన్సూరెన్సు ప్లాన్ లను తెలుసుకోవచ్చు.  
 • ఆరోగ్య పరీక్షలు - మీరు  ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, ఆవే వివరాలు మీరు  అన్ని ఇన్సూరెన్సు కంపెనీ ల తో పంచుకోవచ్చు.  దీనివల్ల ఒకే ఒక్క సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం  వల్ల మీకు  సమయం, డబ్బు ఆదా అవుతాయి.  
 • భీమా - పాలసీ దారుని  తో లబ్ధిదారుని ఉన్న సంబంధం గూర్చి ఇన్సూరెన్సు కంపెనీ లు ప్రశ్నిస్తూ ఉంటాయి.  దీనికి సరిఅయిన ఆధారాలను సమర్పించ వలసి ఉంటుంది.  మీరు మీ దగ్గర కుటుంబసభ్యులు అయిన తండ్రి, తల్లి, కొడుకు లేదా కూతురు లను లబ్ది దారులు గా సూచిస్తే మీ ప్రతిపాదన త్వరగా అంగీకరింప బడుతుంది.   లబ్ది దారుని గా స్నేహితుడు లేదా తోటి ఉద్యోగి వంటి మూడవ పక్షం పేర్లు ఉంటే లబ్ది దారుని  సంబంధానికి ఆధారం గా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
 • ఇన్సూరెన్సు అవసరాల అంచనా - ఎప్పటికప్పుడు మీకు కావలసిన ఇన్సూరెన్సు అవసరాలను అంచనా వేసుకుంటూ ఉండాలి.  మీరు మీ ఆదాయం లో మార్పులు, కుటుంబ భాద్యతలను ఎప్పటికప్పుడు దృష్టి లో ఉంచుకొని ఇన్సూరెన్సు అవసరాలను తెలుసుకోవాలి.  అదనపు/ఒకటికన్నా ఎక్కువ ఇన్సూరెన్సు ప్లాన్ లు ఎన్నుకోవడం ఎప్పటికి ఆర్ధిక భారం కాకూడదు.    
 • యుక్త వయసులో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం - మీరు యుక్త వయసులో ఉన్నపుడే టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ని కొనుగోలు చేయాలి.  మీ వయసు తక్కువ గా ఉంటేనే దాని ప్రీమియం కూడా తక్కువ గా ఉంటుంది.  అదే ప్రీమియం ని ఆ పాలసీ కాలవ్యవధి లో చెల్లించాల్సి ఉంటుంది.  అందువల్ల, ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించడం ఆర్ధిక భారం గా అనిపించదు.  
 • సమీక్షలు - మీరు పలువురు నిపుణులు ఇచ్చే సమీక్షలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.  వివిధ ఇన్సూరెన్సు కంపెనీ లు  అందించే  వివిధ ఇన్సూరెన్సు ప్లాన్ ల కోసం ఇచ్చే ఆ సమీక్షలు మీకు ఉత్తమ మైన ప్లాన్ ని ఎన్నుకోవడానికి సహాయపడతాయి.  మీరు ఇన్సూరెన్సు పాలసీ ప్లాన్ యొక్క ప్రయోజనాలను పెంచుకోవడానికి అదనపు ఫలాలను కూడా జత చేసుకో వచ్చు. ఒక ఉత్తమ మైన ఇన్సూరెన్సు పాలసీ  జీవితం జరిగే మార్పులను అన్నింటినీ సమర్ధవంతం గా ఎదుర్కొనేలా ఉపయోగపడుతుంది.  

చివరి మాట

మీరు ఒకటి కన్నా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు తీసుకుంటే, మీరు అదనపు ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.  మీకు ఎక్కువ పాలసీ లు నిర్వహించడం కష్టం కలిగించవచ్చు.  కానీ, ప్లాన్ లను నిర్వహించడం వల్ల కలిగే ఇబ్బంది  మీకు వచ్చే లాభాలకన్నా తక్కువే అనుకుంటే మీరు ఒకటి కన్నా ఎక్కువ పాలసీ లు తీసుకోవచ్చు.  వివిధ కంపెనీ ల నుండి ఒకటి కన్నా ఎక్కువ ప్లానులు తీసుకోవడం విషయం లో ఏ విధమైన పరిమితులూ లేవు.   వివిధ కంపెనీల వద్ద క్రొత్త ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనే సమయం లో ఆ ఇన్సూరెన్సు కంపెనీ కు ముందు  కంపెనీ లో తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ కి సంబంధిన వివరాలు తప్పక తెలియచేయాలి.  

Written By: PolicyBazaar
You May Also Like

Term insurance articles

Recent Articles
Popular Articles
Which are the 6 Factors That Affect the Term Insurance Premium in India?

13 Jan 2022

A term life insurance plan is the most common and popular option...
Read more
Disease and Disability-Coverage for Self-Employed

13 Jan 2022

As India is moving towards new economic encouragements, growth...
Read more
The Best Disability Insurance for Self-Employed Individuals

13 Jan 2022

When you are self-employed, you sometimes wear many hats at the...
Read more
Free Cover Limit in Group Term Insurance Policies – All You Need to Know

13 Jan 2022

Life insurance covers offered by insurance companies establish...
Read more
Term Insurance for Entrepreneurs

13 Jan 2022

A term Insurance Plan is designed for every sector, be it self-...
Read more
LIC Term Insurance 1 Crore
If you have a LIC term insurance 1 Crore handy, you can cherish all your happy moments as you have made a fine...
Read more
Types of Deaths Covered & Not Covered by Term Life Insurance
Types of Deaths Covered and Not Covered by Term Insurance When it comes to securing the future of your loved ones or...
Read more
Term Insurance for NRI in India
Term insurance offers financial protection to the family of the insured in case of demise. Every bread-earner...
Read more
Important Aspects of 5-year Term Life Insurance Plan
Intro: 5 Year term life insurance is the most cost-effective life insurance plan that one can consider for...
Read more
10 Questions You Should Ask Before Buying Term Insurance
10 Questions You Should Ask Before Buying Term Insurance There are various doubts faced by customers when it comes...
Read more
top
View Plans
Close
Download the Policybazaar app
to manage all your insurance needs.
INSTALL