ఇన్సూరెన్స్ ప్రీమియంల యొక్క మాన్యువల్ లెక్కింపు గజిబిజిగా బోరింగ్ పద్దతిని కూడా చెప్పనవ సరంలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీకు ప్రీమియం ఖర్చు యొక్క స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి, మీరు మీ యొక్క వయస్సు, బీమా కింద కవర్ చేయబడే కుటుంబ సభ్యుల సంఖ్య మరియు ముందుగా ఏవయినా అనారోగ్యాలు ఉంటే వాటి గురించిన తదితర వివరాలను మొదలగునవి అందించాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ద్వారా నంబర్స్ ఆటోమేటిగ్గా లెక్కించబడుతుంది మరియు మీరు వెంటనే మీ రిసల్ట్ తెలుసుకోవచ్చు. ఇది మీ ప్రీమియం కాలిక్యులేషన్ని కొన్ని క్లిక్ లతో మాత్రమే గాలి పిల్చుకునే అంత సులభంగా ఉండే ప్రక్రియగా మార్చడానికి అంకితం చేయబడింది.
*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply
*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply
My name is
My number is
My name is
My number is
Select Age
City Living in
Popular Cities
Do you have an existing illness or medical history?
This helps us find plans that cover your condition and avoid claim rejection
What is your existing illness?
Select all that apply
When did you recover from Covid-19?
Some plans are available only after a certain time
చాలా మంది ప్రజలు వారి ప్రీమియం చెల్లింపులపై వివరాలు అందివ్వడానికి వారి యొక్క ఇన్సూరెన్స్ సంస్థలపైన ఆధారపడతారు. ఒక బీమా పాలసీని సెటిల్ చెయ్యడానికి ఉండే రిసెర్చ్ ప్రోసెస్ నివారించవచ్చు. ఇది ఇక్కడ మెడిక్లెయిమ్ ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క పాత్రని అమలులోకి తెస్తుంది. ఇది టైమ్ సేవ్ చేస్తుంది మరియు సమర్ధవంతమైనది.
ఉదాహరణకి, ఆరోగ్య బీమా ప్రీమియం 20వ సంవత్సరంలో చెల్లించే వ్యక్తి 40వ సంవత్సరంలో చెల్లించే వ్యక్తితో పోలిస్తే తక్కువ మొత్తం చెల్లిస్తాడు. వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంటే అనారోగ్యం చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి మరియు ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే ముందే ఆ వ్యక్తి మెడికల్ టెస్ట్ చేయించుకోవలసిన అవసరం ఉంది.
దరఖాస్తు దారులలో చిన్న వయస్కులు మరియు ముందుగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారితో పోలిస్తే ముందుగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, పొగాకు ఉపయోగించేవారు మరియు ధూమపానం చేసేవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు మరియు పాలసీ వ్యవధిలోనే క్లెయిమ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మెడికల్ కవరేజీని పొందటానికి అలాగే పాలసీ అమలులో ఉందని నిర్ధారించుకోవడానికి మీరు బీమా సంస్థకి నియమిత సమయంలో చెల్లించాల్సిన డబ్బు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ యొక్క బీమా అవసరాల ఆధారంగా మీ మెడిక్లెయిమ్ ప్రీమియాన్ని లెక్కించడానికి అవసరాన్ని కల్పిస్తుంది. బదులుగా, హాస్పిటల్ ఖర్చులు మరియు వైద్య ఖర్చులను అత్యవసర వైద్య పరిస్థితులలో లేదా పాలసీ నిబందనలకి లోబడి వ్యాధి నిర్ధారణ అయినప్పుడు బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్ పాలసీలు చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు పాలసీ పత్రాలలో కొన్ని తెలియని నియమాలు మరియు నిబందనలు ఉంటాయి. కొన్నిసార్లు, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బీమా-నిర్దిష్ట నిబందనలు మీకు అర్ధంకాలేదు మరియు తత్ఫలితంగా, మీ అంచనాలకంటే ఎక్కువ మొత్తాన్ని మీరు చెల్లించాల్సివస్తుంది. ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఖచ్చితంగా ఎంత ప్రీమియం చెల్లించాలి అనేది మీకు ముందుగానే తెలిస్తే? మీ జీవితం చాలా సులభతరం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:
01 మెడికల్ హిస్టరీ
ముందే వైద్య పరీక్షలు లేదా మెడికల్ హిస్టరీ ఫలితాల ఆధారంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని నిర్ణయిస్తారు. కొన్ని ప్లాన్స్ లో వైద్య పరిక్ష అవసరం లేకపోవచ్చు కానీ మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ ఆరోగ్య నేపధ్యం మరియు జీవనశైలికి సంబందించిన అలవాట్లు పరిగణలోకి తీసుకోబడతాయి. ధూమపానం చేసేవారికి ప్రీమియం సాదారణంగా ఎక్కువగా ఉంటుంది.
02 ప్రవేశ వయస్సు మరియు లింగం
వయసస్సు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని లెక్కించేటప్పుడు ఒక ముఖ్యమయిన నిర్ణయ కారకం. ప్రీమియం అనేది పాలసీ దారుని వయసస్సుతో పాటు పెరుగుతుంది. ఎక్కువ వయస్సువారు క్లిష్టమైన అనారోగ్యాలకి, అనగా హృదయ సంబందిత వ్యాధులు, మూత్రపిండాల లోపాలు మొదలగువాటికి ఎక్కువగా గురవుతారు. సాధారణ హెల్త్ ప్లాన్ కన్నా ప్రీమియం సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కి ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. అలాగే, పురుషులతో పోల్చుకుంటే మహిళలకి గుండె పోటు, స్ట్రోక్ మొదలగు ప్రమాదాలు తక్కువ కారణంగా మహిళా అభ్యర్ధులకు ప్రీమియంలు తక్కువ.
03 పాలసీ నిర్ణీత కాలం
ఒక సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ పధకానికి ప్రీమియం 2-సంవత్సరాల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. అయితే మీరు లాంగ్-టర్మ్ పాలసీని కొనుగోలు చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది.
04 ఎంచుకున్న ప్లాన్
మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రీమియం ఖర్చుని ప్రభావితం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తక్కువ రిస్క్ ఉంటే తక్కువ ప్రీమియం ఉంటుంది మరియు దీనికి వైస్-వెర్సా. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగించి తెలివిగా ఎంచుకున్న మరియు మంచి ప్లాన్ ఇది అనేక ప్రయోజనాలను మరియు మీకు కావలసిన ప్రీమియంను పొందటానికి మీకు సహాయం చేస్తుంది.
05 నో-క్లెయిమ్-బోనస్
ఇది అన్ని సంవత్సరాలుగా మీరు కట్టే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క క్లెయిమ్ చేసుకోని మొత్తం పైన వచ్చే డిస్కౌంట్. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించే ముందు పరిగణించవలసిన ముఖ్యమయిన అంశం.
06 జీవనశైలి
మీరు ధూమపానం లేదా క్రమం తప్పకుండా మద్యపానం చేస్తుంటే, మీరు ప్రీమియంకు అదనపు మొత్తం చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి, కంపెనీ మీ పాలసీని జారీ చేయడానికి తిరస్కరించవచ్చు.
బీమా సంస్థలకు మెడిక్లెయిమ్ కు సంబందించి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి మరియు వాటిని ప్రతి వ్యక్తికీ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే సమయంలో వాటి అన్నింటినీ అనుసరించాలి; హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి కూడా అదే జరుగుతుంది. చాలామంది బీమా సంస్థలు అనుసరించేటటువంటి మార్గదర్శకాల జాబితా క్రింద ఇవ్వబడింది:
01 మార్కెటింగ్ మరియు సేవలకి సంబందించిన ఖర్చులు
మార్కెటింగ్ మరియు సేవలకు సంబందించిన ఖర్చులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, అవి పాలసీదారులు చెల్లించే ప్రీమియంల నుండి ఖచ్చితంగా భర్తీ చేయబడతాయి. ఈ ఖర్చులు వివరంగా చెప్పబడ్డాయి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క రూపకల్పన ఖర్చుగా తరువాత మార్కెటింగ్, కమీషన్, బ్రోకరేజ్, బ్రోచర్, ప్రకటన మరియు ఇతర అదనపు ఖర్చులుగా ముసాయిదా చేయబడతాయి.
02 పొదుపులు మరియు పెట్టుబడులు
ఇన్సూరెన్స్ కంపెనీలు తమ మూలధనాన్ని ప్రభుత్వరంగ పెట్టుబడికి సంబందించిన సంస్థలలో పెట్టుబడిగా పెడతాయి.ఇలాంటి కంపెనీలు సాధారణంగా అదిక నష్టాల కారణంగా ప్రైవేటురంగంలో పెట్టుబడులు పెట్టడానికి తప్పించుకుంటాయి. వీటిలో చేసిన ప్రతిఒక్క పెట్టుబడులు మరియు తరువాత వచ్చే సమ్మతి సమస్యలను నివారించడానికి భారత IRDA యొక్క మార్గదర్శకాలను అనుసరిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియంలు అటువంటి సంస్థల ద్వార సంపాదించిన రాబడులకి లోబడి ఉంటుంది.
03 పాలసీ పూచికత్తు
ఇన్సూరెన్స్ కంపెనీలలో వివిధ రకాలకు సంబందించిన ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, అవి ఏమనగా వ్యక్తిగత ఆరోగ్య బీమా, కుటుంబ ఆరోగ్య బీమా మరియు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ కంపనీలు తమ మెడిక్లెయిమ్ పాలసీలను ఒకే సమయం లో అన్నింటి మధ్య సమతుల్యత ఉండే పద్ధతిలో పూచికత్తు చేసే విధంగా పొందుతారు. వారు సాధ్యమయినంతవరకూ వచ్చే నష్టాలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోణాలలో విశ్లేషించి సమస్యలను కలిగించే అనేక రకాల కారకాలను పరిగణలోకి తీసుకుంటారు. దాని ఆధారంగా, వేర్వేరు మెడిక్లెయిమ్ పాలసీలు వారి అర్హత మరియు పాలసీదారునికి కవరేజీని తిరస్కరించాల్సిన సందర్భాలు వంటి నిర్దిష్ట ప్రమాణాలను పొందుతాయి. స్పష్టంగా, ఈ చర్యలు భవిష్యత్తులో నష్టాలను నివారించడానికి తీసుకోబడినవి.
04 మరణాల రేటు
అత్యవసర పరిస్థితులలో బీమా చేసిన వ్యక్తికి లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరయినా హాస్పిటల్ లో చేరినప్పుడు వారికి రావాల్సిన సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉన్నప్పుడు చెల్లించాల్సిన మొత్తాన్ని వారు చెల్లిస్తామని హామీ ఇచ్చే సందర్భాలు ఉంటాయి. మరణాల రేటు అంటే ఒక కస్టమర్ కు చివరి దశలో బీమా సంస్థ భరించాల్సిన ఖర్చు తప్ప మరొకటి కాదు. ఈ ఖర్చులు వయస్సుతో అనుగుణంగా మారుతూ ఉంటాయి, పాత కస్టమర్ల విషయంలో ఇటువంటి భాద్యతలు తరచూ తలెత్తుతూ ఉంటాయి. ఇది దేని వలన అంటే:
అయినప్పటికీ అన్ని ఇన్సూరెన్స్ జెనరల్ కంపెనీలు మీకు ఆరోగ్య బీమా పాలసీని ఇచ్చే ముందు మీరు పూర్తి ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొందరు దానిని మీపై వదిలేసి దరఖాస్తు రూపంలో మీరు వారికీ అందించిన సమాచారంతో ముందుకు వెళతారు. మీకు ఆరోగ్య బీమా పాలసీని ఇచ్చే ముందు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ ఆరోగ్య నేపధ్యాన్ని, ధూమపానం/మద్యపానం అలవాట్లను నమోదు చేసుకోవాల్సిన అవసరం బీమా సంస్థలకు ఉంది. ఈ సమాచారం ఆధారంగా, ప్రీమియం కవరేజీకి చేల్లించవలసినది లెక్కించబడుతుంది, ఇది పాలసీ ప్రయోజనాలను పొందటానికి మీరు చెల్లించాలి. దీని అర్ధం ఎవరికైనా మెడికల్ హిస్టరీ ఉన్నా, లేదా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నవారు కవరేజీని పొందటానికి అదనపు ప్రీమియం చెల్లించాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క ప్రాముఖ్యతను ఎక్కువమంది ప్రజలు గ్రహించినప్పటికీ, ప్రీమియం ఖర్చు ఇప్పటికీ చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. తక్కువ ప్రీమియంతో మెడిక్లెయిమ్ పాలసీలు ఉన్నప్పటికీ తగినంత ఆరోగ్య రక్షణని అందించడం లేదు. కానీ మీ ఆరోగ్య బీమా ప్రీమియంను తగ్గించే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
మెడికల్ కవరేజీతో పాటు, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80D క్రింద ఆరోగ్య బీమా పాలసీలకు కూడా పన్ను ప్రయోజనం ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఆరోగ్య బీమా పాలసీకోసం మీరు చెల్లించే ప్రీమియంలు ఐటి సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపు పొందటానికి మీరు అర్హులు, ఇక్కడ మీకు 60ఏళ్ల లోపు వయస్సు ఉంటే ఆర్ధిక సంవత్సరంలో గరిష్టంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మరోవైపు మీరు ఒకవేళ సీనియర్ సిటిజెన్ అయితే ఆర్ధిక సంవత్సరంలో ఈ పరిమితి రూ. 30,000 వరకు ఉంటుంది.
సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఆరోగ్య బీమా ప్రీమియంగా ఎంత ఎక్కువ చెల్లిస్తారో, మీ ఆదాయపు పన్నుపై అంత ఎక్కువగా ఆదా చేస్తారు. హెల్త్ కవరేజీ ద్వార తగినంత ప్రయోజనం పొందటానికి ఎంత చెల్లించాలో తెలుసుకోవడానికి ఆరోగ్య బీమా ప్రీమియం కాలిక్యులేటర్ ను ఉపయోగించండి.
ఒకవేళ మీరు మీ కుటుంబంలో బ్రెడ్ విన్నర్ (ఏకైక సంపాదన) మరియు మీ కుటుంబానికి(భార్య మరియు పిల్లలు) అలాగే మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా ప్రీమియంలు చెల్లిస్తుంటే, అప్పుడు మీకు ఆర్ధిక సంవత్సరంలో మొత్తం కలిపి పన్ను మినహాయింపు రూ.55,000 పొందవచ్చు.
మీకు వార్షిక ఆరోగ్య పరీక్షల కొరకు రూ.5000 అదనపు పన్ను మినహాయింపు ఉంటుంది.
గమనిక: పన్ను మినహాయింపు పొందటానికి, మీరు మీ ఆరోగ్య బీమా ప్రీమియంలను చెక్ రూపంలో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఒకవేళ మీరు మీ ఆరోగ్య బీమా రెన్యువల్ ప్రీమియంను గత సంవత్సరం నగదు ద్వారా చెల్లించినట్లయితే, మీరు ఆ చెల్లింపు ఆధారంగా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయలేరు.
* పన్ను ప్రయోజనం పన్ను యొక్క చట్టాలలో మార్పులకు లోబడి ఉంటుంది.
పాలసీబజార్ మీకు అధునాతన ఆరోగ్య బీమా ప్రీమియం కాలిక్యులేటర్ ను అందిస్తుంది ఇది మీ కోసం ఖచ్చితంగా అదే ఫంక్షన్ చేస్తుంది. ఈ ఆన్ లైన్ ప్రీమియం కాలిక్యులేటర్ వివిధ ఆరోగ్య బీమా పాలసీల యొక్క ప్రీమియంలను లెక్కించడానికి మీకు వీలును కల్పిస్తుంది మరియు మీకు ఉచితంగా కోట్ చేస్తుంది. మీరు వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రీమియం ఆధారగానే కాకుండా కవరేజ్ గొడుగు క్రింద ఉన్న ప్రయోజనాల ఆధారంగా కూడా పోల్చవచ్చు.
ఈ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం కాలిక్యులేటర్ తో, మీరు చెయ్యాల్సిందల్లా మీ వ్యక్తిగత వివరాలతో పాటు ఎవరికోసం పాలసీ కొనాలనుకుంటున్నారో ఆ కుటుంబసభ్యుల వివరాలను అందించాలి. అందించిన సమాచారం ఆధారంగా, ఈ ప్రీమియం కాలిక్యులేటర్ మీకు అనువైన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల రేంజ్ ని పోల్చి చూస్తుంది. కవరేజ్ ఆధారంగా మరియు మీ బడ్జెట్ లో మీకోసం ఉతమమైన ప్రీమియం ప్లాన్ ను ఎంచుకోండి.
ఆన్ లైన్ లో మెడిక్లెయిమ్ ప్రీమియం కాలిక్యులేటర్ ను ఉపయోగించడానికి ఈ క్రింది అంశాలను అనుసరించాలి:
ఇప్పుడు, మీరు వివిధ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క ఫీచర్స్ మరియు దానికి సంబందించిన ప్రీమియంలను చూడవచ్చు. మెడిక్లెయిమ్ ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగించి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రీమియం ప్లాన్ లను పోల్చుకోవచ్చు మరియు ఉతమమైన ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే పాలసీబజార్ యొక్క మద్దతు బృందంతో కూడా మీరు చాట్ చేయవచ్చు.