బోనస్ ఎలా జెనరేట్ అవుతుంది?
ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం ద్వారా సేకరించిన ఎక్కువ మొత్తాన్ని భద్రత దృష్ట్యా రుణ సంబందిత గవర్నమెంట్ సంస్థలలో మరియు కొద్ది మొత్తాన్ని ఈక్విటీలలో పెట్టుబడిగా పెడతాయి. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాల ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టే పాలసీదారులకు ఇన్సూరెన్స్ లాభాలను పంపిణీ చేస్తుంది. ఆ బోనస్ రేట్ వివిధ అంశాలని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడుతుంది, అవి ఏమనగా ప్రాధమిక ఆస్తులపై రాబడి, ముందటి సంవత్సరంలో ప్రకటించిన బోనస్ స్థాయి మరియు ఇతర వాస్తవిక కారకాలు. బోనస్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే, మీరు పాలసీలో తప్పనిసరిగా పాల్గొంటూ ఉండాలి లేదా లాభాల బాటలో ఉండటం తప్పనిసరి.
బోనస్ ఎప్పుడు చెల్లిస్తారు?
పాలసీదారుని యొక్క మెచ్యూరిటీ సమయంలో లేదా మరణించిన తరువాత బోనస్ నగదు మొత్తం చెల్లించబడుతుంది. ఉదాహరణకి, 30 సంవత్సరాల టర్మ్ పాలసీకి, బోనస్ నగదు మొత్తం 30 సంవత్సరాల తరువాత మాత్రమే చెల్లించబడుతుంది. అయితే పాలసీదారు 10వ సంవత్సరం తరువాత మరణించినట్లయితే, ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఆ రోజు వరకు తీసుకున్న బోనస్ మొతాన్ని నామినీకి చెల్లిస్తుంది.
జీవిత బీమా సంస్థలు అందించే వివిధ బోనస్ రకాలు
జీవిత బీమా సంస్థలు క్రింది చెప్పబడిన వివిధ బోనస్ లని అందిస్తున్నాయి:-
కాంపౌండ్ రివర్షనరీ బోనస్:- చక్ర వడ్డీ ఆధారంగా కాలిక్యులేషన్ జరుగుతుంది. వార్షిక బోనస్ మొత్తం అప్పటివరకు ఉన్న మొతానికి జోడిస్తారు మరియు వచ్చే సంవత్సరం బోనస్ మొత్తం ఆ కొత్త మొత్తం పైన లెక్కించబడుతుంది. ఉదాహరణకి, మిస్టర్. రాజ్ 10 లక్షల రూపాయల పాలసీని కడుతున్నారు వారికి పాలసీ బోనస్ మొత్తం శాతం 4% అనగా రూ.40,000. ఈ మొత్తం హామీ ఇచిన మొత్తానికి అనగా రూ.10,00,000 కి జోడించబడుతుంది మరియు బోనస్ హామీ ఇచ్చిన ఈ కొత్త మొత్తం కి లెక్కించబడుతుంది.
క్యాష్ బోనస్:- ఇది పాలసీదారునికి సంవత్సర ప్రాతిపదికన ఇవ్వబడుతుంది మరియు వార్షిక ప్రీమియంగా లెక్కించబడుతుంది. ఉదాహరణకి, హామీ ఇచిన మొత్తం రూ.2,00,000 లు అయితే బోనస్ రేట్ 4% మరియు సంవత్సర ప్రీమియం రూ.12,000, అప్పుడు పాలసీదారునికి ఇచ్చే బోనస్ రూ.480 (12,000 లో 4%).
మధ్యంతర బోనస్:- ఈ బోనస్ పాలసీ మెచ్యూర్ అయిన తరువాత లేదా ప్రకటించిన రెండు బోనస్ క్లెయిమ్ డేట్స్ మధ్య చెల్లించబడుతుంది. అయితే ఒక పాలసీ ఇప్పటికే ముందు సంవత్సరం బోనస్ ను కలిపి ఉంది, బోనస్ డిక్లరేషన్ మరియు పాలసీ యొక్క మెచ్యూరిటీ తేదీ మధ్య దూరం ఉంది. అటువంటి సమయంలో, బీమా సంస్థ తాత్కాలిక పాలసీ రేట్ల ఆధారంగా బోనస్ మొత్తంను లెక్కిస్తుంది.
పాలసీలో ఉన్న బోనస్లు పాలసీ డాక్యుమెంట్ లో వివరంగా చెప్పబడ్డాయి. పాలసీ కొనుగోలు చేసే సమయంలో, మీరు ఎల్లప్పుడూ ఆయా బీమా సంస్థలతో ప్రయోజనాలను నిర్ధారించుకోవాలి. మీకు ఏమేమి ప్రయోజనాలని కల్పిస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవడం అవసరం.
గమనిక: టర్మ్ బీమా అది ఏమిటో తెలుసుకోండి
(View in English : Term Insurance)
Read in English Term Insurance Benefits
Read in English Best Term Insurance Plan