అందుకే ప్రతీ ఒక్కరు తాము చనిపోయిన తర్వాత కూడా తమ కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్ధికపరమైన ఇబ్బంది పడకూడదని ఎంతో కొంత ఇన్సురెన్స్ ప్లాన్ లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. తమ ప్రియమైన వారు బాధ పడటం చూడటానికి నిజంగా ఎవరూ ఇష్టపడరు(కనీసం ఆర్థికంగా) వారు మరణించిన తరువాత. కాదా?.
అయితే లైఫ్ ఇన్సురెన్స్ కవరేజ్ ను తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత, దానిని పొందడానికి ఎలా క్లెయిమ్ చెయ్యాలో తెలియక, అతని కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం బాధాకరమైన విషయం. అందుకే జీవిత భీమా తీసుకున్న వ్యక్తి తన తదనంతరం ఆ సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో తన కుటుంబ సభ్యులకు ముందే చెప్పి ఉంచడం మంచిది. ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి మరణం తర్వాత ఇన్సురెన్స్ క్లెయిమ్ కు ఏయే డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే మరణ దావా గురించి, దానిని ఏ విధంగా క్లెయిమ్ చెయ్యాలనే విషయాలను తెలుసుకునే ముందు అసలు జీవిత భీమా అంటే ఏమిటో తెలుసుకోవడం మంచిది, ఇది ప్రాధమిక విషయాలతొ ప్రరంబించడానికి మాత్రమే అని భావం. అవునా?
జీవిత భీమా అంటే ఏమిటి?
ఒక వ్యక్తి తన మరణం తర్వాత అతని కుటుంబానికి ఏక మొత్తంలో ధనం వచ్చేందుకు ఇన్సురెన్స్ కంపెనీలో నెలనెలా కొంత సొమ్మును అదా చెయ్యడాన్నే జీవిత భీమా అంటారు. ఇక ఆ వ్యక్తి ఇన్సురెన్స్ కంపెనీకి చెల్లించే మొత్తాన్ని ప్రీమియం పేమెంట్ అని వ్యవహరిస్తే, ఆ వ్యక్తి మరణం తర్వాత కంపెనీ అతని కుటుంబానికి చెల్లించే మొత్తాన్నే డెత్ బెనిఫిట్ అంటారు.
ఇంకా చెప్పాలి అంటే జీవిత భీమా క్లెయిమ్స్ ను రెండు విధాలుగా కేటాయించవచ్చు. అవి డెత్ క్లెయిమ్ మరియు మెట్యురిటీ క్లెయిమ్. అయితే ఇక్కడ మనం డెత్ క్లెయిమ్ గురించి విపులంగా చర్చిద్దాం.
డెత్ క్లెయిమ్
ఇకపాలసీ తీసుకున్న వ్యక్తి గనుక మరణిస్తే అతని తదనంతరం అతని నామినీ ఆ సొమ్ము మొత్తాన్ని పొందడాన్నేలైఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్ లేదా ప్రముఖంగా డెత్ క్లెయిమ్ అని వ్యవహరిస్తారు.
డెత్ క్లెయిమ్ ను పొందడం ఎలా?
డెత్ క్లెయిమ్ ను పొందేందుకు దశల వారీగా క్రింద సూచించిన విధానాలను అనుసరించాలి.
మొదటి 1: డెత్ క్లెయిమ్ ను పొందేందుకు అన్నిటికన్నా ముందుగా పాలసీ హోల్డర్ యొక్క మరణాన్ని సదరు ఇన్సురెన్స్ కంపెనీకి తెలియపరచాలి. ఇక్కడ మరణాలను రెండు రకాలుగా ఇన్సురెన్స్ కంపెనీలు విభజిస్తాయి. ఇందులో మొదటి రకం ‘ఎర్లీ డెత్’ కాగా రెండోది ‘నాన్ ఎర్లీ డెత్’. ఇక పాలసీదారుడు పాలసీని తీసుకున్న మూడేళ్ళ లోపు గనుక మరణిస్తే ఇన్సురెన్స్ కంపెనీలు దానిని ఎర్లీ డెత్ గా నిర్ణయిస్తాయి.
రెండవ 2: ఈ దశలో ఇన్సురెన్స్ కంపెనీకి వెళ్లి అక్కడ క్లెయిమ్ ఇంటిమేషన్ ఫారమ్ ను తీసుకోవాలి.
మూడవ 3: ఇక ఈ దశలో క్లెయిమ్ ను పొందేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకోవాలి. ఒకవేళ పాలసీని గనుక ఆన్ లైన్ లో కొన్నట్లయితే ఫారమ్ ను కూడా ఆన్ లైన్ లోనే పొందేందుకు దరఖాస్తు చెయ్యాలి.
ఇప్పుడు క్లెయిమ్ పొందేందుకు చెయ్యాల్సిన మొదటి మూడు దశలు తెలుసుకొన్న తర్వాత ఏయే డాక్యుమెంట్లు కావాలో పరిశీలించాలి.
పరిశీలించాల్సిన డాక్యుమెంట్ల జాబితా
సహజంగా క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లు డెత్ క్లెయిమ్ పొందేందుకు అవసరం అవుతాయి. అవి
- డెత్ సర్టిఫికేట్
- ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్
- లబ్దిదారుని యొక్క ఐడీ ప్రూఫ్
- ఇన్సురర్ యొక్క ఏజ్ ప్రూఫ్
- డిశ్చార్జ్ ఫారమ్ (ఎగ్జిక్యూట్ చేసి విట్ నెస్ చేయబడినది)
- మెడికల్ సర్టిఫికేట్ ( ఏ విధంగా చనిపోయారో తెలియజేసేందుకు)
- పోలీస్ ఎఫ్ ఐఆర్ (ఒకవేళ అసాధారణ మరణం సంభవించిన పక్షంలో)
- పోస్ట్ మార్టం రిపోర్ట్స్ (ఒకవేళ అసాధారణ మరణం సంభవించిన పక్షంలో)
- హాస్పటల్ రికార్డ్స్ / సర్టిఫికేట్ (ఒకవేళ అతడు అనారోగ్యంతో మరణించినట్లయితే)
- క్రిమేషన్ సర్టిఫికేట్ మరియు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ( ఒకవేళ ఎర్లీ డెత్ అయిన పక్షంలో)
ఒకవేళ మీరు గనుక మీ కుటుంబ పాలసీ హోల్డర్ మరణం తర్వాత డెత్ క్లెయిమ్ ను వెంటనే పొందాలని అనుకుంటే ఎక్కువ కాలం నిరీక్షించకండి. ఇక పైన పేర్కొన్న ఈ అవసరమైనడాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకుని, మీ ఇన్సురెన్స్ కంపెనీతో మాట్లాడి అటుపై వారు కొత్తగా మార్చిన డాక్యుమెంట్ల జాబితాను అడిగి తెలుసుకుని డెత్ క్లెయిమ్ కొరకు వెంటనే దరఖాస్తు చెయ్యండి.
ఆఖరుగా!
ఇక జీవిత భీమాకు సంబంధించి డెత్ క్లెయిమ్ ను ఎలా చెయ్యాలో మీకు ఇప్పుడు అర్ధమైందని అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ పొందుపరచిన సమాచారంతో మీరు డెత్ క్లెయిమ్ విధానాన్ని సులభంగా తెలుసుకుని తద్వారా లాభం పొందగలరని ఆశిస్తున్నాము
ఈ వ్యాసం మీకు నచ్చిందా? లేదా ఏదైనా ప్రశ్నించాలి అనుకుంటున్నారా..
ఇక కారణం ఏదైనా దిగువ వెంటనే కామెంట్ చెయ్యండి.
గమనిక: టర్మ్ బీమా అది ఏమిటో తెలుసుకోండి
(View in English : Term Insurance)
Read in English Term Insurance Benefits
Read in English Best Term Insurance Plan