కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్
కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ కొనుగోలుదారునికి వివిధ ఇన్సూరెన్సు కంపెనీలు అందించే ఇన్సూరెన్సు ప్రీమియం ధరలను పరిశీలించడానికి మరియు పోల్చి చూడడానికి అవకాశాన్ని ఇస్తుంది.. ఇది ఎవరికి వారు తమ తమ అవసరాలకు తగిన, అనుకూల మైన ఇన్సూరెన్సు ప్లాన్ ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది
-
హోమ్‌పేజీ
-
మోటార్ ఇన్సూరెన్స్
-
కారు బీమా
- కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్
కొనుగోలుదారుడు తాను ఇచ్చిన అంశాలను బట్టి ఉత్తమమైన కార్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎంచుకోవడానికి ఈ కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఉపయోగపడుతుందనడం లో సందేహం లేదు. ఒక్క మౌస్ క్లిక్ తో మీకు వివిధ కంపెనీలు అందిస్తున్న ఇన్సూరెన్సు ప్లానులు మరియు వాటి మధ్య గల పోలికలను మీకు అందిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇన్సూరెన్సు కొనుగోలు చేసేవారికి అవసరాలకు అనుగుణం గా ఈ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ మంచి ఇన్సూరెన్సు ప్లాన్ ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.
కారు ఇన్సూరెన్సు పోల్చడం ద్వారా ప్లాన్ ధరలను 55% వరకూ ఆదా. మీ క్రొత్త లేదా పాత కారుల ఇన్సూరెన్సు ప్లానుల కోసం పెద్ద పెద్ద కంపెనీల ఇన్సూరెన్సు ప్రీమియం ధరలను ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ద్వారా పోల్చి చూడండి. మీ అవసరాలకూ, ఆర్ధిక పరిమితులకు తగిన ఇన్సూరెన్సు ప్లాన్ ఆన్లైన్ లో తక్షణమే పొందండి.
- కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఆన్ లైన్ లో ఉపయోగించండి డబ్బును ఆదా చేసుకోండి
- పెద్ద పెద్ద ఇన్సూరెన్సు కంపెనీల ప్లానులను పోల్చి చూడండి
- అన్నింటికన్నా ఉత్తమమైన కార్ ఇన్సూరెన్సు ను ఎంచుకోండి.
English
हिंदी
मराठी
కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ వలన ఉపయోగాలు
- ఒక కార్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవాలనుకొనేవారికి ముందుగానే ఆ పాలసీ పై ఎంతో సులువుగా మొత్తం విధానం పైన ఒక అవగాహన ఏర్పడుతుంది.
- వివిధ పాలసీల ప్రీమియం ధరలను పోల్చి చూడడం వల్ల ఒక ఉత్తమమైన పాలసీ ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
- ఎంచుకున్న ఇన్సూరెన్సు కవరేజీ ని బట్టి, ప్రీమియం ధర ఎలా మారుతుందో మీకు మీరే చూడవచ్చు.
- దీనికి ద్వారా మీరు తొందపాటుతనం వల్లనో, మధ్యవర్తుల మాటల ప్రభావం వల్లనో నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు.
కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ ని ఎలా ఉపయోగించాలి?
ఆన్ లైన్ ద్వారా లభించే ఈ సదుపాయం వినియోగదారులు అందించే వాహన వివరాలకు అనుగుణం గా ప్రీమియం యొక్క ధరని లెక్కిస్తుంది.
ఈ కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ వినియోగదారుని అవసరాలకు తగ్గట్టు గా మార్చుకుంటూ వివిధ రకాల ప్రీమియం ధరలను అందిస్తుంది. వినియోగదారుడు ఒక కారు ఇన్సూరెన్సు ప్రీమియం ని ఖచ్చితం గా లెక్కించడానికి తప్పని సరిగా రిజిస్ట్రేషన్ తేదీ, కారు వివరాలు, పాలసీ మొదలు అయిన తేదీ మరియు మిగతా కవరేజి వివరాల అవసరం ఉంటుంది. మీకు కావాల్సింది పొందటానికి మీరు చేయాల్సిందల్లా మౌస్ తో కొన్ని క్లిక్స్ చేయడం మాత్రమే. ఒక మంచి కార్ పాలసీ ని పొందటానికి రెండు వేరు వేరు ఇన్సూరెన్సు పాలసీ లు పోల్చి చూడటము అన్నింటికన్నా ముఖ్యం. వివిధ కంపెనీల ఇన్సూరెన్సు ప్రీమియం రేట్లను పోల్చి చూడటం, వాటి మధ్య గల వ్యత్యాసాలను తెలుసుకోవడం వల్ల అన్ని రకాలు గా ఉపయోగపడే పాలసీ ని సులువుగా గుర్తించవచ్చు. ముఖ్యం గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కవరేజి విస్తృతి పెరుగుతున్న కొద్దీ, కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ధర పెరుగుతూ వస్తుంది.
ఇన్సూరెన్సు కంపెనీలు తమ స్వంత పద్ధతుల ద్వారా ఇన్సూరెన్సు ప్రీమియం ని లెక్కిస్తూ ఉంటాయి.
- ఉపయోగించిన కారుల ప్రీమియం క్యాలిక్యులేటర్: ఉపయోగించిన కారుల ఇన్సూరెన్సు ప్రీమియం ని లెక్కించడానికి కారు రకము, ఇంధనం పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ప్రస్తుత ఇన్సూరెన్సు పాలసీ వివరాలు, కారు యజమానుల మార్పులు, ఒకవేళ ఇంతక ముందు క్లెయిమ్ చేసి ఉంటే వాటి రిపోర్టులు వంటి వివరాలు అవసరమవుతాయి. వినియోగదారుని అవసరాలకు తగిన మరియు అన్నింటికంటే ఉత్తమమయిన ఒప్పందాన్ని పొందటానికి ఈ ఉపయోగించిన కారుల ప్రీమియం క్యాలిక్యులేటర్ అవకాశం ఇస్తుంది.
- క్రొత్త కారుల ప్రీమియం క్యాలిక్యులేటర్:ప్రీమియం విలువను లెక్కించడానికి, వాహనం తయారుచేసిన సంస్థ పేరు, వాహనం మోడల్ నెంబర్, తయారు చేయబడిన సంవత్సరము, కారు రిజిస్ట్రేషన్ చేయబడిన రాష్త్రము పేరు మొదలైనవి, యజమాని పూర్తి వివరాలతో పాటు క్యాలిక్యులేటర్ లో పూరించవలసి ఉంటుంది. క్రొత్త కారుల కు వివిధ కంపెనీ లు అందిస్తున్న సౌకర్యాలతో పాటు ఇన్సూరెన్సు ప్రీమియం ధరలను తెలుసుకోవడానికి ఈ క్రొత్త కారుల ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. వినియోగదారుల సంశయాలకు సత్వర పరిష్కారం పొందటానికి ఇది చక్కటి మార్గం.
కారు ఇన్సూరెన్సు ప్రీమియం ను లెక్కించడం ఎలా?
ప్రీమియం ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని అనుసరించి లెక్కించబడుతుంది. మీరు ఒక సారి ఆ సూత్రాన్ని పరిశీలిస్తే, కారు ఇన్సూరెన్సు ప్రీమియం ను ఎలా లెక్కింపబడుతుందో మీకు చక్కగా అర్ధం అవుతుంది.
ప్రీమియం = సొంత డామేజి ప్రీమియం - (క్లెయిమ్ చేయబడని బోనస్ + డిస్కౌంట్లు) + ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐ ఆర్ డి ఏ) నిర్ధారించిన చెల్లించాల్సిన ప్రీమియం. కారు ఇన్సూరెన్సు లెక్కింపు లో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా క్రింద ఒక ఉదాహరణ ఇవ్వబడింది.
కారకం |
తయారుచేయబడిన సంవత్సరం (2012) |
కారు ఇన్సూరెన్ ఎన్ సి బి తో కలిపి |
ఎక్స్ షోరూం ధర |
రూ. 4,16,000 |
|
తరుగుదల |
20% |
రూ. 83,200 |
ఇన్సురెడ్ డిక్లేర్డ్ వేల్యూ |
రూ. 3,32,800 |
|
ఓన్ డామేజ్ ప్రీమియం |
1.970% |
రూ.6556 |
నో క్లెయిమ్ బోనస్ డిస్కౌంట్స్ |
20% |
రూ. 1311 |
మొత్తం ఓన్ డామేజ్ ప్రీమియం |
రూ. 5,425 |
|
వ్యక్తిగత ప్రమాద కవరేజి |
రూ. 100 |
|
చట్ట పరం గా డ్రైవర్ కి చెల్లించాల్సినది |
రూ. 50 |
|
తప్పనిసరి అయిన థర్డ్ పార్టీ కవరేజి |
రూ. 1110 |
|
నికర ప్రీమియం |
రూ. 6505 |
|
సర్వీస్ టాక్స్ |
14% |
|
మొత్తం ప్రీమియం |
రూ. 7416 |
కారు ఇన్సూరెన్సు ప్రీమియం ని నిర్ణయించే కారకాలు
ఇన్సూరెన్సు ప్రీమియం ని నిర్ణయించే విషయం లో ఈ క్రింద పేర్కొన్న కారకాల ప్రాముఖ్యాన్ని త్రోసిపుచ్చలేము.
- వయస్సు మరియు లింగము -25 సంవత్సారాల వయసు లోపు ఉన్న వ్యక్తులు ఇన్సూరెన్సు కంపెనీల దృష్టి లో ఎక్కువ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం కలవారు. అందువల్ల 18 - 25 సంవత్సరాల వయసు లోపు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రీమియం వెచ్చించాల్సి ఉంటుంది.
- తయారు చేసిన కంపెనీ, మోడల్ మరియు వేరియంట్ -స్వతహాగా ఆడి, బెంట్లేయ్ వంటి పెద్ద ఖరీదయిన కార్లకు ఇన్సూరెన్సు ప్రీమియం బడ్జెట్ కార్లు అయిన ఆల్టో, శాంత్రో వంటి కార్ల కంటే చాలా ఎక్కువ గా ఉంటుంది. అలాగే ఫామిలీ కార్ల కంటే ఎస్ యూ వి లకి ఇన్సూరెన్సు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
- ఇన్సూరెన్సు కావాలనుకునే ప్రదేశం -పెద్ద నగరాలలో చిన్న పట్టణాలలో కన్నా ట్రాఫిక్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక, కారు ఇన్సూరెన్సు ప్రీమియం చిన్న పట్టణాలకన్నా పెద్ద నగరాల్లో కొంచెం ఎక్కువ గా ఉంటుంది.
- వాడే ఇంధనం -సాధారణ పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే సి ఎన్ జి తో కూడిన కార్ లకు ప్రీమియం ఎక్కువ గా ఉంటుంది.
- తయారు చేయబడిన సంవత్సరం -కారు పాతబడుతున్న కొద్దీ దాని ఇన్సురెడ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐ డి వి) తగ్గుతుంది, తక్కువ (ఐ డి వి) కి తక్కువ ప్రీమియం నిర్ణయించబడుతుంది.
- తగ్గింపులు -రక్షణ సిబ్బంది, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మొదలైన వారికి ప్రీమియం పై కొన్ని అదనపు తగ్గింపులు పొందటాని అవకాశం ఉంటుంది.
- వాలంటరీ యాక్సిస్ -క్లెయిమ్ చేసేటప్పుడు మీరు భరించడానికి సిద్ధపడుతున్న కనీస మొత్తాన్ని వాలంటరీ యాక్సిస్ అంటారు. ఎక్కువ ఎక్కువ మొత్తానికి సిద్దపడితే అంత తక్కువ గా ప్రీమియం నిర్ధారించ బడుతుంది.
- ఏంటి-థెఫ్త్ డిస్కౌంట్ -కార్ దొంగిలించబడకుండా ఉండేందుకు ఏ ఆర్ ఏ ఐ అనుమతించిన పరికరాన్ని అమర్చబడి ఉంటే ప్రీమియం లో 2.5 % తగ్గింపు ఉంటుంది.
- నో క్లెయిమ్ బోనస్ -ఒక సంవత్సరం లో ఒక్క క్లెయిమ్ కూడా లేక పోయినట్లయితే మీరు నో క్లెయిమ్ బోనస్ కు అర్హులు. ఇది ప్రతీ సంవత్సరం 10% నుండీ 50% వరకూ మారుతూ వస్తుంది. ఈ ఎన్ సి బి ని మరొక కార్ పాలసీ కు బదిలీ చేసుకోవచ్చు.
కారు ఇన్సూరెన్సు ప్రీమియం లెక్కించడానికి కావలసిన వివరాలు
ఎవరైనా సరే సులువుగా ఎవ్వరి సహాయమూ లేకుండా సూటిగా ఆన్ లైన్ లో కార్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగించ గలుగుతారు. పొందుపరిచిన సూచనలు, వివరాల ఆధారం గా ప్రముఖ ఇన్సూరెన్సు కంపెనీలు అందిస్తున్న ఇన్సూరెన్సు ధరలు చూపబడతాయి.
కార్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ లో ఈ క్రింద ఇవ్వబడిన వివరాలను ఆన్ లైన్ లో పూరించాల్సి ఉంటుంది.
- కారు రిజిస్ట్రేషన్ నెంబర్
- ఆర్ టి ఓ
- కారు రిజిస్టరు చేయబడిన సంవత్సరం
- కారు వివరాలు
- తయారు చేసిన కంపెనీ పేరు
- కారు వాడే ఇంధనం
జాగ్రత్తగా చేయాల్సింది ఏమిటంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించి పెద్ద ఇన్సూరెన్సు కంపెనీల ప్రీమియం ధరలను పొందటమే. మీరు సంతృప్తి చెందితే సొమ్ము చెల్లించ వచ్చు లేదా తిరస్కరించ వచ్చు.
మీరు ఇక్కడ ఇవ్వబడిన సూత్రాన్ని వాడినట్లయితే కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేషన్ మరింత సులువుగా అర్ధము అవుతుంది. సూత్రం క్రింద ఇవ్వబడింది.
ప్రీమియం = సొంత డామేజి ప్రీమియం - (క్లెయిమ్ చేయబడని బోనస్ +
అదనపు డిస్కౌంట్లు) + అదనపు కవరేజ్ ధరలు + ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐ ఆర్ డి ఏ) నిర్ధారించిన థర్డ్ పార్టీ ప్రీమియం.
16 జూన్ 2019 న ఐ ఆర్ డి ఏ విడుదల చేసిన జూన్ నుండీ అమలు అయ్యే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం రేట్లు క్రింద ఇవ్వబడ్డాయి.
ఇంజిన్ కెపాసిటీ |
జూన్ 16 , 2019 నుండీ అమలు అయ్యే ప్రీమియం |
1000 సీసీ కంటే తక్కువ |
2,072 |
1000 సీసీ కంటే ఎక్కువ & 1500 సీసీ కంటే తక్కువ |
3,221 |
1500 సీసీ కంటే ఎక్కువ |
7,890 |
క్రొత్త & పాత కార్లకు మీరు ప్రీమియం ఎలా లెక్కించగలుగుతారు ?
ఈ క్రింద ఇవ్వబడిన వివరాలను క్రొత్త మరియు పాత కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ను లెక్కించడానికి ఆన్ లైన్ లో ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ కు అందించాల్సి ఉంటుంది.
క్రొత్త కారుల కొరకు -
- కారు వివరాలు మరియు తయారుచేసిన కంపెనీ పేరు
- కారు తయారీ మరియు మోడల్ వివరాలు
- కారు రకము
- రిజిస్ట్రేషన్ తేదీ మరియు రిజిస్ట్రేషన్ చేయబడిన రాష్ట్రము
- పట్టణము & ఆర్ టి ఓ
- వాడే ఇంధనం
- తయారుకాబడిన సంవత్సరము
పాత మరియు వాడబడిన కారులకు -
- కారు రకము
- వాడే ఇంధనం - సి ఎన్ జి, డీజిల్ లేదా పెట్రోలు
- మునుపటి క్లెయిమ్ వివరాలు
- తరుగుదల విలువ
- మునుపటి పాలసీ వివరాలు
సెకండ్ హ్యాండ్ కార్లు అయినచొ యజమాని వివరాలు అవసరం అవుతాయి.
కారు ఇన్సూరెన్సు ప్రీమియం పునరుద్ధరణ
ఇప్పటికే వారి కార్లకు ఇన్సూరెన్సు ప్రీమియం తీసుకున్న వారు అన్ని లాభాలు ఖచ్చితం గా పొందాలంటే ఎప్పటికప్పుడు సరిఅయిన సమయాల్లో పాలసీ ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ పాలసీ కి ఒక గడువు తేదీ నిర్ణయించబడి ఉంటుంది. వినియోగదారులు ఆ నిర్దిష్టమైన తేదీ దాటగానే ఇన్సూరెన్సు పాలసీ ని పునరుద్ధరించుకోవాలి. పాలసీ ని పునరుద్ధరించుకోవడం ఆన్ లైన్ లో చాలా సులువు.
చాలా మంది కొనుగోలుదారులు ప్రీమియం ధర ఆధారం గా కారు ఇన్సూరెన్సు పాలసీ లను ఎంచుకుంటూ ఉంటారు. కానీ, ఇది సరి అయిన ఆలోచన కాదు. ప్లాను లో ఉన్న ముఖ్య మైన అంశాలు మరియు లాభాలను చూడవలసి ఉంటుంది. తక్కువ కవరేజి ప్లాన్ కన్నా, మంచి కవరేజి ఇచ్చే ప్లాను ప్రీమియం ధర కొంచెం ఎక్కువ అయినప్పటికీ తీసుకోవడం ఉత్తమం.
కార్ ఇన్సూరెన్సు: తరుచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు
-
కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి ?
జవాబు: కారు ఇన్సూరెన్సు కొనుగోలుదారులకు ఆన్ లైన్ లో వివిధ కంపెనీల ప్రీమియం ధరలను తెలుసుకోవడానికి, తాము ఎంత ప్రీమియం చెల్లించాలో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడే కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్.
-
నేను నా కారు కోసం ఇన్సూరెన్సు ప్రీమియం ధరని పొందాలనుకుంటున్నాను. కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ నాకు ఎక్కడ దొరుకుతుంది?
జవాబు: మీకు కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ ఇక్కడ గానీ లేదా మీకు నచ్చిన ఇన్సూరెన్సు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో గానీ సులువు గా దొరుకుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ పేరు, మొబైల్ నెంబర్, అడ్రసు, వాహనం మోడల్ నెంబర్, వాహన తయారీదారుని పేరు, తయారుచేయబడిన సంవత్సరము, వాడే ఇంధనం, రిజిస్ట్రేషన్ వివరాలు వంటి ప్రాధమిక వివరాలు అందులో పూరించ వలసి ఉంటుంది. సరైన వివరాలు ఇచ్చిన తరువాత ప్రీమియం ని లెక్కించే బటన్ ని క్లిక్ చేసి మీ ప్రీమియం ధరను పొందవచ్చు.
-
కారు ఇన్సురన్ ప్రీమియం ని ధరని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?
జవాబు: కారు యొక్క డిక్లేర్డ్ వేల్యూ, వయస్సు, మోటార్ రకము, ఇంజిన్ యొక్క క్యూబిక్ కెపాసిటీ, భౌగోళిక ప్రదేశం మొదలైన అంశాలు మీ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ని లెక్కించడం లో ఎక్కువ గా ప్రభావితం చేస్తాయి.
-
కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ను తగ్గించే చిట్కాలు ఏమిటి?
జవాబు: కార్ ఇన్సూరెన్సు ప్రీమియం తగ్గించేందుకు ఉపయోగపడే దారులు చాలా రకాలు ఉన్నాయి. మీరు మీ కారు దొంగతనం కాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్ అఫ్ ఇండియా వారి పరికరాన్ని అమర్చుకోవడం తద్వారా వారి మెంబెర్ గా మీరు తయారుకావడం. కార్ ఇన్సూరెన్సు తీసుకొనే ముందు మీ కారు యొక్క ఐ డి వి సరిగ్గా లెక్కింప బడిందో లేదో చెక్ చేసుకోండి. అది మీకు సరైన ప్రీమియం నిర్ణయించుకోవడానికి మాత్రమే కాక సౌకర్యవంతమైన క్లెయిమ్ ఫ్రీ విధానానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ అవసరాలకు తగిన వాహనాన్ని మాత్రమే తీసుకోండి. మీరు నెలకు కనీసం 50 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రయాణిస్తూ ఉంటే ఎస్ యూ వి కొనవద్దు. మీ వాహన షోరూం ధర, క్యూబిక్ కెపాసిటీ యొక్క భారం మీ ప్రీమియం మొత్తం పై పడుతుందనే విషయం మనసు లో ఉంచుకోవాలి. మీకు అవసరం లేని అదనపు కవరేజి లు ఎంచుకోకండి. లేదంటే అవి మీ ఇన్సూరెన్సు ప్రీమియం ను అమాంతం పెంచేస్తాయి.
-
కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ వల్ల లాభాలు ఏమిటి?
జవాబు: కార్ ఇన్సూరెన్సు క్యాలిక్యులేటర్ వాడడం వల్ల ఈ క్రింది లాభాలు ఉంటాయి:
1 . ఇన్సూరెన్సు కొనుగోలుదారునికి మొత్తం కొనుగోలు ప్రక్రియని సులభం గా సౌకర్యవంతం గా మారుస్తుంది.
2 . మీ ఇన్సూరెన్సు అవసరాలకు తగ్గట్టు గా ఇన్సూరెన్సు ప్రీమియం రేట్లను సరిపోల్చి మీకు ఉత్తమ మైన ఇన్సూరెన్సు పాలసీ ను ఎంచుకొనేందు సహాయపడుతుంది.
3 . కవరేజి అంశాల మార్పు ద్వారా ప్రీమియం ధర ఎలా మారుతుందో అనుభవ పూర్వకం గా అవగతం చేస్తుంది.
4 . మీరు తొందపాటులోనో లేదా ఎవరైనా ఇన్సూరెన్సు ఏజెంట్ ల యుక్తుల కు లోబడి నిర్ణయాలు తీసుకో కుండా ఉపకరిస్తుంది.
నేను ఈ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఇన్సూరెన్సు రెన్యువల్ చేసుకొనే సమయం లో ఉపయోగించుకోగలనా?
జవాబు: మీరు కార్ ఇన్సూరెన్సు రెన్యువల్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఇన్సూరెన్సు కొనుగోలు చేసే సమయం లో ఉపయోగించినట్లయితే మీకు దీని ని ఉపయోగించడం ఎంత సులువో తెలిసి ఉండాలి. ఒక వేళ ఉపయోగించనట్లయితే, ఆన్లైన్ లో కార్ ఇన్సూరెన్సు రెన్యువల్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఇన్సూరెన్సు పాలసీ పునరుద్దీకరణ సమయం లో ఉపయోగించి మీ ప్రీమియం వివరాలు తెలుసుకోండి. ఇది చాలా సులువైనది, సౌకర్యవంతమైనది ఇంకా సరళమైనది.
-
కార్ ఇన్సూరెన్సు రెన్యువల్ ప్రీమియం క్యాలిక్యులేటర్ యొక్క గొప్పతనం ఏమిటి ?
జవాబు: ఇది కారు ఇన్సూరెన్సు ప్రీమియం ని నిర్ణయించడానికి ఒక సౌకర్యం వంతమైన, ముఖ్యమైన సాధనం. ఇన్సూరెన్సు కొనుగోలుదారులు కేవలం కొన్ని క్లిక్లు చేయడం ద్వారా ఇన్సూరెన్సు ప్రీమియం రేట్లను తెలుసుకొని వారి బడ్జెట్ కి అనుకూలం గా, ఇన్సూరెన్సు అవసరాలకు తగిన ప్లాన్ ను ఎన్నుకోగలుగుతారు.
Find similar car insurance quotes by body type
RTO Offices by State
Car Insurance
Plans start at
₹2,094*
Compare & Save
Up to 85%*
on Car Insurance
