ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి)
బీమా డిక్లేర్డ్ వాల్యూ(ఐడివి) అనేది బీమా చేత నిర్ణయించబడిన గరిష్ఠ మొత్తం, ఈ మొత్తం దొంగతనం లేదా వాహనం యొక్క నష్టంపై అందించబడుతుంది. సాధారణంగా, ఐడివిఅనేది వాహనం యొక్క ప్రస్థుత మార్కెట్ విలువ. వాహనం మొత్తం నష్టాన్ని చవిచూస్తే, పాలసీదారునికి బీమా అందించే పరిహారం ఐడివి.
-
హోమ్‌పేజీ
-
మోటార్ ఇన్సూరెన్స్
-
కారు భీమా
- ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి)
ఐడివిను తయారీదారులు జాబితా చేయబడిన అమ్మకపు ధర మైనస్ తరుగుదలగా లెక్కించబడుతుంది. రిజిస్ట్రేషన్ మరియు బీమా ఖర్చులు ఐడివినుండి మినహాయించబడ్డాయి.ఫ్యాక్టరీ అమర్చని ఉపకరణాల యొక్క ఐడివి, వాటికి బీమా అవసరమైతే అదనపు ఖర్చుతో విడిగా లెక్కించబడుతుంది.
కారు యొక్క ఐడివి ని ఫిక్స్ చేయడానికి తరుగుదల షెడ్యూల్
కారు యొక్క ఐడివి ని ఫిక్స్ చేయడానికి ఉపయోగించే తరుగుదల షెడ్యూల్ ను ఈ క్రింది పట్టిక చూపుతుంది:
వాహన వయస్సు | ఐడివిని సర్ధుబాటు చేయడానికి తరుగుదల % |
6 నెలలు మించకూడదు | 5% |
6 నెలలు దాటినా1సంవత్సరానికి మించకూడదు | 15% |
1 సంవత్సరం దాటినా 2 సంవత్సరాలు మించకూడదు | 20% |
2 సంవత్సరాలు దాటినా 3 సంవత్సరాలు మించకూడదు | 30% |
3 సంవత్సరాలు దాటినా 4 సంవత్సరాలు మించకూడదు | 40% |
4 సంవత్సరాలు దాటినా 5 సంవత్సరాలు మించకూడదు | 50% |
5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వాహనాల ఐడివిబీమా చేసిన వారు మరియు బీమా సంస్థల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా లెక్కించబడుతుంది. తరుగుదలకు బదులుగా, సర్వేయర్లు, కారు డీలర్లు మొదలైనవారు వేసిన వాహనం యొక్క అంచనా ద్వారా పాత కార్ల ఐడివివస్తుంది.
ఐడివికాలిక్యులేటర్
ఐడివికాలిక్యులేటర్ అనేది మీ కారు యొక్క మార్కెట్ విలువను నిర్ణయించే ఆన్ లైన్ సాధనం మరియు మీ కారు బీమా కోసం మీరు చెల్లించాల్సిన ఐడియల్ ప్రీమియం మొత్తాన్ని అంచనా వేస్తుంది. మీ వాహనం యొక్క వయస్సు లేదా వేల తరుగుదలను పరిగణలోకి తీసుకుని మీ కారుకు సరైన ఐడివివస్తుంది.
కారు ఇన్సూరెన్స్ కింద ఇది చాలా ముఖ్యమైన కాలిక్యులేటర్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఇది మొత్తం నష్టం లేదా దొంగతనం క్లెయిమ్ పరిష్కారం సమయంలో చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించదానికి కారు యజమానులకు సహాయపడుతుంది.
ఐడివిను ఎలా లెక్కించాలి?
తయారీదారు నిర్ణయించే అమ్మకపు ధర ఆధారంగా ఐడివిలెక్కించబడుతుంది మరియు దాని వాహనం యొక్క భాగాలపై తరుగుదల దాని నుండి తీసివేయబడుతుంది.
అసలు బీమా డిక్లేర్డ్ వాల్యూ పొందే సూత్రం క్రింద పేర్కొనబడింది:
బీమా ప్రకటించిన విలువ= (కంపెనీ జాబితా చేయబడిన ధర –తరుగుదల విలువ ) + (వాహన విడిభాగాల ధర –ఈ భాగాల తరుగుదల విలువ)
పైన పేర్కొన్న సూత్రం ఏమిటంటే, కారు కొనుగోలు చేసిన తర్వాత జోడించిన అదనపు ఉపకరణాలతో కూడిన కొత్త కారు కోసం ఐడివిని లెక్కించడం. ఒకవేళ మీకు వాహనంలో అలాంటి వస్తువులు లేకపోతే, ఐడివిలెక్కింపు చాలా సులభం.మీరు ఆన్ లైన్ ఐడివికాలిక్యులేటర్ ను ఉపయోగించి మీరు బీమా చేసిన డిక్లేర్డ్ విలువను సులభంగా లెక్కించవచ్చు మరియు సూత్రం కింద ఇవ్వబడింది:
ఐడివి= తయారీదారు యొక్క రిజిస్టర్డ్ ధర –తరుగుదల విలువ
పైన ఇచ్చిన టేబుల్ ప్రకారం తరుగుదల వర్తిస్తుంది.
ఉదాహరణకు- పాలసీ కొనుగోలు సమయంలో మీ కారు విలువ లేదా ఐడివిరూ.5 లక్షల రూపాయలు వద్ద నిర్ణయించబడితే, మొత్తం నష్టం లేదా నష్టం జరిగిన సందర్భంలో బీమా రూ.5 లక్షల రూపాయల గరిష్ఠ మొత్తాన్ని చెల్లిస్తుంది.నిర్మాణాత్మక మొత్తం నష్టం లేదా కారు దొంగతనం లాంటివి పాలసీ వ్యవధిలో మాత్రం జరిగితే మీకు పరిహారం లభించడం అత్యవసరం.
కారు కోసం ఐడివిను లెక్కించేటప్పుడు మైండ్ లో ఉంచుకోవలసిన విషయాలు
మీ కారు యొక్క ఐడివిని జాగ్రత్తగా అంచనా వేయడానికి మీరు క్రింద పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్నారని నిర్ధారించుకోండి-
- మీ కారు విలువ ప్రస్తుత మార్కెట్ ధర నుండి తరుగుదల విలువను తీసివేయడం ద్వారా తీసుకోబడింది. ఏదేమైనా మీ కారుకు మొత్తం నష్టం లేదా దొంగతనం జరిగితే మీకు లభించే గరిష్ఠ పరిహారం ఇది.
- ఐడివికు సరైన విలువ కట్టుట మీకు తక్కువ ప్రీమియం ఖర్చు అవుతుంది.
- ప్రీమియంను తగ్గించడానికి మీ కారు యొక్క ఐడివిను తగ్గించవద్దు, అంటే ఇది తక్కువ క్లెయిమ్ లేదా వివాదాస్పద క్లెయిమ్ అని అర్ధం.
- ఐడివియొక్క సరైన డిక్లరేషన్ అంటే సరైన క్లెయిమ్ అని అర్ధం.
- మీ కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ సెట్ చేసిన ఐడివికి అంగీకరించే ముందు మీరు పరిశోధన చేయండి లేదా తయారీదారునితో చెక్ చేసుకోండి.
- అలాగే, ప్రీమియం వ్యయాన్ని అంచనా వేయండి మరియు మీ కారు యొక్క ఐడివిఆధారంగా సరిగ్గా అంచనా వేయబడిందో లేదో తనిఖీ చేయండి.
- మీరు తగినంత కవరెజీ ని పొందటం చాలా ముఖ్యం మరియు బీమా ప్రకటించిన విలువతో సంతృప్తిచెందడం వలన ఇది చాలా మొత్తంను ఇస్తుంది. కావలసిన ఐడివిపొందటానికి మీరు కూడా చర్చలు జరపవచ్చు.
- మీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను పునరుద్ధరించేటప్పుడు, ప్రీమియం ఖర్చు ఐడివిఆధారంగా నిర్ణయించబడిందని నిర్ధారించుకోండి. ఐడివితో పోలిస్తే మీ కారు మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటే, తక్కువ ఖర్చుతో కూడిన కారుతో పోలిస్తే ఇది అధిక ప్రీమియం అని అర్ధం.
మీ కారు యొక్క ఐడివిను ఆన్ లైన్ లో కూడా ఫిక్స్ చేయవచ్చు, కానీ ఇది ఒక బీమా సంస్థ నుండి ఇంకొక బీమా సంస్థకు మారుతుంది.ఇది మీ కారును పునరుద్ధరించేటప్పుడు మీ ఐడివిని సర్ధుబాటు చేయడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది, కాబట్టి మీరు అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోండి.
కారు యొక్క ఐడివిని నిర్ణయించడానికి సహాయపడే అంశాలు
మీ కారు యొక్క ఐడివిని అంచనా వేయడానికి ఈ క్రింది అంశాలు ఐడివికాలిక్యులేటర్ కు సహాయపడతాయి. ఒకసారి చుడండి:
- కారు వయస్సు- మీ కారు యొక్క వయస్సు మీ కారు యొక్క ఐడివిని నిర్ణయించడంలో సహాయపడే అతి పెద్ద కారకాల్లో ఒకటి. మీ కారు వయస్సు పెరిగే కొద్దీ, దాని ఐడివివిలువ తగ్గుతుంది.
- కారు యొక్క తయారీ మరియు మోడల్-కారు యొక్క తయారీ & మోడల్ కారు ఎంత హై-ఎండ్ లో ఉంది మరియు దాని మరమ్మత్తు ఖర్చు ఎంత ఎక్కువగా ఉంటుందో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, BMW X7 యొక్క ఐడివిదాని ఖరీదు మరియు నిర్వహణ కారణంగా హుండాయ్ సాన్ట్రో యొక్క ఐడివికంటే ఎక్కువగా ఉంటుంది.
- ప్రామాణిక తరుగుదల- ముందు టేబుల్ లో చూపిన తరుగుదల షెడ్యూల్ మీ కారు యొక్క ఐడివిని ప్రభావితం చేస్తుంది.తగ్గింపు షెడ్యూల్ లో పేర్కొన్న శాతం ఆధారంగా మీ కారు మార్కెట్ విలువకు తరుగుదల వసూలు చేయబడుతుంది.
- కారు రిజిస్ట్రేషన్ సిటీ- మీ కారు రిజిస్టర్ చేయబడిన సిటీ కూడా ఐడివిని ప్రభావితం చేస్తుంది. న్యూ-డిల్లీ వంటి మెట్రోపాలిటన్ సిటీలో రిజిస్టర్ చేయబడిన మరియు నడుస్తున్న కారు యొక్క ఐడివిUP లోని ఒక చిన్న పట్టణంలో నడుస్తున్న కారు యొక్క ఐడివికన్నా ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంది.
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఐడివిఎలా ప్రభావితం చేస్తుంది?
మీ కారు యొక్క ఐడివిమీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంకి నేరుగా ప్రొపోర్షనల్ లో ఉంటుంది.దీని అర్ధం ఐడివియొక్క అధిక విలువ, మీకు వసూలు చేసిన ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా, మీ కారు యొక్క ఐడివిపెరుగుతున్న వయస్సుతో తగ్గుతుంది కాబట్టి, మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం కూడా తగ్గుతుంది.
అయినప్పటికీ, ప్రీమియం మొత్తాన్ని తగ్గించడానికి తక్కువ ఐడివిని ఎంచుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది నష్టాలకు దారి తీస్తుంది.తక్కువ ఐడివిఅంటే మొత్తం నష్టం లేదా దొంగతనం క్లెయిమ్ ల విషయంలో మీకు తక్కువ పరిహారం లభిస్తుంది.ప్రీమియంగా అపారమైన మొత్తాలను చెల్లించకుండా మీ కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉన్న ఒక ఐడివిని పొందడం దీని యొక్క మొత్తం ఆలోచన.
కారు ఇన్సూరెన్స్ లో ఐడివిఎందుకు ముఖ్యమైనది?
వివరించినట్లుగా, మీ వాహనం దొంగలించబడినా లేదా మొత్తం నష్టాన్ని చవిచూసినా మీకు లభించే యొక్క మొత్తమే ఐడివి.కారు యొక్క మార్కెట్ విలువకు దగ్గరగా ఉన్న ఐడివిను పొందడం చాలా మంచిది. కస్టమర్ ఎంచుకోగల ఐడివిని 5% నుండి 10% రేంజ్ కు తగ్గించడానికి బీమా సంస్థలు అందిస్తాయి.తక్కు ఐడివితక్కువ ప్రీమియంను ఆకర్షిస్తుంది.
మీ కారు ఐడివిగురించి మీరు ఎందుకు పట్టించుకోవాలి?
మీ కారు యొక్క ఐడివికారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడంలో చాలా కీలకమైన అంశం.మీ కారుకు గరిష్ఠ పరిహార మొత్తాన్ని నిర్ణయించడంతో పాటు, ఇది చాలా ముఖ్యం మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క విషయానికి వస్తే.
మీ కారు ఇన్సూరెన్స్ కోసం మీరు చెల్లించే ప్రీమియం మొత్తానికి ఐడివిచాలా కీలకం. ఐడివిమీ కారు యొక్క ప్రస్థుత మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీ మోటార్ ఇన్సూరెన్స్సంస్థ యొక్క భాద్యతకు అద్ధం పడుతుంది. ఐడివితక్కువ అంటే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కు భాద్యత తగ్గుతుంది అందువల్ల, తక్కువ ప్రీమియం వసూలు చేయబడుతుంది మరియు వైస్ వెర్సా.అయినప్పటికీ, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ కోసం తుది ప్రీమియం మొత్తాన్ని చేరుకోవడంలో సహాయపడే కవరేజ్ రకం, భౌగోళిక మండలం, యాడ్-ఆన్ కవర్లు వంటి ఇతర అంశాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ కాదు. మీరు మీ కారును విక్రయించాలనుకున్నప్పుడు దాని యొక్క ఐడివికూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మీ కారు యొక్క ఐడివిఎక్కువగా ఉంటే, అది ఆటోమేటిక్ గా మీకు అధిక అమ్మకపు ధరను పొందుతుంది. అదేవిధంగా, తక్కువ ఐడివిమీ కారును తక్కువ ధరకు అమ్మడానికి దారితీస్తుంది.ఇతర అంశాలు ఉన్నప్పటికీ, క్లెయిమ్ ల అనుభవం వంటివి, అది మీ కారు అమ్మకపు ధరను కూడా ప్రభావితం చేస్తుంది, మీ కారు కోసం ఐడివిని ఫిక్స్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అధిక/తక్కువ ఐడివియొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
కారు ఇన్సూరెన్స్ కింద మీ వాహనం యొక్క ఎక్కువ లేదా తక్కువ ఐడివిని ఫిక్స్ చేయడం యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన టేబుల్ ను చూడండి:
ఐడివియొక్క స్వభావం |
ప్రయోజనాలు |
అప్రయోజనాలు |
ఎక్కువ ఐడివి |
దొంగతనం లేదా మొత్తం నష్టం క్లెయిమ్ ల సమయంలో అధిక పరిహారం చెల్లించబడుతుంది. |
అధిక ప్రీమియం మొత్తంను చెల్లించాలి |
తక్కువ ఐడివి |
తక్కువ ప్రీమియం మొత్తంను చెల్లించాలి |
దొంగతనం లేదా మొత్తం నష్టం క్లెయిమ్ ల సమయంలో తక్కువ పరిహారం చెల్లించబడటం నష్టాలకు దారి తీస్తుంది |
ముగింపు
అంతిమంగా, కొనుగోలు చేసిన సమయంలో మరియు పునరుద్ధరించే ఈ రెండింటిలో ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ మీ కారు యొక్క ప్రీమియంను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.సరైన ఐడివిను ప్రస్తావించడం ముఖ్యం; లేకపోతే, ఇది మీ క్లెయిమ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మీరు అనేక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల నుండి గొప్ప ఒప్పందాలను పొందవచ్చు మరియు వారు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన ఎంపికను కనుగొనడంలో కూడా సహాయపడతారు. మీరు సాధ్యమయ్యే అన్ని ఎంపికలను సరి పోల్చవచ్చు ఆ తరువాత మీరు ఉపదేశించిన నిర్ణయం తీసుకోవచ్చు.ఈ విధంగా మీరు అధిక ప్రీమియం ఖర్చులు చెల్లించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మరియు మీ కారుకు మీరు ఉత్తమ విలువను పొందవచ్చు.
బీమా డిక్లేర్డ్ వాల్యూ తరచుగా అడిగే ప్రశ్నలు
-
ప్ర1: కొత్త కారుకు ఐడివిఎలా ఉంటుంది?
జ: ఆదర్శవంతంగా, కొత్త కారు యొక్క ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ లేదా ఐడివికారు యొక్క ఇన్వాయిస్ విలువకు సమానంగా ఉండాలి. ఏదేమైనా, తరుగుదల కొత్త కారు నుండి కూడా తీసివేయబడుతుంది ఎందుకంటే అది ఉపయోగం కోసం విక్రయించబడింది.సాధారణంగా, కొత్త కారుపై వసూలు చేసే తరుగుదల సుమారు 5% మరియు అందువల్ల, కొత్త కారు యొక్క డిఫాల్ట్ గరిష్ఠ ఐడివికారు యొక్క ఇన్వాయిస్ విలువలో 95% వద్ద ఉంటుంది.
-
ప్ర2: షోరూం బయట కారు యొక్క ఐడివిఎంత?
జ: కొత్త కారు షోరూం నుండి బయలుదేరిన క్షణం, ఐడివిని అంచనా వేయడానికి తరుగుదల పరిగణలోకి తీసుకోబడుతుంది. కారు కొనుగోలు చేసిన మొదటి ఆరు నెలల వరకూ, చాలా మంది మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు కారు యొక్క ఇన్వాయిస్ విలువపై 5% తరుగుదల మాత్రమే అందిస్తాయి. అందువల్ల, షోరూం బయట కారు యొక్క ఐడివికారు యొక్క ఎక్స్-షోరూం వాల్యూ మైనస్ 5% తరుగుదల అవుతుంది అనగా కారు యొక్క ఇన్వాయిస్ ధరలో 95%అవుతుంది.
-
ప్ర3: అధిక ఐడివికోసం వెళ్ళడం తెలివైనదా?
జ: మీరు ఎక్కువ ఐడివిలేదా తక్కువ ఐడివిని ఎంచుకోవాలా అనేది పూర్తిగా మీ కారు యొక్క వయస్సు మరియు పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.మీ కారు కొత్తది మరియు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటే, అప్పుడు అధికఐడివికోసం వెళ్ళడం అనువైనది.అయితే, మీ కారు ఐదేళ్ళ కి మించి పాతది మరియు మంచి కండిషన్లో లేనట్లయితే అధిక ఐడివిని నివారించడం మరియు తక్కువ ఐడివికోసం వెళ్ళడం మంచిది.
-
ప్ర4: కారు యొక్క ఐడివిఎంత మారుతుంది?
జ: కారు యొక్క తరుగుదల విలువను పరిగణలోకి తీసుకోవడం ద్వారా కారు ఇన్సూరెన్స్ యొక్క ఐడివినిర్ణయించబడుతుంది. ఏదేమైనా, మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు కార్ల యజమానులకు సెట్ ఐడివిను 15% పెంచడానికి లేదా తగ్గించడానికి అనుమతిస్తాయి.కాబట్టి తగ్గుదల ప్రకారం మీ కారు ఐడివిరూ. 5 లక్షలు అయితే, మీకు రూ.4,25,000 నుండి రూ. 5,75,000 లక్షల మధ్య ఐడివిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది.
-
ప్ర5: కార్లకు ఏ ఐడివిఉత్తమమైనది?
జ: కార్లు లేదా మరే ఇతర వాహనలకైనా ఉత్తమమైన ఐడివిఅనేది ఆ వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుంది.
-
ప్ర6: ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరొకదానికి ఐడివిఎందుకు మారుతుంది?
జ:మీ కారు యొక్క ఐడివిఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరొకదానికి మారుతుంది ఎందుకంటే బీమా సంస్థలు తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవ్వడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ఐడివిని తగ్గిస్తాయి.తక్కువ ఐడివివారి భాద్యతను కూడా తగ్గిస్తుంది, తద్వారా, క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో తక్కువ పరిహారం చెల్లించడానికి వీలును కల్పిస్తుంది.
-
ప్ర7: కారు యొక్క ఐడివిప్రతి సంవత్సరం ఎందుకు మారుతుంది?
జ: కారు యొక్క ఐడివిప్రతి సంవత్సరం తగ్గిస్తుంది ఎందుకంటే కారు మార్కెట్ విలువ ప్రతి సంవత్సరం మారుతుంది. వయస్సు మరియు వాడకంతో కారు విలువలో తరుగుదల కారణంగా ఇది జరుగుతుంది.
Find similar car insurance quotes by body type
Car Insurance
Plans start at
₹2,094*
Compare & Save
Up to 85%*
on Car Insurance
