ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు

మీ కుటుంబ సభ్యుల మొత్తానికి ఒక నిర్దిష్టమైన హామీ మొత్తానికి కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్సు నే, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు అంటారు. అటువంటి హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కుటుంబ సభ్యులకు ఒకే సమయం లో హాస్పిటల్ లో జాయిన్ కావడం లేదా అనారోగ్యానికి గురి కావడం జరిగితే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కవరేజీ తప్పక కల్పిస్తుంది.

Read More

  • Policybazaar is one of India's leading digital insurance platform
  • ~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
  • 6.7 Crores Registered consumer
  • 51 Insurance partners
  • 3.4 Crores Policies sold
Policybazaar exclusive benefits
  • 30 minutes claim support*(In 120+ cities)
  • Relationship manager For every customer
  • 24*7 claims assistance In 30 mins. guaranteed*
  • Instant policy issuance No medical tests*

*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply

*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply

Back
Find affordable plans with up to 25% Discount**
  • 1
  • 2
  • 3
  • 4

Who would you like to insure?

  • Previous step
    Continue
    By clicking on “Continue”, you agree to our Privacy Policy and Terms of use
    Previous step
    Continue

      Popular Cities

      Previous step
      Continue
      Previous step
      Continue

      Do you have an existing illness or medical history?

      This helps us find plans that cover your condition and avoid claim rejection

      Get updates on WhatsApp

      Previous step

      When did you recover from Covid-19?

      Some plans are available only after a certain time

      Previous step
      Advantages of
      entering a valid number
      valid-mobile-number
      You save time, money and effort,
      Our experts will help you choose the right plan in less than 20 minutes & save you upto 80% on your premium

      మీరు మీకోసం, పిల్లలు మరియు లేదా మీ జీవిత భాగస్వామి కి ఫ్లోటర్ సమ్ ఇన్సూరెన్సు కవరేజీ కల్పించినట్లైతే, అది మీ కుటుంబ సభ్యుల కు పూర్తి హామీ మొత్తం వరకూ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్లాన్లు మీరు మీ కుటుంబ అవసరాల కు తగ్గట్టు గా మార్పుచేసుకోవడానికి అనువుగా ఉంటుంది.

      ఈ మధ్య విస్తరిస్తున్న మహమ్మారి నుండి మీ ఫ్యామిలీ ని రక్షించుకోవ డానికి, వైద్య అవసరాలు కల్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ని ఇవ్వాలి. మీ కుటుంబ సభ్యుల కు మెరుగుతున్న మెడికల్ ఖర్చు లకు సరైన హెల్త్ ఇన్సూరెన్సు కవరేజీ ని ఇవ్వడం అత్యంత అవసరమైన విషయం. ఈ మద్య కాలం లో కొవిడ్-19 మెడికల్ ట్రీట్మెంట్ కు కూడా కవరేజీ ని మీకు ఉన్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తో పాటు అదనం గా అందిస్తున్నారు.

      అయినప్పటికీ, మీరు కరోనా కవచ్ పాలసీ వంటి ప్రత్యేకమైన కొవిడ్ మెడికల్ ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకోవచ్చు. అది మీకు హాస్పిటలైజేషన్, హోమ్ ట్రీట్మెంట్ మరియు ఆయుష్ ట్రీట్మెంట్ లాంటి అన్ని కొవిడ్ సంబంధిత ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది పి పి ఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్ లు, ఆక్సిమిటర్స్, వెంటిలేటర్స్, ఫుట్ కవర్ వంటి వినియోగ వస్తువుల ఖర్చులను కూడా చెల్లిస్తుంది.

      మీరు ఒక సరైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు కోసం వెతుకుతున్నట్లైతే, మీరు పాలసీ బజార్ తో చాలా సులువు గా పాలసీ లను సరిపోల్చుకొని, ఒక ఉత్తమ మైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను పొందవచ్చు.

      కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేయడం వలన ప్రయోజనాలు

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ పిల్లలు, వయోవృద్దులు మొదలైన వారు కలిగిన పెద్ద కుటుంబాలకు ఎక్కువ గా ప్రయోజనం ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల వలన పాలసీ దారులు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మీకు వయస్సు తో సంబంధం లేకుండా అందరు కుటుంబ సభ్యులకూ కవరేజీ ని ఈ ఒక్క పాలసీ తో పొందవచ్చు. ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

      01. ఒత్తిడి-లేని హాస్పిటలైజేషన్ ఖర్చుల కవరేజీ

      కుటుంబ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల వలన కుటుంబ సభ్యులందరికీ వేర్వేరు వ్యక్తిగత హెల్త్ పాలసీ లు తీసుకోవలసిన పని ని తగ్గిస్తుంది. అంతే కాక, మీరు హెల్త్ కవర్ కోసం ప్రత్యేకం గా ప్రీమియం కూడా ప్రతీ ఒక్క వ్యక్తి కోసం చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఇన్సూరెన్సు చేయబడిన వ్యక్తి హాస్పిటల్ లో జాయిన్ కాబడితే, వ్యక్తి గత ఇన్సూరెన్సు పాలసీ దారుని వలే నెట్ వర్క్ హాస్పిటల్ ల లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను పొందవచ్చు. ఈ విధం గా, మీరు మీ కుటుంబ సభ్యుల చికిత్స విషయం లో రాజీ పడనవసరం లేకుండా అన్నివైద్య సహాయాలు అందించగలుగుతారు.

      02.క్రొత్త ఫ్యామిలీ మెంబెర్స్ కు సులువుగా భీమా ను కల్పించడం

      ఈ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లలో, మీరు క్రొత్త కుటుంబ సభ్యులను ఈ పాలసీ తో జత చేయడం సులువు. వ్యక్తి గత పాలసీ అయితే, క్రొత్త కుటుంబ సభ్యుడు ప్రవేశించిన ప్రతీ సారి ఒక క్రొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ తల్లితండ్రులను ఈ పాలసీ లో జత చేయాలని భావిస్తే, ఎక్కువ హామీ మొత్తం గల పాలసీ ని ఎంచుకోవడం మంచిది. ఒక వేళ పెద్ద వయసు గల కుటుంబ సభ్యుల మరణం తరువాత లేదా ఇంక ఎవరూ అర్హులు కానిచో మిగిలిన కవరేజీ కలిగిన సభ్యులు హెల్త్ఇన్సురన్సు కవరేజీ ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు. ఇదే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ అందించే అతి పెద్ద ప్రయోజనం.

      03.సరసమైన ప్రీమియం

      ఇది ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ కావడం చేత ప్రతీ కుటుంబ సభ్యునికి వ్యక్తిగత ప్రీమియం చెల్లించనవసరం లేదు. మీరు మీ జీవిత భాగస్వామికి, పిల్లలకు మరియు తల్లితండ్రులకూ ఒకే ప్లాన్ లో మీకు అందుబాటు లో ఉండే ప్రీమియం ధరలో పొంది కవరేజీ అందచేయవచు. అయితే, తల్లి తండ్రుల కోసం వారి వయో-సంబంధమైన ఆరోగ్య సమస్యల కోసం వ్యక్తి గత హెల్త్ కవర్ కొనుగోలు చేయడం మంచిదని సూచించ బడుతుంది.

      04.ఒకే ప్లాన్ లో తల్లితండ్రులకు హెల్త్ ఇన్సూరెన్సు

      మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, మీ తల్లి తండ్రులకు, మీ జీవిత భాగస్వామి తల్లి తండ్రుల ఆరోగ్య ప్రయోజనాలకు ఒకే ప్లాన్ లో కవరేజీ ని పొందవచ్చు. కొంత అదనపు ప్రీమియం ను చెల్లించడం ద్వారా మీ పై ఆధారపడుతున్న తల్లితండ్రులకే కాక అత్తమామలకు కూడా వ్యక్తిగత ఇన్సూరెన్సు ఆరోగ్య కవరేజీ ని పొందవచ్చు.

      05.కుటుంబం కోసం కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్సు

      మీరు మీ కోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్సు ను కొనుగోలుచేయవచ్చును. దాదాపు అన్ని ఇన్సూరెన్సు కంపెనీలూ ప్రాధమిక ఇన్సూరెన్సు ప్లాన్ లో భాగం గా కొరోనావైరస్ చికిత్సను కూడా కవర్ చేస్తున్నాయి. కొన్ని రకాల ఇన్సూరెన్సు సంస్థలు కేవలం కొరోనా కోసం ప్రత్యేకం గా కొరోనా కవచ్ పాలసీ మరియు కొరోనా రక్షక్ వంటి పాలసీ లు అందిస్తున్నాయి. కొరోనా కవచ్ పాలసీ ఫ్యామిలీ ఫ్లోటర్ పద్దతి పై హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చు, పి పి ఈ కిట్లు, ఐ సి యూ ఖర్చు, డాక్టర్ ఫీజు వంటి అన్ని చికిత్స ఖర్చులు కవర్ చేస్తుంది.

      కొరోనా రక్షక్ పాలసీ కూడా కోవిడ్ ట్రీట్మెంట్ కవర్ చేస్తుంది కానీ వ్యక్తిగతం గా కనీసం 72 గంటల హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది. కుటుంబ సభ్యులకు వేర్వేరు గా వ్యక్తిగత పాలసీ లు కొనుగోలు చేయాలనుకుంటే కొరోనా రక్షక్ పాలసీ ని ఎంచుకోవచ్చు. లేదా మీ ఇన్సూరెన్సు సంస్థ ను సంప్రదించి, మీ ప్రస్తుత కుటుంబ హెల్త్ ఇన్సూరెన్సు లో కొరోనావైరస్ ట్రీట్మెంట్ కవరేజీ ను తనికీ చేసుకోండి.

      06.అదనపు ప్రయోజనాలు పొందే విధానం

      విధ రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలకూ, ప్రసూతి సంబంధిత కవరేజీ కోసం ఆడ్-ఆన్ ప్రయోజనాలు లభ్యం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు, యువ జంట ప్రసూతి కవర్ పొందవచ్చు మరియు క్రొత్త గా-పుట్టిన పిల్ల లకు కవరేజీ. అయినా, ఇది వెయిటింగ్ పీరియడ్ తో కూడుకున్న అంశం. మీరు ఉత్తమ మైన హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు మీ కుటుంబ ప్రసూతి కవరేజీ తో పాటు పొందాలనుకుంటే, మీ పాలసీ పత్రాన్ని జాగ్రత్తగా చదవండి.

      07.డిస్కౌంట్ లు అందుకోండి

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ వలన మీకు ఇన్సూరెన్సు పాలసీ లు అందించే డిస్కౌంట్స్ మరియు ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులువైన మరియు, సరళమైన మార్గము.

      08.హెల్త్ఇన్సురెన్సు ద్వారా పన్ను ప్రయోజనాలు

      ఇండియన్ ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, సెక్షన్ 80 డి ద్వారా హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియం లో పన్ను రాయితీ కలిగిస్తుంది. ఒక వ్యక్తి తమ కుటుంబానికి, మరియు తల్లి తండ్రులకు హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లిస్తున్నట్లైతే, పన్ను ప్రయోజనాలకు అర్హులు అవుతారు.

      சுகாதார காப்பீட்டு நிறுவனம்
      Expand

      ఇండియా 2020 లో ఉత్తమమైన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

      మీకు సులువు గా ఉండేందుకు ఇండియా లో ఉన్న పెద్ద హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు అందిస్తున్న ఉత్తమ మైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు కొన్నింటిని మీ కుంటుంబానికి తగిన మెడిక్లైయిమ్ పాలసీ ని కొనుగోలుచేసేందుకు అందిస్తున్నాము. మీ అవసరాలు అంటే, హామీ మొత్తం, వయోపరిమితి, ప్రీ & పోస్ట్ హాస్పిటలైజేషన్ వంటి అవసరాలకు తగిన ప్లాన్ ను ఎంచుకోవడానికి ఉపయోగపడతాయి.

      ఇన్సూరెన్సు కంపెనీ

      ఫ్యామిలీ హెల్త్ ప్లాన్

      హామీ మొత్తం (రూ.)

      ప్రీ & పోస్ట్ హాస్పిటలైజేషన్

      ముందే కలిగి ఉన్న వ్యాధుల కొరకు

      ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు

      ఆక్టివ్ హెల్త్ ప్లాటినం

      2 లక్షలు - 2 కోట్లు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      బజాజ్ అలియాన్స్ హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్-గార్డ్

      1.5 - 50 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      భారతి ఏ ఎక్స్ ఏ హెల్త్ ఇన్సూరెన్సు

      స్మార్ట్ సూపర్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ

      5 లక్షలు - 1 కోటి

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంతకు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు)

      కేర్ హెల్త్ కేర్ ప్లాన్

      3 - 6 కోట్లు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      చోళ ఎం ఎస్ హెల్త్ ఇన్సూరెన్సు

      చోళ ఎం ఎస్ ఫ్యామిలీ హెల్త్ లైన్ ఇన్సూరెన్సు

      2 - 15 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు

      డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్

      2 - 25 లక్షలు

      --

      వర్తించదు

      ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ ఫ్లోటర్

      1 కోటి వరకూ

      1. సిల్వర్: 30 & 60 రోజులు

      2. గోల్డ్: 60 & 90 రోజులు

      3. ప్లాటినం: 90 & 180

      --

      ఫ్యూచర్ జెనెరలి హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యూచర్ హెల్త్ సురక్ష ఫ్యామిలీ ప్లాన్

      5 - 10 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు

      ఇఫ్కో టోకియో ఫ్యామిలీ హెల్త్ ప్రొటెక్టర్ ప్లాన్

      1.5 - 30 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 45 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      -

      కోటక్ మహీంద్రా హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు

      2 - 100 లక్షలు

      1 . కవర్ చేయబడింది

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు

      సెక్యూర్ హెల్త్ కనెక్ట్

      1 .సెక్యూర్ బేసిక్: 3,4, 5 ఎల్

      2 . సెక్యూర్ ఎలైట్: 2, 3, 4, 5, 6, 7.5, 10 ఎల్

      3 . సెక్యూర్ సుప్రీమ్: 3, 4, 5, 6, 7.5, 10 ఎల్

      4 . సెక్యూర్ కంప్లీట్: 2, 3, 4, 5, 6, 7.5, 10, 15 ఎల్

      --

      --

      మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు

      హార్ట్ బీట్ ఫ్యామిలీ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్

      1. సిల్వర్: 3-15 లక్షలు

      2. గోల్డ్: 3-50 లక్షలు

      3. ప్లాటినం: 15-50 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      సిల్వర్ ప్లాన్ కు 48 నెలలు

      గోల్డ్ & ప్లాటినం ప్లాన్ కు 24 నెలలు

      మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ ఫ్లోటర్ - ప్రో హెల్త్ ప్రొటెక్ట్ ప్లాన్

      2.5 - 50 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు

      నేషనల్ ఇన్సూరెన్సు మెడిక్లైయిం పాలసీ

      50000 - 5 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      న్యూ ఇండియా అసురన్సు హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లైయిం పాలసీ

      2 - 5 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ

      హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ

      1 - 20 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      రహేజా క్యూ బి ఈ హెల్త్ ఇన్సూరెన్సు

      హెల్త్ క్యూ బి ఈ

      1 - 50 లక్షలు

      --

      --

      రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్సు

      రాయల్ సుందరం లైఫ్ లైన్ హెల్త్ ఇన్సూరెన్సు

      1. క్లాసిక్: 2, 3, 4 లక్షలు

      2. సుప్రీం: 5, 10, 15, 20 & 50 లక్షలు

      3. ఎలైట్: 25, 30, 50, 100 & 150 లక్షలు

      1. క్లాసిక్: 30 & 60 రోజులు

      2. సుప్రీం: 60 & 90 రోజులు

      3. ఎలైట్: 90 & 180 రోజులు

      24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు

      రిలయన్స్ హెల్త్ వైస్ ప్లాన్

      1 – 5 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు

      స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమ ప్లాన్

      1 – 15 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు (మొత్తం ఖర్చుల లో 7% గరిష్టం గా రూ. 5,000)

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు

      ఎస్ బి ఐ ఆరోగ్య ప్రీమియర్ ప్లాన్

      10 లక్షలు – 30 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు

      వెల్సురేన్స్ ఫ్యామిలీ పాలసీ

      2 – 4 లక్షలు

      --

      48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      యునైటెడ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు

      ఫ్యామిలీ మెడికేర్ పాలసీ

      1 – 10 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు గరిష్టం గా హామీ మొత్తం లో 10 %

      24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      యూనివర్సల్ సోంపూ హెల్త్ ఇన్సూరెన్సు

      కంప్లీట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్సు

      1.బేసిక్: 1-2 లక్షలు

      2. ఎసెన్షియల్: 3-5 లక్షలు

      3 . ప్రివిలేజ్: 6-10 లక్షలు

      1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

      2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

      36 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత

      విశేష సూచన: *పాలసీ బజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు సంస్థను గానీ, ఇన్సూరెన్సు ఉత్పత్తిని గానీ ఆమోదింపచేయడం గానీ, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా సిఫార్సు గానీ చేయదు.

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేసే ముందు గమనించాల్సిన విషయాలు

      మీ కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేసేముందు ఈ క్రింద ఇవ్వబడిన విషయాలను దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. వీటిని పరిశీలించి, మీ ప్రియమైన వ్యక్తుల ఆరోగ్య అవసరాలను అనుసరించి హెల్త్ ఇన్సూరెన్సు కవర్ ను కొనుగోలు చేయండి:

      01.ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ కవరేజీ:

      వివిధ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను సరిపోల్చే టప్పుడు ప్రాధమిక హెల్త్ కవరేజ్ ల జాబితాను తయారుచేసుకోవాలి. దాదాపు అని హెల్త్ ప్లాన్ లో డే కేర్ ఎక్సపెన్సెస్, ఇన్-హాస్పిటలైజేషన్ ఖర్చులు, అంబులెన్సు చార్జీ లు వంటి ఖర్చులను కవర్ చేస్తాయి.

      మీరు చిన్నపిల్లలకు హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవాలనుకుంటే న్యూ-బోర్న్ బేబీ కవరేజ్ పాలసీ ని గానీ లేదా సులువుగా మీకు ఉన్న ప్రస్తుత ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ కు జత చేయడం గా చేయాలి.

      అంతే కాక, మీకు ముందే -కలిగి ఉన్న అనారోగ్యాలకు, జీవన శైలి అనారోగ్యాలకు మరియు పాలసీ ప్రారంభం అయిన 30 రోజుల వంటి మినహాయింపుల ను దృష్టి లో ఉంచుకొని వేరొక పాలసీ తో సరిపోల్చాలి.

      02. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ లో హామీ మొత్తాన్ని పెంచుకొనే వెసులుబాటు:

      జీవించడానికి అయ్యే ఖర్చులు, వైద్య చికిత్సల కోసం అయ్యే ఖర్చులు ఎప్పుడూ ఒకే లా ఉండవు. చాలా ఇన్సూరెన్సు సంస్థలు వచ్చే సంవత్సరాల్లో పాలసీ ల హామీ మొత్తాన్ని పెంచుకొనే సౌకర్యాన్ని ఇస్తున్నారు. కొన్ని సార్లు, మీరు సరిగ్గా రెన్యువల్ చేయించు కుంటూ మరియు నో క్లెయిమ్ బోనస్ కలిగి ఉంటె, ఇన్సూరెన్సు సంస్థ హామీ బహుమతి గా హామీ మొత్తాన్ని పెంచవచ్చు.

      03. క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనం:

      ఇప్పుడు దాదాపుగా, అన్ని హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాన్ని వారి నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్నాయి. దీని ద్వారా హాస్పిటల్ చేరే ప్రక్రియ సమస్యలు-లేకుండా సులభ తరం అవుతుంది. అయినా, మంచి ఆసుపత్రులు వారి జాబితా లో ఉన్నాయో లేవో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

      04.గరిష్ట రెన్యువల్ వయస్సు కోసం అడగండి:

      చాలా హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు 60-65 సంవత్సరాల వరకూ రెన్యువల్ చేసే పరిమితి ని ఇస్తున్నాయి. ఈమధ్య, కొన్ని హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు జీవితాంతం రెన్యువల్ చేసుకొనే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీరు కావాలసిన సమయాల్లో భద్రతను కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ ను తప్పక ఎంచుకోండి.

      05.సమస్య లు -లేని క్లెయిమ్ పరిష్కారం:

      అన్ని హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు ఇన్సూరెన్సు రెగ్యులేటర్ ఆదేశాల ద్వారా పనిచేస్తున్నప్పటికీ, ప్రతీ సంస్ధ తమ తమ కార్యాచరణ ను అనుసరించి పనిచేస్తుంటాయి. మీ కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకొనే టప్పుడే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ గూర్చి తెలుసుకోవాలి. చాలా కంపెనీలు ఈరోజుల్లో క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ ను అందిస్తూ ఉండటం వలన పత్రాలు తీసుకోవడం మరియు వాటిని సమర్పించే సమస్య లు ఉండవు.

      ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ లో గల సాధారణ మినహాయింపులు

      కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్సు కొనుగోలు చేసే టప్పుడు పాలసీ డాక్యుమెంట్ ను జాగ్రత్తగా చదివి పాలసీ లో గల మినహాయింపులను విస్తారం గా తెలుసుకోవాలి.

      అంతేకాక, ఇన్సూరెన్సు పాలసీ లలో ఇచ్చే అప్పటికే కలిగి-ఉన్న వ్యాధులకు, క్యాష్ లెస్ హాస్పిటవైజేషన్ మరియు వెయిటింగ్ పీరియడ్ వంటి వేర్వేరు ఉపవాక్యలను అర్ధం చేసుకొంటే, తరువాత ఒక వేళ హాస్పిటల్ లో జాయిన్ అయితే క్లెయిమ్ వస్తుందో రాదో అర్ధం చేసుకోగలుగుతారు.

      ఈ క్రింది వైద్య ఖర్చులు ఇండియా లో సాధారణం గా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లలో కవర్ చేయబడవు -

      • ఓ పి డి ట్రీట్మెంట్ లు మరియు ఆరోగ్య పరీక్షలు
      • సౌందర్యం కోసం గానీ లేదా ప్లాస్టిక్ సర్జరీల వలన అయినా ఖర్చులు
      • లైఫ్-సప్పోర్ట్ యంత్రాల కోసం అయ్యే ఖర్చులు
      • ప్లాన్ లో లేకుండా నే విదేశాల్లో చికిత్స తీసుకున్నప్పుడు
      • యుద్ధ సమయాల్లో, అనైతిక పౌర యుద్ధాలు, న్యూక్లియర్ రియాక్షన్, రెబెల్లిన్, విదేశీ శత్రువుల వలన మరియు అటువంటి పరిస్థితులలో కలిగిన అనారోగ్యం లేదా గాయాలు పాలవడం.
      • గర్భము లేదా చైల్డ్ బర్త్ సమస్యలు (ప్లాన్ లో పేర్కొనబడక పొతే), స్వచ్చందం గా గర్భాన్ని ఆపడానికి, ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ కాకుండా గర్భ స్రావం
      • ముందుగా-ఉన్నఆరోగ్య సమస్యలు వెయిటింగ్ పీరియడ్ ముగియక ముందు కవర్ చేయబడవు.

      వ్యక్తి గత హెల్త్ ప్లాన్ కన్నా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ మంచిదా ?

      హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ మంచిదా లేదా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ మంచిదా అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే రెండు పాలసీ ల కవరేజీని, ఆచరణ పరిస్థితులను సరిపోల్చిన అవసరం ఉంది.

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ మొత్తం కుటుంబం అంతటి నీ కవర్ చేస్తూ ఒకే హామీ మొత్తం కలిగి ఉంది, ఇన్సూరెన్సు కంపెనీ కి ఒకే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. దీనినే మరోలా చెప్పాలంటే, ఒక కుటుంబానికి ఒకే పాలసీ, మరియు ప్రీమియం చెల్లిపు కూడా సంవత్సరానికి ఒకటే.

      మరొక వైపు, ఇండివిడ్యుఅల్ హెల్త్ ప్లాన్ ఒకే వ్యక్తిని కవర్ చేస్తుంది, అందువలన కుటుంబం లో ఉండే ప్రతీ ఒక్కరికీ వేర్వేరు హెల్త్ ప్లాన్ లు ఉంటాయి. ఎక్కువ పాలసీ లు ఉంటాయి కనుక, చెల్లించే ప్రీమియం లు కూడా వేర్వేరు గా ఉంటాయి.

      ఈ రెండు రకాల హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల చెల్లించే ప్రీమియం లను సరిపోల్చినట్లైతే, ఎక్కువమంది కి చెల్లింపబడే వ్యక్తి గత హెల్త్ ప్లాన్ లకు చెల్లించే మొత్తం ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ కు చెల్లించే మొత్తం కన్నా ఎక్కువ గా ఉంటుంది.

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను కొనుగోలు చేయడానికి కావాల్సిన అర్హతలు

      ఒక ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ చాలా వరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ను పోలి ఉంటుంది. ఇది ఒకే హామీ మొత్తాన్ని, ఒకే ఒక సంవత్సర ప్రీమియం నీ కలిగి ఉండి, కుటుంబ సభ్యులను చేర్చుకోవడాన్ని వీలు గా ఉండే సింగల్ ప్లాన్. మీ కుటుంబం 4 లేదా 6 మందిని కలిగి కలిగి ఉంటే మీకు అదనపు అర్హతలు అవసరం లేకుండానే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు.

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్య మైన అంశాలను మనసులో ఉంచుకోవలసి ఉంటుంది. అవి క్రింద ఇవ్వబడ్డాయి:

      • అదనపు ప్రీమియం ధర చెల్లించడం ద్వారా కొత్త సభ్యులను పాలసీ లోనికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
      • కుటుంబం లో ఉన్న వయోవృద్దుల లో ఒకరు గరిష్ట కవరేజీ వయస్సు కి చేరినట్లైతే పాలసీ ముగించబడుతుంది.
      • కొత్త కుటుంబ సభ్యులు పాలసీ లో నికి చేరితే, హామీ మొత్తాన్ని కూడా పెంచుకున్నట్లైతే సరైన కవరేజీ వ్యక్తి గతం గా కుటుంబ సభ్యునికి కలుగుతుంది.
      • ఈ పాలసీ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ డాక్యుమెంట్ లో పేర్కొంటే తప్ప ఆధార పడి ఉన్న పిల్లలు అతడు/ఆమె నిర్దిష్టమైన వయస్సు దాటిన తరువాత కవరేజీ ని అందించదు.
      • మీ సీనియర్ సిటిజెన్ తల్లి తండ్రులను ఈ హెల్త్ ప్లాన్ లో జత చేయకండి, ఎందుకంటే అది పాలసీ ప్రీమియం ను ఎక్కువవుగా పెంచుతుంది.

      క్లుప్తం గా చెప్పాలంటే, ఏ కుటుంబం అయినా వారి బడ్జెట్ కు అనుకూలమైన హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎంచుకోవచ్చు. అంతే కాక, వ్యక్తిగత హెల్త్ ప్లాన్ కంటే కంబైన్డ్ ప్రీమియం చాలా తక్కువ గా ఉంటుంది.

      *అన్ని సేవింగ్స్ ఇన్సూరెన్సు కంపెనీలు ఐ ఆర్ డి ఏ అనుమతించిన ఇన్సూరెన్సు ప్లాన్ ద్వారా అందిస్తాయి. ప్రామాణికమైన నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

      ఒక క్రొత్త ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ని కొనుగోలు చేయడం ఎలా?

      మీకు ఇప్పటికే ఒక హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఉన్నట్లైతే, మీరు క్రొత్త కుటుంబ సభ్యులను దానికి చేర్చాలనుకుంటే, మీ భీమా సంస్థను సంప్రదించండి. ఒక వేళ ఇన్సూరెన్సు కు క్రొత్త అయితే, మీరు కుటుంబసభ్యుల కోసం ఇన్సూరెన్సు ప్లాన్ ను తీసుకోవాలనుకుంటే, చాల ఇన్సూరెన్సు సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

      మీ సౌలభ్యం కోసం, ఆన్ లైన్ లో ఇచ్చిన వివిధ రకాలైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లను సరిపోల్చుకొని ఉత్తమ మైన, మీ బడ్జెట్ కు సరిపోయిన ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు. పాలసీ తీసుకోవడానికి పాలసీ ప్రీమియం తక్కువ ఉండటం కారణం కాకూడదు, అందించే కవరేజీ తో రాజీ పడకూడదు.

      కేవలం తక్కువ ప్రీమియం ధర వల్ల సరైన కవరేజీ లేకుండా హెల్త్ ప్లాన్ తీసుకోవడం లో అర్ధం లేదు ఎందుకంటే తరువాత ఆరోగ్య రక్షణ కోసం మీ జేబు నుండే చెల్లించాల్సి ఉంటుంది. అందువలన నిర్ణయం తీసుకొనే టప్పుడే తెలివిగా వ్యవహరించాలి.

      ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ క్లెయిమ్ ను నమోదు చేయడం ఎలా?

      మీరు హెల్త్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను ఈ క్రింది రెండు విధాలు గా చేయవచ్చు.

      క్యాష్ లెస్ కొరకు ప్రీ-ఆధరైజేషన్ పొందడానికి ఈ క్రింది ప్రక్రియను పాటించాలి:

      • టి పి ఏ లేదా హాస్పిటల్ లో ఇన్సూరెన్సు డెస్క్ నుండి పొందిన ఇన్సూరెన్సు ప్రీ-ఆథరైజేషన్ ఫారం ను ఇమెయిల్ లేదా ఫాక్సు చేయాలి. మీరు భీమా సంస్థ వెబ్ సైట్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
      • డిశ్చార్జ్ లెటర్ , మెడికల్ రిపోర్ట్ లు, డయాగ్నొస్టిక్ రిపోర్ట్ లు, బిల్లు లు వంటి పత్రాలు అన్నీ సమర్పించాలి.
      • క్లెయిమ్ రిక్వెస్ట్ అమ్మోదించబడితే, క్లెయిమ్ మానేజ్మెంట్ టీం మీకు ఆమోదించినట్టు ఒక లేఖను పంపుతుంది.
      • ఇన్సూరెన్సు సంస్థ కు మీ క్లెయిమ్ విషయమై అదనపు వివరాలు కావలసి వస్తే హాస్పిటల్ తో వారు సంప్రదింపులు జరుపుతారు.
      • ఒక వేళ మీ క్లెయిమ్ ఆమోదించబడనిచో, మీరు రీఇంబర్సుమెంట్ క్లెయిమ్ పద్ధతి ని పాటించవలసి ఉంటుంది.

      రీ-ఇంబర్సుమెంట్ ప్రక్రియ ఈ విధం గా ఉంటుంది:

      • పాలసీ కొనుగోలు చేస్తప్పుడు క్లెయిమ్ ఫారం ఇతర పత్రాల తో పాటు జమ చేయాల్సి ఉంటుంది.
      • బీమా సంస్థ క్లెయిమ్ మానేజ్మెంట్ టీం లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వ వలసి ఉంటుంది.
      • జమ చేసిన తరువాత ఆమోదించబడిన లేఖ లేదా తిరస్కరణ లేఖ మీరు అందుకుంటారు.

      పాలసీ బజార్ నుండి ఆన్ లైన్ లో ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఎందుకు కొనుగోలు చేయాలి?

      ఇండియా లో మెడిక్లైయిం పాలసీ ల కు కరువు లేకపోవడం వల్ల కొనుగోలు చేయడం ఒక కష్టమైన పని లా తయారయ్యింది. పాలసీ బజార్ వివిధ రకాలైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ల వివరాలు, ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థల ధరల వివరాలు ఒకే వేదిక మీద లభించేలా చేయడం వల్ల దీనివల్ల మీ కాలాన్ని, శక్తి ని కూడా ఆదా చేసుకోగలుగుతారు. మీరు ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం వలన మీరు పారదర్శక మైన ఒప్పందాన్ని, సరైన సలహా మరియు సమస్యలు-లేని విధం గా కొనుగోలు ప్రక్రియను పొందగలుగుతారు. పాలసీ లు ఒకదాని ప్రక్కన ఒకటి ఉంచి,సరి పోల్చి చూసుకొని తెలివి గా ఎంచుకోండి!

      తరుచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు

      • ప్ర.1 ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ అంటే ఏమిటి?

        జవాబు: ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ అంటే మొత్తం కుటుంబ సభ్యులందరి నీ కవర్ చేసే ఒక ప్లాన్. వీటికి నిర్దిష్ట మైన హామీ మొత్తం కలిగి ఉంది ఎవరైనా సభ్యులు వైద్య సదుపాయాలకు క్లెయిమ్ చేసినట్లైతే ఆగిపోతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ద్వారా పాలసీ దారుడు మరియు అతని/ఆమె తల్లితండ్రులు, జీవిత భాగస్వామి మరియు పిల్లలు సభ్యులు గా కవర్ అవుతారు.

      • ప్ర. 2 ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్స్ ఎందుకు అవసరం?

        జవాబు: వ్యక్తి గత పాలసీ లు కొనుగోలు కన్నా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లు చౌక గా ఉంటాయి. అంతే కాకుండా, ఫ్లోటర్ ప్లాన్ ద్వారా తర్వాత కుటుంబసభ్యులు అంటే, క్రొత్తగా పుట్టిన పిల్లలు మరియు జీవిత భాగస్వామి ని ఇబ్బంది లేకుండా కవరేజీ లో జత చేసుకోవచ్చు.

      • ప్ర. 3 ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎలా పని చేస్తుంది?

        జవాబు: ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లో హామీ మొత్తం స్థిరం గా ఉంటుంది మరియు ఒక సభ్యుడు వైద్య సేవలు పొందితే ఆ మొత్తం క్షీణిస్తుంది. పాలసీ కాలవ్యవధి లో ఒక సభ్యుని వలన ఆ మొత్తం పూర్తి అయితే, ఇంకొక సభ్యుడు మరల పాలసీ రెన్యువల్ అయ్యేవరకూ క్లెయిమ్ ను నమోదు చేయలేరు.

      • ప్ర. 4 పత్రాల అవసరం (ఏదయినా ఉంటే)

        జవాబు: ఇన్సూరెన్సు చేయబడే వ్యక్తుల వయసు ధ్రువీకరణ, గుర్తింపు పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రాలు. పాలసీదారుని ఆదాయ ధ్రువీకరణ, మరియు పూర్తిగా నింపబడిన ప్రపోసల్ దరఖాస్తు. కొన్ని రకాల ప్లాన్ లకు ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం అవుతాయి.

      • ప్ర. 5 నా ప్రస్తుత పాలసీ తో ఫ్యామిలీ మెంబెర్స్ ని ఎలా జత చేయాలి?

        జవాబు: మీరు ప్రస్తుత పాలసీ ని రెన్యువల్ చేసే సమయం లో కుటుంబసభ్యుల ను జత చేసుకోవచ్చు. అయితే, మీరు మీ పై ఆధారపడి జీవిస్తున్న వారిని క్రొత్త పుట్టిన పిల్లలు తప్ప మిగిలిన వారిని పాలసీ కాలవ్యవధి మధ్య లో జత చేసుకో లేరు.

      • ప్ర. 6 నేను, నా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒక కార్పొరేట్ హెల్త్ పాలసీ ద్వారా కవర్ అయి ఉన్నా, ఇంకొక హెల్త్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉందా?

        జవాబు: అవును. ఒక కార్పొరేట్ హెల్త్ పాలసీ ద్వారా కవర్ అయి ఉన్నా, ఇంకొక స్వతంత్ర హెల్త్ పాలసీ తీసుకోవలసి ఉంటుంది. మీ యజమాని మీరు ఆ సంస్థ లో పని చేస్తున్నంత కాలం వైద్య ఖర్చులు కవర్ చేస్తారు. మీరు ఆ ఉద్యోగం నుండి మారినా, రిటైర్ అయినా లేదా మీరు స్వంతం గా ప్రారంభించినా కార్పొరేట్ ఇన్సూరెన్సు పనికి రానిది గా పరిగణించబడుతుంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యుల కు ఏదయినా వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురయితే మీకు వేరొక హెల్త్ పాలసీ లేకపోతే మీరు అచేతన మవుతారు.

        ఇంకా, ఒక వేళ కంపెనీ అకస్మాత్తుగా నిబంధనలను మార్చినా, ఇన్సూరెన్సు కవరేజీ ని

        అకస్మాత్తుగా ఆపుచేసి నా, వైద్య ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల లో మీకు ఒక ప్రత్యేక మైన హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ మిమ్మల్ని కాపాడుతుంది.

      • ప్ర. 7 ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అంటే ఏమిటి?

        జవాబు: ఒకే సింగల్ ప్లాన్ లో కుటుంబ మొత్తాన్ని కవర్ చేసేవే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లు. ఇక్కడ ఒక స్థిరమైన కవరేజీ మొత్తం కుటుంబానికి పంచబడుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఒక ఉత్తమ మైన ఎంపిక. ఇది ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేస్తుంది కనుక ఒక్కో కుటుంబ సభ్యునికి ఒక ప్రత్యేక హెల్త్ పాలసీ లు తీసుకోవలసిన పని తప్పడమే కాక సరసమైనది కూడా. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లు సాధారణం గా వ్యక్తులకు, జీవిత భాగస్వామి కి, పిల్లలకు కవర్ చేస్తాయి, కానీ కొన్ని ఇన్సూరెన్సు సంస్థలు ఆధారపడి ఉన్న తల్లి తండ్రులకు మరియు అత్తమామలకు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లో కవరేజీ ని కల్పిస్తున్నాయి.

        ప్ర. 8 ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్సు లో ఒక వేళ భీమా చేయబడిన ప్రాధమిక వ్యక్తి మరణిస్తే ఏమి జరుగుతుంది? జీవించిన ఉన్న పాలసీ సభ్యులు ఆ పాలసీ ని పునరుద్ధరించు కో గలరా?

        జవాబు: అవును. భీమా చేయబడ్డ ప్రాధమిక వ్యక్తి మరణిస్తే లేదా అతని వయసు గరిష్ట రెన్యువల్ పరిమితి ని చేరుకుంటే, తరువాత వయసు లో పెద్ద వారు అయిన వ్యక్తి ఆ పాలసీ ని కొనసాగిస్తూ కంటిన్యుయిటీ బెనిఫిట్ ను పొందవచ్చు. ఒక పాలసీ లో చేర్పులు, తొలగింపులు రెన్యువల్ అయ్యే సమయం లోనే జరుగుతాయి.

      • ప్ర. 9 చికిత్స జరుగుతూ ఉన్నప్పుడు నేను హాస్పిటల్ ని మార్చుకో గలనా?

        జవాబు: అవును. మీరు మరింత ఉన్నతమైన చికిత్స కోరుకుంటున్న నేపధ్యం లో హాస్పిటల్ మార్చుకోవడానికి అనుమతి కలుగుతుంది, కానీ దీనికోసం మీరు టి పి ఏ కు తెలియజేస్తే, టి పి ఏ మీ కేసు ను పరిశీలించి, పాలసీ నిబంధనలు & షరతుల ఆధారం గా నిర్ణయిస్తుంది.

      • ప్ర. 10 నేను విదేశాలలో అస్వస్ధ కు గురి అయితే ఏమి అవుతుంది?

        జవాబు: మాక్స్ భూపా, కేర్ హెల్త్, మణిపాల్ సిగ్న వంటి వివిధ ఇన్సూరెన్సు కంపెనీలు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, ప్రీ-డియాగ్నోసిడ్ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ మరియు సెకండ్ మెడికల్ ఒపీనియన్, ప్రయాణాలలో అకస్మాత్తు అస్వస్థత వంటి విదేశీ ప్రయోజనాలు కూడా కలుగచేస్తున్నాయి. అంతేకాక, ట్రావెల్ ఇన్సూరెన్సు ప్లాన్ కూడా ఎంచుకోవడం వలన ప్రమాదాల వలన మరణం, ప్రమాదాల ఖర్చులు, ట్రిప్ క్యాన్సిల్, అంతరాయ ఖర్చులు వంటి కవరేజి పొందవచ్చు. ఇది హాస్పిటల్ బిల్లులు, అత్యవసర తరలింపు బిల్లులు తో పాటు మరిన్ని పెద్ద ఖర్చుల జాబితా ను కవర్ చేస్తుంది. మరింత చదవండి

      • ప్ర. 11 క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ తిరస్కరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి?

        జవాబు: మీ క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ కవరేజి ని ఈ క్రింది పరిస్థితుల్లో తిరస్కరిస్తారు - మీరు టి పీ ఏ కు పంపిన సమాచారం వివరం గా లేకపోయినా లేదా ఏదయినా వ్యత్యాసం కలిగి ఉన్నా. ప్రస్తుత అనారోగ్యం ప్లాన్ లో కవర్ చేయబడి లేకపోయినా. ప్రీ-ఆథరైజేషన్ అభ్యర్ధన పత్రం సరైన సమయం లో టి పీ ఏ కు అందకపోయినా పాలసీ దారుడు అన్నీ ఖర్చులూ భరించి, తరువాత రీయింబర్సుమెంట్ కు క్లెయిమ్ చేసుకోవలసి ఉంటుంది.

      • ప్ర. 12 నా క్లెయిమ్ స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోగలుగుతాను ?

        జవాబు: మీరు టి పీ ఏ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా గానీ, లేదా ఇన్సూరెన్సు సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా గా గానీ స్టేటస్ చెక్ చేసుకొని వచ్చు.

      • ప్ర. 13 ఎక్కువ ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకోవచ్చా ? ఈ దృష్టాంతం లో క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

        జవాబు: అవును, మీరు ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ లు అదే కంపెనీ లేదా వేరొక ఇన్సూరెన్సు సంస్థ నుండి గానీ తీసుకోవచ్చు కానీ, కొనుగోలు చేసే ముందు గానీ క్లెయిమ్ సమర్పించే సమయం లో గానీ ప్రస్తుతం కలిగి ఉన్న పాలసీ ల వివరాలు క్రొత్త ఇన్సూరెన్సు సంస్థ కు తెలియజేయాల్సి ఉంటుంది. వివిధ పరిస్థితుల్లో క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

        • దృష్టాంతం 1 : ఒక వేళ పాలసీ దారుడు ఎక్కువ పాలసీ లు కలిగి ఉంటే, వాటి కాల పరిమితి కూడా ఒకటే అయితే మరియు క్లెయిమ్ మొత్తం హామీ మొత్తం కన్నా తక్కువ గా ఉంటే, అప్పుడు పాలసీ దారునికి నచ్చిన ఇన్సూరెన్సు సంస్థ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలని హక్కు కలుగుతుంది. ఉదాహరణకు, కుమార్ గారు రూ. 4 లక్షల ఇన్సూరెన్సు పాలసీ ఇన్సూరెన్సు సంస్థ ఎక్స్ మరియు రూ. 2 లక్షల ఇన్సూరెన్సు వై అనే ఇన్సూరెన్సు సంస్థ నుండీ తీసుకున్నారు. క్లెయిమ్ మొత్తం రూ. 2 లక్షలు. ఈ పరిస్థితులలో, పాలసీ దారుడు ఈ రెండు ఇన్సూరెన్సు కంపెనీలలో ఒక దానిని నిబంధనలు మరియు షరతుల ను అనుసరించి క్లెయిమ్ సెటిల్ చేసుకోవడం కోసం ఎంచుకోవచ్చు.
        • దృష్టాంతం 2 : ఒక సింగల్ పాలసీ లో క్లెయిమ్ మొత్తం హామీ మొత్తం కన్నా ఎక్కువ గా ఉన్నట్లైతే, పాలసీ దారుడు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఇన్సూరెన్సు సంస్థను ఎంచుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు. అయితే, క్లెయిమ్ పరిష్కరించే టప్పుడు మిగిలిన పాలసీ ల విషయం తెలియ జేయక పోవడం వలన, ఇన్సూరెన్సు సంస్థ చెల్లించాల్సిన సొమ్ము హామీ మొత్తం మాత్రమే మరియు పాలసీ దారుడు మిగిలిన మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది.
        • దృష్టాంతం 3 : నిర్దిష్టమైన ప్రయోజనాలకోసం తీసుకున్న పాలసీ ల క్లెయిమ్: పాలసీ దారుడు క్లిష్టమైన అనారోగ్యం వంటి నిర్దిష్ట మైన ప్రయోజనాలు పొంది, చికిత్స ఖర్చు తో క్లెయిమ్ కు మాత్రం సంబంధం లేకుంటే మరియు చెల్లించాల్సిన మొత్తం స్థిరం గా ఉంటే, పాలసీ దారుడు మొత్తం అన్నీ పాలసీ ల నుండీ ప్రయోజనాలు పొందుతాడు. ఇక్కడ నిజమైన మంత్రం ఏమిటంటే క్లెయిమ్ చేయడానికి పాత పాలసీ లను, అనారోగ్య వెయిటింగ్ పీరియడ్ ముగిసిన పాలసీ లను ఎంచుకోవాలి.
      book-home-visit
      Search
      Disclaimer: Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by an insurer.
      top
      Close
      Download the Policybazaar app
      to manage all your insurance needs.
      INSTALL